jకోలాహలం… బీచ్ ఫెస్టివల్ ని ప్రారంభించిన మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం సముద్ర తీరంలో మసులా బీచ్ ఫెస్టివల్స్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం సాయంత్రం ప్రారంభించారు..తొలుత బీచ్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ను ఇరువురు మంత్రులు ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు స్వాగతం పలికారు. తొలిరోజే బీచ్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పర్యాటకులు ఖుషీ అయ్యారు..నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ బీచ్ ఫెస్టివల్స్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు.బీచ్ ఫెస్టివల్ లో భాగంగా నేషనల్ వాటర్ స్పోర్ట్స్ ని మంత్రులు దుర్గేష్, రవీంద్ర ప్రారంభించారు.…
Author: apanalysis
M.GANESH. AMARAVATHI. డిఎస్సీ విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని,. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించు.ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని ఆరోపణ చేశారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమంటున్నారని తెలిపారు. మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెడుతున్నారని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని చెప్పారు. డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలన్నారు, ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలని కోరారు. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా డిఎస్సీ పరీక్షలు ఒకటే జిల్లా..…
దగా డీస్సీ- షర్మిలా అభ్యర్ధులకు ప్రిపరేషన్ గడువు పెంచాలి. M.GANESH. Vja. డిఎస్సీ విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. వారంతా మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదని,. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నించు.ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని ఆరోపణ చేశారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమంటున్నారని తెలిపారు. మూడున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెడుతున్నారని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనమని చెప్పారు. డీఎస్సీ నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో…
అదిరే… అదిరే సర్వం సిద్ధం 12వ బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ జరుగనుంది. ఈ ఛాంపియన్ షిప్ లో 24 రాష్ట్రాల నుండి పురుషుల, 21 రాష్ట్రాల నుండి మహిళల జట్లు పాల్గొనున్నాయి. సుమారు 600 మంది క్రీడాకారులు, నిర్వహకులు ఈ టోర్నిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్ని జరుగనుంది. రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ స్పోర్ట్స్ :3వ జాతీయస్థాయి కయాకింగ్ పోటీలను రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో నిర్వహించనున్నారు. సుమారు 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల, నిర్వాహకులు పోటీల్లో పాల్గొనున్నారు. ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు :మసులా బీచ్ ఫెస్ట్ – 2025లో భాగంగా ఆహ్వానపు బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 8 పురుషల, 4 మహిళల జట్లు పాల్గొననున్నాయి. లీగ్ కమ్ నాకౌట్…
ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల కు సూచనలు ఏపీ స్టేట్ బ్యూరో స్థూల విలువ జోడింపు ఎక్కువగా ఉన్న ఉద్యాన సాగుపై రాబోవు 10 సంవత్సరాల్లో ఎక్కువగా దృష్టి పెట్టండని వ్యవసాయ సహకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. బుధవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో వారికి పలు సూచనలు చేశారు. ప్రధానంగా రాష్ట్ర జీడిపి లో 35 శాతం వాటా ప్రాథమిక రంగానిదేనని, ఆ రంగంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ పంటల సాగు నుండి రైతులను ఉద్యాన పంటల సాగు మళ్లింపునకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. తక్కువ నిల్వ కాలపరిమితి కలిగి వాటిని, నిల్వ చేసుకునే సౌకర్యం లేని పంటలకు నూతన ఉత్తమ పద్ధతులు ప్రవేశపెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ విధానం విబిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకుని దిగుబడులను నిలకడగా సాధిస్తాయని చెప్పారు. ప్రస్తుత …
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నది. వీటిని మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు -ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరియు ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మరియు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్ ఆధారిత విధానంలో 15 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు రూ.822.86 లక్షల వన్ టైమ్ సెట్లమెంట్‌కు మంత్రి మండలి ఆమోదం తెల్పింది. – ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన పదిహేడు (17) మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోం శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.03. హోం శాఖ: – APSPFలో 248 కానిస్టేబుల్లను హెడ్ కానిస్టేబుల్లుగా పదోన్నతి…
అన్ని గ్రామాలలో పీఎండీఎస్ అమలు చేయండి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలులో లేని గ్రామాలలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం అమలు చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు . బుదవారం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2025-26 సంవత్సరంలో 15.40 లక్షల రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి మార్చాలనే లక్ష్యంతో ప్రయత్నాలు మొదలు పెట్టామని చెప్పారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడమే కాకుండా, దాని వెనక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయడం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను నెలకొల్పడం అవసరమని అయన స్పష్టం చేశారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ కుమార్ మాట్లాడుతూ రసాయనాలు వాడడం వల్ల మనం తినే ఆహారంలో పోషక…
దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ తన నిరుపమాన సేవలతో రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నారు తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ స్వర్గీయ దేవినేని వెంకట రమణ 26వ వర్ధంతి ని పురస్కరించుకుని గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26 సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. శ్రమదానంతో వేములపల్లి గ్రామంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లారనీ, వెలదికొత్తపాలెంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడుని నందిగామ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రమణ…
ఉక్రెయిన్ FPV డ్రోన్లతో రష్యా లోతుల్లో దాడులు చేస్తుండగా, భారత సైన్యం అలాంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తూ అప్రమత్తమవుతోంది. ఉక్రెయిన్ జూన్ 1న ‘ఆపరేషన్ స్పైడర్‌వెబ్’ పేరిట నిర్వహించిన డ్రోన్ దాడిలో రష్యా లో 4,000 కి.మీ దూరంలో ఉన్న వాయుసేన స్థావరాలపై దాడి చేసి 40కి పైగా విమానాలను నాశనం చేసింది. ఫిబ్రవరి 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత లోతైన దాడిగా ఇది గుర్తింపు పొందింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, ఈ దాడి 18 నెలల పాటు ప్రణాళికతో చేయబడింది, 117 FPV drones మాత్రమే ఉపయోగించి మిలిటరీ లక్ష్యాలపై దాడులు చేశారు. FPV drones, Military technology, Cyber warfare, Aerial attacks, Low-cost weapons, Drone strategy, Electronic warfare, Swarm drone defense అనే పదాలు ఈ సాంకేతిక దాడుల్లో కీలకంగా మారాయి. FPV డ్రోన్లంటే ఏంటి?FPV అంటే First Person View. ఇది డ్రోన్ మీద మౌంట్ చేసిన కెమెరా ద్వారా ఆపరేటర్‌కు ప్రత్యక్ష వీడియో ఫీడ్‌ను ప్రసారం చేస్తుంది. గాగుల్స్ లేదా స్మార్ట్‌ఫోన్లు ద్వారా ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఇవి మెయిన్‌గా మీడియా,…
వినియోగదారులు ముందుగా నగదు మొత్తాన్ని రీఛార్జి చేయించుకోవాలి. ఏపీ స్టేట్ బ్యూరో, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుకు చాలా వ్యత్యాసం ఉంది. పూర్తిస్ధాయి అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డు హోల్డర్లు కొనుగోళ్లు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా కొంత మంది కార్డు హోల్డర్లు నెలవారీ బిల్లులను సకాలం చెల్లించలేకపోతున్నారు. లేదా బిల్లు మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తుంటారు. డెబిట్ కార్డు ఇందుకు విరుద్దం. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత వరకు ఉంటే అంతే మొత్తాలను కొనుగోలు చేస్తుంటారు. వీరు జాగ్రత్తగా కొనుగోళ్లు చేస్తుంటారు. నగదు వృధా కూడా కాదు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్టు మీటర్ల బిగించేందుకు ఆదేశాలు జారీ చేసింది. తొలి దశలో నలభై ఒక్క లక్షల ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్ల బిగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దశల వారీగా రెండు కోట్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి దశలో సీపీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు,…