Author: apanalysis

బందరులో సినీ హీరోల సందడి … మసులా బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోరుతూ 2కే రన్ … ఏపీ స్టేట్ బ్యూరో,        కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో సినీ హీరోలు సందడి చేశారు. ఈనెల 5 నుంచి 8 వరకు జరుగనున్న మసులా బీచ్ ఫెస్టివల్స్ విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం మచిలీపట్నంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా భైరవం సినిమా హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ హాజరయ్యారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు ఈ రన్ కొనసాగింది . హీరోలతో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎస్పీ గంగాధర్ తదితరులు ఈ 2కే రన్ లో పాల్గొన్నారు. ప్రాచీన చరిత్ర గల మచిలీపట్నంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని హీరో మంచు మనోజ్ ఈ సందర్భంగా…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాది పూర్తవుతున్న తరుణంలో, జగన్ ‘వెన్నుపోటు దినోత్సవం’ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టడం అనుచితమని శ్రీనివాసులు రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోట్లకు వైఎస్ ఫ్యామిలీకి పేటెంట్ ఉందని, గతంలోనే వారి వల్ల చాలామంది రాజకీయంగా బాధపడ్డారని ఆరోపించారు. శ్రీనివాసులు రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జగన్ తాత రాజారెడ్డి మంగంపేట మైన్స్ యజమానిని హత్య చేసి మైన్స్ కబళించడం వెన్నుపోటు మాదిరిగానే ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగిన తర్వాత పీవీ నరసింహారావుపై చెప్పులు వేయించడమూ వెన్నుపోటేనన్నారు. జగన్ తన సోదరి షర్మిల ఆస్తులపై కన్నేసి ఆమెను మధ్యరోడ్డున వదిలేశారని చెప్పారు. తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని జగన్ రక్షించారని, కుటుంబం నుంచే మొదలైన వెన్నుపోట్ల రాజకీయాలు ప్రజల…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ హీరో అక్కినేని నాగార్జున  ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. తన చిన్నకొడుకు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు నాగార్జున అందించారు.

Read More

5వ తేదీ నుండి 8వ తేదీ వరకు బందరు బీచ్ లో జాతీయస్థాయి పండుగ …. పది లక్షల మంది తిలకించేందుకు ఏర్పాట్లు …. అతిథులుగా సీఎం ,డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు రాక … వివరాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర….. ఏపీ స్టేట్ బ్యూరో, కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ లో జాతీయస్థాయి పండుగ నిర్వహించనున్నారు. దీనిని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 5 నుంచి 8 వరకు నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. దాదాపు పది లక్షల మంది పాలుపంచుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. వీటి వివరాలను మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ పోటీల కోసం 24 రాష్ట్రాల నుండిజాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తరలి రానున్నారు. బీచ్ ఫెస్టివల్ కు ఒక రోజు ముందుగా 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నేషనల్ వాటర్ 24 రాష్ట్రాల నుండి 2వేల మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రానున్నారని తెలిపారు. వీరికి…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, రౌడీ షీటర్లను కొడితే తప్పేంటి అని హోమ్ మంత్రి అనిత అన్నారు. గంజాయి అమ్మకాలను చేపడుతున్న నిందితుల అరికాళ్లపై తెనాలి పోలీసులు కొట్టడాన్ని మొదటి గుంటూరు జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్ధించుకున్నది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది రాష్ట్రమంతా చర్చనీయాంశం అయింది. పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం వల్లే తాము వాళ్లను పట్టుకుని శిక్షించినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో సోమవారం హోంమంత్రి స్పందించారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక స్టెప్ ఫార్వాడ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తారని చెప్పుకొచ్చారు. పోలీసుల్ని కొంత పని చేసుకోనివ్వాలన్నారు. తెనాలిలో పోలీసులపై రౌడీ షీటర్స్ దాడికి ప్రయత్నించారని, పోలీసుల్ని కొట్టినందుకే వాళ్లు అలా చేసారని హోంమంత్రి తెలిపారు. వాళ్లందరూ రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్ అని అన్నారు. పోలీసుల్ని కొట్టిన వాళ్లను చట్టప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా ఇలా…

Read More

నాలుగు రష్యా వైమానిక స్థావరాలపై సమకాలీన దాడి► టీయు-95, టీయు-22 బాంబర్లు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడి ఉక్రెయిన్ సెక్యూరిటీ దళాలు నిర్వహించిన మేజర్ డ్రోన్ దాడిలో 40కి పైగా రష్యా యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని ఓ ఉక్రెయిన్ భద్రతా అధికారి వెల్లడించారు. ఈ సమాచారం రాయిటర్స్‌కు అనామకంగా తెలిపారు. ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా సంస్థ ఎస్‌బియు (SBU) ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించబడినట్లు అధికారి పేర్కొన్నారు. ఈ డ్రోన్ దాడిలో నాలుగు రష్యా వైమానిక స్థావరాలు ఒకేసారి లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా రష్యా నుంచి ఉక్రెయిన్‌పై క్షిపణులు ప్రయోగించే దీర్ఘశ్రేణి బాంబర్లైన టీయు-95 (Tu-95), టీయు-22 (Tu-22) విమానాలను ఉక్రెయిన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని సమాచారం. దాడికి సంబంధించిన దృశ్యాలను అధికారి మీడియాకు షేర్ చేశారు. అందులో కొంత భాగంలో టీయు-95 బాంబర్లు అగ్నికి ఆహుతి కావడం స్పష్టంగా కనిపిస్తోంది.

Read More

జూన్ 4 న వెన్నుపోటు, పీడవిరగడైన దినాలు అప్రమత్తమైన పోలీసులు ఏపీ స్టేట్ బ్యూరో. ఈ నెల 4న వైసీపీ, జనసేన పార్టీలు చేపట్టనున్నఆందోళన కార్యక్రమాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో సంబరాలకు సిద్దమవుటుంటే, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదని ఆరోపిస్తూ దీనికి నిరసనగా 4న ఆందోళనలకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశాలు జరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రెడ్ బుక్ కు భయపడిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. అయితే పార్టీ యంత్రాంగం కార్యకర్తలకు నచ్చచెబుతూ వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరుతోంది. ఈ నేపధ్యంలో జనసేనాని పవన్ కళ్యాన్…

Read More

కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి మంత్రి కొలుసు పార్థసారథి ఏపీస్టేట్ బ్యూరో. క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్‌ పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఉద్బోధించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గొలగమూడిరోడ్డులో గల యాదవ భవన్‌లో యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని , విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. యాదవ విద్యార్థులతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతిభ గల విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు యాదవ సంఘం నేతలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో యువనేత లోకేష్‌బాబు పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని చెప్పారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయని, ప్రతిఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం…

Read More

కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి మంత్రి కొలుసు పార్థసారథి ఏపీస్టేట్ బ్యూరో. క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్‌ పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఉద్బోధించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గొలగమూడిరోడ్డులో గల యాదవ భవన్‌లో యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని , విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.  యాదవ విద్యార్థులతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతిభ గల విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు యాదవ సంఘం నేతలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో యువనేత లోకేష్‌బాబు పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని చెప్పారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయని, ప్రతిఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాదవ…

Read More

వడ్డే శోభనాద్రీశ్వరావు ప్రశ్న ఏపీ స్టేట్ బ్యూరో, కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరావు కోరారు. పరిశ్రమలు రావాలి,పెట్టుబడులు రావాలని తాపత్రయం తప్ప రైతులకు న్యాయం జరగాలని ఆలోచన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నూటికి 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని వడ్డే శోభనాద్రీశ్వరావు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి, రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ పలు సూచనలు చేసిందని రైతు సంఘాల సమన్వయ సమితి ఏపీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరావు తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ సిఫార్సులు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో మీడియాతో వడ్డే శోభనాద్రీశ్వరావు మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని హామీ ఇచ్చారని వడ్డే శోభనాద్రీశ్వరావు తెలిపారు. పక్క రాష్ట్రాల్లో పలు రకాల పంటలపై ఎంఎస్పీ…

Read More