Author: apanalysis

దొందూ దొందే –వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ స్టేట్ బ్యూరో, 10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందని ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. ఉపాధ్యాయులు ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుందన్నారు. దీనిని బట్టి ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయ్యిందన్నారు. విద్యావ్యవస్థను ఇద్దరూ భ్రష్టు పట్టించారనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు.…

Read More

క్వాంటం వ్యాలీ టెక్నాలజీ తో ఐటీ హంగులు హైటెక్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మరో పేరు ఉంది. ఉమ్మడి అంధ్రప్రదేశ్ సమయంలోనే ఐటీ టెక్నాలజీతో అభివృద్ధి కి ఆయన బాటలు వేశారు. హైదరబాద్ కు అనేక ఐటీ కంపెనీలు రావడానికి ఆయన కారణంగా చెప్పవచ్చు. వచ్చిన ప్రతీ ఐటీ కంపెనీ తన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రభుత్వ పరంగా అనేక ప్రోత్సాహాలు అందించారు. ఈ చర్యలు వల్లనే హైదరాబాద్ ప్రపంచ ఐటీ రంగంలో ఒక సుస్ధిర స్ధానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎవరు అంగీకరించినా…అంగీకరించకపోయినా చంద్రబాబు ఇందుకు కారణమని ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ స్పూర్తి, ఆ అనుభవంతో అమరావతికి ఐటీ హంగులు అద్దేందుకు చంద్రబాబు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అమరావతి అభ్యున్నతి కోసం వినియోగిస్తున్నారు. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఇందుకు దోహదం కానున్నది. అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా నిలవబోయే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలకు 29,761 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీకి చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లబ్ధిదారులు రైస్ కార్డు నమోదైన డీలర్ దగ్గరే కాకుండా… తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఆదివారం ఉదయం పిఠాపురం పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -ప్రతి నెలా 1 నుంచి 15 తేదీలోపు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్‌ దుకాణాలు…

Read More

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ స్టేట్ బ్యూరో. కూటమి ప్రభుత్వం పేదలకు మళ్లీ రేషన్ కష్టాలు తీసుకువస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన డోర్ డెలివరీ విధానాన్ని తొలగించడం పట్ల మండి పడ్డారు. ఈ నిర్ణయం వలన 9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడిన 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉపాది కోల్పోయారని చెప్పారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు సరుకులు అందించిన ఈ వాహనాలను తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ సేవలందించిన వారిని స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాకముందు రేషన్ సరుకులు తీసుకోడానికి పేదలు ఎండనక, వాననక క్యూలైన్లలో ఫాపుల వద్ద పడిగాపులు పడేవారని, ఎప్పుడు రేషన్‌ ఇస్తారో, ఎంతసేపు రేషన్‌ ఇస్తారో తెలియక…

Read More

పూర్తిస్థాయి డీజీపీగా  హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరణ.. . ఏపీ స్టేట్ బ్యూరో, మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ దళాధిపతిగా  హరీష్ కుమార్ గుప్తా శనివారం పదవీ బాధ్యతలు  స్వీకరించారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తా  విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్  విభాగం డైరెక్టర్  జనరల్  పోస్టులో కొనసాగుతూ ఇన్ ఛార్జి డీజీపీ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  శనివారం పదవీ భాద్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా డీజీపీగా నేటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.  గత నాలుగు నెలలుగా ఇన్ ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పోలీసుశాఖలో తనదైన ముద్ర వేశారు. ఈ ఏడాది జనవరిలో ద్వారకా తిరుమలరావు డీజీపిగా పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ హరీష్ కుమార్ గుప్తాకే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి…

Read More

విజయవాడ, మే 29:విజయవాడ నగరం ఆశల బంగారంగా మిన్నకున్న రోజు. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవ్వరూ వద్దంటారా! “బంగారం బిస్కెట్ స్కీమ్” అంటూ ఓ వ్యాపారి సృష్టించిన మాయాజాలం చివరికి వందలమంది ఆశల్ని బూడిదచేసింది. బంగారం కాదు.. చివరకు క్రీం బిస్కెట్‌ కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసపు బంగారం పాటకు దాదాపు 10 కోట్ల రూపాయల మధుర స్వరం వినిపించినా చివరకు నిరాశే గతి అయింది. ఏమిటీ బంగారం బిస్కెట్ స్కీమ్?విజయవాడకు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యాపారి, గతంలో పచ్చళ్ళ వ్యాపారం చేసి స్థానికుల విశ్వాసాన్ని సంపాదించాడు. అదే నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్త ప్లాన్ వేయించాడు. “చీటీ పాటలు” పేరిట బంగారం బిస్కెట్లు పథకాన్ని ప్రారంభించాడు. నెలనెలా పాట వేసే వారికి బంగారం అందిస్తానన్న మాటతో స్కీమ్ ఎంతో మందిని ఆకర్షించింది. ఒక్కో సభ్యుడు…

Read More

ఏపీపై మోదీకి ఇంత ప్రేమా?.. పులకించిన పవన్! బద్వేల్, నెల్లూరుల మధ్య రహదారిని 4 లేన్లగా మార్పు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఏపీ స్టేట్ బ్యూరో, ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఓ రేంజి సహాయం అందుతోంది. అడిగిన వాటితో పాటు అడగని వాటికి కూడా కేంద్రం ఏపీలోని ప్రాజెక్టులకు ఇతోదికంగా నిధులు విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం… ఏపీలోని బద్వేల్, నెల్లూరుల మధ్య రహదారిని 4 లేన్ రహదారిగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అదికారికంగా ప్రకటించగా… ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ రోడ్డు మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగులో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందేశాన్ని చూసిన జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పులకించి పోయారని…

Read More

లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నూరు ఎమ్మేల్యే ప్రతిపాదన ఏపీస్టేట్ బ్యూరో, తెలుగుదేశం పార్టీ పగ్గాలు యువ నాయకుడు నారా లోకేష్ కు అప్పగించాలే డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే టిడిపి లీడర్లు, క్యాడర్ లోకేష్ కు మరింత ఉన్నతస్థానం కల్పించాలని అధినేత చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. తాజాగా కడపలో జరుగుతున్న టిడిపి మహానాడులో పలువురు నాయకులు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనే ప్రతిపాదనలు చంద్రబాబు ముందుంచుతున్నారు. కడప మహానాడులో రెండోరోజు గుంటూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో నాయకులు వ్యక్తపర్చిన అభిప్రాయాన్ని చంద్రబాబు ముందుంచారు. నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని తీర్మానం చేసినట్లు తెలిపిన ధూళిపాళ్ల దీన్ని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పరిశీలించాలని కోరారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా పాలనా వ్యవహరాలు చూసుకుంటే లోకేష్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని… అందుకే…

Read More

అన్నదాతకు మద్దతు… ఎం ఎస్ పి పెంచుతూ కేంద్రం నిర్ణయం… షరతులతోనే రైతులు సతమతం… ఏపీస్టేట్ బ్యూరో, ఏడాది ఖరీఫ్ సీజన్ కు కొంతమేర సానుకూల వాతావరణం కానవస్తుంది . సీజన్ కు ముందే ఇప్పటికే వర్షాలు ప్రారంభం కాగా మరోపక్కఅన్నదాతకు కేంద్రం మద్దతు పలుకుతుంది. ఈ పరిణామాలు సార్వా సాగుకు శుభ సూచికాలుగా ఉన్నాయి .ఫలితంగా ఏడాది ఖరీఫ్ పంటలకు కొంతమేర ఊరట లభించనుంది. సార్వా సీజన్లో సాగయ్యే పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇది సానుకూల అంశమే అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలలో ఎదురయ్యే షరతులే వారిని సతమతం పాలు చేస్తున్నాయి. ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే కేంద్రం ఎట్టకేలకు రైతులపై కొంత కనికరం చూపింది. ఈ సీజన్లో సాగే పంటలకు మద్దతు ధర పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు. తాము అందరం ఎన్టీఆర్ నుండి ఎంతో ప్రేరణ పొందామని మోదీ నివాళి అర్పించారు. తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఏపీలో అదికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

Read More