Author: apanalysis

తెలుగు చిత్రపరిశ్రమకు పవన్ రిటర్న గిఫ్ట్ ఇంత వరకు సీఎంను ఎందుకు కలవలేదు. గత ఛీత్కారాలు మరిచారా? నాపైనే కుట్రలు చేస్తారా? అని ప్రశ్నించిన పవన్ పేషీ ఏపీ స్టేట్ బ్యూరో, తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే –ఆ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేద‌ని ఎత్తిపొడిచారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేద‌ని పేర్కొన్నారు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌ అంటూ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వివాదాస్పందంగా మారిపోయింది.. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ సమస్యలు అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సమయంలో.. ఎలాంటి చర్చలు లేకుండా థియేటర్ల బంద్‌పై ఎలా నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది.. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సినిమా హరిహర వీరమల్లు లాంటి సినిమాలు వచ్చే సమయంలో నిర్ణయం ఏంటి? అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ కూడా ప్రశ్నించారు.. అంతేకాదు.. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారు..? ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు.. ఈ నేప‌థ్యంలో థియేటర్ల బంద్‌పై వెనక్కి తగ్గారు ఎగ్జిబిటర్లు.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ నేడు జరిగింది.. ఈ సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితార నాగ…

Read More

రాష్ట్రం నుండి లక్షలాది కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు మృగ్యం కావడం, పనులు దొరికినా అరకొరగానే ఉండటంతో బతకడానికి మరో మార్గం లేక అత్యధిక కుటుంబాలు రాష్ట్రాన్ని వీడుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు తేలింది. రాష్ట్రంలోనే ఇతర జిల్లాలకు వలస వెళ్లిన కుటుంబాల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. వలసవెళ్లిన వారిలో మొరుగైన జీవనం కోసం వెళ్లినవారు కూడా ఉన్నారని అధికారులు చెబు తున్నప్పటికీ, ఆ తరహా కుటుంబాల సంఖ్య నామమాత్రమే అని సమాచారం ఎక్కువ మంది ఉపాధి అవకాశాల కోసమే పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1.71 కోట్ల కుటుంబాలు నివశిస్తున్నాయి.వాటి పూర్తి వివరాలు సేకరించేందుకు, ఆయా కుటుంబాల్లో ఇతర పరిస్థితులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పి4 కార్యక్రమంలో భాగంగా కొద్ది…

Read More

ఫాస్టాగ్ లో కీలక మార్పు.. ఇకపై అన్ లిమిటెడ్ హైవే జర్నీ.. ఏపీ స్టేట్ బ్యూరో, ఇకపై హైవే ప్రయాణం మరింత సులభం కానుంది. అంతేకాక ఫాస్టాగ్ లో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. సంవత్సరంలో ఒకేసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లించి.. అన్ లిమిటెడ్ హైవే ప్రయాణం చేసేందుకు వీలుగా ఓ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విధానంతో వాహనదారుల ప్రయాణం సులభతరం కావడంతోపాటు.. ఇష్టం ఉన్న ప్రదేశాలకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ప్రయాణం చేసే వీలుంటుంది. టోల్ ప్లాజాల వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫాస్టాగ్ విధానంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమనట్లు తెలుస్తోంది. కొత్త పాలసీలో ముఖ్యంగా రెండు పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. యాన్నువల్ పాస్ పద్ధతి.. అంటే సంవత్సరానికి ఒక్కసారి…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, వాతావరణ శాఖ సూపర్ కూల్ న్యూస్ చెప్పింది. దేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని, సహజంగా మరో ఎనిమిది రోజుల తర్వాత కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతుపవనాలు, ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకాయి అని పేర్కొంది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విస్తరించే అవకాశం ఉందని, ఈసారి తెలుగు రాష్ట్రాలలో ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం అవుతుందని పేర్కొంది. ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏపీలో అప్పటినుండే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ ఒకటవ తేదీకి రుతుపవనాలు పలకరిస్తాయి. ఈసారి మాత్రం మే నెలలోనే ముందస్తుగా పలకరిస్తున్నాయి. గత 16ఏళ్ళలో…

Read More

 “ప్రకృతి వ్యవసాయ మామిడి” ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తో లక్షల్లో ఆదాయం ముందుగానే ఆర్డర్లు- ఓ మహిళా రైతు హేమ విజయ గాధ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎమ్ డీ ఎస్) రైతులకు ఓ వరం లా మారుతోంది. నేలలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పంటకు  ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే  సామర్థ్యాన్ని ఇస్తూనే  రైతును నస్టాలనుంచి కాపాడుతుంది. తక్కువ పెట్టుబడి,అధిక  దిగుబడి.. అధిక ఆదాయం చేకూరుస్తుంది. ప్రధాన పంటతో పాటు అంతర పంటలు అధనపు లాభం చేకుర్చుతున్నాయి.  ఈ కోవకు  చెందిన మహిళా రైతు హేమ విజయ గాధ ఇది . పూర్తిగా నష్టాల్లో ఉన్న మామిడి తోటను మార్చుకోవాలని నిర్ణయించు కున్న సమయంలో ప్రకృతి వ్యవసాయం హేమకు వెలుగు దారిని చూపింది. ఈ ఏడాది మామిడి పంట ద్వారా 4 ఎకరాల్లో ఏకంగా 10 లక్షల రూపాయల ఆదాయం సంపాదించారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ తో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించారు. ఆరు…

Read More

నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నువ్వే పదవి వచ్చాక మారిపోయావని రాజ్య సభ మాజీ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు. మద్యం కేసు సిట్ చూస్తోంది. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భవిష్యత్ లో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో!భక్తి ఇప్పుడూ ఉంది అప్పుడూ ఉంది. కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది. ఆయనకు ఇంకా నాగురించి ఏమి తెలియదు. నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు.ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో బాధలు పడ్డాను. అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది.…

Read More

మహానాడులో మారుమోగిన నినాదం మచిలీపట్నంలో టిడిపి జిల్లా మహానాడు అవినీతిలో వాటాలు పంచుకున్న వైసిపి -మంత్రి సుభాష్ టిడిపి శతాబ్ద కాలం పాటు వర్ధిల్లుతుంది- మంత్రి కొల్లు రవీంద్ర బాబు ఆశయం గొప్పది – ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల జగన్ తో చేతులు కలిపి జైలు పాలయ్యారు – వర్ల రామయ్య కృష్ణా జిల్లా మహానాడులో పలు తీర్మానాలు ఆమోదం ఏపీ స్టేట్ బ్యూరో, అభివృద్ధి – సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం శుక్రవారం మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్ లో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నాయకులు ప్రసంగించారు .ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే టిడిపి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నినాదంతో మహానాడు…

Read More

అడవి ఏనుగులను నియంత్రించే కుంకి ఏనుగులు గ్రామ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టం నివారణకు దోహదపడతాయి. ప్రత్యేక శిక్ష్లణ ఫలించిన ఉప ముఖ్యమంత్రి కృషి ఏపీ స్టేట్ బ్యూరో కుంకి ఏనుగులు ఇఫ్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులను అందజేసింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, మంత్రి ఈశ్వర ఖండ్రే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వాటికి సంబంధించిన పత్రాలు అందజేశారు. అడవి ఏనుగులను నియంత్రించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా నిరోధించడానికి వీటిని వినియోగిస్తారు. కుంకీ ఏనుగులు అంటే..? కుంకీ ఏనుగులు అనేవి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, తరిమికొట్టడానికి, లేదా వాటిని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ‘రాజుల కాలంలో సైనిక కార్యకలాపాల్లో, భారీ పనులు చేయడానికి వీటిని ఉపయోగించేవారు. అడవి ఏనుగులను నియంత్రించడానికి, వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేందుకు శిక్షణ…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, ఈ ఏడాది నైరుతీ పవనాలు కేరళ తీరాన్ని సాధారణం కంటే ఐదు రోజుల ముందే తాకబోతున్నట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది.జూన్‌ ఒకటిన రావాల్సిన పవనాలు ఈ నెల 27నే తీరాన్ని తాకనున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలులో జూన్‌ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు పడతాయని ముందస్తు శుభవార్త అందించింది. ఈ సారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ మోసుకొచ్చిన చల్లని కబురు అన్నదాతల్లో ఆశలు చిగురింప జేసింది. గతేడాది అకాల వర్షాలు, నాసిరకం, కల్తీ విత్తనాలు, పంటలకు ధరలేమి ఇత్యాది సమస్యలన్నీ కట్టకట్టుకొని రైతులకు నష్టాలు మూటగట్టాయి. అప్పుల భారంతో ఎంతోమంది అన్నదాతలు తనువు చాలించారు. యాసంగి ,దాళ్వా చివరిలోనూ అకాల వర్షాలు కన్నీరు పెట్టించాయి.కొద్దిరోజులుగా ఎక్కడో చోట ఏదోమూల అకాల వర్షాలు పడుతూ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనకంతంటికీ వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు ఒక బాగమైతే,పంటల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపించింది.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా…

Read More