Author: apanalysis

డీజీపీ కోర్టులో బంతి… రఘురామ – పీవీ సునీల్ వార్ ఎటు? తెరవెనుక వైసీపీ రాజకీయం ఎం.గణేశ్, జర్నలిస్టు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు – ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మధ్య వివాదం కీలక దశకు చేరుకుంది. పరస్పర ఆరోపణలు, చట్టపరమైన దాడులు, సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు  చర్చనీయాంశంగా మారుతున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చుతున్నారే అనే రీతిలో వైసీపీ నేతలు చంకలు కొట్టుకుంటున్నారు. ఈ  వివాదం టీడీపీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందనే ఆందోళనో ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కస్టడీలో తనను హింసించారంటూ రఘురామకృష్ణంరాజు న్యాయపోరాటానికి దిగడం, ఆ కేసులో అప్పటి సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు దారి తీసేలా చేయడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిణామం తర్వాతే బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకు సుప్రీంకోర్టు నుంచి ఎదురైన షాక్ ఆయనకు రాజకీయంగా కొత్త చిక్కులు తెచ్చింది. ఈ…

Read More

రాజధానికి కూతవేటులో మావోయిస్టులు విజయవాడలో 24, ఏలూరులో 15 మంది మావోస్టుల అరెస్టు మావోయిస్టుల కోసం జల్లెడ స్ధానిక పోలీసుల డొల్లతనం- నిఘా సంస్ధల వైఫల్యం. రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల దొరకడంపై ఆందోళన వివిఐపీలు ఉండే రాజధానిలో పోలీసుల భద్రత కూడా అధికమే. అయినా మవోస్టులు ఇక్కడే తలదాచుకోవడంపై కలవరం ఎం.గణేశ్, జర్నలిస్టు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్, తరుచూ వచ్చే కేంద్ర మంత్రులతో విజయవాడ ఇప్పుడు కీలక ప్రాంతంగా మారింది. వీవీఐపిలు నడయాడే ప్రాంతంలోనూ, రాజధాని అమరావతికి కూతవేటులో 24 మంది మావోయస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని ఎన్నో నేరాలకు సంబంధించిన ఆధారాలను కనుగొంటున్న ప్రస్తుత పరిస్ధితి లో ఒకే భవనంలో 24 మంది మావోస్టులను పోలీసులు గుర్తించకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే కాకుండా ప్రశాంతంగా ఉండే ఏలూరులో 15 మంది మావోస్టులు దొరకడం కూడా…

Read More

సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌-2025 కు సిద్దమౌతున్న సీఆర్డీఏ రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించే యత్నం పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతుల రంగాలకు ప్రాధాన్యం ప్రణాళిక రూపొందించిన కమీషనర్ కన్నబాబు ఎం.గణేశ్, జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సిఆర్డిఏ) విశాఖలో రెండు రోజులపాటు జరగనున్న సిఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ 2025లో సుమారు రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ పెట్టుబడులు పర్యాటకం, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, విద్య, మౌలిక వసతుల రంగాలలో ఉండనున్నాయి. అమరావతిని సుస్థిర నగరాభివృద్ధికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు కేంద్రంగా నిలబెట్టే దిశగా ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయి.“అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అభివృద్ధి, సుస్థిరత, సమగ్రతకు ప్రతీక. సిఐఐ సమ్మిట్‌లో కొత్త భాగస్వామ్యాలు రూపుదిద్దుకోవడంతో రాజధాని అమరావతి ప్రాంతం దక్షిణ భారతదేశంలో ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా మరింత బలపడుతుంద”ని ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కె. కన్నబాబు…

Read More

మహిళా క్రికెటర్లకు స్పూర్తినిచ్చిన లోకేష్ సెల్ఫీ సోషల్ మీడియాలో నయా ట్రెండ్ ఎం.గణేశ్, జర్నలిస్టు . మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతి, ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చ.గ. స్థలం, రాష్ట్ర ప్రభుత్వం లో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ అభిమానులు అంతా సీఎం నిర్ణయం వెలువడిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు. ఇంత వరకు భాగానే ఉంది. అయితే అరగంట తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ అంతకు మించి ట్రెండ్ అయింది. సీఎం ఇచ్చిన నజారానా కంటే ఆయన తనయుడు ఇచ్చిన ప్రోత్సాహం విలువైందనే అభిప్రాయం వ్యక్తం అయింది. శ్రీ చరణితో ముఖ్యమంత్రితోపాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా…

Read More

ఎం.గణేశ్, జర్నలిస్టు విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. 27 సంవత్సరాలపాటు విజయ డెయిరీ చైర్మన్ గా పని చేశారు. “ఆపరేషన్ ఫ్లడ్” ద్వారా డాక్టర్ వర్గీస్ కురియన్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగాని తయారు చేశారు. అరుదైన దార్శనికత కలిగిన డాక్టర్ కురియన్ తన జీవిత కాలాన్ని భారతదేశ రైతులను శక్తిమంతం చేయడం కోసం అంకితం చేశారు. అందుకే ఆయనను “శ్వేత విప్లవ పితామహుడు” గా పిలుస్తారు. అదే రీతిలో మండవ జానకీ రామయ్య విజయ డెయిరీ పరిధిలోని రైతులను ఆర్ధికంగా శక్తిమంతులను చేశారు. రాజకీయాలకు అతీతంగా డెయిరీలోని పాలనా వ్యవహారాలను కొనసాగించారు. పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జానకిరామయ్య చాలా కృషి చేశారు. విజయ డెయిరీని విస్తరించడంలో జానకిరామయ్య చేసిన…

Read More

దీపారాధన, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు అధిక సంఖ్యలో హాజరైన భక్తులు ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. కార్తీక పౌర్ణమి సందర్భంగా పున్నమి తోట టిటిది దేవస్థానంలో భక్తుల అధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు శాంతిశ్రీ, తులసి, రాజేశ్వరి, మణి., సుశీలల ఆధ్వర్యంలో దేవాలయం లోని ఉసిరి చెట్టు క్రింద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అవునేతితో ఉన్న 365 వత్తులను భక్తులకు పంపిణీ చేయగా, వారు ఉసిరి చెట్టు క్రింద వత్తులను వెలిగించారు. ఆలయ ఇనస్పెక్టర్ లలితా, రమాదేవి సూపరింటెండెంట్ మల్లిఖార్జునరావు, న్యాయవాదులు పధనల ఏడుకొండలు, విజయకుమార్, ప్రసాద్ భక్తులు వేణు, ప్రసాదరెడ్డి, జలయా అర్చకులు మురళీకృష్ణ లు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు

Read More

వచ్చాడంటే పరిష్కారం కావాల్సిందే.. అదే పవన్ స్టయిల్ నిధులు విడుదల, పనుల ప్రారంభానికి ఆదేశాలు దివి సీమ ప్రజల కల సాకారం బ్రిడ్జి నిర్మాణానికి అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఎనాలసిస్, అవనిగడ్డ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ కొత్త వరవడిని .సృష్టిస్తున్నారు. ఆరు నెలల క్రితం గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడి రహదారి సౌకర్యాలు లేకపోవడాన్ని,. గిరిజన మహిళలు పాద రక్ష్లలు లేకుండా నడవడం గమనించారు. అమరావతి వచ్చిన వెంటనే ఆ గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు అయ్యాయి. అదే విధంగా తన సొంత నిధులతో గిరిజన మహిళలకు పాదరక్ష్లలు అందాయి. అదే రీతిలో వారం క్రితం తుపాను బాధితుల పరామర్శకు అవనిగడ్డ, తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎదురుమొండి సమస్యను అక్కడి ప్రజలు వివరించారు. సీన్ కట్ చేస్తే బుధవారం తన…

Read More

ఉద్యోగాలు, పరిశోధనలకు విజ్ఞాన్.పెద్దపీట విజ్ఞాన్స్‌  వీశాట్‌ నోటిఫికేషన్‌ విడుదల ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు ఏపీ ఎనాలిసిస్, గుంటూరు యువతకు అత్యున్నత ఉద్యోగాలు కల్పించడం, వారిని గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడం, పరిశోధనలకు పెద్దపీట వేయడంలాంటి సమున్నత లక్ష్యాలతో తాము ముందుకెళుతున్నామని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ 2026–27 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (హానర్స్‌), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (హానర్స్‌), బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్, ఫార్మ్‌–డీ అడ్మిషన్ల వీశాట్‌ – 2026–27 నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న వీశాట్‌ ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం కలదన్నారు. మార్చి 1 నుంచి నుంచి ఏప్రిల్‌ 15 వరకు ప్రవేశ పరీక్ష విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీన్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ వీశాట్‌ దరఖాస్తులు గుంటూరు, విజయవాడ, హైదరాబాదు,…

Read More

భారీ సంఖ్యలో తరలి రానున్న కాపు సామాజిక వర్గం స్వాగత ద్వారాలతో  కొత్త రూపు సంతరించుకున్న మచిలీపట్నం మన కులాన్ని ప్రేమిద్దాం-ఇతర కులాలను గౌరవిద్దాం అనే విధానం ఎం.గణేశ్, జర్నలిస్టు కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో నోములు, వ్రతాలు చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. నదీ స్నానం, దీపారాధన కూడా విశేష ఫలితాలను ఇస్తాయని ఇతిహాసాలు చెబుతున్నాయి. అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. క్రమంగా కార్తీక మాసాన్ని అన్ని వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, సామాజిక వర్గం, రాజకీయ పార్టీల ప్రతినిధులు సామాజికపరంగా సామూహికంగా కలుస్తున్నారు. కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. కలిసి భోజనాలు చేస్తున్నారు. ఐక్యంగా ఉంటూ అభివృద్ది బాటలో పయనిద్దామని ప్రతిన బూనుతున్నారు. ఇందులో ఏ వర్గం మినహాయింపు కాదు. ఇలా సమావేశం కావడం వలన ఆ వర్గాల్లో ఐక్యత కొంత వరకు ఫరిఢవిల్లుతోంది. పుణ్యం, పురుషార్ధం…

Read More

వ్యూహాత్మకంగా వాసంశెట్టి  వ్యాఖ్యలు ….!! తూర్పులో ఉదయభానుడు అగ్రకులాల నేతల్లో అందోళన సొంత సాామాజికవర్గంలో పెద్దన్నగా బాధ్యత  తీసుకున్న వాసంశెట్టి టీడీపీలోని కొందరు నేతలకు మింగుడు పడని వాసంశెట్టి ఎం.గణేశ్, జర్నలిస్టు  ఇటీవల శెట్టిబలిజల వన సమారాధన సన్నాహక సమావేశంలో  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఎత్తుగడలో భాగమేనా?  వైసీపీని తెరమరుగు చేసేందుకే ఆయన అలా మాట్లాడారా? అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా వారు చెబుతున్నారు. అలాంటప్పుడు మంత్రి వాసంశెట్టి ఎందుకు టార్గెట్ అయ్యారనేది డాలర్ల ప్రశ్నగా ఉంది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన శెట్టి బలిజ సామాజికవర్గంలో ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు. పార్టీలకతీతంగా శెట్టిబలిజలకు చేదోడువాదోడుగా ఉండడమేనా ఆయన చేసిన తప్పు? అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక…

Read More