లక్షలు జీతాలు ఇక గగనమే.! ఉద్యోగాలు ఊడిపోయే రోజులు దగ్గరలోనే ఏపీ స్టేట్ బ్యూరో, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాలర్ ఎగరేసి చెప్పుకునే రోజులు ఉండేవి. డాక్టర్లు, టీచర్లు ఇంకెవరైనా సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ముందు కొంచెం తక్కువే అనే భావన ఉండేది. ఇంజనీరింగ్ చదవకపోయినా లక్షల్లో జీతాలు సంపాదించే అదృష్టం ఈ రంగానికే దక్కింది. దీంతో చాలామంది హైలైఫ్ అలవాటు పడ్డారు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. “పెరుగుట విరుగుట కొరకే” అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎక్కువ జీతాలు తీసుకుంటున్నామని సంబరపడకండి. ఉద్యోగాలు ఊడిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు అనుభవిస్తున్న భారీ జీతాలు శాశ్వతం కాదని జోహో సీఈవో శ్రీధర్ వెంబు కుండబద్దలు కొట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) వంటి టెక్నాలజీలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని…
Author: apanalysis
ఏపీస్టేట్ బ్యూరో. 014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ వివరించారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అసలు నిజమైన స్కామ్ స్టర్ ఎవరూ?..చంద్రబాబు కాదా? 2014–2019 మధ్య చేసిన లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై లేడా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు చేసిన స్కామ్ చెబుతా చూడండి. రాష్ట్రంలో 4380 లిక్కర్‌షాపుల కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియను రిగ్గింగ్ చేశారు. తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు, తన బినామీలు రిగ్గింగ్ చేసి తన మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటిని ఒక సిండికెట్ మాఫియాగా తయారు చేశారు. వీటికి పక్కనే ఇల్లీగల్‌గా పర్మిట్ రూమ్‌లు, 40 వేల బెల్ట్‌షాపులు నడిపారు. ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్‌షాపుల సిండికేట్, ఈయనకు కావాల్సిన డిస్టరీలకు మేలు చేసే వి«ధంగా…
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు. ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఈ ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ వివరాలు వెల్లడించింది.సాంప్రదాయంగా యాక్సెంచర్ డిసెంబరులో ప్రమోషన్లను ప్రకటించింది. కానీ క్లయింట్ డిమాండ్, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రమోషన్ చెల్లింపులు లేకపోవడంతో ఆ సైకిల్‌ను జూన్‌కు మార్చారు. స్థిరమైన వార్షిక షెడ్యూల్ ప్రకారం కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగా ఉద్యోగులను ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్లు భారతదేశంలో 15,000, యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (ఈఎంఈఏ) దేశాల్లో 11,000, అమెరికాలో 10,000గా ఉండనున్నాయి. అధిక వృద్ధి రంగాల్లోని ఉద్యోగులకు మూల వేతన పెంపు ఉంటుందని…
సరిగ్గా 31 ఏళ్ల క్రితం మే 21న ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ సుస్మితాసేన్ (Sushmita Sen) అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ తరఫున తొలిసారి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించారు. అందుకే తన జీవితంలో మే 21 ఎప్పటికీ ప్రత్యేకమే అంటారు నటి సుస్మిత. నేడు మరోసారి ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘‘ భారతదేశానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయిని విశ్వానికి పరిచయం చేసిన చరిత్రాత్మక విజయం అది. ఆశకు మరింత బలాన్నిస్తూ.. ప్రేమను మరింత ముందుకునడిపిన రోజు. ప్రపంచమంతా పర్యటించడానికి జీవితంలో స్ఫూర్తినింపే ఎంతోమంది వ్యక్తులను కలిసే భాగ్యాన్ని పొందిన రోజు. ఈ విషయంలో దేవుడికి, మా అమ్మకు ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటాను. మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవం…
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎక్స్‌లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. ‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా దళాలకు అభినందనలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారు.…
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) సమీపంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ ఘటన రైల్వే బ్రిడ్జ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని చందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఒక సూట్‌కేస్‌ను స్థానికులు గుర్తించారు. దాన్ని తెరచి చూడగా గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. దీనిపై సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసి రైలులో నుంచి ఇక్కడ విసిరేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందింది అనే వివరాలు తెలియాల్సి ఉంది
మహానాడు వేదికగా పలు మార్పులు ఏపీ స్టేట్ బ్యూరో, మరో వారం రోజుల్లో టీడీపీ మహానాడు కడపలో జరగనున్నది. ఈ కార్యక్రమాన్ని వేదికగా తీసుకుని పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా మంత్రి లోకేష్ అనుచరులు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ నేతకు ఎటువంటి పదోన్నతి లభించనున్నది అనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నారు. కొందరైతై పార్టీ పరంగా పదోన్నతి లభిస్తుందని చెబుతుంటే మరి కొందరు మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. లోకేష్ తోపాటు పార్టీలో మిగిలిన నాయకులకు ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలనా బాధ్యతలు స్వీకరించిన తరువాత కొన్ని ప్రత్యేక పనులపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ప్రధానంగా ఏపీకి రానున్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ఎక్కువుగా సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రభుత్వం…
ఏఫీ స్టేట్ బ్యూరో, గడచిన 10 నెలల్లో పోక్సో , వరకట్న హత్యలు, మహిళల హత్యలు, రేప్ మరియు గ్యాంగ్ రేప్ కేసుల్లో 169 మంది నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించడం జరిగిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలపై జరిగే వ్యవస్థీకృత నేరాలను అరికట్టడానికి ఐజీ రాజకుమారి నేతృతంలో “ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్” ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శక్తి యాప్: మహిళల భద్రతకై అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన “శక్తి యాప్” ఇపుడు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో యూజర్లకు అందుబాటులో ఉండటంతో పాటుగా PlayStore (Android Phone) మరియు IOS (Apple Phone) నుండి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. శక్తి యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 1,52,16,440 మంది శక్తి యాప్ ను…
ఏపీ స్టేట్ బ్యూరో, రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా చేపట్టిన రెండోదశ పూలింగు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే సిఆర్‌డిఏ ఆధ్వర్యాన గ్రామసభలను అధికారులు పూర్తి చేస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామాల రైతులు స్వల్ప అభ్యంతరాల నడుమ పూలింగుకు అంగీకారం తెలుపుతున్నా, తాడికొండ మండల గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులూ లేకుండా భూసమీకరణ ముందుకు సాగాలంటే గతంలో అనుభవం ఉన్న అధికారులను సిఆర్‌డిఏ జిల్లాల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతాధికారులతోపాటు 50 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల(ఎస్‌డిసి) అవసరం ఉందని, తక్షణ అవసరంగా 30 మంది కావాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. వీరే పూలింగు సమయంలో కాంపిటెంట్ అథారిగా వ్యవహరించనున్నారు. తొలిగా గతంలో సిఆర్‌డిఏ భూపరిపాలన విభాగం డైరెక్టర్‌గా విశేష అనుభవం ఉన్న చెన్నకేశవులును మరలా డైరెక్టర్‌గా తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సిఆర్‌డిఎలో పూలింగు ప్రక్రియకు సంబంధించి కార్యాచరణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఆయన నియామకంపై స్పష్టమైన ప్రకటన రానున్నట్లు…
ఏపీ స్టేట్ బ్యూరో, రాష్ట్రంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎపి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఒ) ద్వారా చెల్లించే విధానం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది.