Author: apanalysis

ఏపీ స్టేట్ బ్యూరో. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్‌ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని చెప్పారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీలపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. రెంట్ రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్టిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.

Read More

ఏపీ స్టేట్ బ్యూరో. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్‌ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని చెప్పారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీలపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది.  రెంట్  రూపంలో సినిమాలను ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్టిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటైన సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. అమరావతే రాజధాని అని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శరవేగంగా రాజధాని నిర్మాణాన్ని చేపట్టేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే అమరావతి రాజధానిని హరిత నగరంగా మార్చేందుకు నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. వినూత్న ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే తొలిసారి ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రీ ట్రాన్స్‌లొకేషన్ పద్దతిని చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అమరావతిని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియలో భాగంగా రోడ్ల నిర్మాణాలకు అడ్డుగా ఉన్న వందలాది చెట్లను ఉన్న ప్రాంతం నుంచి తీసి.. సురక్షితంగా మరో చోటుకు తరలించి అక్కడ మళ్లీ నాటుతోంది.…

Read More

యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది .2024 ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ ‌లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి‌ బాటలు వేసింది.    పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి, పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ  సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి…

Read More

బాయ్‌‌ఫ్రెండ్‌తో కలిసి తల్లినే చంపేసింది !! ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళ 14 ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిన ఓ పాపను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచింది. అయితే, ఆ బాలిక పెరిగి పెద్దయ్యాక ఇద్దరు యువకులతో కలిసి, తన పెంపుడు తల్లిని దారుణంగా హత్య చేసింది. పైగా గుండెపోటుతో చనిపోయినట్లు నాటకం ఆడింది. కానీ ఆమె మీద అనుమానం రావడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. విచారనలో ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read More

బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ధారుణ హత్య ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళ 14 ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిన ఓ పాపను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచింది. అయితే, ఆ బాలిక పెరిగి పెద్దయ్యాక ఇద్దరు యువకులతో కలిసి, తన పెంపుడు తల్లిని దారుణంగా హత్య చేసింది. పైగా గుండెపోటుతో చనిపోయినట్లు నాటకం ఆడింది. కానీ ఆమె మీద అనుమానం రావడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. విచారనలో ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read More

దేశంలోనే అత్యంత పొడవైన వంతెన పూర్తి కావచ్చిన నిర్మాణం ఒకేసారి 40 మంది వరకు దీనిపై నడవ వచ్చు. టూరిస్టులకు కనువిందు. ఏపీ స్టేట్ బ్యూరో, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలను టూరిస్ట్ స్పాట్‌లుగా అభివృద్ధి చేసి ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉంది. ఈ క్రమంలోనే సముద్ర తీర ప్రాంతం వెంబడి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏపీలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పేమాట .. విశాఖపట్నం. సాగర హోరు.. అలల జోరు.. ప్రకృతి అందాలతో వైజాగ్ పర్యాటకులను కట్టిపడేస్తూ ఉంటుంది. పోర్టు నుంచి మ్యూజియం వరకూ.. సింహాచలం దేవస్థానం, బీచ్‌లు, కైలాసగిరి ఇలా ఒక్కటేమిటి ఎన్నో అందాలు విశాఖ సొంతం. అలాంటి విశాఖ సిగలో మరో మణిహారం చేరనుంది.విశాఖపట్నంలో భారతదేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెన నిర్మితమవుతోంది. నిర్మాణం కూడా దాదాపుగా…

Read More

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది . 2024 ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్ ‌లో పొందుపరిచారు. యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి‌ బాటలు వేసింది.పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి, పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, యూ ట్యూబర్ అరెస్ట్ పహల్గాం ఉగ్రదాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. పాక్‌ అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్న వారి గుట్టును రట్టుచేస్తున్నారు. ఈ క్రమంలో కీలక సమాచారాన్ని పాక్‌ అధికారులతో పంచుకుంటున్న హర్యానాకు చెందిన ఓ యూట్యూబర్‌తో సహా ఆరుగురు భారతీయుల్ని అధికారులు తాజాగా అరెస్ట్‌ చేశారు.హర్యానాకు చెందిన ట్రావెల్‌ వ్లాగర్‌ జ్యోతి మల్హోత్రా సహా మిగిలిన ఐదుగురు పాక్‌ ఐఎస్‌ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించి.. వారిని అరెస్టు చేశారు. ట్రావెల్‌ వ్లాగర్‌ జ్యోతి.. ‘ట్రావెల్‌ విత్‌ జో’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతోంది. కమిషన్‌ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్‌ను రెండుసార్లు సందర్శించింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఉద్యోగి ఎహ్సాన్‌-ఉర్‌-రహీం అలియాస్‌ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్‌ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులు…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, ఏపీలో మెగా డీఎస్సీ-2025కి సంబంధించి ఓ అంకం పూర్తి అయ్యింది. దరఖాస్తుల గడువు ముగిసింది. అన్ని పోస్టులకు కలిపి దాదాపు 5,67,417 ద‌ర‌ఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లు మే 30న విడుదల కానున్నాయి. హాల్ టికెట్లు విడుదలకు సంబంధించి తెర వెనుక ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం జారీ చేసిన డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. చివరిరోజు భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీకి ఓవరాల్‌గా 5.67 దరఖాస్తులు వచ్చినట్టు ప్రకటించింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొత్తం 16 వేల పైచిలుకు టీచర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఏప్రిల్‌ 20 నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. ఈ నెల 15తో ఆ గడువు కాస్త ముగిసింది.…

Read More