ఏపీ స్టేట్ బ్యూరో, మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ప్రతీ నెల 3 వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర. కార్యక్రమం కొనసాగుతుందని, పరిశుభ్రత – పచ్చదనం థీమ్ గా దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పర్యావరణానికి, పచ్చదనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, 30 శాతం గ్రీన్ కవర్ తో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. గ్రీన్ కవర్ లో ప్రపంచ దేశాలతో మనం పోటీపడాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ హరికృష్ణ, రవి ప్రకాష్, జి.పాలరాజు, రాజకుమారి, డిఐజిలు అమ్మిరెడ్డి, సెంథిల్ కుమార్, పకీరప్ప, ఎస్పీలు శ్రీకాంత్, బి. ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Author: apanalysis
భధ్రత, డేటా సంరక్షణ లక్ష్యంతో కొత్త విధానం ఏపీ స్టేట్ బ్యూరో, పాస్ పోర్టుల భధ్రత, పరిరక్ష్లణ, నకిలీ, టాంపరింగ్ ల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్ ఫోర్టు విధానాన్ని అమలులోకి తీసుకువస్తుంది. దేశంలోని అన్ని పాస్ పోర్టు కేంధ్రాల్లో అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం (PSP) 2.0 ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ (e-Passport) ప్రవేశపెట్టింది. భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగుపరచడం, పాస్‌పోర్ట్ భద్రతను కల్పించడంలో భాగంగా ఈ-పాస్‌పోర్ట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం పాస్‌పోర్టులు పేపర్ ప్రింటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్‌లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్‌పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డేటాను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.ఈ-పాప్‌పోర్ట్ ఏంటంటే? ఇది సంప్రదాయ పేపర్ డాక్యుమెంట్ వంటిదే. ఈ-పాస్‌పోర్ట్ కవర్‌పై బంగారు వర్ణపు…
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలోనూ సబ్జా గింజలు ముందుంటాయిచర్మాన్ని లోలోపలి నుంచి శుభ్రం చేయడంలో సబ్జా గింజలు సమర్థంగా పనిచేస్తాయి. వీటిలో సహజంగా ఉండే డీటాక్స్ గుణాలు.. చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటికి పంపిస్తాయి. దాంతో చర్మం కాంతిమంతంగా మారుతుంది. మొటిమలూ తగ్గుముఖం పడతాయి.తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్‌తో నిండిన సబ్జా గింజలు.. ఆకలిని నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సాయపడతాయి.సబ్జా గింజల్లో ఉండే యాంటి బయోటిక్, యాంటి ఫంగల్, యాంటి మైక్రోబియల్ లక్షణాలు.. చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఇందుకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. సబ్జాలో ఉండే చర్మ స్థితిస్థాపక లక్షణాలు.. చర్మం త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.చర్మానికే కాదు.. జుట్టుకూ సబ్జా గింజలు మంచి పోషణ అందిస్తాయి. వీటిలో అధికంగా లభించే…
టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను అమెరికాకు తెచ్చేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నం చాలాచాలా ఖరీదైనదిగానే కనిపిస్తున్నది. అవును మరి.. ట్రంప్ పుణ్యమాని యాపిల్‌కు ‘మేక్ ఇన్ యూఎస్’ కష్టాలు వచ్చిపడ్డాయిప్పుడు. భౌగోళిక, రాజకీయ వ్యూహాల దృష్ట్యా చైనా నుంచి భారత్‌కు తమ తయారీని మార్చాలనుకున్న అమెరికన్ కంపెనీ యాపిల్‌కు ట్రంప్ రూపంలో ప్రధాన అవరోధం ఏర్పడుతున్నది. అమెరికా సంస్థలు స్థానిక ఉత్పాదకతకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ అక్కడి కార్పొరేట్లపై గత కొద్ది రోజులుగా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో యాపిల్ తల పట్టుకుంటున్నది.యాపిల్ ఉత్పత్తులు ప్రస్తుతం 80 శాతం చైనాలోనే తయారవుతున్నాయి. దీనివల్ల అక్కడ దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాలూ లభిస్తున్నాయి. అయితే గత కొన్నేండ్లుగా చైనా పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారుతున్నాయని భావిస్తున్న కంపెనీలు.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్‌పై యాపిల్ దృష్టి సారించింది. అయితే గతంతో పోల్చితే…
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన అరాచకానికి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టగా, ఇది విజయవంతమైన నేపథ్యంలో విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ జరగగా, ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. అయితే ఇక్కడ అందరి దృష్టి పవన్ కల్యాణ్ చేతిపైనే ఉంది.అందుకు కారణం పవన్ ఎప్పుడు పట్టబొచ్చు పొడిపించుకుంది లేదు. ఆ మధ్య పవన్ చేతిపై త్రిశూలం టాటూ కనిపించింది. త్రిశూలం ఎందుకు వేసుకొన్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది.కాస్త ఆరా తీస్తే ఆ టాటూ హరిహర వీరమల్లు కోసం వేసుకున్నారని తెలిసింది. ఇక తిరంగా ర్యాలీలో పాల్గొన్న పవన్…
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ బృందం నుంచి ఓ కీలకమైన అప్‌డేట్ రానుంది. ఆ విషయాన్ని కథానాయకుడు హృతిక్ రోషన్ స్వయంగా వెల్లడించారు. హృతిక్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా ‘వార్2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ లుక్ కానీ, ఇతర అప్‌డేట్స్ కానీ బయటికి వస్తాయనే అంచనాలతో ఉన్నారు అభిమానులు. అది నిజమేనని చాటుతూ, ఎన్టీఆర్‌ని ఉద్దేశించి హృతిక్ ఎక్స్ ద్వారా ఓ పోస్ట్‌ని పంచుకున్నారు. ‘తారక్… మే 20న ఏ అప్డేట్ రాబోతోందో, అసలు ఏం జరగబోతోందో తెలుసా? నువ్వు అస్సలు ఊహించలేవు. అంతా సిద్ధంగా ఉన్నారా?’…
సైబర్ క్రైమ్ ముఠాల బారి నుంచి ఇద్దరు యువకులు త్రుటిలో తప్పించుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పసిగట్టడంతో వారు సైబర్ ఉచ్చులో పడకుండా బయటపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ బిజ్నూర్ జిల్లా ఖటాయ్‌కు చెందిన నబీల్ అహ్మద్(30) వాట్సప్‌కు యూఏఈలో ఉద్యోగం ఉందంటూ కొద్దిరోజుల క్రితం మెసేజ్ వచ్చింది. చాటింగ్ చేసిన వ్యక్తి తన పేరు జాసన్ అని పరిచయంచేసుకున్నాడు. కంబోడియాలో మంచి వేతనంతో కూడిన డేటాఎంట్రీ ఉద్యోగం ఉందని చెప్పడంతో నబీల్ ఆసక్తి చూపారు. నబీల్‌ను వాట్సప్ గ్రూప్‌లో చేర్చాడు. అందులో చైనా దేశస్థుడు ట్యాంక్‌ను టీం లీడర్‌గా పరిచయం చేశాడు. అదే గ్రూప్‌లో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కే చెందిన అహ్మద్ అనే యువకుడు కంబోడియాలో ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పాడు. ఇద్దరికీ వీసా, విమాన టికెట్లను షాహిల్ అలియాస్ అజీమ్ సమకూరుస్తాడని వివరించాడు. ఏప్రిల్ 25న దిల్లీ నుంచి కంబోడియా వెళ్లాల్సి ఉండగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం కావడంతో…
మొదటి దశకు రూ.11,009 ట్రామ్ తరహా రవాణా విజయవాడ – గన్నవరం విజయవాడ – పెనమలూరు డీపీఆర్ సిద్దం ఏపీ స్టేట్ బ్యూరో, రాజధాని అమరావతిలో భాగంగా ఏర్పాటు చేయనున్న లైట్ మెట్రోకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు మొదటి దశకు రూ.11,009 కోట్లు, భూ సేకరణకు రూ.1,152 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారీ బాధ్యతను శిస్ట్రా కన్సల్టెన్సీకి అప్పగించింది. కంపెనీ ప్రాథమిక నివేదికను మెట్రో రైల్ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. విభజన హామీల్లో భాగంగా కేంద్రం అమరావతికి రైల్ కనెక్టివిటీ అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య రైల్వేలైన్‌కు అనుమతులూ వచ్చాయి. అదే సమయంలో విజయవాడ నుండి రాజధాని అమరావతికి లైట్ మెట్రోను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో లైట్ మెట్రో (ట్రామ్ తరహా రవాణా)ను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో…
నిమ్మకాయల వల్ల మనకు ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిమ్మరసాన్ని చాలా మంది వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది. నిమ్మకాయల్లోని రసంలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. అయితే నిమ్మకాయలు మాత్రమే కాదు, నిమ్మ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులను ఉపయోగించి అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. నిమ్మ ఆకుల్లో సిట్రిక్ యాసిడ్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ మనకు రోగాలు రాకుండా చూస్తాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి.నిద్రలేమి సమస్యకు..నిమ్మ ఆకులను కొన్ని తీసుకుని కొద్దిగా నలిపి నీటిలో వేసి మరిగించాలి. 10 నిమిషాలు మరిగాక స్టవ్‌ను ఆఫ్ చేసి నీళ్లను వడకట్టి ఆ నీళ్లు గోరు వెచ్చగా ఉండగానే కొద్దిగా తేనె కలిపి తాగేయాలి. ఈ…
త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. చిత్రాల్లో కథానాయికగా నటించారు సమంత. ఈ మూడూ బ్లాక్‌బస్టర్సే. అయితే.. ‘అఆ’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత నటించలేదు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానున్నదని తెలుస్తున్నది.త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ.. చిత్రాల్లో కథానాయికగా నటించారు సమంత. ఈ మూడూ బ్లాక్‌బస్టర్సే. అయితే.. ‘అఆ’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత నటించలేదు. తాజా సమాచారం ప్రకారం మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానున్నదని తెలుస్తున్నది. ఇటీవల ఓ సందర్భంలో సమంత తెలుగు సినిమాల్లో నటించాలని త్రివిక్రమ్ కోరారు. సామ్ కూడా తన ‘శుభం’ ప్రమోషన్‌లో భాగంగా తెలుగు సినిమాల్లో నటించాలనుందనీ, అయితే.. సరైన కథలు రావడం లేదని, మంచి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది.అందుకే.. సామ్ కోసం గురూజీ మళ్లీ కలం పట్టారట. ప్రస్తుతం ఆయన వెంకటేశ్‌తో సినిమా చేయబోతున్న…