Author: apanalysis

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కొవిడ్‌ కొత్త కేసులు (Covid Cases) నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్‌ అయ్యారు.ఆసియా దేశాల్లో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్ (Hong Kong)‌, సింగపూర్‌ (Singapore) దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. హాంకాంగ్‌లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల శాంపిల్స్‌లో అనేకం పాజిటివ్‌గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్‌గా తేలడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కొవిడ్ మరణాలు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది ఇదే గరిష్ఠ సంఖ్య అని కూడా తెలిపారు. రెండేళ్ల నాటి కొవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే…

Read More

ఇంటి వద్దకే టైలరింగ్ సేవలు ఏపీ స్టేట్ బ్యూరో. షేక్ కాలేషా ఐడియా అతని జీవితాన్ని మార్చేస్తుంది. సాధారణ టైలర్లగా ఆయన ఆలోచించలేదు. ఎక్కడైనా దుకాణం తీసుకుంటే దానికి అడ్వాన్స్, నెలవారీ అద్దె, కరెంట్ బిల్లుతోపాటు ఇతర ఖర్చులను భరించడం అతనికి కష్టంగా మారింది. టైలరింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఆ ఖర్చులకే పరిపోవడం లేదు. దీనితో కొత్తగా ఆలోచించాడు. ఇంటి వద్దకే టైలరింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాడు. వెంటనే ఖాతాదారుల పనిని చేసేస్తున్నాడు. అదేమిటో చూడండి మరి.. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ కాలేషా టైలర్ వృతితో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తొలుత గ్రామంలో టైలరింగ్ దుకాణాన్నినిర్వహించేవాడు. అయితే, కాలక్రమేణ షాపుకు ఆదరణ తగ్గిపోయింది. కొంత మంది బట్టలు కుట్టించుకున్నా ఇచ్చే మొత్తం కంటే, అప్పులు పెట్టేదే ఎక్కువైంది. దీంతో కుటుంబ జీవనం కష్టంగా మారింది. వేరే పని వెత్తుకుందామా అంటే.. తెలిసింది టైలరింగ్ పని ఒక్కటే. టైలరింగ్ వృత్తి…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో. ఏపీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఆయన ఈ వయసులో కూడా యువకుల కంటే వేగంగా పని చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చంద్రబాబు బాగానే చూసుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఈ క్రమంలో ఆయన అనేకమార్లు తన ఆరోగ్య రహస్యాలను ప్రజలకు చెప్పారు. సమయానికి భోజనం చెయ్యాలన్న చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో డిసిప్లిన్ అవసరమని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి భోజనం చేయాలని చంద్రబాబు చెబుతారు. తను అదే విధంగా సమయానికి భోజనం చేస్తానని చెబుతారు. సమయానికి భోజనం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని, ఎప్పుడు పడితే అప్పుడు తినటం మంచిది కాదని ఆయన చెప్తారు. ఆహారంలో వీటిని తక్కువ చెయ్యాలన్న చంద్రబాబు అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెర వంటి…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వందకోట్లకే అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారు • ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయి • అందుకే అబద్దపు రాతలతో జగన్ రెడ్డి మీడియా విషం చిమ్ముతుంది ఏపీ స్టేట్ బ్యూరో, గత ప్రభుత్వంలో కమీషన్ ల కోసం పేరున్న బ్రాండ్ లను రాష్ట్రం నుండి తరిమికొట్టారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఆయన మాట్లాడారు. సొంత బ్రాండ్ లకే ఆర్డర్లు ఇచ్చి.. దోచుకోవడానికి డిజిటల్ లావాదేవీలు లేకుండా చేసి వేల కోట్లు కొల్లగొట్టారని.. ప్రభుత్వ మద్యం షాపుల్లో నాన్ డ్యూటీ లిక్కర్ ను అమ్మి.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్నారు… అలాగే నాసిరకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని.. నేడు అవి ఒక్కొక్కటిగా సిట్ విచారణలో బయటకు వస్తున్నాయని తెలిపారు.…

Read More

రూ.22వేల కోట్ల పెట్టుబడి రైతులిచ్చిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.31 లీజు లోకేష్ కృషి ఫలితంగా వచ్చిన ప్రాజెక్టు ఆరేళ్ల తరువాత ఏపీలో పెట్టుబడులు పెట్టనున్న రెన్యూ. ఏపీ స్టేట్ బ్యూరో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి . తాజాగా అనంతపురం జిల్లాలో భారీ విద్యుత్ ప్రాజెక్టు రాబోతుందని ఏపీ ప్రభుత్వం చెప్పడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని స్పష్టం చేస్తుంది. గుత్తి మండలం బేతపల్లి లో 22 వేల కోట్ల రూపాయలతో రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతుంది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ అవుతుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రేపు మంత్రి లోకేష్ ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ…

Read More

కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం భారత వైమానిక దళంలో మహిళలు రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపగలిగినపుడు, వారిని ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ (లీగల్‌) పోస్టుల్లో ఎందుకు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని నిలదీసింది. ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ పోస్టులకు 50-50 నిబంధన వర్తించినప్పటికీ మహిళలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఇద్దరు మహిళా అధికారులు అష్నూర్‌ కౌర్‌, ఆస్థ త్యాగిలు దాఖలు చేసిన పిటిషన్‌పై మే 8న జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ ఇద్దరు అధికారులు ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ లీగల్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో వరుసగా 4,5 ర్యాంకులు సాధించారు. పురుషుల కన్నా మెరిట్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలకు కేటాయించిన ఖాళీలు తక్కువగా ఉండటం వలన జెఎజి విభాగానికి తమను ఎంపిక చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.…

Read More

రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు 52వ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ‌లోక్‌సభ స్పీకర్ ‌ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు తదితరులు హాజరయ్యా రు. జస్టిస్ ‌కేజీ బాలకృష్ణన్ ‌తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ ‌బీఆర్ ‌గవాయ్ ‌రికార్డులకెక్కారు. జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 లో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదుల తో కలిసి పనిచేశారు. అనతికాలంలోనే స్వతం త్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆయన మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు.

Read More

మచిలీపట్నం బీచ్ ను అత్యద్బుతంగా తీర్చిదిద్దుతాం 10 లక్షలకు పైగా హాజరయ్యే అవకాశాలు పర్యాటకులను ఆకర్షించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఏపీ స్టేట్ బ్యూరో. వచ్చే జూన్ మాసం మొదటి వారంలో 4 రోజులపాటు మసులా ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించుటకు వీలుగా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మంత్రి మంగినపూడి బీచ్ లోని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు. స్వయంగా తోరణాల వెల్డింగ్ పనులను చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. తదుపరి మంత్రి అక్కడ ధర్మాకోల్ తో తయారు చేస్తున్న గౌతమ బుద్ధుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, ఎండ్రకాయ, నక్షత్ర చేప, వివిధ రకాల చేపలు, తాబేలు,…

Read More

విడుదల అవుతున్న సినిమాలు గోడకు కొట్టిన బంతుల్లా తిరిగి వస్తున్నాయి. దీనికి తోడు ప్రేక్షకులు థియేటర్లకు రావటం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సింగిల్ థియేటర్లను పర్శంటేజ్ (Percentage System) పద్ధతిలో నడపాలనే వివాదం రాజుకుంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి టాలీవుడ్ రెండుగా చీలబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి. అసలేం జరగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ లో పర్సంటేజ్ విధానం అమలులో ఉంది. సింగిల్ థియేటర్స్ మాత్రం రెంటల్ బేస్(Rental System) మీద నడుస్తున్నాయి. అందులో అధిక భాగం థియేటర్లు డి.సురేశ్ బాబు, ఆసియన్ సునీల్, దిల్ రాజు-శిరీష్ చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రెంటల్ సిస్టం వల్ల కలెక్షన్స్ లేక చాలా వరకు సింగిల్ థియేటర్స్ షోస్ ని క్యాన్సిల్ చేయటమో లేక థియేటర్లు మూత వేయటమో చేస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే సినిమాలను పర్సంటేజ్ పద్ధతిలో ఆడాలన్నది సింగిల్ థియేటర్ యజమానుల…

Read More

దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. నైపుణ్య లేదా సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థుల్లో అర్హత ఉన్నవారందరికీ విద్యా రుణాలపై వడ్డీ రాయితీ, మారటోరియం సౌకర్యాలను సెంట్రల్‌ సెక్టార్‌ ఇంట్రెస్ట్‌ సబ్సిడీ (సీఎస్‌ఐఎస్‌) స్కీం కల్పిస్తున్నది. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలలోపున్న విద్యార్థులకే ఈ స్కీం వర్తిస్తుంది. అలాగే క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ స్కీం ఫర్‌ ఎడ్యుకేషన్‌ లోన్స్‌ (సీజీఎఫ్‌ఎస్‌ఈఎల్‌) ద్వారా రుణ చరిత్ర లేని విద్యార్థులకు క్రెడిట్‌ గ్యారంటీలు, తనఖా లేని రుణాలను సులువుగా అందిస్తున్నారు. అయితే మాడల్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ స్కీముల కిందనున్న రుణాలకు మాత్రమే సీజీఎఫ్‌ఎస్‌ఈఎల్‌ వర్తిస్తుంది. చదువుకునేటప్పుడు విద్యార్థులు సంపాదించే వీలుండదు. అందుకే అలాంటి విద్యార్థులనుద్దేశించే ఈ పథకాలకు రూపకల్పన చేశారు. అయితే చదువు ముగిసిన తర్వాత ఇచ్చిన గడువులోగా రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీములకు సంబంధించి పూర్తి…

Read More