భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి తుర్కియే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ‘బాయ్‌కాట్ తుర్కియే’ నినాదం ఊపందుకున్నది. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్, బాన్ తుర్కియే’ని ట్రెండ్ చేస్తున్నారు. మొన్నటివరకు సోషల్‌మీడియాలో కొనసాగిన ఈ ట్రెండ్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్ని రంగాలకు వ్యాపిస్తున్నది. ఇప్పటికే తుర్కియే టూరిజంపై దాని ప్రభావం పడింది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బుకింగ్‌లు వాయిదా లేదా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తున్నది. రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది.ఈ ప్రభావం తుర్కియే యాపిల్ మార్కెట్‌పై కూడా పడింది. తుర్కియే యాపిళ్లను దిగుమతి చేసుకోవద్దని పుణె వ్యాపారులు నిర్ణయించారు. తుర్కియే…
Author: apanalysis
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో వచ్చే ఏడాది చివరికి 1.66 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ విశ్లేషించింది. గ్రేడ్ ఏ విభాగంలో ఈ షాపింగ్ మాల్స్ రానున్నాయని తెలిపింది. ఇందులో హైదరాబాద్, దిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే 65% స్థలం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో అద్దె లావాదేవీలతో పోలిస్తే గ్రేడ్ ఏ స్థలం లభ్యత తక్కువగా ఉందని అనరాక్ రిటైల్ సీఈఓ, ఎండీ అనుజ్ కేజ్రివాల్ తెలిపారు. 2022లో ఈ ఏడు నగరాల్లో 26 లక్షల చదరపు అడుగుల గ్రేడ్ ఏ స్థలం అందుబాటులోకి రాగా, 32 లక్షల చ.అడుగులకు గిరాకీ ఏర్పడిందని పేర్కొన్నారు. 2023లోనూ 53 లక్షల చదరపు అడుగుల స్థలం కొత్తగా రాగా, 65 లక్షల చ.అడుగుల మేర అద్దె లావాదేవీలు జరిగాయని తెలిపారు.…
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పాటు శాఖాధిపతులు.. ఈ నెల 21, 22, 23 తేదీల్లో పల్లె బాట పడుతున్నారు. స్థానిక సచివాలయంలో కానీ, అంగన్‌వాడీ కేంద్రం/పాఠశాల భవనంలో కానీ రెండు రాత్రులు నిద్ర చేస్తారు. మూడు పగళ్లు అక్కడే ఉంటారు. ప్రజల సాధకబాధకాలు తెలుసుకుంటారు. సివిల్ సర్వీసు అధికారులంతా పల్లె నిద్ర చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా.. ప్రణాళిక శాఖ ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమానికి ‘స్వర్ణాంధ్ర సంకల్పం’ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా మార్గదర్శకాల్ని రూపొందించారు. వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. కార్యక్రమ అమలుకు సంబంధించి త్వరలో అధికారులకు కార్యశాల నిర్వహించనున్నారు. పల్లెలకు వెళ్లే అధికారులు రాజకీయ నేతలకు దూరంగా ఉండాలి. వారి ఇళ్లకు వెళ్లకూడదు. ఉక్కపోతగా ఉందనో, దోమలు కుడుతున్నాయనో.. రాత్రి సమయాల్లో నేతల ఇళ్లలో బస చేయకూడదు. మొదటి…
రైతు సేవ కేంద్రాల్లో పని చేసే అసిస్టెంట్లకు శిక్ష్లణ 13 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాలు ఏపీ స్టేట్ బ్యూరో, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రైతు సాధికార సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. రామారావు స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ప్రకృతి వ్యవసాయంపై మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం ఆరంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవ కేంద్రాలలో పనిచేసే వి ఏ ఏ (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు), వి హెచ్ ఏ (విలేజ్ హర్టీకల్చర్ అసిస్టెంట్ లు) లకు ప్రకృతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో శిక్షకులను తయారు చేయడం కోసం ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ…
ఇటువంటి వార్తలు శాంతి భద్రతలకు భంగం విఘాతం కలిగిస్తాయి. ఏపీ స్టేట్ బ్యూరో, ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్.? పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నదని డీజీపీ హరీష్ కుమార్ గుప్త హెచ్చరించారు. ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అపఖ్యాతిపర్చే దురుద్దేశంతో ప్రచారం చేసే మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. విచారణలో భాగంగా, ఈ కేసుకు సంబంధించిన అనుమానితులను, సాక్షులను చట్టబద్దంగా ప్రశ్నించడం జరిగిందని వివరించారు. ఎవ్వరినీ అక్రమంగా అరెస్టు చేయడం గాని, లాకప్ హింసకు పాల్పడటం గాని జరుగలేదని స్పష్టం చేశారు. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించడం గాని, బలవంతం చేయడం గాని జరగలేదని వివరించారు. వాస్తవాలకు విరుద్ధంగా వార్తలను ప్రచరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం టెంట్ సిటీ ఏర్పాటు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..! టూరిజం ఏపీ స్టేట్ బ్యూరో… కూటమి ప్రభుత్వానికి టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా మారనున్నది. మారుమూల ప్రాంతాల్లోఅనువైన ప్రాంతాలను గుర్తిస్తుంది. వాటిని అభివృద్ధి చేయడం ద్వారా అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనువుగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అరకు, గండికోట సహా ఆరు ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని ఏపీ టూరిజం ప్రణాళికలు రచిస్తోంది. గండికోటలో సుమారుగా నాలుగు ఎకరాల్లో ప్రీమియం టెంట్ సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూడు ఎకరాల్లో టెంట్ సిటీ, మిగతా ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాట్లు, కెఫెటేరియా, ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సందర్శకులను ఆకర్షించాలని భావిస్తోంది.…
పండే విషంగా మారితే.. కూరగాయలే నిలువెల్లా గాయాలు చేస్తుంటే… అచ్చంగా ఇదే జరుగుతోంది. పండ్లు, కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్లోరోపైరిఫాస్ రసాయన వాడకం వల్ల దాని అవశేషాలు ఉండిపోయి వాటిని తిన్నవారిలో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక, ప్రమాదకర వ్యాధులతో ఆ ఉత్పత్తులను నేరుగా తినడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పండ్లు, కూరగాయల పంటల్లో పురుగుల నివారణకు రైతులు ఇది వాడుతున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో వరి, కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల పండ్ల జాతుల పంటల్లో క్లోరోపైరిఫాస్ వినియోగం ఎక్కువగా ఉంది. ఇతర రకాల మందులతో కలిపి దీన్ని చల్లుతున్నారు. దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పురుగులను నివారించేందుకు..లద్దెపురుగు, శనగపచ్చ పురుగు, గులాబీరంగు పురుగు, పచ్చపురుగు, ఆకుచుట్టు పురుగు, మొవ్వ పురుగు తదితరాలు.. పంటలను నాశనం చేస్తున్నాయి. వీటి నివారణకు దాదాపు…
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించామని, ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చామని భారత సైన్యం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పాకిస్థాన్ ఆర్మీ (Pakistan Army) స్పందించింది. తమ ఫైటర్ జెట్ ఒకటి ధ్వంసమైన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే, అది స్వల్పమేనని పేర్కొనడం గమనార్హం. పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ.. తమ దేశ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో మన వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైంది’’ అని వెల్లడించారు. అయితే, ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించింది. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్…
తెరపై సహజమైన నటనతో.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగించే కథానాయిక శ్రీలీల(Sreeleela).. బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో హిందీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. విక్రాంత్ మాస్సే, లక్ష్య ప్రధాన పాత్రల్లో ‘దోస్తానా 2’ (Dostana 2) రూపొందుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాత. ఇప్పుడీ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని గురించి ఆమెతో చర్చలు చేస్తున్నారని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శ్రీలీల జాబితాలో ‘మాస్ జాతర’, ‘పరాశక్తి’ తదితర చిత్రాలు ఉన్నాయి.
‘రాజకీయం బాధ్యత.. అధికారం అంటే ప్రజాక్షేమాన్ని ఆలోచించే మార్గమని నేను నమ్ముతా. అదే భావనతో జనసేన పార్టీని స్థాపించా. ఓట్లు, సీట్ల లెక్కలు వేసుకోకుండా ప్రజలకు మేలుచేసే దారిలో ముందుకెళ్లాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించారు. తమిళనాడు ప్రజలకు మేలుచేసే విషయాల్లో అవసరమైన తోడ్పాటు అందిస్తాం’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో తమిళనాడుకు చెందిన రచయిత, పర్యావరణ ఉద్యమకారుడు కేఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో తమిళ రచయిత, పబ్లిషర్ మరవన్‌పులవు కె.సచ్చిదానందన్, ఎంజీఆర్ మనవడు సత్యరాజేంద్రన్, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యావంతులతో కూడిన బృందం శనివారం పవన్ కల్యాణ్‌తో సమావేశమైంది. తమిళనాడులోని వర్తమాన రాజకీయ, పాలనాపరమైన పరిస్థితులు, ఆ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సంస్కృతి, ధర్మపరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ‘తమిళనాడులోని సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి.…