Author: apanalysis

యుద్దం నేపధ్యంలో ప్రత్యేక కథనం, సరిహద్దుల్లో ఉధ్రిక్త పరిస్ధితులు కృష్ణారావు, జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది భారతదేశం యొక్క జమ్మూ మరియు కశ్మీర్ రాష్ట్రంలోని ఒక భాగం. ఇది 1947లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ నియంత్రణలోకి వెళ్లింది. దీనిని భారతదేశం అధికారికంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ మరియు కశ్మీర్ లేదా సరళంగా PoK అని పిలుస్తుంది. అయితే పాకిస్తాన్ దీనిని ఆజాద్ జమ్మూ మరియు కశ్మీర్ (AJK) మరియు గిల్గిట్-బాల్టిస్తాన్గా సూచిస్తుంది. ఈ ప్రాంతం గురించి సంక్షిప్త వివరణ ఇలాఉంది. PoK భౌగోళిక స్థానం… PoK అనేది జమ్మూ మరియు కశ్మీర్ రాష్ట్రంలోని పశ్చిమ మరియు ఉత్తర భాగాలను కలిగి ఉంటుంది. ఇందులో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఆజాద్ జమ్మూ మరియు కశ్మీర్ (AJK). ఇది పాకిస్తాన్ నియంత్రణలోని ఒక భాగం, దీనిని పాకిస్తాన్ “స్వతంత్ర” ప్రాంతంగా పిలుస్తుంది. కాని  ఇది పాకిస్తాన్ పరిపాలనలో…

Read More

భారత్‌-పాకిస్థాణ్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ దాయాది దేశం ఫేక్‌ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే factcheck. telangana.gov.in వెబ్‌సైట్‌, కేంద్రం ఆధ్వర్యంలో నడిచే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ)లు పౌరులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నాయి.భారత ప్రభుత్వం పీఐబీ ఆధ్వర్యంలో నకిలీ వార్తలను అరికట్టే లక్ష్యంతో 2019లో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ను స్థాపించింది. పౌరులు ఏదైనా వార్త ఫేక్‌ న్యూస్‌ లేదా ఒరిజినల్‌ న్యూస్‌ అని తెలుసుకోవాలంటే వాట్సాప్‌, ఈమెయిల్‌, వెబ్‌ పోర్టల్‌ ద్వారా తమ అభ్యర్థనలు పంపాల్సి ఉంటుంది. PIBFactCheck ఎక్స్‌(ట్విట్టర్‌) అకౌంట్‌, PIBFactCheck ఫేస్‌బుక్‌ ద్వారా అభ్యర్థన పంపొచ్చు. లేదా Factcheck @pib. gov.in, socialmedia @pib. gov.in కు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ వార్త ఒరిజినలా.. లేదా ఫేకా అనేది నిర్ధారించుకున్న తర్వాత బహిరంగంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వివరాలను…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈరోజు సమావేశమయ్యా రు. భారత్-పాక్ ఉద్రిక్తతల దృష్ట్యా వారితో చర్చలు జరుపుతున్నారు. పాకిస్థాన్‌ షెల్లింగ్‌, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణ మంత్రి సమీక్షిస్తున్నారు. 50 పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్? ఎల్‌ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్ల ను భారత్ కూల్చేసినట్లు సమాచారం. సాంబా, ఉధంపూర్‌, జమ్ము, నగ్రోటా, అఖ్నూర్‌, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను ప్రయోగించగా, వాటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొని కూల్చేవేసింది. భారత దెబ్బ మామూలుగా లేదు పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ పాకిస్తాన్‌లో 7 కీలక ప్రాం తాలపై ఈరోజు తెల్లవారు జామున దాడులకు దిగింది భారత్. కరాచీ, ఇస్లామా బాద్‌, పెషావర్, లాహోర్‌ లపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇందులో కరాచీ టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం తో దాడులు చేసింది. మన ఆర్మీ చేసిన అటాక్స్ కరాచీ ఓడరేవును…

Read More

వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద అభియోగాలు మోపి, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు (ఈసీఐఆర్‌) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. వైకాపా ప్రభుత్వ పెద్దల తరఫున మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్‌ కెసిరెడ్డితో పాటు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలతో పాటు ఏపీఎస్‌బీసీఎల్‌ పూర్వపు ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ పూర్వపు డైరెక్టర్‌ సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లలో…

Read More

అర్జాకు అందలం ఢిల్లీ లో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ గా ఉత్తర్వులు ఏపీస్టేట్ బ్యూరో. సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్య అభివృద్ది శాఖ సిఇవో గా వ్యవహరించిన పూర్వ ఐఆర్టిఎస్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ ను కూటమి ప్రభుత్వం ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ కు స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. ఇక నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ కు వచ్చే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర అధికారులకు సంబంధించిన వ్యవహారాలు ఆయన చూసుకుంటారు! అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వివిధ స్కీమ్స్ ను పర్యవేక్షించి సకాలంలో రాష్ట్రానికి అందేలా చూసే బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలు శ్రీకాంత్ చూసుకుంటారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ఎందరో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల…

Read More

అమలులోకి నూతన పాలసీలు ప్రభుత్వ సలహాదారులు సోమనాథ్, సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ ఏపీ స్టేట్ బ్యూరో, అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ అడ్వయిజర్‌గా ఉన్న ఎస్ సోమనాథ్, మాజీ డీఆర్డీఓ చైర్మన్, ప్రస్తుత రాష్ట్ర ఏరోస్పేస్-డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ సలహాదారు డాక్టర్ జి. సతీష్ రెడ్డితో సీఎం చర్చించారు. స్పేస్-డిఫెన్స్ పాలసీల రూపకల్పనతో పాటు… ఈ రెండు రంగాలకు సంబంధించి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు పొందేలా చురుకైన పాత్ర పోషించాలని ఇరువురికి ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్ధులు స్పేస్, డిఫెన్స్ రంగాల వైపు ఆకర్షితులయ్యేలా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రితో సమావేశంలో సోమనాథ్, సతీష్ రెడ్డి… స్పేస్-డిఫెన్స్ రంగాల అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Read More

పాక్ ఉగ్రవాదులపై భారత్ మెరుపు దాడి… ప్రపంచ వ్యాప్తంగా చర్చ… గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాక్… నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో(పాక్‌లో 5, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 4) 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికి ప్రకటన రావాలి. బవహల్పూర్‌(జైషే మహమ్మద్‌), మురిద్కే(లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చనిపోయింది 8 మందే అని, భారత్ కావాలని తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మతహక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని అంటోంది. తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.

Read More

భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో(పాక్‌లో 5, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 4) 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికి ప్రకటన రావాలి. బవహల్పూర్‌(జైషే మహమ్మద్‌), మురిద్కే(లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు సమాచారం. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ చనిపోయింది 8 మందే అని, భారత్ కావాలని తమ దేశ సార్వభౌమాధికారాన్ని, మతహక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని అంటోంది. తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టారు. భారత స్త్రీల సిందూరాన్ని నేలరాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా…

Read More

భారత్.. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియా విజయవంతంగా ధ్వంసం చేసింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సెళ్లను సంధించింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సెల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడులు జరగగానే ఇండియాకు మద్దతు ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్. పాకిస్తాన్ పై యుద్ధంలో భారత్ కు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. భారత దేశానికి పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని వ్యాఖ్యానించారు. భారత్ చేపట్టిన మిస్సెళ్ల దాడిని ఆత్మరక్షణ హక్కుగా అభివర్ణించారు రువెన్ అజర్. ఈ సైనిక…

Read More

జై భారత్.. జై భారత్.. జై భారత్.. ప్రధాని మోది జిందాబాద్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు. దీనికి సంబంధించిన ఈ నినాదాలే దేశమంతా మారుమోగుతున్నాయి. అది కదా…ఐక్యత. విపత్కర పరిస్ధితుల్లో ప్రజాప్రతినిధులకు లభించాల్సిన మద్దతు.

Read More