భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమై, యుద్ధం వస్తుందనే ఆందోళనల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకింగ్, చమురు షేర్లలో లాభాలు స్వీకరించడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. యుద్ధం వచ్చినప్పుడు ఎలా మెలగాలనే అంశంపై ప్రజలకు సూచనలు ఇచ్చేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోం శాఖ ఆదేశించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 84.35 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 2.76% లాభంతో 61.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ మంగళవారం రూ.6.17 లక్షల కోట్లు తగ్గి రూ.421.31 లక్షల కోట్లు (4.98 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.సెన్సెక్స్ ఉదయం 111 పాయింట్ల (క్రితం ముగింపు 80,796.84) లాభంతో 80,907.24 వద్ద ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ, ఇంట్రాడేలో 315.81 పాయింట్లు తగ్గి 80,481.03 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 155.77 పాయింట్ల…
Author: apanalysis
భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. బవహల్పూర్(జైషే మహమ్మద్), మురిద్కే (లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ రెండు చోట్లా ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తొయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కరే తొయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బవహల్పూర్‌లోని ఉస్మాన్ ఓ అలి క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీనిని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది.. కానీ, నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు…
ఏపీ స్టేట్ బ్యూరో, నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పుల నమోదుకు బుధవారం నుండి అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించండం, కార్డులను సరెండర్ చేయడం వంటి వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకుంటారని తెలిపారు. వారం రోజుల తరువాత వాట్సాప్ గవర్నెన్సు ద్వారా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని తెలిపారు. జూన్ మాసంలో స్మార్టు కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మరియు 80 సంవత్సరాలు పైబడిన వారికి ఇకెవైసి చేయాల్సిన అవసరం లేదనే…
ఏపీ స్టేట్ బ్యూరో, వైబ్రంట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకు చెందిన వైబ్రంట్స్ ఆఫ్ కలాం సంస్థ వ్యవస్థాపకులు విజయ్ కలాం నేతృత్వంలో ఈ విగ్రహాలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఈ విగ్రహాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపించేందుకు సచివాలయానికి తీసుకుచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహ ఆకృతిని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మాట్లాడుతూ…పదేళ్లుగా దేశ వ్యాప్తంగా అబ్దుల్ కలాం పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ‘గ్రేట్ ఇండియన్ స్టాట్యూస్’ పేరుతో 20 అడుగుల ఎత్తుతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ కలాంను సీఎం చంద్రబాబు అభినందించారు. భారతదేశ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం…
ఏపీ స్టేట్ బ్యూరో, రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించేందుకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందింస్తుంది. ప్రత్యేకించి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు తయారు చేస్తుంది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో అక్కడి ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపట్టనున్నది. ప్రతి నెలా పర్యాటక ప్రగతికి సంబంధించిన నివేదికలు రూపొదించనున్నది. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేయనున్నది. ఈ విషయమై కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి డీపీఆర్ లు రూపొందిస్తారు. తద్వారా వాటిని అమలు చేసి రాష్ట్రానికి పర్యాటక శోభ తీసుకువచ్చేందుకు కృషి జరుగుతుంది. విభిన్న పర్యాటక ప్రక్రియలను ప్రవేశపెట్టి పర్యాటకుడికి మధురానుభూతి…
ఏపీ స్టేట్ బ్యూరో.. ఏపీలో కీలక మైన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఇవాళ మరో అడుగు పడింది. రాష్ట్రంలో ఆర్ధిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో ప్రజా రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే నగరంలో మూడు కారిడార్లుగా మెట్రో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కొనసాగింపుగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తి కి కన్సల్టెన్సీ ల ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించి వివిధ సంస్లల నుంచి అభిప్రాయాలే తీసుకుంది. మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. నేరుగా హాజరైన 14 సంస్థలు, ఆన్లైన్ లో హాజరైన 8 సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. టెండర్లు దాఖలుకు జూన్ 8 వరకూ గడువు ఉంది. జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ప్రభుత్వం ఎంపిక చేయనుంది.…
వారం రోజుల ముందు వరకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. పసిడి ప్రియులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక, పేద.. మధ్య తరగతి వారి గురించి చెప్పక్కర్లేదు. బంగారం కొనాలనుకునే ఆశల్నే చంపేసుకునే పరిస్థితికి వచ్చారు. అయితే, లక్షకు చేరిన తర్వాత ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. హమ్మయ్యా.. ఇంకా కొంచెం తగ్గితే బంగారం కొనేద్దాం అనుకునేలోపే.. బంగారం బాదుడు మళ్లీ మొదలైంది. గత కొద్దిరోజులనుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి.నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,730 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,750 రూపాయలు.. 10 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 71,800 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధర బాగానే పెరిగింది. గ్రాముపై ఒక రూపాయి…
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్దకొడుకు రమేశ్ బాబు (Ramesh Babu) ఇవాళ మన మధ్య లేరు. కృష్ణ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రమేశ్ బాబు… ఆ తర్వాత నిర్మాతగా మారిపోయారు. తన తమ్ముడు మహేశ్ బాబు (Mahesh Babu) తో సినిమాలు తీశారు. రమేశ్ బాబు మరణానంతరం ఆయన కొడుకు జయకృష్ణ (Jaya Krishna) నటనపై మక్కువ పెంచుకున్నాడు. తాతయ్య, తండ్రి, బాబాయ్ మాదిరిగా తానూ నటుడు కావాలని అనుకున్నారు. అందుకే విదేశాలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు జయకృష్ణతో సినిమాలు నిర్మించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయితే… ఈ విషయంలో మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే నందమూరి (Nandamuri), అక్కినేని (Akkineni), రామానాయుడు (Ramanaidu) , కొణిదెల (Konidela), అల్లు (Allu) కుటుంబాల మాదిరిగానే ఘట్టమనేని వంశంలోనూ చాలామంది నటీనటులు ఉన్నారు. కృష్ణ కుమార్తె…
అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంటనష్టంపై సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా సాయం విడుదల చేయాలని చెప్పారు. అకాల వర్షాలతో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని…
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసినవారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? దాయాది పీచమణిచేలా కొరడా ఝళిపించనున్నారా?.. వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునివ్వడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. గగనతల దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ పనిచేసేలా చూడాలని, ఇతరత్రా స్వీయరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనేదానిపై పౌరుల్ని సమాయత్తం చేసేందుకు ఈ నెల 7న (బుధవారం) మాక్‌డ్రిల్ నిర్వహించాలని కోరింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు/ పాఠశాలల విద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా…