Author: apanalysis

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. తొలకరికి ముందే వేసవిలోనే అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే పదిమందికి పైగా మృత్యువాతకు గురయ్యారు .దాదాపు 6 వేఊ ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ హెచ్చరికలకు తగ్గట్టుగానే పకృతి బీభత్సం సృష్టిస్తుంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఏర్పడిన వాతావరణంలో మార్పులతో విజయవాడ తో పాటు పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి .ఉరుములు మెరుపులు విపరీతమైన వీధురు గాలులతో జనం అల్లాడిపోయారు. తిరుపతి జిల్లాతో పాటు బాపట్ల ఏలూరు పల్నాడు కృష్ణా తదితర జిల్లాల్లో పదిమందికి పైగా చనిపోయారు. 6 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా వీటిలో అత్యధికంగా వరి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాలను అంచనా వేసి మంగళవారం సాయంత్రంలోగా రైతులకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

సినీ రంగంలో 50 ఏళ్ల పాటు హీరోగా కొనసాగిన వారు ఎవరూ లేరు. ప్రపంచంలో నా ఒక్కడికే అది సాధ్యం అయింది. అందుకే నన్ను చూసి నాకే గర్వం అన్నారు సినీనటుడు, హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నేపథ్యంలో హిందూపురంలో అక్కడి టీడీపీ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, హిందూపురం తనకు రెండో ఇల్లు అని, అభిమానులే తన బలం అని అన్నారు. పద్మభూషణ్ తనకు సరైన సమయంలోనే వచ్చిందని, తన జీవితంలో జరిగిన సంఘటనలు సినిమాల్లోని పాత్రలకు దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన చిత్రాల్లో నటిస్తానని బాలకృష్ణ తెలిపారు. 50 ఏళ్లుగా హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలో మరొకరు లేరన్నారు. పౌరసన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ…

Read More

టాప్‌ అడ్వాన్స్‌ ట్యాక్స్‌ పేయర్ల (ఎక్కువ మొత్తంలో ముందస్తుగా పన్ను చెల్లిస్తున్న వారు)ను దగ్గరగా పర్యవేక్షించాలని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి) ఆదేశాలు జారీ చేసింది. అలాగే మినహాయింపులు, తగ్గింపులు కోరుతూ చేసే బోగస్‌ క్లెయిమ్‌లను గుర్తించడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లను పెంచే వ్యూహాన్ని అనుసరించాలని సూచించింది. సీబీడీటీ ఇటీవల 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర కార్యాచరణ ప్రణాళిక (సీఏపీ)ను విడుదల చేసింది. ఇది ఆదాయ సేకరణకు సంబంధించి విభాగంలో కీలక పనితీరు ప్రాంతాలను నడిపించడానికి మార్గదర్శకంగా పని చేస్తుందని తెలిపింది. ఫిబ్రవరిలో సమర్పించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల విభాగం కింద ఐటీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం రూ.25.20 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో రూ.10.82 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్ను, రూ.13.6 లక్షల కోట్లు కార్పొరేట్‌యేతర పన్ను (వ్యక్తిగత…

Read More

‘హరి హర వీరమల్లు’ను ముగించేందుకు కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రంగంలోకి దిగారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకోగా.. ఆఖరి షెడ్యూల్‌ కోసం పవన్‌ ఆదివారం సెట్లోకి అడుగు పెట్టారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెట్లో దర్శకుడు జ్యోతికృష్ణ నేతృత్వంలో రెండు రోజుల పాటు ఈ చిత్రీకరణ కొనసాగనుంది. దీనిలో భాగంగా పవన్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించి.. 6వ తేదీతో సినిమాకి (HariHara Veeramallu) గుమ్మడికాయ కొట్టనున్నారు. ఆ వెంటనే చిత్రబృందం కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది. 17వ శతాబ్దం నాటి మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో జరిగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పవన్‌ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌…

Read More

జమ్మూకశ్మీర్‌ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్‌ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, కోట్‌ బాల్వాల్‌ జైల్‌, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్‌ సెల్స్‌, ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్‌, ముష్తాక్‌ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. ఆయా కారాగారాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ డీజీ శ్రీనగర్‌లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్లు సమాచారం. 2023 నుంచి జమ్మూకశ్మీర్‌లో జైళ్ల భద్రత ఈ దళం అధీనంలోనే ఉంది.

Read More

సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో రూ.20 వేల చొప్పున అందజేయనుంది. ‘పీఎం కిసాన్‌’ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగిన(ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) వారినీ అర్హులుగా గుర్తించనుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతోపాటు తహసీల్దారు, మండల వ్యవసాయాధికారి తమ పరిధిలోని రైతుల వివరాలను పరిశీలించి, ధ్రువీకరించిన అర్హుల జాబితాలను ఈ నెల 20లోగా ‘అన్నదాత సుఖీభవ’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘పీఎం కిసాన్‌’నూ సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా జాబితాలను నవీకరించాలని కేంద్రం ఆదేశించింది. మే ఆఖరులోగా ఈ జాబితాలనూ సిద్ధం చేయనున్నారు. చనిపోయిన వారి పేర్ల తొలగింపు, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు,…

Read More

రూ.5 వేల కోట్లు పెట్టుబడితో వస్తున్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ఇండియాలో ఆ సంస్ధకు మూడో ప్లాంట్ప్రభుత్వం నుంచి ఇతోధిక ప్రోత్సాహకాలు ఏపీ స్టేట్ బ్యూరో:తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో మరో అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడిలో తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్‌జీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎల్‌జీ ప్లాంట్ కోసం మే 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు శ్రీసిటీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఎల్‌జీ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కూడా పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిసింది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏపీకి ఎల్‌జీ పరిశ్రమను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేసినట్లు చెప్పుకొచ్చారు.ఎల్‌జీ కంపెనీకి…

Read More

రెండు సార్లు నిర్మాణ సంస్ధలకు గడువు కాలం పొడగింపుబందరు దశను మార్చే ఈ రెండు ప్రాజెక్టులపై ప్రభుత్వ అలక్ష్యంప్రతీసారీ ఎన్నికల హామీగా మిగిలిపోతున్న బందరు రేవు, హార్బర్ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్ధితి ఏపీ స్టేట్ బ్యూరో,బందరు పోర్టు, హార్బర్ నిర్మాణ పనులు వేగంగా సాగడంలేదు. ఏపీలో కొత్తగా ఇతర ప్రాంతాల్లో ప్రారంభమైన పోర్టు, హార్బర్ల పనులు వేగంగా జరుగుతుంటే, ఇక్కడి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. పనులు పొందిన నిర్మాణ సంస్ధలు ప్రభుత్వం నుంచి రెండుసార్లు గడువు కాలాన్ని పొడగింపునకు అనుమతి పొందాయి. అయితే ఆ తేదీల్లోనూ పనులు పూర్తికావని స్ధానికులు చెబుతున్నారు. ఈ రెండు నిర్మాణాలు పూర్తి అయితే బందరు పరిస్ధితి మారుతుందని అక్కడి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలకు భిన్నంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదని, ప్రతీ ఎన్నికలకు బందరు ఓడరేవు, హార్బర్ల నిర్మాణాలు రాజకీయ నాయకులకు హామీలుగా…

Read More

ప్రకాశం జిల్లాలో దాదాపు ఒకే సమయంలో మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి ముగ్గురు మృతి చెందారు. మృతులను నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడుకు చెందిన రమణయ్య (60), బాబు (45), నాగేంద్ర (25)గా గుర్తించారు. బోల్తాపడిన లారీని మరో లారీ ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న పావని (25), కౌశిక్‌(14) మృతి చెందారు. వీరు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లుగా గుర్తించారు.

Read More

అల్లు అర్జున్‌ని ‘పుష్ప’ సినిమాలు ఐకాన్‌ స్టార్‌ని చేసేశాయి. అంతకుముందు ఆయన్ని స్టైలిష్‌ స్టార్‌ అని పిలిచేవారు. అందుకు తగ్గట్టే ప్రతి సినిమాకీ ఓ కొత్త రకమైన స్టైల్‌తో దర్శనమిచ్చేవారు. ‘పుష్ప’ పాత్ర కారణంగా దాదాపు ఐదేళ్లపాటు గుబురు గడ్డం, జుట్టుతోనే కనిపించాల్సి వచ్చింది. ఆ పాత్ర నుంచి బయటికి వచ్చాక మళ్లీ అల్లు అర్జున్‌ మునుపటిలా స్టైల్‌గా మారిపోయారు. కొత్త సినిమాలో ఎలాంటి లుక్‌లో కనిపిస్తారో ఇంకా స్పష్టత లేదు. చిత్రీకరణ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. ఒక దఫా లుక్‌ టెస్ట్‌ అయితే జరిగింది. ఇంకా తుది నిర్ణయానికైతే రాలేదని సమాచారం. అయితే అల్లు అర్జున్‌ మాత్రం బయట కొత్త రకమైన స్టైల్‌తో కనిపిస్తూ ఊరిస్తున్నారు. వేవ్స్‌ సమ్మిట్‌లో ఆయన లుక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన తదుపరి చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో భిన్నరకాల లుక్స్‌లో ఆయన సందడి చేస్తారని తెలుస్తోంది.

Read More