తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో తాజాగా చేసిన మార్పులు శనివారం అమల్లోకి వచ్చాయి. గత ప్రభుత్వం నుంచి నెలకొన్న గందరగోళాన్ని తొలగించే క్రమంలో ప్రస్తుత పాలకమండలి ప్రయోగాత్మకంగా ఈ మార్పులు చేపట్టింది. గతంలో గురు/శుక్రవారాల్లో ఉదయం 7.30 గంటల నుంచి మిగిలిన రోజుల్లో 8.30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 1.30 గంటలు దాటినా వరుసగా బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి, దాతలు, ఉద్యోగుల దర్శనాలు కొనసాగేవి. దీంతో ఉదయం క్యూలైన్‌లోకి వచ్చిన సర్వదర్శనం, రూ.300 ఎస్‌ఈడీ భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో తితిదే పాలకమండలి పలు మార్పులు చేపట్టింది. మే ఒకటో తేదీ నుంచి నూతన వేళలు అమలు చేయాల్సి ఉన్నా గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం నేపథ్యంలో యథావిధిగా కొనసాగించారు. శనివారం మొదటి రోజు రెండు విడతలుగా బ్రేక్ విధానం అమలు చేశారు. మొదట ఉదయం 6.20 నుంచి 8.30 వరకు వీఐపీ ప్రొటోకాల్, రెఫరల్, జనరల్…
Author: apanalysis
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ ప్రధాని మోది అమరావతి పర్యటన పట్ల మిశ్రమ స్పందన లభిస్తోంది. కొత్తగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా, అమరావతి నిర్మాణంలో నేనూ బాధ్యత తీసుకుంటాను….కలిసి నిర్మిద్దామని ప్రధాని వెల్లడించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయగల సమర్దత చంద్రబాబుకు ఉందని, గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పని చేసిన సమయంలోనే ఆయన నుంచి ఇటువంటి విషయాలను తెలుసుకున్నానని సభాముఖంగా చెప్పారు. హైదరాబాద్ ని అంతార్జాతీయ స్ధాయికి తీసుకువెళ్లడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను తాను అక్కడికి వెళ్లి అప్పుడే పరిశీలించి, అందుకు అనుగుణంగా గుజరాత్ లో భారీ ప్రాజెక్టులు చేపట్టానని చెప్పారు. ఇటువంటి సమర్ధత, దీర్ఢకాలిక ప్రణాళిక, విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఫీచర్ సిటీగా తీర్చిదిద్దుతారనే నమ్మకం తనకు ఉందని ప్రకటించి ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు నైతికంగా మద్దతు పలికారు. మాటల మాంత్రికుడు మోది ప్రసంగం టీడీపీ అనుకూల వర్గాలకు, ప్రగతి కాములకు సానుకూలంగానే కనిపించాయి.…
క్రైం బ్యూరో. నలుగురు స్నేహితుల మధ్య సరదాగా మొదలైన పోటీ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి రూ.10 వేలకు పందెం వేసుకొని..ఐదు సీసాల మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోలార్ జిల్లాలోకు చెందిన కార్తిక్ కి గత ఏడాది వివాహం జరిగింది. అతని భార్య ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. కార్తిక్, అతని మరో ముగ్గురి ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక నలుగురు ఫ్రెండ్స్ పార్టీలో కూర్చుంటే మామూలుగా ఉంటుందా.. ఒకరిపై ఒకరు జోక్స్ వేస్తూ, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. కొన్నిసార్లు తినడం, తాగడం విషయంలో బెట్టింగ్స్ కూడా వేసుకుంటారు. ఇలాగే కార్తీక్, అతని ఫ్రెండ్స్ వెంకట రెడ్డి, సుబ్రమణి, మరో ముగ్గురి కలిసి పార్టీ చేసుకుంటుండగా ఓ పందెం పెట్టుకున్నారు. కార్తిక్ తాను ఐదు ఫుల్…
ఏపీ స్టేట్ బ్యూరో, ప్రధాని నరేంద్ర మోది 2015లో అమరావతి శంకుస్ధాపనకు మరచెంబుతో మట్టి తీసుకు వచ్చారని, ఇప్పడు ఏపీ ప్రజల మొఖాన సున్నం కొట్టారని పీసీసీ చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి విమర్శించారు. శనివారం ఆమె శుక్రవారం నాటి అమరావతి పర్యటనపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. మోడి తీరు చూస్తుంటే చిచ్చుబుడ్డి తుస్సు మంది అనక తప్పదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే బాధ్యతని పేర్కొన్నారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన చట్టం కేంద్రం చేయాల్సిన విధులను స్పష్టంగా చెబుతుంటే, ప్రధాని మోదీ గారు మనకు ఏమిచ్చారని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారని విమర్శించారు. 10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో, నేడు…
వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. దాంతో మామూలు నీటికి బదులుగా ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడానికే ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఒకేసారి రెండుమూడు రోజులకు సరిపడా నీళ్లను బాటిళ్లలో నింపి.. ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. మరికొందరు బద్ధకస్తులైతే.. వారానికి సరిపడా స్టాక్‌ను ఒక్కసారే ఫ్రిజ్‌లో లోడ్ చేసేస్తారు. అయితే, తాగునీటిని ఇలా రోజుల తరబడి ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగునీటిని రిఫ్రిజిరేటర్లో 24 గంటలు మాత్రమే ఉంచాలని చెబుతున్నారు. అంతకుమించి నిల్వ చేస్తే.. ఆ నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుందట.ఈ నీరు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాబట్టి, ఫ్రిజ్‌లో ఉంచే తాగునీటిని ప్రతి 24 గంటలకు మార్చడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేయడం కూడా ఏమాత్రం మంచిదికాదని అంటున్నారు. అలాగే, ఫ్రిజ్ నీటిని తాగడంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్…
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.97.80 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.61.40 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ.31.8 లక్షలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై రూ.31.80 లక్షల చొప్పున విధించింది. కేవైసీ నిబంధనలు పట్టించుకోకపోవడం, సైబర్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం వల్లనే జరిమానా విధించింది.
గోవాలో తీవ్ర విషాదం జరిగింది. శిర్గావ్‌లో గల లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట (Stampede in Temple) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (Goa Stampede) శ్రీ లైరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. దీంతో లైరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా (Goa) నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆ ఆలయంలో అనాదిగా వస్తున్న ‘నిప్పులపై నడిచే’ ఆచారంలో శనివారం తెల్లవారుజామున వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది,…
కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తన కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్రబృందం. ఇందులో చిరుకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా, అందులో ఓ నాయిక పాత్ర కోసం నటి నయనతారను రంగంలోకి దించేందుకు చిత్ర వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై నయన్‌తో (Nayanthara) చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది చిరు – నయన్‌ల కాంబోలో హ్యాట్రిక్ సినిమా కానుంది. వీళ్లిద్దరూ గతంలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో కలిసి సందడి చేశారు. ఇక ఈ చిత్రంలో మరో పాత్ర కోసం ఓ యువ…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాష్ట్ర ప్రగతికి భుజం కాస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతికి ఉందని ఉద్ఘాటించారు. ‘‘ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసూచిక. స్వర్ణాంధ్ర విజన్‌కు అమరావతి శక్తినిస్తే.. వికసిత్ భారత్‌కు స్వర్ణాంధ్ర బలమవుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు. ‘అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యువత కలలు నిజం చేసే నగరంగా నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా (లీడింగ్ సిటీ)గా అమరావతి రూపొందుతుంది.…