Author: apanalysis

గగనతలంలో కానవచ్చే గుల్లలమోద క్షిపణి…దివిసీమ లో అతిపెద్ద రక్షణ రంగ ప్రాజెక్టు…నవ్యాంధ్ర ప్రదేశ్ కి కంఠాభరణంగావర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఏపీ స్టేట్ బ్యూరో, అది ఓ మారుమూల గ్రామం . కృష్ణా జిల్లా నాగాయలంక మండలం కృష్ణానది తీరంలో విసిరేసినట్టు కాన వస్తుంది ఆ గ్రామం. ఆ ఊరిపుడు ప్రపంచ పటంలో కనిపించబోతుంది. అక్కడ మన దేశ రక్షణ రంగ సంస్థ ఓ అతి పెద్ద భారీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. ఇక్కడ క్షిపణి పరీక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి ఆర్ డి ఓ) ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. ఇందుకు సంబంధించిన పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. రూ. 2300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుల్లలమోదలో నిర్మించబోయే క్షిపణి పరీక్షా ప్రయోగ కేంద్రం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయింది.…

Read More

ఆసక్తిగా ప్రజలు, వ్యాపార, రాజకీయ వర్గాలు ప్రజల రాకపోకల కోసం 14 వేల బస్సులు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి సభలో ప్రధాని మోదీ ప్రకటన కోసం అన్ని వర్గాలు వేచి చూస్తున్నాయి. ప్రజలు, వ్యాపార, రాజకీయ వర్గాలు మరింత ఆసక్తిగా ఉన్నాయి. రాజధాని గ్రామాల ప్రజలైతే తమ దిశ ఈసారి మారుతుందనే ధీమాతో ఉన్నారు. తామంతా కోట్లకు పడటలెత్తుతామనే భావనతో ఉన్నారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లోని పొలాలు, స్ధలాల ధరలు సామాన్యుల అంచనాకు మించి ఉన్నాయి. ఇక ప్రధాని మోది అమరావతి నిర్మాణానికి అనుకూలమైన ప్రకటన చేస్తే, కృష్ణా, గుంటూరు జిల్లాలు జట్ వేగంతో పరుగులెత్తుతాయి. ఇప్పటికే అమరావతి కోసం కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ 13 వేల కోట్ల రుణం మంజూరైంది. చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు : అమరావతి పనుల రీ లాంఛ్ కోసం జరిగే ఈ…

Read More

అన్ని నియోజకవర్గాల నుంచి తరలిరానున్న ప్రజలుఅందరికీ భోజన సౌకర్యంభూములు ఇచ్చిన రైతులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంఏపీ స్టేట్ బ్యూరో.అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్ ఛార్జిగా నియమించడంతోపాటు 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్చార్జి అధికారిని నియమించింది. ఎక్కడా ఎటువంటి ఆటకం కలగకుండా ప్రజలను సభా స్థలికి చేర్చే విధంగా తగిన ఏర్పాట్లు చేసింది.బస్సులు బయలుదేరే సమయంలోనే ఆల్పాహారం, తాగునీరు, దారి మధ్యలో మధ్యాహ్న భోజనం కల్పించడంతోపాటు సభా ప్రాగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్ ప్రాంతాల్లో కూడా భోజన వసతి కల్పించింది. సభానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి…

Read More

ప్రభుత్వ ఆహ్వానం ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపింది. ప్రధాని చేతులమీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని ఆయన్ని ఆహ్వానించింది. తాడేపల్లి నివాసంలో జగన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఎస్‌కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకావాలని కోరుకుంటున్నామని మంత్రులు తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేకు సంబంధించి రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

Read More

గ్రామీణ రహదారులకు రూ.400 కోట్లు కేటాయింపు సీనియార్టీ ప్రాతిపదికగా బిల్లలు చెల్లింపులు ఏపీ స్టేట్ బ్యూరో, రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం వస్తోంది. గ్రామీణ రహదారులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు రూ. 400 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.. నాబార్డు పథకంలో భాగంగా ఈ నిధులతో 192 పనులను చేపట్టనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా ధ్వంసమైన రహదారులు, ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉన్న రోడ్లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్రాన్ని ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. అలాగే గుంతలు పూడ్చడానికి వీలులేని విధంగా ఉన్న రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారులను సీ కేటగిరీ కింద రూ. 600 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. గుంతల రహిత రహదారులే లక్ష్యంగా…

Read More

ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఏపీ స్టేట్ బ్యూరో, తెనాలికి చెందిన శిల్పి కాటూరి వెంకటేశ్వరావు ఆయన కుమారులు రవిచంద్ర, సూర్య కుమార్ మోడ్రన్ ఆర్ట్ లో నిష్ణాతులు. ఇప్పటికే ఎన్నో రకాల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఐరన్ స్క్రాప్ తో తయారు చేసిన మోడీ విగ్రహం కూడా ఇందులో ఉంది. ఆటో మొబైల్ రంగంలో ఉపయోగించే నట్టులు, బొల్టుల సాయంతో ఎత్తైన విగ్రహాలు తయారు చేశారు. ప్రధాని మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా లక్షలు ఖర్చు చేసి అనేక విగ్రహాలను తయారు చేశామని వాటిని సభ వద్ద ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతి తీసుకున్నట్లు వెంకటేశ్వరావు తెలిపారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్ తో పాటు తెలుగు దేశం పార్టీ సింబల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు అమరావతి పేరును కూడా తీగతో ఆకట్టుకునేలా రూపొందించారు. వీటన్నింటిని సభకు వచ్చే ప్రముఖులతో పాటు ఇతరులు తిలకించాలనేది తమ కోరిక అని శిల్పి రవిచంద్ర తెలిపారు. తెనాలి ప్రాంతం శిల్పకళకు పేరుగాంచింది. గతంలోనూ అనేక అవార్డులు…

Read More

అర్హతకు అందలం2020 నుంచి ఎన్టీఆర్ జిల్లాపార్టీ అధ్యక్షునిగా కొనసాగింపు…తాజాగా కెడీసీసీ చైర్మన్ పదవి ….నిబద్ధతకు నిదర్శనంగా నెట్టెం రఘురాం… ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.అర్హతకు అందలం దక్కింది. పదవికి పరపతి పెరిగింది. ఎంతో మంది సీనియర్ నాయకులు, నిష్ణాతులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చైర్మన్ గా పని చేశారు. ఆ పదవి ద్వారా జాతీయ స్ధాయి బ్యాంకు (ఆప్కాబ్)కు చైర్మన్ గా ఎన్నికయ్యారు. రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ ఎత్తున రుణ సౌకర్యం కల్పించారు. ఆయా రంగాలపై ఆధారపడిన సంస్ధలకు ఆర్ధిక పరిపుష్టి కలిగించారు. పదవితోపాటు బ్యాంకుకు జాతీయ స్ధాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. రుణాల చెల్లింపు, వసూళ్లలో రికార్డులను తిరగరాశారు. అదే స్ధాయిలో బ్యాంకు ప్రతిష్ఠను ఇనుమడింప చేయగల సమర్ధత నెట్టెం రఘురామ్ కలిగి ఉండటంతో ఆ పదవిలో నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నెట్టెం చాలాకాలం తరువాత అంతే గుర్తింపు కలిగిన పదవిని పొందారు. మూడుసార్లు జగ్గయ్యపేట…

Read More

డిసిఎంఎస్ చైర్మన్ పదవి తో ఊరట… ఢిల్లీ నుంచి మచిలీపట్నం వచ్చిన ఆర్కే… గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బందరుకు ర్యాలీ… జనసైనికుల్లో ఆనందోత్సవాలు….ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.పార్టీ ఏ పని అప్పగించినా కాదనకుండా వెనకడుగు వేయకుండా బండెడు బరువు మోసిన జనసేన నాయకులు బండి రామకృష్ణ కు సముచిత స్థానం లభించింది. నామినేటెడ్ పదవులు భర్తీలో భాగంగా ఆయనకు డీసీఎంఎస్ చైర్మన్ పదవి లభించింది. నిన్నటి వరకు ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా అక్కడ నుంచి మచిలీపట్నం వరకు ర్యాలీగా తరలివచ్చారు. జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న బండి రామకృష్ణ కు డి సి ఎం ఎస్ పదవి దక్కడంతో జిల్లా వ్యాప్తంగా జనసైనికుల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణకు కీలక పదవి లభించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన…

Read More

రెండో దశలో 44,676 ఎకరాలలుకొత్తగా 11 గ్రామాల్లోని రైతుల నుంచి భూములు తీసుకునే దిశగా ప్రభుత్వ నిర్ణయంరైతులు అంగీకరిస్తే భూ సమీకరణ లేకుంటే భూ సేకరణవారం రోజుల్లోపు నోటిఫికేషన్‌.. ఎం.గణేశ్, జర్నలిస్టు.అమరావతిలో రోజుకో విధంగా సమీకరణలు మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తమ ఆర్ధిక పరిస్ధితులు అనూహ్యంగా మారిపోతాయని రాజధాని గ్రామాల ప్రజలు భావించారు. అదే విధంగా భూముల ధరలు పెరిగాయి. ఎకరా భూమి ధర కోట్లలోనే పలుకుతుంది. కొనుగోలు, అమ్మకాలు కూడా పెరిగాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలకు ప్రభుత్వం రైతుల నుంచి సమీకరించిన భూములను పంపిణీ చేస్తుండటంతో నిర్మాణాలు పెరిగే పరిస్ధితులు నెలకొన్నాయి. పరిస్ధితులను గమనించిన రాజధాని గ్రామాల రైతులు భూముల ధరలను అనూహ్యంగా పెంచేశారు. కోర్ కేపిటల్ ప్రాంతాల్లోని భూముల ధరలు సామాన్యులు ఊహించని రీతిలో చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడున్న 54 వేల ఎకరాలకు తోడు అదనంగా…

Read More

సముద్రతీరంలో నేషనల్ ఈవెంట్స్…. నయా అమరావతికి గేట్ వే కానున్న బందరు బీచ్…. నాలుగు రోజులపాటు నిర్వహణకు సన్నాహాలు… పర్యాటకరంగ అభివృద్ధికి ప్రాధాన్యత…. 1500 కోట్ల పెట్టుబడులకు ఆస్కారం …. సముద్ర తీరాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర …. కె వి కృష్ణారావు. జర్నలిస్టు పర్యాటకుల మనసు దోచే రీతిలో మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని రాష్ట్ర గనులు ,ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.మే నెలలో నిర్వహించనున్న మంగినపూడి బీచ్ ఫెస్టివల్స్ కు సంబంధించి మంగళవారం ఆయన సముద్ర తీరం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బీచ్ ఫెస్టివల్స్ లో నిర్వహించబోయే నేషనల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు . ఈ ఉత్సవాలను నాలుగు రోజులు పాటు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నమన్నారు.రెండు మూడు రోజుల్లో తుది రూపం వస్తుందన్నారు. పర్యాటకరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ బీచ్ ఫెస్టివల్స్ జరుగుతాయన్నారు.…

Read More