Author: apanalysis

స్టార్ డమ్..ప్రోటోకాల్ ని పక్కన పెట్టిన ఉప ముఖ్యమంత్రి మొకాలు వరకు ఫ్యాంట్ మడత పెట్టి బురద నీటిలో రైతులతో పంట పొలాల పరిశీలన రైతుల్ని ఆదుకుంటానని హామీ ఎం.గణేశ్, ఏపీ స్టేట్ బ్యూరోఇన్ఛార్జి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ రీల్ హీరో కాదు. రియల్ హీరో అనే విషయాన్ని గతంలో అనేకసార్లు నిరూపించారు. గిరిజన ప్రాంతాల పర్యటనలో అక్కడి పరిస్ధితులకు అనుగుణంగా చెప్పులు లేకుండా వారితో కలిసి బురదలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం తరువాత బురద రోడ్లు తారు రోడ్లు అయ్యాయి. గిరిజన మహిళల కాళ్లకు చెప్పులు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ ప్రజాప్రతినిధి గిరిజన ప్రాంతాల్లోని మారు మూల ప్రాంతాల్లో పర్యటించలేదు. అక్కడి సమస్యలను పట్టించుకున్నదీ లేదు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ పర్యటించారు. నిఘా సంస్ధలు అభ్యంతర వ్యక్తం చేసినా, దానిని పట్టించుకోలేదు. చెప్పులు…

Read More

అవసరమైతే కొన్నిసార్లు సర్దుకుపోవాలి. కాపు సామాజికవర్గం అన్ని రంగాల్లో ముందుండాలి. విద్యార్ధుల ఉపకార వేతనలకు రాయల్ సర్వీస్ ట్రస్ట్ కి రూ. లక్ష్ల విరాళం బండి రామకృష్ణ. మానికొండ గణేశ్, జర్నలిస్టు ‘‘ మూడు రూపాయల కూలి నుంచి నా జీవితాన్ని ప్రారంభించా. ఇప్పుడు నా వద్ద 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రూ.12 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులు నా సంస్ధల్లో పని చేస్తున్నారు. నేను చదువుకోక పోయినా, విద్యాసంస్ధలు నడుపుతున్నాను. చిన్నపాటి మెస్ తో వ్యాపారం ప్రారంభించాను. మచిలీపట్నంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు హోటళ్లు నిర్వహిస్తున్నాను. విజయవాడలోనూ ప్రారంభించనున్నాను. పొదుపు మంత్రంతో చిన్నపాటి మొత్తాలను బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ చేశాను. ఆర్ధిక క్రమశిక్షణ పాటించే వ్యక్తిగా బ్యాంకర్ల వద్ద గుర్తింపు పొందాను. వారి నుంచి రుణాలు తీసుకుని వ్యపారాన్ని విస్తరించాను. సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. అవతలి వ్యక్తి సాధించగా…

Read More

ఎం.గణేశ్, జర్నలిస్టు పెట్టుబడుల ప్రవాహం, ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఏర్పాటు వంటి సానుకూల పరిస్ధితులు ఎన్నోనెలకొన్నప్పటికీ ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఆ రంగానికి అనుకూలంగా నాలాను రద్దు చేసింది. నగరాలు, పట్టణాల్లోని భవన నిర్మాణ అనుమతులకు నిబంధనలను సరళీకృతం  చేసింది. గతంతో పోల్చితే సిమెంటు రేట్లు తక్కువుగా ఉన్నాయి. ఇసుక కొరత సమస్య లేనేలేదు. దీనికితోడు ప్రభుత్వం తన వంతుంగా బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి సీఆర్టీఏ, మున్సిపల్, నగర పాలక సంస్ధల్లో వారం వారం సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తుంది. ఆ శాఖ మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు రియల్టర్లు, స్ధల యాజమానులకు అందుబాటులో ఉంటున్నారు. కొన్ని సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పధంతో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చేసిన దిశానిర్డేశానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా భూముల క్రయ విక్రయాలు, అపార్టుమెంట్ల…

Read More

ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన కుమారుడు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న ICRP నూకరత్నం ఎం.గణేశ్, జర్నలిస్టు . అనకాపల్లి జిల్లా మునగపాకు మండలం గణపతి గ్రామానికి చెందిన మహిళా రైతు నూక రత్నం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం లో చూచుకొండ గ్రామం ఐ సి ఆర్ పి గా పని చేస్తున్నారు. భర్త ఆదిబాబు వ్యవసాయం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు. నాగేశ్వరరావు హైదరాబాదు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. చిన్న కుమారుడు హరిబాబు . భార్యా భర్తలు ఇద్దరు తమకున్న 2.60 ఎకరాల భూమిలో ప్రధాన పంట గా చెరకును కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ తో కుమారుడి మరణం చిన్న కుమారుడు హరిబాబు (10 సంవత్సరాలు) ఐదో తరగతి చదువుకుంటున్న సమయంలో వరిబీజం లో వాపు వచ్చింది.…

Read More

అన్ని సమస్యలు సానుకూల ధోరణితోనే పరిష్కారంకులాలకు, వర్గాలకు అతీతంగా నిర్ణయాలు.ఉద్యోగుల సమస్యలు, తిరుమలశెట్టి హత్య కేసు పరిష్కారంలో చూసిన రాజకీయ చతురతఆశ్చర్యపోతున్న నాటి సహచర్యలు ఎం.గణేశ్, ఏపీ స్టేట్ బ్యూరో ఇన్ఛార్జి . పది రోజుల వ్యవధిలో మూడు సమస్యలు పరిష్కారంలో ఆయన చూపిన చొరవ, ఆసక్తి రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, బీసెంట్ రోడ్డులోని హాకర్లతో చచ్చలు, కందుకూరులో ఇటీవల హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కేసు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. రెండు కులాల మధ్య విబేధాలు పెరగకుండా ఆయన ముందస్తుగా తీసుకున్న నిర్ణయం ఇతర పార్టీలకు మింగుడు పడటం లేదు. విశాఖ గూగుల్ సంస్ధపై ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ఏపీలోని వైసీపీ నేతల విమర్శలకు ఏ మాత్రం స్పందించక పోవడం కూడా ఆయన మారిన వైఖరిని స్పష్టం చేస్తుంది. భుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే…

Read More

సమాజాన్ని తప్పుదారి పట్టించే పోస్టులు పెడిగే జైలుకే.చట్టం ముందు అంతా సమానమే.నిజాయితీతో కూడిన సమాచార మార్పిడికి సోషల్ మీడియాను వాడండిడీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ… ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేష పూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా… సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్న కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల క్రింద క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. ఎవరు ఎంత పెద్దవారైనా, ఏ సంస్థలో పనిచేస్తున్న వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ మినహాయింపు కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ… సోషల్ మీడియా వేదిక…

Read More

ఎం. గణేశ్, జర్నలిస్టు. జనసేనాని, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇకనుంచి జనంతో మమేకం కానున్నారు. సేనతో సేనాని అనే వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీని కోసం పక్కా ప్రణాళిక రూపొందించారు. ఒక పోస్టర్ ని జనసేన పార్టీ నేతలు ఆవిష్కరించారు. రెండు నెలల క్రితం విశాఖపట్నంలో జరిగిన మూడు రోజుల కార్యకర్తల సభలో ఆయన త్రిశూల్ వ్యూహాన్ని ప్రకటించారు. సేనలో సేన అనే వినూత్న కార్యక్రమం ఇందులో ఉంది. ఇది పూర్తిగా పార్టీ పటిష్టతకు సంబంధించిన కార్యక్రమం. జిల్లాల వారీగా జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మమేకమవుతారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటారు. అక్కడే రాజకీయాల పట్ల పారదర్శకత, సేవా తత్పరత భావాలు కలిగిన యువతీ యువకులను పార్టీలోకి ఆహ్వానిస్తారు.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాలపై మరింతగా…

Read More

ఉమా, వర్మ, శ్రీధర్ల పరిస్ధితిపై అంతర్గతంగా చర్చ ఎం.గణేశ్, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గత ఎన్నికల్లో టికెట్టు త్యాగం చేసిన ఈ ముగ్గురు నేతలకు నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉంది. పార్టీలోనూ మంచి పేరుంది. వివాద రహితులుగా గుర్తింపు ఉంది. ప్రభుత్వం ఏర్పాటు అయిన తరవాత వీరి త్యాగానికి తగిన రీతిలో గుర్తింపు ఉంటుందని పార్టీ నుంచి హామీ కూడా ఉంది. అయితే ఈ నెలల కాలంలో పదవుల కేటాయింపు సమయంలో అనేక సార్లు వీరి పేర్లు తెరమీదకు వచ్చాయి.ఇదిగో మా నేతకు ఎమ్మెల్సీ వచ్చేసింది…ఇదిగిదిగా పలానా నామినేటెడ్ పోస్టు వచ్చేసిందని ఆ నేతల అభిమానులు, అనుయాయులు సంబంర పడేవారు. తీరా ఈ నేతలకు కాకుండా వేరే వారికి పదవులు లభించడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు కంచుకోట. మేజరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో…

Read More

ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాల్లోపు యువత (జెన్‌ జెడ్‌) మెచ్చిన నగరాల్లో బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌) అగ్రస్థానంలో నిలిచింది. ముఖ్యంగా అందుబాటు ధరలు, సంస్కృతి, రాత్రివేళల్లో వినోదభరిత జీవనం, నాణ్యమైన జీవితం- ఈ నాలుగు అంశాలకు వాళ్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి గాను టైమ్‌ అవుట్‌ ఈ సర్వేను నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18,500 మంది ఇందులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో రెండో ఉత్తమ నగరంగా మెల్‌బోర్న్‌కు ఎక్కువ మంది ఓటేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ నగరంలో అందరికీ సమాన అవకాశాలతో కూడిన పరిస్థితులు, సంస్కృతి విధానాలు తమకు నచ్చాయని యువత వెల్లడించినట్లు సర్వే తెలిపింది. మూడో స్థానంలో నిలిచిన కేప్‌టౌన్‌లో ప్రకృతి సౌందర్యం, రాత్రిపూట వినోధభరిత జీవనం వంటి అనుకూలతలు ఉన్నట్లు వారు చెప్పారని పేర్కొంది.

Read More