ఏపీ ఎనాలిసిస్, విజయవాడ కృష్ణా డిసిఎంఎస్ చైర్మన్ గా మచిలీపట్నం చెందిన జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ నియమితులయ్యారు. సోమవారం పది జిల్లాలకు డిసిసిబి చైర్మన్ లను నియమించిన ప్రభుత్వం అలాగే మరో 10 మంది డిసిఎంఎస్ చైర్మన్ లను నియమించారు. వారిలో కృష్ణాజిల్లా డిసిఎంఎస్ చైర్మన్ గా బండి రామకృష్ణ నియమితులు కాగా మిగిలిన 9 జిల్లాలకు నూతన డిసిఎంఎస్ చైర్మన్ల నియామకం జరిగింది.
Author: apanalysis
కె డి సి సి బ్యాంకు చైర్మెన్ గా నెట్టెం రఘురాం … రాష్ట్రంలో మరో 9 డి సి సి బి లకు చైర్మన్ ల నియామకం… ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మెన్ గా మాజీ మంత్రి నెట్టెం రఘురాం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా తో పాటు రాష్ట్రంలో మరో 9 డిసిసిబి లకు కొత్తగా చైర్మన్ లను నియమించింది. కేడీసీసీ చైర్మన్ గూనెట్టెం రఘురాం నియమితులు కాగా శ్రీకాకుళం డిసిసిబి చైర్మన్ గా శిర్వాల సూర్యనారాయణ విశాఖ డిసిసిబి చైర్మన్ గా కోన తాతారావు విజయనగరం కు కిమిడి నాగార్జున గుంటూరు మాకినేని మల్లికార్జునరావు నెల్లూరు ధనుంజయ రెడ్డి చిత్తూరు అమాస రాజశేఖర్ రెడ్డి అనంతపురం కేశవరెడ్డి కర్నూలు విష్ణువర్ధన్ రెడ్డి కడప డి సి సి బి చైర్మన్ గా…
చాలా మంది ఫ్రాంఛైజీలు సృష్టిస్తుంటారు. అవి ఎన్ని రోజులుంటాయి.. ఎక్కడి దాకా వెళ్తాయి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ, శైలేశ్ ‘హిట్: ఫస్ట్ కేస్’ (Hit 3) అని ప్రకటించగానే.. ఇది ఓ అనంతమైన ఫ్రాంఛైజీలా ముందుకెళ్తూనే ఉంటుంది అందరికీ అర్థమైపోయింది. ఇది నిజంగా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘హిట్: ది థర్డ్ కేస్’ చిత్ర విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాని (Nani) కథానాయకుడిగా శైలేశ్ కొలను రూపొందించిన పాన్ ఇండియా చిత్రమిది. యునానిమస్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా మా సినిమాలకు సంబంధించి ఏమైనా లీక్స్ వచ్చినప్పుడు నాకు చాలా…
రుణయాప్‌ల ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గతేడాది విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణయాప్ నుంచి రూ.3,200 తీసుకుని తిరిగి చెల్లించినా సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుట్టు విప్పిన వాట్సప్ సమాచారంబాధితుడి వాట్సప్‌నకు వచ్చిన బెదిరింపులను పరిశీలించగా పాకిస్థాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అస్సాం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంకు ఖాతాలు తెరిచిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కర్నూలుకు చెందిన…
కృత్రిమ మేధ (ఏఐ)తో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తాయని, తద్వారా పని స్వభావంలో మార్పులు వస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఏఐ గ్లోబల్ హెడ్ అశోక్ క్రిష్ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి చోదకంగా ఏఐను పరిగణించాలని, ఉద్యోగాలకు ముప్పుగా చూడరాదని అన్నారు. కంపెనీల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఏఐను ఒక ఐటీ ప్రాజెక్టుగా చూడటం లేదని, బోర్డు స్థాయి ప్రాధాన్యంగా మారిందని తెలిపారు. ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక మార్పు కాదని, ఉద్యోగులు పనిచేసే తీరును మార్చే ఒక సాంస్కృతిక మార్పు అని వివరించారు. గత మూడు దశాబ్దాల్లో మెయిన్‌ఫ్రేమ్స్ నుంచి ఇంటర్నెట్ వరకు.. ఆ తర్వాత ఇ-కామర్స్, డిజిటల్, క్లౌడ్ వంటి సాంకేతిక పరమైన మార్పులు వచ్చాయని.. భారీ మార్పులు చోటుచేసుకున్న ప్రతిసారీ, భవిష్యత్‌పై ఉద్యోగులకు కొత్త భయాలు రావడం సహజమేనన్నారు. ఏఐ భవిష్యత్తు విప్లవమని, తద్వారా మరిన్ని టెక్నాలజీలు వస్తాయని, ప్రక్రియలు సులభతరం అవుతాయని అశోక్ క్రిష్…
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల (Ban on Youtube Channels) ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్‌లో కూడా ప్రసారాలు అందుబాటులో లేవు. యూట్యూబ్‌లో ఈ ఛానళ్లను తెరవగానే.. ‘‘ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అనే సందేశం వస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్,…
నిన్నటి విధ్వంసం నుంచి..రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు..రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ‘ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి.. ఒక అద్భుత రాజధానిని నిర్మించి, విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం’ అని స్పష్టం చేశారు. ‘గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది. అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది. గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను.. కూటమి అధికారంలోకి…
పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్ ఉపయోగపడుతుంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించింది. యుద్ధసన్నద్ధతను చాటింది. ఉక్కిరిబిక్కిరి చేసేలా..విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (సీబీజీ)గా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రాంత్ కదలికలను బట్టి.. పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా…
బాధితుల మొర వింటూ ఫిర్యాదు రాసిచ్చేస్తుందినేరాన్ని బట్టి ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాల్సిన సెక్షన్లూ చెప్పేస్తుందిక్రైమ్ సీన్‌లో ఆధారాల సేకరణ నుంచి దర్యాప్తు ఏ విధంగా చేయాలో చెబుతుందిడిఫెన్స్ లాయర్ ఏమి వాదిస్తారో చెబుతూనే కౌంటర్ సూచిస్తుంది ఏపీ స్టేట్ బ్యూరో: ఏలూరులో ట్రయల్ సక్సెస్… త్వరలో 175పోలీస్ స్టేషన్ల లో ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ) అందుబాటులోకి రానున్నది. అత్యాధునిక సాంకేతికతతో ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలను అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని ఏపీ పోలీసులు అందిపుచ్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ‘టెక్నాలజీ పోలీస్ ‘గా ఎదగడానికి అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందిపుచ్చుకుంటోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో చార్జిషీట్ వరకూ అంతా ఏఐ తోనే అని అంటోంది. ఏఐ ప్రపంచాన్ని ఏలుతున్న కాలమిది. దానిని ముందుగా అందింపుచ్చుకున్న వారిదే ఆ రంగంలో విజయం. ఆంధ్ర పోలీస్ తన సత్తాను చాటడానికి ఆ దిశగా వడివడిగా అడుగులు…
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో కన్నడ చిత్రం గిల్లితో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘కెరటం’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ అగ్రహీరోయిన్‌గా ఎదిగింది.సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా తన అందచందాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నది. రకుల్ ఇటీవల కాస్మెటిక్ సర్జరీపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది.తనకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడని.. కాబట్టి తాను అలాంటి వాటి గురించి ఆలోచించలేదు అని చెప్పింది. అయితే, ఇటీవల రకుల్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన వారంతా రకుల్ తన పెదవులకు ఏదో కాస్మెటిక్ సర్జరీ, ఫిల్లర్ (పెదవులు బొద్దుగా కనిపించేలా చేసే ఒక రకమైన ప్రక్రియ) చేయించుకున్నట్లుగా భావించారు. దీనిపై రకుల్…