Author: apanalysis

పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు శనివారం వాటికన్‌ సిటీలో సాదాసీదాగా ముగిశాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్‌ భౌతిక కాయాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. అత్యంత సీనియర్‌ కార్డినల్స్‌ సమక్షంలో సెయింట్‌ మేరీ బాసిల్లికా చర్చి ఆవరణలో పోప్‌ను ఖననం చేసినట్టు వాటికన్‌ వర్గాలు తెలిపాయి.ద్రౌపదీ ముర్ము, ట్రంప్‌ సహా 2 లక్షల మంది హాజరువాటికన్‌, ఏప్రిల్‌ 26: పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలు శనివారం వాటికన్‌ సిటీలో సాదాసీదాగా ముగిశాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్‌ భౌతిక కాయాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. అత్యంత సీనియర్‌ కార్డినల్స్‌ సమక్షంలో సెయింట్‌ మేరీ బాసిల్లికా చర్చి ఆవరణలో పోప్‌ను ఖననం చేసినట్టు వాటికన్‌ వర్గాలు తెలిపాయి.అంత్యక్రియలకు ముందు పోప్‌ దేహంపై తెల్లటి వస్ర్తాన్ని, నాణేలు ఉన్న సంచిని, ఆయన పోప్‌గా ఉన్నప్పటి రికార్డ్‌ (రోజిటో)ను శవపేటిక లోపల పెట్టారు. పోప్‌ అంతిమ సంస్కారాల్లో పలువురు ప్రపంచ దేశాధినేతలు సహా…

Read More

ఆత్మవిశ్వాసం.. పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అసలైన ఆస్తి. కాన్ఫిడెంట్‌గా ఉంటేనే.. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనే ‘శక్తి’ లభిస్తుంది.ఆత్మవిశ్వాసం.. పిల్లలకు తల్లిదండ్రులు అందించాల్సిన అసలైన ఆస్తి. కాన్ఫిడెంట్‌గా ఉంటేనే.. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. ధైర్యంగా ఎదుర్కొనే ‘శక్తి’ లభిస్తుంది. అయితే.. ఇది రాత్రికి రాత్రే వచ్చేదికాదనీ, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే వారిపై వారికి నమ్మకాన్ని కలిగించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వారిపై మీరు చూపించే ప్రేమ, విశ్వాసం, ఇంట్లో వారినిఎలా చూసుకుంటున్నారు? అనే విషయాలే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనీ అంటున్నారు.చిన్నచిన్న విషయాల్లో.. నిర్ణయాలను పిల్లలకే వదిలేయండి. బయటికి వెళ్లేటప్పుడు ఏ డ్రెస్‌ వేసుకోవాలో.. సాయంత్రం స్నాక్స్‌ కోసం ఏం సిద్ధం చేయాలో.. వారినే నిర్ణయించుకోమని చెప్పండి. వారి నిర్ణయాలను గౌరవించండి. ఈ చిన్న అలవాటే.. పిల్లల్లో సొంతంగా ఆలోచించుకొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో పెద్దపెద్ద నిర్ణయాలు సులువుగా తీసుకోగలిగే…

Read More

వక్షోజాలు పట్టుకొనే యత్నం రేప్‌ ప్రయత్నం కాదు కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు మైనర్‌ బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడానికి ప్రయత్నించడం ‘తీవ్రస్థాయి లైంగిక దాడి’ అవుతుందే తప్ప అది అత్యాచార యత్నం కిందకు రాదని కలకత్తా హైకోర్టు శుక్రవారం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ పోక్సో కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది.మైనర్‌ బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడానికి ప్రయత్నించడం ‘తీవ్రస్థాయి లైంగిక దాడి’ అవుతుందే తప్ప అది అత్యాచార యత్నం కిందకు రాదని కలకత్తా హైకోర్టు శుక్రవారం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ పోక్సో కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేసింది. అయితే కింది కోర్టు మాత్రం నిందితుడు తీవ్రస్థాయి లైంగిక దాడితోపాటు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు నిర్ధారించి 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.నిందితుడు దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన జస్టిస్‌ అరిజిత్‌ బెనర్జీ, జస్టిస్‌ బిస్వరూప్‌ చౌదరితో కూడిన…

Read More

నవమాసాలు మోసి కనిపెంచిన కుమారుడే తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. భూమి పంపకంపై కక్ష పెంచుకుని ట్రాక్టర్‌తో వెంబడించి, తొక్కించి నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ప్రాణభయంతో వారు పరుగులు తీస్తున్నా వదిలిపెట్టలేదు. ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)కు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. రాధాకుమారికి కొన్నేళ్ల కిందట విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో తమకున్న ఎకరా భూమిలో 20 సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. ఐదేళ్ల కిందట రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటి వద్ద నివసిస్తున్నారు. మిగిలిన ఆస్తి పంపకాలలో తల్లిదండ్రులు, కుమారుడి మధ్య రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. భూమిని తల్లిదండ్రులు, కుమారుడికి పంచుతూ పంచాయితీలో గ్రామ పెద్దలు తీర్మానించారు. కుటుంబ…

Read More

దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ‘బ్లాక్‌ హిల్స్‌’గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్‌ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్‌ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. శుక్రవారం రాత్రి కర్రెగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి నాలుగు హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్లు తెలిపారు. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్‌జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి,…

Read More

అవనిగడ్డ శ్రీకాకుళం లో మే 14న శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఆంధ్రుల తొలి రాజధానిగా గుర్తింపు కలిగిన శ్రీకాకుళం గ్రామంలో ఆంధ్ర జాతి పేరుతో శ్రీ ఆంధ్ర మహావిష్ణువు స్వయంభువై వెలసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీకృష్ణదేవరాయ ప్రభువు ఆముక్తమాల్యదా గ్రంథ రచన చేయడం ద్వారా ఈ దేవస్థాన ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేశారని కొనియాడారు. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన దేవస్థానంలో జరిగే శ్రీకృష్ణదేవ రాయ మహోత్సవాలను ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావు, బర్మా ప్రసాద్,…

Read More

భారతదేశంలో పేదవాడి దగ్గరినుంచి లక్షల కోట్లు కలిగిన ధనవంతుడి వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఒక్క రాజకీయాలకు మాత్రమే ఉంది. రాజకీయ నాయకులు తలుచుకుంటే.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అయిపోతాయి. అందుకే సినిమాల్లో స్టార్లుగా ఎదిగి.. వందల కోట్లు సంపాదిస్తున్న వాళ్లు కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. కేవలం సినిమా వాళ్లే కాదు.. ప్రజల్లో కొద్దిగా పాపులారిటీ ఉన్నా చాలు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వారానికో కొత్త పార్టీ పుట్టుకు వస్తోంది. వీధికో రాజకీయ పార్టీ వెలుస్తోంది. వాటిలో కొన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తుంటే.. మరికొన్ని డిపాజిట్లు కూడా రాకుండా ఉనికిని కోల్పోతున్నాయి. మరి, ఎవరు పడితే వాళ్లు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు కదా.. కొత్త పార్టీ పెట్టడం అంత సులభమా?.. కొత్తగా పార్టీ పెట్టాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి?.. ఎంత ఖర్చు అవుతుంది?.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రాజకీయ పార్టీ…

Read More

అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించారు.అద్భుతమైన భవిష్యత్‌ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు…

Read More

కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) త్వరలో తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన నటిస్తున్న ఈ 22వ సినిమాకి అట్లీ (Atlee) దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో కథ రీత్యా ముగ్గురు కథానాయికలు కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అందులో ఓ పాత్ర కోసం మృణాల్‌ ఠాకూర్‌ను (Mrunal Thakur) రంగంలోకి దించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు పూర్తయ్యాయని.. ఇటీవలే తను లుక్‌ టెస్ట్‌లోనూ పాల్గొందని తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెండు నాయికా పాత్రల కోసం జాన్వీ కపూర్, దీపికా పదుకొణె (Deepika Padukone) పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే జాన్వీతో చర్చలు పూర్తయ్యాయని.. దీపికతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న కథతో రూపొందుతున్న చిత్రమిది. సమాంతర ప్రపంచం, పునర్జన్మ కాన్సెప్ట్‌ ఈ కథలో మిళితమై ఉండనున్నట్లు…

Read More

ఐపీఎల్‌ చరిత్రలో చెన్నైని వారి సొంతగడ్డపై ఓడించి ఎరుగదు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. పైగా ఈ సీజన్లో ఆ జట్టు ఆట పేలవం. పెద్దగా అంచనాలు లేవు. కానీ సన్‌రైజర్స్‌ అదరగొట్టింది. మొదట బంతితో విజృంభించి.. తర్వాత బ్యాట్‌తోనూ మెరిసి చెపాక్‌ కోట బద్దలు కొట్టింది. మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో వరుస పరాభవాలను చవిచూస్తున్న సీఎస్కే (Chennai Super Kings) ఇంకో ఓటమితో దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది ఏడో పరాజయం.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) మెరిసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించి చెపాక్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మొదట చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. బ్రెవిస్‌ (42; 25 బంతుల్లో 1×4, 4×6), ఆయుష్‌ మాత్రే (30; 19 బంతుల్లో 6×4) పోరాడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌…

Read More