జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.ముంబై వరుస పేలుళ్లు సంవత్సరం: 1993బాధితులు: 257 మంది మృతి, 1,400 మందికి పైగా గాయాలుదాడులు చేసింది: దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి సంవత్సరం: 2001బాధితులు: 9 మంది మృతి, 18 మందికి గాయాలుదాడులు చేసింది: జైషే మొహమ్మద్, లష్కర్-ఏ-తాయిబా అక్షరధామ్ ఆలయంపై దాడి, గుజరాత్ సంవత్సరం: 2002బాధితులు: 33 మంది మృతి, 80 మందికి…
Author: apanalysis
సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును షాతో పంచుకున్నట్లు తెలిసింది. వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికపైనా చర్చించినట్లు సమాచారం. ఈ స్థానాన్ని భాజపాకు వదిలిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆ విషయాన్ని తెదేపా నాయకులు ధ్రువీకరించలేదు. అయితే, చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణమాదిగ ఆ తర్వాత విలేకర్లకు చెప్పారు. అనంతరం ఆయన దిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసం జన్‌పథ్‌కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు భాజపా నాయకత్వం తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు…
తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు ముమూర్తం ఖరారైంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రైలు జూలై నుంచి హరియాణాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు ప్రారంభం అయిన తరువాత దశల వారీగా విస్తరణ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రూ 80 కోట్ల ఖర్చు భారతీయ రైల్వేశాఖ సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ కింద హైడ్రోజన్…
విలీనమైన నాలుగు గ్రామీణ బ్యాంకులుఒక రాష్ట్రం-ఒక గ్రామీణ బ్యాంకు విధానం ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంక్” విధానానికి అనుగుణంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లు విలీనం అయ్యాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది మే 1 నుంచి అమలులోకి రానున్నది. విలీనం తరువాత “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్” అనే పేరుతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా* స్పాన్సర్‌షిప్‌లో కార్యకలాపాలు కొనసాగుతాయి.ఈ మార్పును ఖాతాదారులు, ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. యధావిధిగానే అన్ని సేవలు కొనసాగుతాయి. ఖాతాదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమకు అవసరమైన సమాచారం కోసం తమ సమీప శాఖను సంప్రదించవచ్చు. బ్యాంక్…
అతని చేసిన మద్యం స్కాం వివరాలేమిటి? జగన్ తో అతనికున్న బంధుత్వం పై ఆరా ప్రభుత్వానికి ఎలా నష్టం కలిగించారు. ఇవీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఏపీ స్టేట్ బ్యూరో: చాలా మంది రాజకీయ వేత్తలు ఢిల్లీ మద్యం స్కాం కంటే ఏపీ మద్యం స్కాం పెద్దదని ఎప్పటి నుంచో చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టేంత వరకు, సిట్ విచారణ చేపట్టేంత వరకు వాటిని పట్టించుకోలేదు. ఇవి కేవలం రాజకీయ పరమైన విమర్శలే అని భావించారు. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూ కుంభకోణం తిరుగుతుండటంతో దీనిలో ఏదో ఉందని భావించారు. ఇటీవల విజయసాయి రెడ్డి, కసిరెడ్డిలు ఒకరిపై మరొకరులు ఆరోపణలు చేసుకున్న తరువాత ఈ స్కాం దేశ రాజధాని కంటే పెద్దదే అయి ఉండవచ్చని నమ్ముతున్నారు. అసలు కసిరెడ్డి ఎవరు? అతను చేసిన నేరం ఏమిటీ? మధ్యం కుంభకోణం ఎలా జరిగిందీ అనే విషయాలను…
జూన్ 14 నుంచి హెటెక్స్ లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి భట్టి విక్రమార్క , కోమటి రెడ్డి, జయ సుధ, దిల్ రాజు అటెండ్ అయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రొత్సహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. గద్దర తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టం. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయం. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవార్డులు…
ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు (Gold Prices) రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. సంపన్నులకే దడ పుట్టించేలా ప్రస్తుతం బంగారం రేట్లు పెరుగుతూపోతున్నాయి. తాజాగా బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి తాకాయి. మంగళవారం దేశీయంగా 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి ధర ఏకంగా రూ.లక్ష దాటింది. ఢిల్లీ (Delhi), ముంబై, కోల్‌కతా, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన ఒక గ్రాము బంగారం ధర రూ.10,000 పైనే పలుకుతోంది.అత్యధికంగా దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.1,02,160కు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర రూ.10,150గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన గ్రాము బంగారం ధర రూ.10,135గా ఉంది. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.1.50 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్…
తమ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు రానున్న వెయ్యేళ్ల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలక సిబ్బంది పనితీరు, విధాన రూపకల్పన కాలం చెల్లిన పద్ధతుల్లో సాగరాదని సూచించారు. దిల్లీలో సోమవారం జరిగిన 17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తన దార్శనికతకు కార్యరూపమిచ్చే దిశగా ప్రతి ఒక్కరూ అలుపెరగకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ‘‘ప్రభుత్వ పరిపాలక సిబ్బంది ‘‘నాగరిక్ దేవోభవ’’ (పౌరుడే దేవుడు) అనే మంత్రానికి కార్యరూపమిస్తూ అట్టడుగు వర్గాల సమస్యల్ని పరిష్కరించాలి. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని పోయేందుకు చివరి వరకూ కృషి చేయాలి. సివిల్ సర్వెంట్లు కేవలం పరిపాలక సిబ్బందిగా కాక అభివృద్ధి చెందిన దేశ నిర్మాతలుగా తమను తాము భావించుకోవాలి. దేశంలో అందరి కనీస అవసరాలను తీర్చడం అధికారుల ప్రాధాన్యత కావాలి. పరిపాలన ఫలాలను చివరి వ్యక్తి వరకూ…
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాపై జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ‘‘ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందించే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. 20 నిమిషాలపాటు ఉండే ఒక దాన్ని పవన్ రూపొందించారు. ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఈ సీక్వెన్స్‌లో 1100 మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో 61 రోజులు దీన్ని చిత్రీకరించాం. దీని కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. గ్రౌండ్ వర్క్ చేశారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్లతో చర్చించారు (Hari Hara Veera Mallu Update). సినిమా మొత్తంలో ఇదే హైలైట్ కానుంది’’ అని తెలిపారు. ఇక ఈ…
ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆ రెండు సంస్థలకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేశ్‌బాబుకు ఆయా సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది.