ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు. ముంబయి నటి జత్వానీకి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వైకాపా హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. మాజీ సీఎం జగన్‌కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన్ను తరలిస్తున్నారు. జత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు. .ముంబయి నటి ఫిర్యాదు కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెండ్ అయ్యారు. జత్వానీ వ్యవహారంలో వైకాపా ముఖ్యనేత చెప్పగానే పీఎస్‌ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి.. ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్నీ తానై చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైకాపా…
Author: apanalysis
వైసిపి బాస్ ని టార్గెట్ గా సిట్ విచారణఆ దిశగా విజయసాయి , మిధున్ రెడ్డిలపై విచారణకసిరెడ్డి కోసం జల్లెడవైసిపి చుట్టూ బిగుస్తున్న లిక్కర్ స్కాం ఉచ్చు ఏపీ ఎనాలిసిస్, విజయవాడలిక్కర్ స్కామ్ లో వైసీపీ బాసును టార్గెట్ చేసే విధంగా సిట్ దర్యాప్తు వేగవంతం అవుతుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువుగా వినపడుతోంది. కుంభకోణంపై వేగంగా జరుగుతున్నవిచారణ వైసీపీలో ప్రకంపనలు రేపుతుంది. జగన్ కు కుడి భుజంగా ఇటీవలి వరకు కొనసాగిన విజయసాయిరెడ్డి ఈ విచారణలో ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోయినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కోంటున్న కసిరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. అతనో క్రిమినల్ అని, ఇందులో అతని పాత్రే ఎక్కువుగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు కసిరెడ్డి ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాకుండానే విజయసాయి రెడ్డిపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. అనేక అంశాలతో కూడిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. సిట్ విచారణ ఇంకా…
దర్శకునిగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వయసు పాతికేళ్ళు. ఆయన తొలి చిత్రం ‘బద్రి’ (Badri)2000 ఏప్రిల్ 20న జనం ముందు నిలిచింది, వారి మనసులు గెలిచింది. చదువుకొనే రోజుల నుంచీ సినిమాపిచ్చి ఉన్న పూరి జగన్నాథ్ డిగ్రీ కాగానే చిత్రసీమలో ప్రయత్నాలు మొదలెట్టారు. ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని చిత్రాల్లో తళుక్కుమని తెరపై కనిపించారు. మొదటి నుంచీ వైవిధ్యం ప్రదర్శించాలని తపిస్తోన్న పూరి జగన్నాథ్ ‘బద్రి’ కథ తయారు చేసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను కలిశారు. అప్పట్లో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ సాగుతున్నారు పవన్. అంతకు ముందు కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి పవన్ నటించిన “తొలిప్రేమ, తమ్ముడు” చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అదే సమయంలో పూరి చెప్పిన ‘బద్రి’ కథ నచ్చడంతో పవన్ మరో మాట లేకుండా ఓకే చెప్పేశారు. అలా తొలిసారి పూరి…
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం మాధ్యమాల్లో…
మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా రెండు విధానాలను తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులకు ఐచ్ఛికాల నమోదు చేయాలని పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారు. ఒక అభ్యర్థి మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికాల ప్రకారమే పోస్టింగ్‌లు ఇస్తారు. మొదట దరఖాస్తు సమర్పించినప్పటికీ గడువు ముగిసేలోపు అర్హత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమర్పించకపోతే హాల్‌టికెట్లు జారీ చేయరు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే…
గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6 శాతం ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. దీనివల్ల ఏడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా రూ.10 వేల కోట్లు మిగిల్చినట్లు అవుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల దగ్గర ఏసీలను వినియోగిస్తున్నారు. హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేప్పుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘారాల విడుదల తగ్గుతుంది. ఏసీల జీవితకాలమూ పెరుగుతుంది. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాం’ అని బీఈఈ పేర్కొంది.
Early Morning Walking – ఉదయం వాకింగ్ అద్భుతం.. ప్రతి రోజు సూర్యోదయం సమయంలో 30 నిమిషాలు నడవడం శరీరానికి ఎనర్జీని అందిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. మనసును ప్రశాంతపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది బెస్ట్ స్టార్ట్. వాకింగ్ సమయంలో పచ్చని ప్రదేశాల్లో నడవడం మెదడుకు నూతన తేజాన్ని అందిస్తుంది. 2. Hydration Discipline – నీరు త్రాగడం ఒక క్రమం.. రోజు 2–3 లీటర్లు మంచి నీరు తాగడం శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ప్రతి గంటకోసారి నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని కణజాలాలకు తేమ అందుతుంది. 3. Natural Food Intake – సహజమైన ఆహారం శ్రేష్ఠం.. ప్రాసెస్ చేసిన ఆహారం కన్నా తాజా కూరగాయలు, పండ్లలో అధిక ప్రయోజనాలుంటాయి. వారానికి 3 సార్లు సూప్స్,…
ఏపీ ఎనాలసిస్. విజయవాడ :ప్రజాస్వామ్య పరిరక్షకుడు నారా చంద్రబాబు నాయుడు. గడిచిన 40 ఏళ్ల కాలంలో తలెత్తిన తీవ్ర సంక్షోభాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.అతి తీవ్రమైన నాలుగు సంక్షోభాల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలను వారికి అండగా ఉండే తెలుగుదేశం పార్టీని కాపాడిన ఘనులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .నాలుగు సంక్షోభాల్లో మొదటిది 1984 సంక్షోభం. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకొని కాంగ్రెస్ పార్టీ యేతర ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాలను పొందిన ఎన్టీఆర్ ను ఎదుర్కోలేక నాటి ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి గవర్నర్ రామ్ లాల్ ,నాదెండ్ల భాస్కరరావు లను ప్రయోగించి పార్టీలో సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. అ సంక్షోభం నుంచి పార్టీని కాపాడి మళ్లీ అన్న ఎన్టీఆర్ పాలనను తెలుగు ప్రజలకు అందజేసిన ఘనత నారా చంద్రబాబునాయుడు గారికి దక్కింది .ఈ ఆపరేషన్ లో వెంకయ్య నాయుడు…
కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna).. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో ఓ చిత్రం రూపొందనున్నట్లు స్పష్టత వచ్చేసింది. ‘వీరసింహారెడ్డి’ విజయం తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేయనున్న రెండో సినిమా ఇది. దీనిపై దర్శకుడు గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇది పూర్తిగా యాక్షన్ చిత్రంగా ముస్తాబు కానుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న దీన్ని ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారు. దీంతో ‘అఖండ 2: తాండవం’ (Akhanda) పూర్తయిన వెంటనే బాలయ్య ఈ సినిమా కోసమే రంగంలోకి దిగనున్నట్లు స్పష్టత వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మించనుంది..దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవలే ‘జాట్’తో (Jaat) బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘జాట్ 2’ని కూడా ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే…
భూ దందాలు చేసినా, తప్పుడు దస్తావేజులు సృష్టించినా, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని భూ నేరాలకు పాల్పడేవారికి కఠినంగా తెలియజేయబోతున్నామని తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు, వారసత్వంగా వచ్చిన భూముల్ని కాపాడుకోవడం కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భూకబ్జాలు, ఆక్రమణలపై తన కార్యాలయానికి వచ్చిన ఆర్జీలపై శుక్రవారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ ఇస్తుంది. గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి.. కబ్జాలు చేసేలా చట్టాలే చేశారు. వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారు. ఆ తరహా అక్రమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి’…