Author: apanalysis

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగస్టర్‌ డ్రామా ‘ఓజీ’ (OG Movie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న (og movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రియాంక మోహన్‌ పాత్రను పరిచయం చేసింది. ఇందులో కణ్మని పాత్రలో ప్రియాంక అలరించనుంది. ఓజెస్‌ గంభీరగా పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడుదల చేసిన ప్రియాంక లుక్‌ చూస్తుంటే, ఓజీ ఫ్లాష్‌బ్యాక్‌ సంబంధించిన సన్నివేశాల్లో ఉంటుందని తెలుస్తోంది. ప్రియాంక చీరకట్టులో విడుదల చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, చిత్ర బృందం మరో సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చింది. సెకండ్‌ సింగిల్‌ ప్రోమోను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. డీడీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీడీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Read More

మహిళా లోకంలో ఉత్సాహం వెల్లివిరిసింది. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉచిత ప్రయాణం పథకానికి విశేష స్పందన లభించింది. శనివారం మహిళలు పెద్దసంఖ్యలో ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ‘స్త్రీశక్తి’ పేరుతో ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రారంభించగా… తొలిరోజు 76వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. శనివారం ఆ సంఖ్య భారీగా పెరిగింది. రాత్రి 9 గంటల వరకు 11.47 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. రెండు రోజులు కలిపి… మహిళలకు ఈ పథకం వల్ల రూ.5 కోట్లకుపైగా లబ్ధి చేకూరిందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) సగటున 69% ఉంటుంది. సెలవు రోజుల్లో 60% నమోదవుతుంది. కానీ ఉచిత బస్సు ప్రభావంతో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవైనా 75% వరకు ఓఆర్‌ వచ్చింది. సోమవారం నుంచి 90%పైగా ఓఆర్‌ రావచ్చని ఆర్టీసీ…

Read More

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఉపద్రవాన్ని మరువక ముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విస్ఫోటం సంభవించిందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆ ప్రాంతానికి చేరుకుందని వెల్లడించారు. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ అనే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలా కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాక్‌ ఖాద్‌, ఉజ్ నదులలో నీటి శాతం అమాంతంగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు దెబ్బతినడంతో పాటు ఆ ప్రాంతంలోని జాతీయ రహదారితో సహా ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయన్నారు. కథువా పోలీస్‌ స్టేషన్‌లోకి కూడా వరదనీరు చేరింది. ఈ…

Read More

ఏపీలో మరికొన్ని నామినేటెడ్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 31 పదవుల భర్తీకి సంబంధించిన జాబితా విడుదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా మార్కెట్‌ కమిటీలు సహా కొన్ని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్‌ పోస్టుల వివరాలివీ..రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఆకేపోగు ప్రభాకర్ (కొడుమూరు-ఎస్సీ) (తెదేపా)సామాజిక సంక్షేమ బోర్డు- బాల కోటయ్య (నందిగామ-ఎస్సీ)-(బహుజన జేఏసీ)కమ్మ కార్పొరేషన్- బ్రహ్మం చౌదరి, గురజాల (తెదేపా)బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్- బుచ్చి రాంప్రసాద్‌, గుంటూరు వెస్ట్‌ (తెదేపా)ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – సి.ఎస్. త్యాగరాజన్- చిత్తూరు (తెదేపా)బొందిలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్- డి.విక్రమ్ సింగ్, కర్నూలు (తెదేపా)హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT)- దాసరి శ్రీనివాసులు, తిరుపతి (భాజపా)వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్- గుంటసల వెంకట లక్ష్మి, దెందులూరు (జనసేన)ఆరెకటిక / కటిక / ఆరే- సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి…

Read More

ఈ పంద్రాగస్టుకు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రాలు ‘కూలీ’ (Coolie), ‘వార్‌2’ (War2). ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా, టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ బుకింగ్స్‌ ఎప్పుడెప్పుడు ఓపెన్‌ అవుతాయా? అన్న అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. మంగళవారం సాయంత్రం నుంచి టికెట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. బుక్‌మై షో, డిస్ట్రిక్ట్‌ యాప్‌లలో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. తెలంగాణలో టికెట్‌ ధరల పెంపు లేదు. సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.175కు, మల్టీప్లెక్స్‌లలో రూ.295కే టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్‌ షో కన్నా ముందు కేవలం ఒక్క షోకు మాత్రమే అనుమతి లభించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా థియేటర్‌లకు అనుమతి ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ స్పెషల్‌ షోను ప్రదర్శించనున్నారు. రెండు సినిమాలకు భారీగా డిమాండ్‌ ఉండటంతో స్పెషల్‌ షోలకు థియేటర్లు కేటాయించే విషయంలో చాలా…

Read More

తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్‌(FASTag) తప్పనిసరని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకొనే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలందించడం దృష్ట్యా ఆగస్టు 15 నుంచి తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఇకపై ఫాస్టాగ్‌ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేస్తూ TTD ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్‌ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలోనే ఫాస్టాగ్‌ సౌకర్యం పొందాక మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది. భక్తులు…

Read More

తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు’ అని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) అన్నారు. హృతిక్‌తో కలిసి ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వార్‌-2’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడారు.25 సంవత్సరాలు క్రితం ‘కహోనా ప్యార్‌ హై’లో హృతిక్‌ డ్యాన్స్‌ చూసి మెస్మరైజ్‌ అయ్యాను. డాన్స్‌ అంటే నాకు మైఖేల్‌ జాక్సన్‌ మాత్రమే. ఇప్పుడు ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్‌ రోషన్‌ ఒకరు. ఇండియాలో గొప్ప డ్యాన్సర్‌ ఎవరంటే హృతిక్‌ రోషన్‌. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఇక్కడ మనకంటే గొప్ప డ్యాన్సర్లు ఉన్నారు. అది మనం అంగీకరించాలి. నేను ఇలాగే ఉంటా.. మీరు అలాగే ఉండండి (అభిమానులను ఉద్దేశించి) ఇది ఎన్టీఆర్‌…

Read More

ఉమ్మడి కడప జిల్లాలోని రెండుచోట్ల జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఆదివారం సాయంత్రానికి ప్రచార సమయం ముగియడంతో అంతా గప్‌చుప్‌గా మారింది. పులివెందుల నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 11 మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి డూ ఆర్ డైగా మారింది. ఇక టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డిలు భుజాన వేసుకున్నారు. వీరికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారథి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు ఆర్.మాధవి, పుత్తా…

Read More

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ (Gottipati Ravikumar) సమీక్ష నిర్వహించారు. ముగ్గురు సీఎండీలు, జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఎల్లో అలెర్ట్‌ దృష్ట్యా అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంత అధికారులతో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని గొట్టిపాటి ఆదేశించారు. ప్రజలకు సమస్యలు లేకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాల వల్ల కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు

Read More

సాధార‌ణంగా చాలా మంది త‌మ‌కు తెలిసిన పండ్ల‌నే త‌ర‌చూ తింటుంటారు. వాటిల్లో సీజ‌న‌ల్ పండ్లు కూడా ఉంటాయి. అయితే తెలియ‌ని పండ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా వాటి గురించి అంత‌గా ప‌ట్టించుకోరు. కానీ అవే అనేక లాభాల‌ను అందిస్తాయి. అలాంటి పండ్ల‌ను తిన‌క‌పోతే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు. అలాంటి పండ్ల‌లో మ‌ల్బెర్రీ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు చాలా చోట్ల ల‌భిస్తున్నాయి. సూప‌ర్ మార్కెట్ల‌తోపాటు బ‌య‌ట పండ్ల దుకాణాల్లోనూ చిన్న చిన్న బాక్సుల్లో ఈ పండ్ల‌ను ఉంచి విక్ర‌యిస్తున్నారు. ఇవి అంత తియ్య‌గా ఉండవు. కానీ రుచిగానే ఉంటాయి. ఈ పండ్లు అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని పోష‌కాల‌కు నిల‌యంగా చెబుతుంటారు. ఈ పండ్ల‌ను తింటే ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌డ‌మే కాకుండా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.నొప్పులు, వాపుల‌కు..మ‌ల్బెర్రీ పండ్ల‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, ఆంథోస‌యనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.…

Read More