Author: apanalysis

అగమ్య గోచరంగా ఉప ఎన్నిక అభ్యర్ధులు అధినేత్రి షర్మిల ప్రచారమే చేయలేదు. ఎన్నికల అవకతవరకలపై సంచలనం రేపిన రాహుల్ ప్రకటనలు వాటిపై స్పందించని ఏపీ కాంగ్రెస్ -అంతర్మధనంలో సీనియర్లు ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి ఏపీ కాంగ్రెస్ అధినేత వైఎస్ షర్మిలా వైఖరి ఇటీవల చర్చనీయాంశంగా మారింది. రెండు ప్రధాన అంశాలపై ఇటీవల అమె స్పందించక పోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అంతర్మధనం ప్రారంభం అయింది. తెలుగుదేశం, వైసీపీ పార్టీలపై సందర్బోచితంగా విరుచుకుపడుతూ వార్తల్లో వ్యక్తిగా, ఒక ప్రధాన పార్టీ అధినేతగా గుర్తింపు పొందుతూ వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఆమె సోదరుడు వైఎస్ జగన్ పట్ల వంద అడుగులు ముందుకు వేసి మరీ విమర్శలు చేశారామె. కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదిని విమర్శించడానికీ వెనుకాడలేదు. ఇంత క్రియాశీలకంగా వ్యవహరించే ఆమె ప్రస్తుత ఉప ఎన్నికలు, రాహుల్ గాంధీ ప్రకటన పట్ల ఉదాశీనంగా ఉండటం కాంగ్రెస్ నాయకులకు కూడా నచ్చడం…

Read More

కడప అందరి చూపు అటువైపే జగన్ కోటలో కూటమి పాగా? ప్రతిష్ట నిలబెట్టుకునే యత్నంలో వైసీపీ, రికార్డు నెలకొల్పే పనిలో టీడీపీ రసవత్తరంగా పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక ఎం. గణేశ్, ఎపీ ఎనాలిసిస్ రాష్ట్రంలో ఇప్పుడు పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసే ప్రయత్నంలో టీడీపీ ఉంటే, ప్రతిష్టను నిలబెట్టుకునేందుకు వైసిపీ అడుగులు వేస్తోంది. ఆగస్టు 12వ తేదీన పులివెందుల జెడ్‌పీటీసీ ఉప ఎన్నిక జరగనున్నది. కేవలం ఒక జెడ్‌పీటీసీ స్థానానికే ఎన్నిక అయినా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటె ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. పులివెందుల జగన్‌ సొంత నియోజకవర్గమే కాదు. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి బలమైన కోట. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ వైఎస్‌ కుటుంబానిదే గెలుపు. అక్కడ మరో పార్టీ వేలు పెట్టే అవకాశం కూడా ఎప్పుడూ లభించలేదు. పులివెందులలో టీడీపీ…

Read More

రక్షాబంధన్‌.. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు,రక్షణకూ ప్రతీక! అన్నాచెల్లెళ్లు – అక్కాత మ్ముళ్ల మధ్య అనురాగాలు- అనుబంధాలను పెంచే పండుగ! కుటుంబం మొత్తం.. సంతోషాల సాగరంలో ఓలలాడే వేడుక! కానీ, ఇదే పండుగ.. మరో కోణంలో ప్రకృతిని కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ప్లాస్టిక్‌ రాఖీల వాడకంతో.. భూమాత కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నది. దీన్ని నివారించాలంటే.. ‘ఎకో-ఫ్రెండ్లీ రాఖీ’లతో సోదరులతో పాటు ప్రకృతికీ రక్షణగా నిలవాల్సిన అవసరం ఉన్నది.గతంలో పూర్తిగా సాంప్రదాయ రాఖీలనే కట్టేవారు. వీటిని సహజమైన పత్తి నూలు దారాలతో తయారుచేసేవారు. చందనం, కుంకుమపువ్వు, పసుపుతో చేసిన రంగులనే ఉపయోగించేవారు. కాబట్టి ఇవి చాలా మృదువుగా, సురక్షితంగా ఉండేవి. వీటిని ఎన్ని రోజులు ధరించినా ఎలాంటి హానీ కలిగేది కాదు. పైగా.. చందనం, కుంకుమ పువ్వు, పసుపులో యాంటి బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలోనూ విరివిగా ఉపయోగించే ఈ పదార్థాలు.. రాఖీ కట్టుకున్న వ్యక్తికి రక్షణగా నిలిచేవి. కానీ, ప్రస్తుతం సింథటిక్‌ రంగులు,…

Read More

భారతదేశం అంటేనే ఎన్నో పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. ఆకట్టుకునే అద్భుత శిల్పకళా సౌందర్యం.. కట్టిపడేసే కట్టడాలను చూడడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు. వందల ఏళ్లనాటి ప్రాచీన ఆలయాల పరిరక్షణ, మరమ్మతుల బాధ్యతలను భారతీయ పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) చేపడుతోంది. ఆ శాఖ పరిధిలో లేని ఆలయాలు, కట్టడాలు కూడా మరెన్నో ఉన్నాయి. అవి ఎక్కడైనా పాడైతే వాటిని నిర్వహిస్తున్న సంస్థలు అవగాహన లేమితో సిమెంట్, కాంక్రీటు వంటి వాటిని ఉపయోగించి మరమ్మతులు చేయిస్తుండడంతో వాటి నాణ్యత దెబ్బతింటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పుణెకు చెందిన ‘శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్‌ ట్రస్ట్‌’ మన రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలకు ప్రాచీన పద్ధతిలో మరమ్మతులు చేపట్టి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ ట్రస్ట్‌ ఛైర్మన్‌ పి.వెంకటేశ్వరరావు తెలుగువారు కావడంతో మన రాష్ట్రంలోని ఆలయాల పునరుద్ధరణకు సొంత నిధులను వెచ్చిస్తున్నారు. పురావస్తుశాఖలో 38 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించి కట్టడాల…

Read More

అఖండ 2: తాండవం’తో దసరా బరిలో సందడి చేయనున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఎం తేజస్విని సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణానంతర పనుల్ని చకచకా పూర్తి చేసే పనిలో పడింది చిత్రబృందం. దీనిలో భాగంగా బాలకృష్ణ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. సీజీ వర్క్, రీ రికార్డింగ్‌తో పాటు మిగతా సాంకేతిక పనులన్నీ నెలాఖరు కల్లా పూర్తవుతాయని వెల్లడించాయి. ఇప్పటికే చెప్పిన తేదీకే సినిమా విడుదల కానున్నట్లు మరోసారి స్పష్టత ఇచ్చింది చిత్రబృందం. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలయ్య రెండు పాత్రల్లో అలరించనున్నారు. ఈ…

Read More

అదేపనిగా ఓటీటీలు చూడడం ప్రాణాల మీదకు తెస్తోంది. బెంగళూరులో గాంధార్‌ (14) అనే బాలుడి ఆత్మహత్యకు జపనీస్‌ వెబ్‌ సిరీస్‌ కారణమని పోలీసులు తేల్చడంతో దిగ్భ్రాంతి చెందడం తల్లిదండ్రుల వంతైంది. సోమవారం రాత్రి భోజనం చేసి, తమ పెంపుడుకుక్క రాకీతో కాసేపు ఆడుకున్న గాంధార్‌ తన గదికి వెళ్లాడు. ‘మీరు నన్ను 14 ఏళ్లు చక్కగా పెంచారు. మీతో కలిసి ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లే సమయం ఆసన్నమైంది. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా’ అని ఆత్మహత్య లేఖ రాశాడు. బాగా చదువుతూ, బడిలోనూ ఎవరితో గొడవలు లేని బాలుడు.. ఇలా రాయడం పోలీసులను ఆశ్చర్యపరచింది. తాను చూసిన సిరీస్‌లోని ఒక పాత్రధారి బొమ్మను గాంధార్‌ తన గదిలో గోడపై గీశాడు. సిరీస్‌లో ఒక మాయాపుస్తకంలో హీరో పాత్రధారి.. చెడ్డవాళ్లు చనిపోవాలని వాళ్ల పేరు రాస్తే.. అలాగే జరుగుతుంది. నిత్యం ఆ సిరీస్‌…

Read More

అమెరికా అధ్యక్షుడు డ్రొనాల్ట్‌ ట్రంప్‌ సుంకాల దెబ్బకు ఆక్వా రంగం విలవిల్లాడుతోంది. ఆక్వా రైతులను పిడుగుపాటుకు గురిచేస్తోంది. ఎగుమతులు నిలిచిపోవటంతో ధరలు రోజురోజుకు పతనమైపోతున్నాయి. చేతికొచ్చిన పంటను నిల్వ చేయలేని స్థితి. తక్కువ ధరకు అమ్ముకుంటే పడిన కష్టానికి ప్రతిఫలం కూడా రాని తీరు తాజాగా నెలకొంది. జిల్లాలో మంచినీటి ఆక్వా సాగు 78146.57 ఎకరాల్లో, ఉప్పునీటి సాగు 25,023.26 ఎకరాల్లో ఉంది. మొత్తం 1,03,169.83 ఎకరాల్లో సాగు అవుతోంది. అమెరికా సుంకాల పెంపుతో రొయ్యల ధరలు గత కొన్ని రోజులుగా పతనమవుతూ వస్తున్నాయి. దీనికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందోనన్న అయోమయం నెలకొంది. పంట చేతికొచ్చే దశలో ఊహించని ఉత్పాతంలా సుంకాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. అమెరికాకు రొయ్యలు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్‌ ఏ నిర్ణయం తీసుకున్నా భారత్‌పై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ పరిస్థితిని వ్యాపారులు తమకు కలిసొచ్చే కాలంగా మార్చుకుని…

Read More

.లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాంషర్మిలా హెచ్చరిక ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫై ఉన్న కోపాన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద చూపిస్తుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప సేవలు చేశారని, పార్టీల రహితంగా ఆయన్ను అందరూ అభిమానించారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఇందుకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటుందని శుక్రవారం మీడియాకు వివరించారు. వైఎస్ ఆర్ విగ్రహాల మీద ఆ కోపాన్ని చూపిస్తుందని చెప్పారు. నందిగామ గాంధీ సెంటర్ లో మహానేత విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ…

Read More

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానెల్లూరు, బాపట్ల, కర్నూలు లోని ప్రయోగశాలలకు నేషనల్ ఆక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ సంస్థ గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు తెలిపారు. బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, నెల్లూరులోని జీవ, సేంద్రీయ ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాల, కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంధ్రాలకు ఈ గుర్తింపు లభించిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రయోగశాలలు తమ సాంకేతిక నైపుణ్యం,గ్లోబల్ ప్రమాణాలతో నాణ్యత పరీక్షల రంగములో సామర్థ్యం మరియు ప్రమాణాలు నిరూపించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించాయని తెలిపారు. దీని ద్వారా వ్యవసాయ వనరుల నాణ్యతపై రైతులకు నమ్మకం మరింత బలపడుతుంది అని , ఇది వ్యవసాయ ఉత్పాదకతలో నాణ్యతా ప్రమాణాలను స్థిరపరిచే దిశగా కీలక…

Read More

‘నేతన్న భరోసా’ పథకం కింద చేనేతలకు ఏటా రూ.25 వేలు ఆర్థికసాయం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి ఏడాదికి రూ.193 కోట్లు వ్యయమవుతుందని వివరించారు. చేనేత వస్త్రాలపై చెల్లించాల్సిన 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందని.. ఇందుకోసం రూ.15 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిలిపేసిన త్రిఫ్ట్‌ ఫండ్‌ను అమల్లోకి తెస్తూ 5,386 మందికి రూ.5 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. చేనేతల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ‘చరిత్రలో ఎన్నడూ చూడని సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. అభివృద్ధిని పట్టాలెక్కించి, సంక్షేమానికి రాజమార్గం వేశాం. రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం…

Read More