గుంటూరు నగరంలో గురువారం రాత్రి దొంగనోట్ల కలకలం రేగింది. సేకరించిన సమాచారం, పోలీసులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. రత్నగిరికాలనీలోని ఓ అపార్ట్‌మెంట్లో గోపిరెడ్డి, జ్యోతి నివాసం ఉంటున్నారు. ఇద్దరు పట్టాభిపురం ప్రధాన రహదారిలో తోపుడు బండిపై వద్దకు వెళ్లి రూ.100కు శనక్కాయలు కొనుగోలు చేశారు. రూ.500 నోటు తీసి చిరు వ్యాపారికి ఇచ్చారు. ఆయన రూ.400 ఛేంజ్ ఇచ్చాడు. తర్వాత అక్కడే ఉన్న బెంగుళూరు అయ్యంగారి బేకరీకి వెళ్లి కూల్‌డ్రింక్ తీసుకుని మరో రూ.500 నోటు ఇచ్చారు. అక్కడ వ్యాపారి మిగతా నగదు ఇచ్చారు. నోటు పల్చగా ఉండడంతో సదరు వ్యాపారికి అనుమానం వచ్చి కేకలు వేయడంతో వెనక్కి వచ్చి వారిచ్చిన రూ.500 నోటు తీసుకుని అంతకుముందు మార్చగా వచ్చిన రూ.100 ఇచ్చి హడావుడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో జనం గుమిగూడి అక్కడి నుంచి గోపిరెడ్డి, జ్యోతిని ముందుకు కదలనివ్వకుండా నిలదీశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడకు చేరుకుని…
Author: apanalysis
భారతీయులకే నష్టం ఎం. గణేశ్, ఏపీ ఎనాలిసిస్ మన బలం అంచనా వేసుకుని బలవంతునితో యుద్దానికి దిగాలి. ప్రపంచానికే పెద్దన్నగా మసులుతున్న అమెరికాతో ఘర్షణకు దిగితే ఎలా ఉంటుంది ? ముందు వెనుకా ఆలోచన చేయాలి కదా. ప్రధాని మోది ఈ తరహా ఆలోచన చేయలేదంటున్నారు. మనం బలవంతులమే…కానీ అమెరికాను ఢీ కొట్టగల బలవంతులం కాదు అంటున్నారు. చాలా దేశాలు మనకు మద్దతు ఇవ్వవచ్చు. దాని వల్ల మనకు ప్రయోజనం లేకపోగా ట్రంప్ లాంటి గడుగ్గాయికి మరింత కోపం పెంచవచ్చు. మనకు నష్టం కలిగించే మరి కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి ఇది దోహదపడవచ్చు. ఇప్పటికి 50 శాతానికి పెరిగిన సుంకాలు ఇంకా పెరగవచ్చు అంటున్నారు. మరి అప్పుడు ఏం చేయాలి. అది ప్రధాని మోది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు అమెరికాలోని భారతీయుల స్ధితిగతులపై ఆలోచన చేయాలి. వారు పంపుతున్న డబ్బు కారణంగా ఇక్కడ పెరిగిన ఆర్ధిక…
ప్రొటీన్ అనగానే అది కండను వృద్ధి చేస్తుందనే విషయమే గుర్తుకొస్తుంది. నిజానికి ప్రొటీన్ ప్రయోజనాల్లో ఇదొక మచ్చుతునక మాత్రమే. కండ కేవలం బలానికి, సౌందర్యానికి సంబంధించిందే కాదు. జీవక్రియ ఉత్తేజిత కణజాలంగానూ మనల్ని కాపాడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా తీసుకునేవారిలో.. ముఖ్యంగా వృద్ధుల్లో మరణాల రేటు తక్కువగా ఉంటున్నట్టు గత సంవత్సరం జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఎనిమిది వేలకు పైగా మందిని పదేళ్లకు పైగా పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. ప్రొటీన్ మనకు కల్పించే రక్షణకు మూలం అమైనో ఆమ్లాలు. ముఖ్యంగా ల్యూసీన్ అనే అమైనో ఆమ్లం కండర ప్రొటీన్ సంశ్లేషణ ప్రక్రియకు తోడ్పడే ఎంటార్ మార్గాన్ని ప్రేరేపిస్తుంది. రోజువారీ పనుల్లో భాగంగా కండర ప్రొటీన్లు సైతం విచ్ఛిన్నమవుతుంటాయి. వీటిని శరీరం ఎప్పటి కప్పుడు తొలగించుకుంటుంది. అందువల్ల ఇవి తగ్గకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. మనం ప్రొటీన్‌ను తిన్నప్పుడు వాటిల్లోని అమైనో ఆమ్లాలను శరీరం సంగ్రహించుకుంటుంది. వీటిని ఎముకలకు…
తప్పిపోయిన ఓ యువతి గురించి వెతుకుతున్న కుటుంబానికి అనుకోనివిధంగా వింత అనుభవం ఎదురైంది. ఇంటినుంచి వెళ్లిపోయిన ఆ యువతి తన సోదరి వరసైన మరో యువతిని వివాహం చేసుకొని.. ఇకపై తాము భార్యాభర్తలుగా జీవించాలనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబసభ్యులు కంగుతిన్నారు. అసలేమయ్యిందంటే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్‌కు చెందిన యువతి ఇటీవల వారి ఇంటినుంచి తప్పిపోయింది. ఆమెను ఎవరైనా విక్రయించి ఉంటారనే అనుమానంతో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ గుర్తించిన పోలీసులు భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఇటీవల పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే వరుసకు చెల్లి అయ్యే మరో అమ్మాయితో పెళ్లి దుస్తుల్లో ఆ యువతి పోలీసుస్టేషన్‌కు తిరిగొచ్చింది. తాము వివాహం చేసుకున్నామని.. ఇకపై భార్యాభర్తలుగా (Husband-Wife) కలిసి జీవించాలని వారు పేర్కొనడంతో పోలీసులు, కుటుంబసభ్యులు కంగుతిన్నారు. తాను వరుడిగా మారి తన చెల్లెల్లిని వివాహం చేసుకున్నట్లు సదరు యువతి పోలీసులకు చెప్పింది. ఏడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఏపీ లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో.. రాబోయే రెండు వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాల అలెర్ట్ జారీ అయింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వారం రోజులుగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళా ఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే…
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పున్నమి తోట తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణలో మహిళలకు కిట్ల పంపిణీ జరిగింది. ఇందులో గాజులు, కంకణాలు, పసుపు, కుంకుమ, ప్రసాదములు ఉన్నాయి. ఆలయ ఇన్సె పెక్టర్ లలిత ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ, శశికిరణ్ ఆనంద్ పాల్గొన్నారు. —
కుంకి ఏనుగులు విధుల్లోకెఫ్పుడు.. రెండు నెలల నుంచి కొనసాగుతున్న తర్ఫీదు. ప్రభుత్వ చర్యల పట్ల అటవీ పరిసర ప్రాంతాల నుంచి నిరసన ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. కుంకి ఏనుగులు ఎప్పుడు విధుల్లోకి దిగుతాయి. తమ ఆస్తి, ప్రాణాలను ఎప్పుడు కాపాడతాయని చిత్తూరు, ఒడిస్సా సరిహద్దుల్లోని శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల ప్రజలు అడుతున్నారు. ఏనుగుల మంద గ్రామాలపై పడి ఆస్తులను ద్వంసం చేయడమే కాకుండా ఒకరి ఫ్రాణాన్ని కూడా బలి తీసుకున్నాయి. ఇటీవలనే కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగుల పనితీరుపై ప్రజల నుంచి ప్రశ్నల వస్తున్నాయి. అడవి ఏనుగుల్ని మళ్లీ అడవిలోకి తరిమికొట్టాడానికి కర్నాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన రెండుసార్లు కర్నాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. గత మే నెలలో ఆయన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు ఏనుగుల్ని ఎంతో వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన ఏనుగుల్ని ఏపీకి…
వెల్లివిరుస్తన్న ఆధ్యాత్మిక శోభ -నమో వెంకటేశాయ మంత్రోచ్చరణతో తరిస్తున్న భక్తజన సందోహం వేద పండితుల ఉపన్యాసాలు, హితోక్తులకు మంత్ర ముగ్ధులౌతున్న భక్తులు ప్రశాంత వాతావరణంలో వైదిక కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ఏర్పాటుకు భక్తుల వినతి ఎం.గణేశ్, ఏపీ ఎనాలిసిస్ తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో స్ధానిక పున్నమ్మతోట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైదిక కార్యక్రమాలు అత్యంత వైభవం జరుగుతున్నాయి. అష్టబంధన మహా సంప్రోక్ష్లణ కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం 9 గంటల నుంచి అష్ట బంధన ద్రవ్యారాధనము, మహాశాంతి హోమములు, ఉష్టబంధనములు మద్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు దాతల సహకారంతో భోజన సౌకర్యాన్ని ఆలయ కమిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి విశేష మహాశాంతి తిరుమంజనము, ధాన్యాధివానము, సర్వదైవత్య హోమము, దోష ప్రాయశ్చిత హోమములు…
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు అత్యంత భద్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండోరోజు సోమవారం ఆయన ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం తరఫున నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనికి సింగపూర్ కంపెనీలతోపాటు ఏపీ నుంచి కూడా పెద్దఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక, పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలు. స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలపై ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ కోసం 2014లో సింగపూర్ వచ్చానని.. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఇచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో ఏపీతో సింగపూర్ ప్రభుత్వ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…
బయటకువెళ్లి వేచి చూసే పని లేకపోవడం, ఊరించే ఆఫర్లు.. ఇవన్నీ కలిసి ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది (Online Shopping in India). అయితే అమెరికా, చైనాతో పోల్చుకుంటే ఈ విషయంలో భారత్ నాలుగు అడుగులు వెనకే ఉంది. భారత్‌లో 850 మిలియన్ల (85 కోట్లు) మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నప్పటికీ వారిలో 20-25 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకెన్సీ వెల్లడించింది. రానున్న రోజుల్లో భారత ఈ కామర్స్ రంగం గణనీయమైన వృద్ధి సాధించడానికి అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా, చైనాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో 85 శాతం మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారని పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించింది (Ecommerce In India). భారతీయులు ఈతరహా షాపింగ్ వైపు మొగ్గుచూపడమే గాకుండా కొత్త ఆలోచనలతో ఈ కామర్స్…