Author: apanalysis

ప్రజా సమస్యలపై వైసీపీ కార్యాచరణ ఈ నెల 29న పీఏసీ సమావేశం ఏపీ ఎనాలిసిస్, విజయవాడ. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా రైతులు ప్రస్తుతం ఎరువుల కొరతతో సమస్యతో సతమత మౌతున్నారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఫించన్లలో విధించిన కోత కారణంగా ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వీటిని ఆలంబనగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి వైఎస్పార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని, అందుకు అనువుగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అదే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింతగా దిగజారిందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ.. ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను, పన్నేతర ఆదాయాలు భారీగా…

Read More

క‌రివేపాకులను మ‌నం నిత్యం ప‌లు ర‌కాల వంట‌ల్లో వేస్తుంటాం. వంట‌కాల్లో వ‌చ్చే క‌రివేపాకుల‌ను దాదాపుగా చాలా మంది తిన‌రు. ప‌డేస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం చూస్తే క‌రివేపాకు అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌రివేపాకును తిన‌డం వల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దీని రుచి కార‌ణంగా చాలా మంది దీన్ని తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇది అందించే ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే మాత్రం ఈ ఆకుల‌ను తిన‌కుండా విడిచిపెట్ట‌లేరు. క‌రివేపాకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ అన్నంలో మొద‌టి ముద్ద‌గా తిన‌వ‌చ్చు. లేదా క‌రివేపాకుల ర‌సాన్ని రోజూ నీటిలో క‌లిపి తాగ‌వ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే గుప్పెడు క‌రివేపాకులను నేరుగా అలాగే న‌మిలి తిన‌వ‌చ్చు. ఇలా క‌రివేపాకుల‌ను ఏ ర‌కంగా తీసుకున్నా కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.గ్యాస్ నుంచి విముక్తి..క‌రివేపాకుల్లో ఆల్క‌లాయిడ్స్‌, మ‌హానింబిన్‌, ముర్రాయ‌నోల్‌, గ్లైకోసైడ్స్‌, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు త‌దిత‌ర శ‌క్తివంత‌మైన యాంటీ…

Read More

‘మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఈ నెల 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50 (జీఎస్టీ అదనం) (Kannappa Ticket Rates Hike in AP) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఇది విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు. దాదాపు పదేళ్లుగా ఆయన దీని కోసం వర్క్‌ చేశారు. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన టైటిల్‌ పాత్ర పోషించగా.. రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు. అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పేర్కొంది. భారత రాజ్యాంగంలోని వాక్‌…

Read More

ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) ఖాతాదారుల కోసం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ సరికొత్త సేవలను ప్రకటించింది. 12 దేశాల నుంచి అంతర్జాతీయ మొబైల్‌ నంబరుతోనూ ఉచితంగా యూపీఐ చెల్లింపులు చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, హాంకాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), అమెరికా నంబర్లకూ ఈ సేవ అందుబాటులో ఉండనుంది. ఈ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలు భారతీయ సిమ్‌కార్డు అవసరం లేకుండానే, అక్కడి తమ మొబైల్‌ నంబరును ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ ఖాతాలకు అనుసంధానం చేసి, యూపీఐ లావాదేవీలు చేయొచ్చు. ఈ యూపీఐ చెల్లింపులపై లావాదేవీ రుసుములు, విదేశీ మారకపు ఛార్జీలు ఉండవని బ్యాంకు వెల్లడించింది. క్యూఆర్‌ కోడ్‌లు, యూపీఐ ఐడీలు, మొబైల్‌ నంబర్ల ద్వారా తక్షణమే డబ్బు బదిలీ, బిల్లు చెల్లింపు, వ్యక్తులకు డబ్బు పంపడం లాంటి సేవలు లభిస్తాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఖాతాలను గూగుల్‌ పే,…

Read More

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. (Andhra Pradesh News) కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (సాస్కి) కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు, 127 ఏళ్ల చరిత్ర ఉన్న హేవలాక్‌ వంతెన రూపురేఖలు మార్చడంతో పాటు గోదావరి మధ్యలో 116.97 ఎకరాల్లో బ్రిడ్జిలంక (హేవలాక్‌ వంతెన, రోడ్‌కం రైల్వే…

Read More

విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ (Cognizant) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. విశాఖలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.నూతన క్యాంపస్‌తో సుమారు 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కాగ్నిజెంట్‌ తెలిపింది. ఏఐ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ రంగంలో ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది. కంపెనీ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Read More

అధిక రక్తపోటును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే తగినంత నీరు తాగటం అలవాటు చేసుకోండి. రక్తంలో సోడియం మోతాదులు నార్మల్‌లో గరిష్ఠ స్థాయికి దగ్గరలో ఉండటానికీ అధిక రక్తపోటు, గుండె వైఫల్యం ముప్పులు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇజ్రాయెల్‌లోని బార్‌-ఇలాన్‌ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. పరిశోధకులు నాలుగు లక్షలకు పైగా మంది ఆరోగ్య వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. తగినంత నీరు తాగితే సహజంగానే సోడియం సాంద్రత తగ్గుతుంది. దీన్ని చిన్న విషయంగా భావించటం తగదని, ఇది దీర్ఘకాల గుండెజబ్బుల నివారణకు సమర్థమైన మార్గమని చెబుతున్నారు. రక్తంలో సోడియం మోతాదులు 135-146 ఎంఎంఓఎల్‌/ఎల్‌ ఉండటం నార్మల్‌గా భావిస్తారు. ఇవి పైస్థాయికి చేరుకోకముందే ముప్పులు పెరుగుతుండటం గమనించదగ్గ విషయం. సోడియం మోతాదులు 140 నుంచి 146 ఎంఎంఓఎల్‌/ఎల్‌ ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండె వైఫల్యం తలెత్తే అవకాశం పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వయసు, లింగ భేదం, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, పొగ తాగే…

Read More

ఈ డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ మన జీవితంలో ఒక అంతర్భాగమైంది. ఆన్‌లైన్‌ షాపింగ్, బ్యాంకింగ్, సామాజిక వేదికలు.. ఇలా సమస్తం ఒక్క క్లిక్‌తో సాధ్యమవుతోంది. ఈ సౌలభ్యం మాటునే సైబర్‌ మోసాలు, సమాచార తస్కరణ వంటి ప్రమాదాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. ఒక పథకంలో మదుపు చేస్తే రూ.లక్షల్లోనే రాబడి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతునట్లుగా ఒక వీడియో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ, డీప్‌ఫేక్‌లాంటి సాంకేతికతలతో తయారైన ఆ వీడియో మోసపూరితం. దీన్ని నమ్మి ఎంతో మంది తమ కష్టార్జితాన్ని కోల్పోయిన వార్తలూ వింటున్నాం. సామాజిక వేదికల్లో వచ్చే వాటిలో ఏదో ఒకటి తప్ప నిజాలు ఉండవన్నది ఎన్నో సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంటుంది. ఇలాంటి పథకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది కదా అనే ఒక సందేహం వస్తే చాలు. మోసాల బారిన పడకుండా కాపాడుకోగలం.ఈ మోసాల నుంచి…

Read More

‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పార్ట్‌ 1 కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాని జులై 24న (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది.పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటం తదితర కారణాలతో ఈ మూవీ షూటింగ్‌ వాయిదా ఆలస్యమవుతూ వచ్చింది. క్రిష్‌ కొంతభాగం తెరకెక్కించిన తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్‌ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా పవన్‌ రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలుపెట్టి ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేయడం విశేషం. కొన్నాళ్ల పాటు…

Read More

విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) సందడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది ఔత్సాహికులు తరలివచ్చారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Read More