Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » Gold
ప్రత్యేకం

Gold

apanalysisBy apanalysisApril 24, 2025Updated:April 25, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఖనిజ సంపద అణ్యేషణ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు

బంగారం, వజ్రాలతో పాటు మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాల కోసం ప్రయత్నం.

దశ తిరగనున్న శ్రీ సత్యసాయి, అనంతపురం, విజయనగరం, కడప జిల్లాలు

జూన్ 6 వరకు బిడ్లు స్వీకరణ

ఏపీ ఎనాలిసిస్, స్టేట్ బ్యూరో.

సమీప భవిష్యత్ లో శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, విజయనగర జిల్లాల్లోని పరిస్ధితులు అనూహ్యంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ అత్యంత విలువైన ఖనిజ సంపద ఉందని వివిధ పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇందులో ప్రధానంగా బంగారం, వజ్రాలతో పాటు మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం వాటి అన్వేషణ కు పెద్ద ప్రయత్నమే మొదలు పెట్టింది.  ప్రవేట్ సంస్ధలకు ఈ అన్వేషణ టెండర్లలో పాల్గొనేందుకు జూన్ 6 వరకు గడువు కాలాన్ని నిర్ణయించింది. అదే విధంగా ఖనిజ సంపదను గుర్తించినవారికే లీజులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే ఆ జిల్లాల పంట పండినట్టే.

కేంద్ర గనుల శాఖ ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. మొత్తం ఏడు బ్లాకులకు టెండర్లు పిలిచింది.. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ముందు నిక్షేపాలను గుర్తించి, ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికి సమర్పించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు ఖనిజ సంపదను గుర్తించి నివేదిక సమర్పిస్తే లీజులు కూడా మంజూరవుతాయి.విజయనగరం జిల్లాలోని శివన్నదొరవలసలో 420 హెక్టార్లు, పెద్దలింగవలసలో 472 హెక్టార్లలో మాంగనీస్ కోసం తవ్వకాలు జరిపి గుర్తించాల్సి ఉంది. మిగిలిన మూడు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోనివి. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలో నార్త్, సౌత్ బ్లాక్స్ లో బంగారు నిక్షేపాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం 1000 హెక్టార్ల స్థలాన్ని కేటాయించి కాంపౌండింగ్ లైసెన్స్ మంజూరు చేయనున్నారు. ఇక అనంతపురం జిల్లా పెన్నా అహోబిలం వద్ద జడల్ వజ్రాల అణ్వేషణ కోసం 100 హెక్టార్లలో తవ్వకాలు జరప జరపనున్నారు.

—

Post Views: 30
అనంతపురం వజ్రాలతో పాటు మాంగనీస్ విజయనగరం
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రాజెక్టు ఒకటే… పేరు మారుతూనే ఉంటుంది!

December 29, 2025

రీల్ హీరో కాదు…రియల్ హీరో.

October 30, 2025

పిల్లిమొగ్గల రియల్

October 25, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.