Author: apanalysis

రాగులు, సజ్జలు లాంటి తృణధాన్యాలే ఓట్స్ కూడా. వీటిని తెలుగులో యవలు అని పిలుస్తారు. ఓట్స్ ద్వారా పీచుపదార్థం సమృద్ధిగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర శాతం అదుపులో ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాల బాగా ఉపయోగపడుతుంది. అన్ని వయసుల వాళ్లూ దీన్ని అల్పహారం రూపంలో తీసుకోవచ్చు. ఓట్స్తో జావ లాంటివి చేసుకోని తినవచ్చు, లేదంటే దోశ, చపాతీ, ఇడ్లీ, ఉప్మాలలో చేర్చుకోవచ్చు. ఓట్స్లో సెలినియం అనే ఖనిజ లవణం ఎక్కువగా లభిస్తుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణలు అదుపులో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ని నివారించడంలో ఓట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలకు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. వంద గ్రాముల ఓట్స్ ద్వారా 389 క్యాలరీలు, 11 గ్రాముల ఫైబర్, 17 గ్రాముల ప్రొటన్లు, 7 గ్రాముల ఫ్యాట్…

Read More

వానాకాలంలో ఎంత జాగ్రత్త పడినా తడవడం మాత్రం తప్పదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు తరచూ వేదిస్తుంటాయి. వీటిని నివారించడానికి మనం తీనే ఆహర పదార్ధల విషయంలో కోన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అవేంటంటే అనారోగ్యాలను తగ్గించడానికి ఆహార నియమాలు తప్పకుండా ఉపయోగపడతాయి. వానకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం పరిశభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల భారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుచేత ఈ సమయంలో బయటకు వెళ్లిన ప్రతి సారి సబ్బుతో చేతులు శుభ్ర పరుచు కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా జాగ్రత్త పడొచ్చు. జలుబుతో బాధ పడుతున్న వారితో కలిసి పానీయాలు, లిప్ స్టిక్ లు, ఇతర వస్తువులు పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో చేతులను శభ్ర పరుచుకుంటే క్రిములు నశిస్తాయి. ఇవి కాకుండా.. …

Read More

వయసుకు తగినట్లు శారీరక మార్పులు జరిగితేనే ఆనందమే. రుతుచక్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలు అవ్వవలసిన రుతుక్రమం పదేళ్లలోపే వస్తే? దానిని ఒక సమస్యగానే భావించాలంటున్నారు నిపుణులు. సరైన అవగాహన పెంచుకుని, ఇతరత్రా ఇబ్బందులు తలత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అమ్మాయిలు బాల్యం నుంచి యౌవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు చోటుచేసుకోవడం సహజం. ఎముకలు, కండరాల ఎదుగుదలతో పాటు, సంతానోత్పత్తికి అనువుగా మరికొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. వీటితో పాటే అమ్మాయిలకు రుతుచక్రం కూడా సాధారణంగా వచ్చే మార్పే. ఇది పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు మొదలవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో పదేళ్ల వయసుకి ముందే నెలసరి మొదలవడం ఎక్కువవుతోంది. మూడు నాలుగేళ్ల ముందుగానే ఇలా జరగడానికి కారణాలివీ అని స్పష్టంగా చెప్పలేం. ఆడపిల్ల రజస్వల అవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు అసలు భాల్యం నుంచి యౌవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో శారీరకంగా…

Read More

కొన్ని సందర్భాల్లో శరీరానికి పడని ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు.. ఫలితంగా పోట్ట ఉబ్బడం, అసౌకర్యంగా అనిపించడం, చెమట పట్టడం, ఆయాసం.. మొదలైన సమస్యలు ఎదురవుతాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదమూ వుంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సమయానికి డాక్టర్, మందులు అందుబాటులో లేకపోతే.. మరేం భయం లేదు.. ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఈ వంటింటి చిట్కాలు పాటించి చూడండి… అరటిపండులో ఉండే పెక్టిస్ వల్ల ఆహారం త్వరగా జీర్ణమవడం, జీర్ణవ్యవస్థలో ఏమైన లోపాలుంటే తొలగిపోవడం.. వంటివి జరుగుతాయి. అలాగే విరేచనాల సమస్యను తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది. ఇది శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, వాంతులయ్యేల ఉండడం, విరేచనాలు.. మొదలైన సమస్యలన్నింటికీ దివ్య ఔషధం అల్లం టీ. ఇది తాగితే…

Read More

యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరస్ శరీరంలో బీపీని అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ శరీరంలో క్యాన్సర్ కణలున్న్లయితే వాటిని నాశనం చేస్తుందని కూడా ఓ పరిశోధనలో వెల్లడైంది. భోజనం చేసిన తర్వాత ఒక యాలక్కాయ తింటే, కేవలం నోటి దుర్వాసన దూరమవడమే కాదు.. అజీర్తి, గ్యాస్, గుండెలో మంట, మలబద్ధకం.. వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎ, బి, సి, నియాసిస్, రైబోఫ్లేవిస్ విటమిన్లు, మినరల్స్.. యాలకుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో తోడ్పడతాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేయడం, మూత్రపిండాల్లో అధికంగా ఉండే యూరియా, క్యాల్షియం.. మొదలైన వాటిని తొలగించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే యాలక్కాయ గింజల్ని చప్పరించడం ద్వారా మన నోట్లో కొన్ని రకాల ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నావారిలో ఆకలిని పెంచేందుకు ఈ ద్రవాలు తోడ్పడతాయి. దగ్గు, జలుబు లాంటి…

Read More

శరీరంలో హెమోగ్లోబిస్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రతి నెల నెలసరి సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరంలో రక్తకణాలు పెంచుకోవాలసిన ఆవశ్యకత ఎంతయిన ఉంది. మరి దీనికోసం ఏం చేయాలాంటే… ఎనీమియాతో బాధపడుతున్న వారు ఆకుపచ్చగా, తాజాగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఎందుకంటే వీటిలో ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. శరీరంలో హెమోగ్లోబిస్ శాతం కూడా ఎక్కువవుతుంది. అలాగే యాపిల్, ద్రాక్ష, పుచ్చకాయ, ఎండు ద్రాక్ష.. మొదలైన పండ్లు తినడం వల్ల హెమోగ్లోబిస్ పెరుగుతుంది. బీట్ రూట్, క్యారట్ మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో ఐరస్ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో రక్త కణాలను పెంచుతుంది. …

Read More

జీవక్రియలు సక్రమంగా జరగాలంటే శరీరానికి విటమిన్లు తగినంత అందాలి. ఈ విటమిన్లు పోషకాహారం తీసుకున్నప్పుడు, పండ్లు తిన్నప్పుడు తగినన్ని లభిస్తాయి. అయితే కొందరు సంప్రదాయ మార్గంలో కాకుండా మాత్రల రూపంలో విటమిన్లు తీసుకుంటుంటారు. కానీ దానివల్ల ఇతర సమస్యలు రావచ్చు. జబ్బు పడినప్పుడు విటమిన్ మాత్రలు తీసుకోవడంలో తప్పులేదు కానీ, అవసరం లేకపోయినా వేసుకుంటే ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వైద్యులు. విటమిన్ మాత్రలు వేసుకుంటే మంచిదేగా అని రోజూ వేసుకుంటే మొదటికే మోసం జరిగే అవకాశం ఉంది. విటమిన్లు ప్రతీ ఒక్కరికీ అవసరమే. అయితే తక్కువ మోతాదులో అన్ని రకాల విటమిన్లు శరీరానికి అవసరమవుతాయి. జీవక్రియలు జరగడానికి, కణాలన్నీ పనిచేయడానికి విటమిన్లు అవసరమవుతుంటాయి. ఇంతటి ప్రాధానత్య ఉన్న విటమిన్లు శరీరంలో తయారు కావు. ఆహారంతోనే శరీరానికి అందాలి. విటమిన్ డి ఒక్కటే శరీరంలో తయారవుతుంది. విటమిన్లలో రెండు రకాలుంటాయి. ఒకటి కొవ్వులో కరిగేవి, రెండవది నీటిలో కరిగేవి.…

Read More

రాత్రి నిద్ర పోవడం ఆలస్యం. ఉదయం లేవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో… టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటు ఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే చాలమందిలో విటమిన్-డి కొరత ఏర్పడుతోంది అంటున్నాయి తాజా అధ్యయనాలు. జనాభాలోని 84 శాతం మందిలో విటమిన్- డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయకోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచుగా శరీరంలో విటమిన్- డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్-డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతి రోజూ కొంత విటమిన్-డిని శరీరానికి అందించండి.

Read More

ఎప్పుడూ టొమాటోలేనా? అని విసుక్కోకండి. ఆరోగ్యానికి అవి ఎంతో మేలు చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టొమాటోలలోని ‘విటమిన్ ఎ’ కంటిచూపును మెరుగుపరుస్తుంది. వయసుతోపాటు అంధత్వం ఆవహించకుండా కాపాడుతుంది. క్యాన్సర్ను ఎదుర్కొనే గుణం వీటికుంది. టొమాటోలను తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఊపిరితిత్తులు, ఉదరం, ప్రొస్టేట్ క్యాన్సర్ల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. తరచూ టొమాటోలను తినడం వల్ల.. రక్తసరఫరా సాఫీగా సాగేందుకు వీలవుతుంది. ఇందులోని విటమిన్ సి, పొటాషియం, ఐరన్, విటమిన్ కె వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ క్లాటింగ్, బ్లీడింగ్లను నియంత్రిస్తాయి. హృద్రోగ సమస్యల నివారణకు టోమాటోలు పనికొస్తాయి. రక్తనాళాలు మూసుకుపోనీయవు. చెడుకొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొవ్వును పెంచేందుకూ దోహద పడతాయి టొమోటోలు. టొమాటోలను బాగా ఉడికించి సూప్ తాగితే చాలు. రోజంతా ఎనర్జిటిక్గా ఉండొచ్చు. ఉదరసంబంధిత ఇబ్బందులు తొలగుతాయి.

Read More

బీపీ, షుగర్, పని ఒత్తిళ్ల వల్ల హృద్రోగాలు వస్తున్నాయి. గుండె కండరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడటం వల్ల గుండె నొప్పి వస్తుంటుంది. కారణాలేమైనా ఆకస్మాత్తుగా గుండె నొప్పితో సృహ కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కొందరు గుండెనొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు గుండెనొప్పి వచ్చిన రోగులు, వారి పక్కన ఉన్న వారు ఏం చేయాలనే విషయాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండె నొప్పి వచ్చి ఎవరైనా సృహ కోల్పోయినప్పుడు పక్కన ఉన్న వారు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అంబులెన్స్ను పిలిచి, జాప్యం లేకుండా సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తే చాలా కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడవచ్చు. కార్యాలయంలోనో, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనే ఉన్నప్పుడు గుండె నొప్పితో పడిపోతే సమీపంలో ఉన్న వారు చేయాల్సిన ప్రాథమిక చికిత్సలపై అందరికీ అవగాహన అవసరం. వివిధ రకాల హృద్రోగాల వల్ల…

Read More