Author: apanalysis
కిడ్నీ (మూత్రిపండాలు) ల్లో రాళ్లు ఏర్పడినట్లు అప్పుడప్పుడు వింటుంటాం.కిడ్నీల్లోనే గాక కాలేయంలో, పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడవచ్చు.ఇవి మనం ఆహారంలో పొరపాటున తీసుకునే రాళ్లు కావు, శరీరంలో కొన్నిరకాల ఆసిడ్స్ (ఆమ్లాలు), ఇతర పదార్థాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్న గుండుసూది తల నుండి కోడిగుడ్డు సైజు వరకు రకరకాల సైజుల్లో వుంటాయి. వైద్యపరిభాషలో ఈ రాళ్లను కాలిక్యులైఅంటారు. ఈ రాళ్లు మూత్రవాహికలో ఇన్ఫెక్షన్లు వున్నప్పుడు, మూత్రం నిల్వ వుండిపోయినప్పుడు, తగినంత నీరు తాగకపోవడం, ఆసిడ్ కలుగ జేసేపదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడతాయి. మూత్రంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా వుంటే సోడియం యూరేట్, యూరిక్ ఆసిడ్, ఫాస్పేటులు గల రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్షార గుణం వుంటే కాల్షియం ఫాస్పేటు, అమోనియం యూరేట్, మెగ్నీషియం, ఫాస్పేటులతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడినపుడు తీవ్రంగా కడుపునొప్పి వస్తుంటుంది. వివిధ రసాయనాలతో పాటు చెడు బ్యాక్టీరియా, ఎపితీలియల్, చీముకణాలు…
ఇష్ట మైన, రుచికర మైన భోజనంవల్ల, నచ్చిన ఆహారపు వాసన వల్ల, వెరైటీ టేస్ట్ వల్ల నోట్లో నీళ్లు ఊరతాయి. దీన్నే ‘నోరూరటం’ అంటారు. ‘నీరు’అని పేర్కొనే ఈ ద్రవం నోటిలోని లాలాజలమే. ఇది ఎలాంటి ప్రయత్నం లేని స్వయంచోదిత (ఆటోమేటిక్) చర్య. నోటిలోని లాలాజలగ్రంథులకూ, మెదడులోని ప్రేరణ కలిగించే స్పందనలకూ, సందేశాలకూ మధ్యజరిగే ప్రక్రియ వల్ల నోరూరడం జరుగుతుంది. దీనికి నాలుక మీది రుచి బుడిపెలు (టేస్ట్ బడ్స్), మానసిక ఉల్లాసం మరికొంత సహకరిస్తాయి. నోటిలో మూడు జతల లాలాజలగ్రంథులు వుంటాయి. చెవులకు ముందర, నాలుక కింద, కింది దవడ లోపల ఒక్కో జత చొప్పున వుంటాయి. లాలాజలగ్రంథులు స్రవించే లాలాజలం లక్ష ణాలు కూడా భిన్నంగా వుంటాయి. తినే పదార్థాన్ని బట్టి ఎంత లాలాజలం స్రవించాలో (ఊరాలో)అంతే ఊరుతుంది.మొత్తం ఆరు లాలాజలగ్రంథులలో చెవులకు ముందరి భాగంలో వుండే లాలాజలగ్రంథులు పల్చని లాలాజలాన్ని, కింది దవడ లోపల వుండే లాలాజలగ్రంథులు…
చాలామంది కొలెస్ట్రాల్, అధిక కొవ్వు వల్లనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయని అనుకుంటుంటారు. కానీ ఇటీవలి కొత్త అధ్యయనాల వల్ల హై బ్లడ్ షుగర్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుందని తెలుస్తోంది. షుగర్ ఉన్నా లేకపోయినా హై బ్లడ్ షుగర్ వల్ల గుండెకు ఇబ్బందులు కలగడం మాత్రం తప్పవు. మీకు ప్రస్తుతానికి డయాబెటిస్ లేకపోయినా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డయాబెటిస్ఉన్నవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక శాతం పెరిగితే హార్ట్అటాక్ వచ్చే అవకశాలు 18 శాతం పెరుగుతాయని తెలిసింది. అయితే క్రమబద్ధమైన మంచి జీవనశైలితో బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తేడా తీసుకు రావచ్చు. ఆహారంలో తక్కువ షుగర్, నూనె, కొవ్వు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకుంటే 30 శాతం వరకు బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవ చ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, వారానికి కనీసం ఐదు రోజులు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్‌లతో పాటు వారంలో కనీసం రెండు సార్లు గుండె…
చాలామంది కొలెస్ట్రాల్, అధిక కొవ్వు వల్లనే గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయని అనుకుంటుంటారు. కానీ ఇటీవలి కొత్త అధ్యయనాల వల్ల హై బ్లడ్ షుగర్ కూడా గుండె జబ్బులకు కారణమవుతుందని తెలుస్తోంది. షుగర్ ఉన్నా లేకపోయినా హై బ్లడ్ షుగర్ వల్ల గుండెకు ఇబ్బందులు కలగడం మాత్రం తప్పవు. మీకు ప్రస్తుతానికి డయాబెటిస్ లేకపోయినా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక శాతం పెరిగితే హార్ట్అటాక్ వచ్చే అవకాశాలు 18 శాతం పెరుగుతాయని తెలిసింది. అయితే క్రమబద్ధమైన మంచి జీవనశైలితో బ్లడ్ షుగర్ లెవల్స్‌లో తేడా తీసుకు రావచ్చు. ఆహారంలో తక్కువ షుగర్, నూనె, కొవ్వు, ఎక్కువ పీచు పదార్థాలు ఉండేట్లు చూసుకుంటే 30 శాతం వరకు బ్లడ్ షుగర్‌ను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, వారానికి కనీసం ఐదు రోజులు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్‌లతో పాటు వారంలో కనీసం రెండు సార్లు గుండె…
కావలసినవి : ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, నూనె – తగినంత, ఎండుమిర్చి – 2, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర – టీ స్పూను, బెల్లం తురుము – టీ స్పూను, కరివేపాకు – ఒక రెమ్మ తయారి ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చింతపండును పది నిముషాలు నీటిలో నాన బెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి. ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి. చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాకఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి. బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి.
కావలసినవి కొత్తిమీర – రెండుకప్పులు పచ్చిమిర్చి – 6 చింతపండు – నిమ్మకాయంత ఉప్పు – తగినంత పసుపు – చిటికెడు ఇంగువ – చిటికెడు నూనె – రెండు టేబుల్ స్పూన్లు తయారి : కొత్తిమీరను శుభ్రంగా కడగాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి) పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి.
కావలసినవి : కొబ్బరి – ఒక చిప్ప, మామిడికాయ – 1 (చిన్నది) పచ్చిమిర్చి – 5, ఉప్పు – తగినంత పసుపు – చిటికెడు, ఇంగువ – కొద్దిగా నూనె – రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 5, ఆవాలు – టీ స్పూను, జీలకర్ర – టీ స్పూను, శనగపప్పు – టీ స్పూను, మినప్పప్పు – టీ స్పూను తయారి కొబ్బరిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీలో మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసి, పోపు, ఇంగువ జతచేసి అన్నంలోకి వడ్డించాలి.
కావలసినవి దోసకాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చిమిర్చి – 6 చింతపండు – కొద్దిగా ఉప్పు – తగినంత పసుపు – చిటికెడు ఇంగువ – చిటికెడు నూనె – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర – చిన్న కట్ట తయారి దోసకాయ చెక్కు తీసి, గింజలు వేరు చేసి, చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కొన్ని దోసకాయముక్కలు వేసి కచ్చాపచ్చాగా చేయాలి. ఒక గిన్నెలో దోసకాయ ముక్కలు, మెత్తగా చేసిన దోసకాయల మిశ్రమం, పసుపు, ఇంగువ, నూనె వేసి బాగాకలిపి, అరగంట సేపు ఊరనివ్వాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయాలి.
మసాలా ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు – కేజీ, నువ్వుల నూనె – పావు కేజీ, కారం – పావు కేజీ, అల్లం + వెల్లుల్లి ముద్ద – పావు కేజీ, పసుపు – టీ స్పూను, ఉప్పు – పావు కేజీ, జీలకర్ర పొడి – 50 గ్రా., ధనియాల పొడి – 2, టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి – టేబుల్ స్పూను, మెంతి పొడి – టీ స్పూను, పసుపు – టేబుల్ స్పూను, జీలకర్ర + మెంతులు – టీ స్పూను, ఇంగువ – టీ స్పూను, ఎండుమిర్చి – 10. తయారీ: మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపు కోవాలి. మామిడికాయ ముక్కలు జత చేయాలి. మరో గిన్నెలో నూనె…
కావలసినవి: మామిడికాయ ముక్కలు – కిలో, ఉప్పు – 125 గ్రా., కారం – 125 గ్రా. నువ్వుల నూనె – పావు కిలో; అల్లం ముద్ద – 125 గ్రా. వెల్లుల్లి ముద్ద – 125 గ్రా.; పసుపు – టీ స్పూను, జీలకర్ర పొడి – 50 గ్రా.; మెంతిపొడి – టీ స్పూను, ఇంగువ – టీ స్పూను; ఆవాలు, జీలకర్ర, మెంతులు – టీ స్పూను తయారీ: మామిడికాయ ముక్కలను తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేరే గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు జత చేసి బాగా వేయించి దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారాక, కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి.…
