Author: apanalysis

ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే తరచుగా చేపలను తిని చూడండి. ఎందుకంటే వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆయుష్షు పెరగటానికి దోహదం చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా గలవారితో పోలిస్తే అధికంగా ఉన్నవారు రెండేళ్లకు పైగా ఎక్కువగా జీవిస్తున్నట్టు చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అలాగని చేపనూనె మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆహారం ద్వారా లభించ ఒమేగా-3 కొవ్వులతోనే ఈ ప్రయోజనం కనబడుతోందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు చెందిన డాక్టర్ దారియష్ మొజఫరేయన్ చెబుతున్నారు. రక్తంలోని ఒమేగా-3 స్థాయులకూ మరణం ముప్పు.. ముఖ్యంగా గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటోదంటున్నారు. ఈ కొవ్వులు అధికంగా గలవారిలో ఏ కారణంతోనైనా వచ్చే మరణాల ముప్పు 27% తక్కువగా ఉంటుండగా.. గుండెజబ్బు సంబంధ మరణాల ముప్పు 35% తక్కువగా ఉంటోందని తేలింది. చేపల్లో…

Read More

నెయ్యి ఎవరికీ మంచిది కాదని భావిస్తూ కొందరు అస్సలు నెయ్యిని పూర్తిగా దూరంగా పెట్టేస్తుంటారు. ఇది సరికాదు. చంటి పిల్లలు, పెరిగే పిల్లలు, రోజంతా కష్టించి బరువు పని చేసేవారు, క్రీడాకారులు.. వీరంతా రోజూ నెయ్యి వంటివి తీసుకోవటం మంచిదే. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్-ఎ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పెరిగే పిల్లలకు చాలా మంచి చేస్తుంది. కాకపోతే అస్సలు శారీరక శ్రమ లేని కంప్యూటర్ ఉద్యోగుల వంటివారు, శారీరక కదలికలు పెద్దగా లేని, మంచం దిగని వృద్ధుల వంటివారు రోజూ నెయ్యి వంటివి తినటం మంచిది కాదు. నెయ్యి అనేది సంతృప్త కొవ్వు కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా వంట నూనెలను తగ్గించటమంటే కష్టం గానీ నెయ్యి తగ్గించెయ్యటం, మానెయ్యటం తేలికే. అందుకే ఎదిగే వయసు దాటిపోయిన పెద్దలు దీనికి దూరంగా ఉండొచ్చు.

Read More

ప్రశ్న: డైటింగ్, వ్యాయామంతో బరువు తగ్గుతుందా…? జవాబు: బీఎంఐ 30, అంతకంటే ఎక్కువగా ఉన్న వారిలో డైటింగ్, వ్యాయామం మాత్రమే బరువు తగ్గడానికి సరిపోవు. పరిమిత ఆహారం, వ్యాయామం స్థూలకాయం రాకుండా చూసుకోడానికి, ఫిట్నెస్ కాపాడుకోడానికి ఉపయోగపడతాయి. కానీ ఒకసారి స్థూలకాయం వస్తే వీటిద్వారా మాత్రమే శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. నూటికి తొంభైమంది డైటింగ్, వ్యాయామం చేసి బరువు తగ్గించుకోవడంలో విఫలమవుతారు. అయితే మొదట్లో కొన్ని కిలోలు బరువు తగ్గించుకోడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ ఇది తాత్కా లికమే. డైటింగ్, వ్యాయామంతోనే స్థూలకాయం ఎందుకు తగ్గదంటే, ఇవి కొవ్వు సెట్పాయింట్ను మార్చలేవు. డైటింగ్ చేసే సమయంలో ఆహారం తక్కువ గా తీసుకుంటాం. దీంతో కడుపు నిండదు. ఫలితంగా ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ పెరిగి ఆకలి పెరుగుతుంది. అలాగే చిన్నపేగులలో తయారయ్యే ఆకలిని తగ్గించే జీఎల్పీ-1 హార్మోన్ ఉత్పత్తి తగ్గి, ఆకలి పెరిగి పోతుంది. కొవ్వు సెట్పాయింట్ ప్రభావం వల్ల…

Read More

ప్రశ్న: బరువు తగ్గాలంటే లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరమా. జవాబు: ఈ పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడవు. చాలామంది బరువు తగ్గించుకోడా నికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇవి బాడీ షేపింగ్కు ఉపయోగపడే కాస్మెటిక్ ఆపరేషన్లు. ఇవి స్థూలకాయ సమస్యను పరిష్కరించలేవు. ఈ విధానాల వల్ల కూడా శరీరంలోని కొవ్వు సెట్పాయింట్లో మార్పు ఉండదు. డైటింగ్, వ్యాయామం ద్వారా బరువు తగ్గగలిగే వారికి లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ అవసరం లేదు. అలా తగ్గలేని వారు లైపోసక్షన్, కూల్ స్కల్ప్టింగ్ ద్వారా కూడా తగ్గలేరు. పైగా కొంతకాలం తర్వాత ఇంకాస్త బరువు పెరుగుతారు.

Read More

ప్రశ్న: తక్కువ క్యాలరీలు ఉండే ఆహారపదార్థాలు (వెరీ లో-క్యాలరీ డైట్) వల్ల స్థూలకాయం తగ్గించుకోవచ్చా? జవాబు: లేదు. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల వల్ల ఉపయోగం తాత్కాలికమే. మార్కెట్లో బరువు తగ్గడానికి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే హెర్బల్ ఆహారం లభ్యమవుతోంది. కానీ వీటివల్ల కొవ్వు సెట్ పాయింట్లో మార్పు ఉండదు. ఈ పదార్ధాలు వాడటం వల్ల కొంత బరువు తగ్గినప్పటికీ సెట్పాయింట్ ప్రభావం వల్ల ఆరునెలల నుంచి ఐదేళ్ల లోపల మనం కోల్పోయిన బరువు తిరిగి పెరుగే అవకాశం వుంది.

Read More

ప్రశ్న: పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోవడం ప్రమాదకరమా. జవాబు: అవును. నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరు కొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం… సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. సెట్పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్, దాని ప్రాధాన్యం స్థూలకాయ సమస్యతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకు రోజువారీ పనులకు, అన్ని జీవ క్రియలకు కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది. మనం…

Read More

ప్రశ్న: స్థూలకాయం అనేది శరీర అందానికి సంబంధించిన సమస్య మాత్రమేనా. జవాబు: కాదు. నిజానికి స్థూలకాయ సమస్యను ఒక వ్యాధిగా పరిగణించాలి. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం మూలకారణం. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారి తీస్తుంది. ఇలా అనేక వైద్యపరమైన సమస్యలకు స్థూలకాయం మొదటిమెట్టు.

Read More

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. ఆధునిక జీవనశైలిలో భాగంగా అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడంతో ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. నూటికి తొంభైమందిలో స్థూలకాయ సమస్య ఈ కారణాలవల్లనే వస్తోంది. మిగిలిన పదిమందిలో ఎండోక్రైన్ సమస్యలు, జన్యుపరమైన అంశాలు, మందుల దుష్ర్పభావం వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయి. శరీరంలో కొవ్వు పురుషులలో 25 శాతం కంటే ఎక్కువగానూ, మహిళల్లో 35 శాతం కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ఉన్నట్లుగా పరిగణిస్తాం. స్థూలకాయం, దాని పరిష్కార మార్గాలపై ప్రజల్లో ఎన్నో అపోహలున్నాయి. ప్రశ్న : స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి విదేశీయులకూ, భారతీయులకూ ఉపయోగించే ప్రమాణాలు ఒక్కటేనా…? జవాబు: సాధారణంగా విదేశాలలో జరిగే అధ్యయనాల ప్రకారం వచ్చిన విలువలనే మన దేశవాసులకూ అన్వయిస్తుంటారు. కానీ స్థూలకాయం విషయంలో ఈ ప్రమాణాలు విదేశీ యులకూ, భారతీయులకూ ఒకటి కాదు. స్థూలకాయాన్ని నిర్ధారణ చేయడానికి సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ)…

Read More

మన శరీరంలో నిత్యం వేల సంఖ్యలో కణాలు పుడుతూ, చనిపోతూఉంటాయి. ఈ ప్రక్రియ అంతా జన్యువుల నియంత్రణలో జరుగుతుంటుంది. కొన్నిసార్లు జన్యువుల నియంత్రణ తప్పి, కణవిభజన ప్రక్రియ అదుపుతప్పి కణాలు విశృంఖలంగా పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అదనంగా ఏర్పడ్డ కణాలు ఒక కణితిగా రూపొందుతాయి. ఈ కణుతులు హానికరం కావుగాని… కొన్ని సందర్భాల్లో మాత్రం హానికరంగా పరిణమిస్తాయి. అవే క్యాన్సర్ కణుతులుగా పరిణితి చెందవచ్చు. ఇవి రొమ్ములోగాని, నిపుల్కు పాలను సరఫరా చేసే నాళాల్లోగాని రావచ్చు. కానీ ముందే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు. క్యాన్సర్కు వయసును కూడా ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించవచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యం కాదు. కాకపోతే తల్లికి, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే రిస్క్ కాస్త ఎక్కువ. ఒకవేళ ఇదివరకు ఒక రొమ్ములో క్యాన్సర్ వస్తే రెండో రొమ్ముకూ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అంతేగాని వంశపారంపర్యంగా కానీ, ఒక రొమ్ముకు వస్తే మరో రొమ్ముకు…

Read More

పాలు’ అనేవి పిల్లలకేగానీ పెద్ద వాళ్లకు అక్కర్లేదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి… పాలన్నది సంపూర్ణ ఆహారం. చంటి పిల్లలకు అదొక్కటే ఆహారం, కొంచెం పెద్దయితే పాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇస్తారు. పాల ద్వారా మన శరీరానికి వచ్చే పోషకాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లలకు సమృద్ధంగా పాలు ఇవ్వాలి. ఇక పెద్దల విషయానికి వస్తే- పాలలో ఉండే కొవ్వు ఒక్కటి తప్పించి మిగతావన్నీ మనకు చాలా అవసరమైనవి. పాలలో క్యాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం. లేకపోతే ఒక వయసు వచ్చేసరికి ఎముకలు బోలుబోలుగా తయారై ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పెద్దలు కొవ్వు తీసిన, లేదా కొవ్వు తక్కువున్న పాలు తీసుకోవటం మంచిది. ఎముకల బలంగా ఉండడానికి స్త్రీలకు పాలు మరీ ముఖ్యం.

Read More