Author: apanalysis
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారతదేశంలోనే ఉండడం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహ రోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.పాదాల సంరక్షణ ప్రత్యేక వైద్య విభాగంమధుమేహ వ్యాధి ఉన్న వారిలో ప్రతి నలుగురిలో ఇద్దరికి పాదాలకు సంబంధించిన సమస్య ఉంది. సగటున ప్రతి 30 సెకన్లకు ఒక అంగచ్ఛేదం (అంప్యూటేషన్) మధుమేహం…
