Author: apanalysis
గర్భస్రావం లేదా అబార్షన్ : గర్భం ద్వారా ఏర్పడిన పిండం మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత గర్భాశయం నుండి బయట పడడాన్ని గర్భస్రావం అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.సాధారణంగా ఎప్పుడైనా ఒక సారి గర్భస్రావం జరగడానికి 50 శాతం మహిళలకు అవకాశం ఉండొచ్చు. ఇవేకాక దీనికి ఎన్నో కారణాలుటాయి. పిండం తయారీలో లోపం అన్నింటికన్నా ముఖ్యం.ఈ లోపాలు ఉన్నప్పుడు సహజంగానే ఎదుగుదల ఆగి గర్భస్రావమవుతుంది. జన్యుపరమైన కారణాలు ఒక్కోసారి గర్భస్రావానికి కారణమైనా కూడా పదే పదే ఇలా జరగదు. కాబట్టి ఒకసారి గర్భస్రావం అయితే దాని గురించి ఎక్కు వగా కంగారు పడాల్సిన అవ సరం లేదు. వరుసనే ఎక్కువ సార్లు గర్భ…
స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి లేదా గర్భిణి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 – 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను ‘పిండం’ అంటారు. ‘శిశువు’ అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. గర్భ నిర్ధారణచాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి…
స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి లేదా గర్భిణి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 – 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది. ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను ‘పిండం’ అంటారు. ‘శిశువు’ అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. గర్భ నిర్ధారణ చాలా మందిలో గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో…
గర్భిణీ స్త్రీలకు సలహాలు మీరు ప్రశాంతముగా,సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది . ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి డాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి,స్వంతంగా మందులు వాడకూడదు. అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది. గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి. మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం. ఎత్తు మడమల చెప్పులు వాడకండి. కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి. బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి. మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు,ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :- దూర ప్రయాణము కారు ,స్కూటర్ నడపడం. అతిగా సంభోగము…
గర్భిణీ స్త్రీలకు సలహాలుమీరు ప్రశాంతముగా,సంతోషముగా ఉంటే మీశిశువు కూడా అలాగే ఉంటుంది .ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్ఠిక ఆహారం ఎక్కువ పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలిడాక్టర్ పై విశ్వాసం ఉంచి వారి సలహా పాటించండి,స్వంతంగా మందులు వాడకూడదు.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది.గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.మొదటి ఆరు నెలలూ నెలకొకసారి, ఏడు,ఎనిమిది నెలల్లో నెలకు రెండుసార్లు, తొమ్మిదవ నెలలో వారానికొకసారి వైద్య పరీక్ష అవసరం.ఎత్తు మడమల చెప్పులు వాడకండి.కుదుపులు కలిగేటట్లు ప్రయాణము చేయకండి.బిడ్డకు చనుపాలు ఇవ్వడానికి వీలుగా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి చివరి 3 నెలలలో డాక్తర్ సలహా అడగండి.మొదటి మూడు నెలలు, చివరి 2 నెలలు,ఈక్రింది పేర్కొన్నవి చేయవద్దు :-దూర ప్రయాణముకారు ,స్కూటర్ నడపడం.అతిగా సంభోగముఈ క్రింది పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.రక్తస్రావముఉమ్మనీరు పోవడంశిశువు కదలిక తగ్గినట్టుగాని , ఆగినట్టుగాని అనిపించినపుడునొప్పులు రావడంసుఖప్రసవానికి…
కారణాలు జీవన విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది. అంతేకాకుండా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలు, మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తులున్నాయి. సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్త్రీలలో ప్రధాన కారణాలు ఋతుచక్రంలో మార్పులు కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం. గర్భాశయపు నిర్మాణంలోను,…
కారణాలు జీవన విధానం మారడంతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుత యువత జీవన శైలి మారిపోయింది. అంతేకాకుండా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇవన్నీ వారి దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మగవాళ్లు సరికొత్త సమస్యలతో బాధపడుతున్నారు. మహిళలు, మగవారిలో కూడా సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లోలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పని సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. తమ రంగంలో రాణించడం కోసం రాత్రి-పగలు తేడా లేకుండా కృషి చేయడం సర్వసాధారణమైపోయింది. దాంతో సరైన వయసులో పెళ్లి కాక, పెళ్లైనవాళ్లలో కూడా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి సంతానం కలగడానికి అవసరమైన హార్మోన్ల స్రావాలు సరిగా జరగక, సమస్యలు తలెత్తులున్నాయి. సంతానలేమితో బాధపడేవారిలో మగవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.స్త్రీలలో ప్రధాన కారణాలుఋతుచక్రంలో మార్పులుకొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం.గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను… పుట్టుకతో వచ్చే లోపాలు గర్భాశయ మార్గంలో…
పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించలి. రుతుస్రావం సమయంలో నెత్తురు ఎక్కువగా పోతుంటుంది కాబట్టి ఆహారం ఎక్కువ మోతాదులో పెట్టాలని పొరుగువారు, ఫ్రెండ్స్ చెబు తుంటారు. అది నిజం కాదు. ఈ సమయంలోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే… ఎప్పటిలాగే తీసుకుంటూ అదనంగా కోన్ని పోషక విలువలు ఎక్కువగా ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొద లైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి…
పాప రజస్వల అయ్యింది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు భర్తీ అవ్వాలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించలి. రుతుస్రావం సమయంలో నెత్తురు ఎక్కువగా పోతుంటుంది కాబట్టి ఆహారం ఎక్కువ మోతాదులో పెట్టాలని పొరుగువారు, ఫ్రెండ్స్ చెబు తుంటారు. అది నిజం కాదు. ఈ సమయంలోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే… ఎప్పటిలాగే తీసుకుంటూ అదనంగా కోన్ని పోషక విలువలు ఎక్కువగా ఉన్న పదార్ధాలు తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొద లైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే…
అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం పండ్లు, కాయగూరలు,గింజలు, పప్పులు, కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి… ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.మగవారు కాస్త మోటుగా వున్నా పర్వాలేదు. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి. ఆడవాళ్లు అందంగా…
