Author: apanalysis
హార్మోన్ల అసమతౌల్యత.. ప్రస్తుతం చాలమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అతిగా బరువు పెరగడం, నిద్ర పట్టకపోవడం, బద్ధకంగా అనిపించడం, రుతు సంబంధిత సమస్యలు.. మొదలైనవి కనిపిస్తే హార్మోన్ల అసమతౌల్యత కారణం కావచ్చు. శరీరంలో వివిధ రకాల హార్మోన్లన్నీ సవ్యంగా విడుదలైనప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఈ క్రమంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచాలంటే ఏం చేయాలి? నిద్రలేమితో కూడా హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడుతుంది. కాబట్టి కనీసం రోజుకి 7-8 గంటలు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. హార్మోన్లు సమతౌల్యంగా ఉంటే జీవిత కాలం పెరగడంతో పాలు శరీర బరువు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. హార్మోన్లను సమతౌల్యంగా ఉంచుకోవడానికి.. మనం తీసుకునే ఆహారంలో కార్బొహైడ్రే్లు, కొవ్వులు, ప్రొటన్లు ఉండేల చూసుకోవాలి. రోజూ రెండుమూడు రకాల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు.. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని ఇన్సులిస్ స్థాయిని సమన్వయ పరుస్తుంది. అలాగే పండ్ల…
మహిళల్లో నెలసరి బుతుచక్రం శాశ్వతంగా నిలిచిపోవటాన్ని మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు. ఒక శారీరక స్థితి. పునరుత్పత్తి సామర్థ్యం నిలిచి పోవటం లేక ఆగిపోవటమే మెనోపాజ్. సహజంగా మెనోపాజ్ అనేది స్త్రీలలో 45వ ఏట ప్రారంభించి 50 సంవత్సరాలు నిండటంతో ముగుస్తుంది. అసలు మెనోపాజ్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం… మెనోపాజ్ ప్రారంభంలో బుతుచక్రం ఆలస్యం అవుతుంది. మూడు, నాలుగు నెలలకొకసారి బహిష్టు కావడం ఆ సమయంలోనూ బుతుస్రావం కొద్దిగా, ఒకటి లేక రెండు రోజులే ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత బుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. దీని గురించి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. అయితే బుతుచక్రం ఆగిన స్త్రీలలో ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నది వాస్తవం. ప్రత్యేకించి లావు పెరగటం, ఎముకలలో పటుత్వం తగ్గటం, మానసిక చికాకులు తదితర సమస్యలు చాలామంది మహిళలలో సర్వసాధారణం. ఇవన్నీ…
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ వద్దకు వచ్చినప్పుడు ఏఏ పదార్థాలు తీసుకోవచ్చునని అడగడం సర్వ సాధారణం. రోగిని పాలు, బ్రెడ్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించడమూ మనకు తెలిసిన విషయమే. జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరంలో రసాయన, భౌతిక ప్రక్రియలు అధికమవుతాయి.. మూత్రంలో మాంసకృత్తులకు సంబంధించిన నైట్రోజెన్ వృధా అవుతుంది. రోగి ఆహారాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటాడు. ఫలితంగా రోగి బరువు తగ్గుతాడు. జ్వరం దీర్ఘకాలికంగా బాధిస్తే రోగి చిక్కిశల్యమవుతాడు. జ్వరం వచ్చినప్పుడు రోగి శరీరంనుంచి అనుకోని విధంగా మాంసకృత్తులు వృధా కాకుండా, సరైన ఆహారం ఎలా తీసుకోవాలో సూచించాల్సిన బాధ్యత డాక్టర్‌దే. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు అన్నం తింటే మంచిది కాదని, మనలో కొన్ని నమ్మకాలున్నాయి. ఇవి నిరాధారమైనవి. మాంసకృత్తులు (మాంసం, కోడిగుడ్లు మొదలైనవి) తింటే జ్వరం ఎక్కువవుతుందని భావిస్తారు. ఇదీ కూడ నిజం కాదు. జ్వరం ఉన్నప్పుడు రోగికి ఏ ఆహారం తీసుకోవాలని ఉంటుందో దానినే ఇవ్వడం మంచిది. జ్వరం…
శరీరంలో అన్ని భాగాలలోకి కంటి కింద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే త్వరగా నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేమి, ఒత్తిడి, అధిక బరువు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఇతర జబ్బుల కారణంగా కళ్లకింద నల్లమచ్చలు వస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తమా ఉండేవాళ్లకు కూడా ఇవి త్వరగా ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదనే సూచన కూడా ఉంది. దాన్ని పట్టించుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకోవడం వల్ల కంటి కింద నల్లటి మచ్చలు రావచ్చు. అందువల్ల రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తీసుకోండి. ఎండలో తిరగడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. సూర్యరశ్మి ప్రభావం కంటిమీద చాలా ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రలేమి వల్ల కూడా త్వరగా ఈ సమస్య బారినపడతారు. అలసిన కళ్లపై ఒక 15నిమిషాలు చల్లటి టీ బ్యాగ్‌లు ఉంచండి. సాయంత్రం పడుకునే సమయంలో కళ్లకింద కీరాదోసకాయ…
మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ‘రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించడమే నిజమైన. రక్తహీనతను ఎదుర్కొంటున్న వారిలో అవసరమైన స్థాయిలో ఎర్ర రక్తకణాలు ఉండవు. ఫలితంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఎక్కువగా అలసట చెందటమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. శరీరంలో శక్తి పూర్తిగా నశించిపోయిన భావన కలుగుతుంది. ఎనీమియా గురించి తెలియాలంటే రక్తానికి సంబంధించిన కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైన హిమోగ్లోబిన్ తయారు కావడానికి మాంసకృత్తులు, ఐరన్ ప్రధానంగా అవసరం అవుతాయి. అలా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం 16ఎం.జి. పరిమాణంలో ఉంటుంది. ఈ…
ఫ్రూట్ సలాడ్ కావలసినవి : దానిమ్మ గింజలు – 1 కప్పు ద్రాక్షపళ్ళు – 1 కప్పు పైనాపిల్ ముక్కలు – 1 కప్పు అరటిపండు ముక్కలు – 1 కప్పు చెర్రీ పండ్లు – 1/2 కప్పు మామిడిపండు ముక్కలు – 1 కప్పు ఆపిల్ పండు ముక్కలు – 1 కప్పు కమలాతొనలు – 1 కప్పు మిరియాలపొడి – 1/2 స్పూన్ ఉప్పు – కొంచెం తేనె – 1/4 కప్పు నిమ్మ రసం – 2 స్పూన్లు తయారు చేసే విధానం : ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధం. ఇలా అయితే అన్ని రకాల పండ్లు తినవచ్చు.…
మాతృత్వం ఓ వరం. ప్రతి స్త్రీకి గర్భం దాల్చిన క్షణం నుంచి ఏదో తెలియని ఉద్వేగం, సంతోషం ఉంటుంది. ఏం తినాలి.. ఎది తినకూడదు. బరువు పెరిగితే లాభమా.. నష్టమా అనే విషయాలపై ఆందోళనా ఉంటుంది. ప్రెగ్నెసీ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తల్లికి, బిడ్డకు క్షేమం వంటి అంశాలపై మహిళలకు అవగాహన ఉండటం చాలా అవసరం. అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చారని తెలుసుకునే లోపే మూడు నెలలు గడిచిపోతాయి. చాలా మంది విషయంలోనూ ఇలానే జరుగుతుంది. కొంత మంది మాత్రం ప్రెగ్నెసీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. నిజానికి అలా చేయడం చాలా ముఖ్యం. హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు డాక్టర్ సూచనల మేరకు మందులు వాడుతూ ప్రెగ్నెసీ కోసం ప్రయత్నించాలి. మొదటి 3 నెలలు గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. మొదటి…
ఈ కాలంలో వయస్సుతో సంబందం లేకుండా అందరిని ఇబ్బందిపెట్టే సమస్య స్థూలకాయం, అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ ఉద్యోగులకు ఎక్కువగా స్థూలకాయం వస్తుంది, ఎందుకంటే వారి ఉరుకుల పరుగుల జీవితంలో, పని ఒత్తిడిలో సరియైనఆహార నియమాలు పాటించడం మానేసి, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ, ఏవిదమైన వ్యాయామం చేయకపోవడం వల్ల, వారి ఆహారంపై నియంత్రణ లేకపోవడం వల్ల దీనికి గురివుతున్నారు.మన ఇంట్లో కూర్చునే అధిక బరువును తగ్గించుకోవడానికి మార్గాలు రోజూ కనీసం 30 నిమిషాలైన వాకింగ్ చేయడం ఎంతో మంచిది, దీని వల్ల మీరు ఆ రోజు తీసుకున్న క్యాలరీలు తగ్గుతాయి. మీ రోజువారి ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉన్న ఆహరం అంటే పాలు, మజ్జిగ ఎల ఎక్కువగా తీసుకుంటే ఎంతో మంచిది. ఒకవేళ మీకు మంసాహారం అంటే ఇష్టం ఉన్ననూ, ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు, దాని వల్ల మీశరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. ద్రవం రూపంలో ఉన్నవి…
వర్షాకాలం వచ్చిందంటే ఎండలేడి తగ్గి కాస్త సేదతీరుతాం.. కానీ చల్లదనంతో పాటే వానలు రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా వెంట తీసుకోస్తాయి. చిన్నారుల విషయంలోనైతే మరీనూ. ఈ సీజన్ లో చిన్నపిల్లల్లో మలేరియా, కలరా, కామెర్లు, వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు.. ఇల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలత్తుతాయి. అంతేకాదు ఈ సమయంలో చాలమంది పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో పిల్లల్ని కంటికి రెప్పల కాపాడాల్సిన భాధ్యత ప్రతి తల్లిదండ్రులకీ ఉంది. మరి ఈ సీజన్ లో చిన్నారులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే…. • వర్షాకాలంలో ఇంటిని, పరిసరాలను పరిశభ్రంగా ఉంచడం చాల అవసరం. ఎందుకంటే పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఆడుకుండుటారు. ఏదైనా కొంచెం మురికిగా ఉన్నా సరే.. క్రిములు శరీరానికి అంటుకుని రకరకాల చర్మ సమస్యలు తలత్తుతాయి. కాబట్టి దోమలు రాకుండా కిటికీలకు మెషలు, ఇంట్లో స్పే లు..లాంటివి చల్లాలి. అలాగే పిల్లల బడ్ చుట్టూ దోమతెరలు…
తల్లి కావాలని కోరుకోని మహిళలూ ఉండదు. పెళ్లైన ప్రతి మహిళా పీరియడ్స్ మిస్ అవ్వగానే తాను తల్లి కాబోతున్నానని ఆనందపడుతుంది. కానీ ఒక్కోసారి అది ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు. అసలు గర్భం ధరించామా లేదా అన్న విషయాన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు? ఒకవేళ గర్భం ధరించినట్లు కన్ఫర్మ్ అయితే తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ అనుమానాలే.. అందుకే ఇక అనుమానాలు అన్నీ క్లియర్ చేసుకొండి. ఈ విషయాలు గమనించండి ఉదయం లేవగానే తల తిరగడం, వాంతి అయేటట్లు అనిపిస్తోందా? ఇవి గర్భధారణకు సంకేతాలు. దీన్నే ‘మార్నింగ్ సిక్నెస్’ అంటరు. నెలనెల సక్రమంగా వచ్చే పిరియడ్ ఒక్కసారి మిస్సయితే మీరు గర్భం ధరించారని అనుకోవచ్చు. కానీ దీన్ని మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించుకోవాలి. కొంతమందిలో స్తనాల పరిమాణం కూడా పెరిగే అవకాశాలున్నాయి. మరికొంతమంది గర్భం ధరించిన కొన్ని రోజుల వరకు చిరాకు, ఉద్రేకంతో ఉంటారు. కొంత మందికి ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార…
