Author: apanalysis

మనసుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుకోవటానికి ఆహారం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం కొంతమంది కాఫీ, టీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఉత్సాహ పరచినా వీటితో దుష్రభావాలు ఎక్కువ. అంతకన్నా పోషకాలు దండిగా కలిగిన ఆహార పదార్థాలు తినటం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి చాలా త్వరగా మూడ్నీ మార్చేస్తాయని వివరిస్తున్నారు. మోనోసాచ్యురేటెడ్ కొవ్వు, పొటాషియం: ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాలు ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వు.. అరటిపండు, చిలగడ దుంపల్లో బాగా పొటాషియం లభిస్తాయి. ట్రైప్టోఫాన్: మూడ్ని నియంత్రించటంలో సెరటోనిన్ పాత్ర చాలా కీలకం. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్ ఎక్కువగా లభించాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు: మానసిక ఏకాగ్రత, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి.…

Read More

చదువులు కావచ్చు.. పోటీ పరీక్షలు కావచ్చు.. విద్యార్థుల మీద రకరకాల ఒత్తిళ్లుంటాయి. అలాంటప్పుడు యోగా, ధ్యానం చాలు అని చాలామంది అంటారు. అవే కాదు… ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. విటమిన్ ‘సి’: ఈ విటమిన్లో ఒత్తిడిని తగ్గించే గుణం ఉంటుంది. నారింజ, అనాస, టొమాటో, జామలో ఇది ఉంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా ఉన్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటి పండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ కెలొరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్ అనే రసాయనం ఉత్పన్నమవుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్యమవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది. నట్స్: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ,…

Read More

సెల్ఫోన్ల సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతోపాటు ఉపయోగించేవారి విస్తృతీ పెరుగుతోంది. సెల్ఫోన్లను ఎక్కువగా వాడితే సమస్యలూ ఎక్కువేనని, వాటిలోని రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో అనారోగ్య సమస్యలు చోటుచేసుకుంటాయనే నేపథ్యంలో పరిశోధకులు ఎన్నో అధ్యయనాల్ని పరిశీలించారు. ఇంతకీ సెల్ఫోన్లతో నిజంగానే సమస్యలున్నాయా? అనే దిశగా అధ్యయనాలు సాగిస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, కడుపులోని పిండాలు, వృత్తిపరంగా ఫోన్లను ఎక్కువగా వినియోగించే వారికి సెల్ఫోన్లతో ఎంతోకొంత హాని ఉంటోందనే వాదనల నిగ్గు తేల్చేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. సెల్ఫోన్లతో అందరూ అనుకున్నంతగా, ప్రచారం చేస్తున్నంత హాని మాత్రం లేదని కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు ఫ్రాంక్ బార్నెస్ స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వీటితో ముప్పు ఉన్నట్లు తేలకపోయినా.. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయనే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు. ఇవే కాకుండా సెల్ఫోన్ టవర్లపై పనిచేసే వారిపై ప్రభావం ఎలా ఉంటోందన్నదీ పరిశీలించాలంటున్నారు. పాఠశాల వయసు పిల్లలు సెల్ వాడటం వల్ల తలెత్తే మంచీచెడ్డల్నీ పట్టించుకోవాల్సి ఉందన్నారు. ఎందుకంటే.. పెద్దలతో…

Read More

విటమిన్-ఇని సమృద్ధిగా తీసుకుంటే 65 ఏళ్ల పైబడిన వృద్ధులు శారీరకంగా బలంగా ఉంటారని తాజా అధ్యయనంలో గుర్తించారు. మన శరీరంలో తయారుకాదు, విటమిన్-ఇ ని ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవాలి. వృక్ష సంబంధ నూనె, సోయా గింజలు, మొక్కజొన్న, ఆలివ్ నూనె, గుడ్డుసొన, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలతో విటమిన్-ఇ అందుతుంది. ఇవి యాంటీఆక్సిడెంట్లనూ అందివ్వటం వల్ల శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుందని అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు. విటమిన్-ఇ మన శరీరంలోని కణజాలాన్ని అన్నిరకాల దాడుల నుంచి రక్షిస్తుంటుంది. వృద్ధాప్య లక్షణాల్ని నెమ్మదింప జేయటంతోపాటు, చర్మ కణాలు క్షీణించటాన్నీ అడ్డుకుంటుంది. యేల్ యూనివర్సిటీ పరిశోధకులు కొంతమంది వాలంటీర్లు రక్తం శాంపిళ్లను పరీక్షించి విటమిన్ల స్థాయుల్ని గణించగా 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో విటమిన్-ఇ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. విటమిన్-ఇ తక్కువగా ఉన్నవారిలో శారీరక సామర్థ్యం 1.62 రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విటమిన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాల్ని సరిపడినంతగా…

Read More

పొగతాగటం ఒక్క వూపిరితిత్తులనే కాదు. శరీరంలోని చాలా భాగాలనూ దెబ్బతీస్తుంది. ఈ అలవాటును ఎప్పుడు మానేస్తే అప్పట్నుంచే మంచి ఫలితం కనబడుతుందని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. దీన్ని బలపరుస్తూ మరో రుజువూ లభించింది. పొగతాగే అలవాటు మానేస్తే కంట్లో శుక్లం ఏర్పడే ముప్పూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది. మన కంట్లో పారదర్శకమైన కటకం ఉంటుంది. దీనిలోంచి కాంతి కిరణాలు ప్రసరించి ఆయా దృశ్యాలు స్పష్టంగా కనబడతాయి. కానీ ఇది వృద్ధాప్యంలో మబ్బుమబ్బుగా (శుక్లం) మారిపోతుంది. దీంతో చూపు మసకబారుతుంది. ఇలా శుక్లం ఏర్పడటానికీ పొగ తాగే అలవాటుకూ గల సంబంధంపై స్వీడన్ పరిశోధకులు ఇటీవల ఒక అధ్యనం చేశారు. పొగ అలవాటు లేనివారితో పోలిస్తే.. రోజుకి 15 కన్నా ఎక్కువ సిగరెట్లు తాగినవారికి శుక్లాల ముప్పు 42% అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత శుక్లాల ముప్పు 21 శాతమే ఉంటుండటం గమనార్హం. పొగ…

Read More

మన గుండె నిరంతరం లబ్డబ్మని కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఇది సమర్థవంతంగా పనిచేస్తేనే శరీరంలోని అన్ని భాగాలకు తగినంత రక్తం పంప్ అవుతుంది. సాధారణంగా మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ వేగం (పల్స్) మన శరీర సామర్థ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యాన్నీ, ఇతర సమస్యలనూ పట్టి చూపుతుంది. అందువల్ల గుండె వేగం గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. గుండె సాధారణ (నార్మల్) వేగం ఒకొకరిలో ఒకోరకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్లు, మోచేయి, మెడ, పాదంపైన పల్స్ను స్పష్టంగా గుర్తించొచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీరానికి రక్తసరఫరా అంతగా అవసరముండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులూలేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుంచి…

Read More

అధికబరువుతో రకరకాల అనర్థాలు పొంచి ఉన్న మాట నిజమే. కానీ తక్కువ బరువునూ తక్కువగా అంచనావేయటానికి వీల్లేదు. ఎందుకంటే శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) సాధారణ స్థాయిలో (18.5-25.9) గలవారి కన్నా తక్కువ బీఎంఐ (18.5, అంతకన్నా తక్కువ) గలవారికి రకరకాల కారణాలతో మరణించే ముప్పు 1.8 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే వూబకాయులకు (బీఎంఐ 30-34.9) మరణ ముప్పు 1.2 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక బీఎంఐ 35, అంతకంటే ఎక్కువగల వుబకాయులకు ఈ ముప్పు 1.3 రెట్లు ఎక్కువని తేలింది. అంటే వూబకాయం కంటే తక్కువ బరువే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నమాట. మన బీఎంఐ కేవలం శరీరంలోని కొవ్వును మాత్రమే కాదు. కండరాల మోతాదునూ ప్రతిబింబిస్తుంది. అందువల్ల వూబకాయాన్ని తగ్గించే విషయంలో కొవ్వు, కండరాల, ఎముక మోతాదులు తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన…

Read More

నవ్వు నాలుగిందాల చేటనేది పాత సామెత. నవ్వు నాలుగిందాల ఆరోగ్యదాయిని అనేది నేటి మాట. ఇది మంచి మందులా పనిచేస్తుందని, తరచుగా నవ్వుతూ గడిపేవాళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధనలు కూడా నొక్కి చెబుతున్నాయి. ఇంతకీ నవ్వినపుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ముఖంలోని కండరాలతో పాటు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. నాడి కొట్టుకోవటం, రక్తపోటు పెరుగుతుంది. శ్వాస వేగంగా తీసుకుంటాం. దీంతో మెదడుకు, కణజాలానికి ఆక్సిజన్ మరింతగా సరఫరా అవుతుంది. ఫలితంగా నిరుత్సాహం మాయమై హుషారు పుట్టుకొస్తుంది. నవ్వు చూపే ప్రభావాలపై చాలా పరిశోధనలు జరిగాయి. వాటి వివరాలేంటో చూద్దాం. భోజనం చేసిన తర్వాత హాస్య సన్నివేశాలను చూసిన మధుమేహుల రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గినట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. నవ్వు మూలంగా రక్తనాళాల సంకోచ, వ్యాకోచాలు తేలికగా జరుగుతున్నట్టు మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో బయటపడింది. ఇలా రక్తప్రసరణ మెరుగుపడటానికి నవ్వు తోడ్పడుతుందన్నమాట. నవ్వు తేలికపాటి వ్యాయామంతో…

Read More

మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువ గా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు. గుండెదడ లక్షణాలు గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్ష ణాలివి… ఆయాసం తలతిరగడం కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు. చికిత్స గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ…

Read More

గుండెదడ… ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్ని సార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగాచెప్పవచ్చు. గుండెదడ అంటే… గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు.…

Read More