Author: apanalysis
ప్రశ్న: నాకు చిన్నప్పటి నుంచి స్వయంతృప్తి అలవాటు ఉంది. కానీ నాకే ఈ అలవాటు ఉందా? అందరికీ ఉంటుందా? అనే అనుమానం నన్ను వేధిస్తూ ఉంటుంది. స్వయంతృప్తితో భావప్రాప్తి పొందిన ప్రతిసారీ తప్పు చేసిన భావన కలుగుతూ ఉంటుంది. అలాగని ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నాను. అసలు స్వయంతృప్తి పొందటం అనేది సహజసిద్ధమైన చర్యేనా?స్వయంతృప్తి వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా? సమాధానం: స్వయంతృప్తి సహజసిద్ధమైన, సాధారమైన చర్య. ప్రతి ఒక్కరూ స్వయంతృప్తి పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు స్వయంతృప్తి ద్వారానే జీవితంలో మొదటి లైంగిక తృప్తి పొందుతారు. మీరు అనుకుంటున్నట్టు ఈ పని తప్పేమీ కాదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా స్వయంతృప్తి పొందవచ్చు. స్వయంతృప్తి వల్ల శారీరకంగా, మానసికంగా ఎటువంటి అస్వస్థతలూ కలగవు. ఎంత తరచుగా చేసినా ఎటువంటి సమస్యలూ తలెత్తవు. అయితే అతి తక్కువ సమయంలో ఎక్కువ సార్లు స్వయంతృప్తి సాధన చేయటం వల్ల మర్మాయవాల్లో కొద్దిగా నొప్పితో కూడిన…
శారీరక శ్రమ లేకపోవటం, చాలాసేపు టీవీ చూడటం వల్ల వీర్యం చిక్కదనం, వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్‌కు చెందిన శాస్ర్తవేత్తలు చాలాకాలంగా వీర్యంపై ఆహారం, వ్యాయామం చూపే ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. శారీరక శ్రమ మూలంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ (విశృంఖల కణాలను తొలగించుకునే సమయంలో శరీరంపై పడే ఒత్తిడి) తగ్గుతున్నట్టు.. ఇది వీర్య కణాల రక్షణకు తోడ్పడుతున్నట్టు గత అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా వారు యువకులపై తాజాగా అధ్యయనం చేశారు. వారానికి 15 గంటల పాటు ఒక మాదిరి నుంచి తీవ్ర వ్యాయామం చేసినవారిలో వీర్యం చిక్కదనం చాలా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అలాగే టీవీ చూడని వారితో పోలిస్తే వారానికి 20 గంటల పాటు టీవీ ముందు గడిపే యువకుల్లో వీర్యకణాల సంఖ్య సుమారు సగం వరకు తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వీర్యకణాల చురుకుదనం, వాటి ఆకారం విషయంలో…
గర్భవతుల్లో సాధారణంగా 28వారాల సమయంలో గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణ పరిభాషలో హార్ట్బర్న్గా వ్యవహరిసు్తంటాం. ఈ సమస్య 28 వారాల తర్వాతి ప్రెగ్నెన్సీలో సాధారణమే అయినా ఒక్కోసారి వేవిళ్ల కారణంగా అర్లీ ప్రెగ్నెన్సీలోనూ కనిపిస్తుంటుంది. కడుపులో ఊరే జఠరరసం… అంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్… జీర్ణాశయం నుంచి పైకి అంటేఅన్నవాహిక వైపునకు ఎగదన్నడమే దీనికి కారణం.గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి మాయ (ప్లాసెంటా) నుంచి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలోఉండే పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ తన సహజ నైజం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే… పక్కనే…
Foods for Health యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు ఒక ఆపిల్‌ను కోసి వాతావరణంలో ఉంచారనుకోండి. ఆపిల్‌లోని ఇనుముతో గాలిలోని ఆక్సిజన్ చర్య జరిపి కాసేపటి తర్వాత అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. కానీ ఒక నిమ్మకాయను పిండి ఆ రసాన్ని ఆపిల్ ముక్కలపై పడేలా చేస్తే అది అలా మారదు. అంటే నిమ్మరసంలోని విటమిన్ ‘సి’ అనే యాంటీ ఆక్సిడెంట్… ఆపిల్‌లోని ఇనుము కణాల (ఫ్రీరాడికల్స్)తో గాలిలోని ఆక్సిజన్ కణాల (ఫ్రీ-రాడికల్స్) తో చర్యజరపకుండా కాపాడుతుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కణాలతో నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్య జరిపి ఆపిల్ నురక్షించాయన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఆపిల్ ముక్కలను తాజాగా ఉంచినట్లు, మన దేహంలోని కణాలనూ తాజాగా ఉంచుతాయన్న మాట. యాంటీ ఆక్సిడెంట్స్‌లో రకాలు : ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్స్ : గ్లూటాథయోన్, ఎస్ఓడీ వంటివి శరీరంలోనే ఉత్పత్తి అయి, అవి 24 గంటలూ…
Sitting Jobs చాలామంది గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోజిషన్ లో కూర్చుంటే అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛాస్వ నిశ్వాస లు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే… ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పని చేస్తున్న కొద్దిసేపటికే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు అదేపనిగా కంప్యూటర్ పై పనిచేయాల్సిన వారు కొద్ది సేపటితర్వాత ఒకసారి లేచి కాసేపు పక్కన తిరగాలి. అలాగే నేరుగా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు…
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:120%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:EN-US;} Tips for Couples సాధారణ ప్రసవమైనా లేదా సిజేరియన్ అయినా-ప్రసవం తర్వాత మెుదటి ఆరువారాలు సాధ్యమైనంత వరకు సెక్స్‌లో పాల్గొనకపోవడం మంచిది. ప్రసవమైన మహిళకు రక్తస్రావం, వైట్ డిశ్చార్జ్ లేకుండా ఉండి, ఆమె కూడా సెక్స్ కోసం శారీరకంగా, మానసికంగా సంసిద్ధంగా ఉంటే ఆరు వారాల తర్వాత నుంచి దంపతులిద్దరూ నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. బిడ్డకు పాలిస్తున్న తల్లులలో మెుదటి మూడు నెలలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ వుళ్లీ గర్భం వచ్చే అవకాశం తక్కువ. అయినప్పటికీ రిస్క్ తీసుకోకుండా రెండు సంవత్సరాల వరకు కచ్చితంగా మళ్లీ గర్భం…
Teeth Care Tips రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి నిరంతరం ప్రభావితమవుతుంటాయి. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు నోటి ఆరోగ్యాన్ని పదికాలాల పాటు కాపాడతాయి. అన్నింటికన్నా ముందు మనం చెప్పుకోవలసింది… తినే ఆహారం గురించే! పంటికి అతుక్కుపోయే అహారపదార్థాలు.. అంటే తీపి పదార్థాలైన చాక్లెట్లు, స్వీట్లు, బేకరీలలో ఎక్కువగా దొరికే ఆహారం ఎంతో ప్రమాదాన్ని తెచ్చి పెడ తాయి. సులభంగా నోట్లో మిగిలిపోకుండా పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా నేరుగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈ మధ్య అందరూ ఎక్కువగా తీసుకుంటున్న జంక్‌ఫుడ్ పంటిపైన,పంటి సందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలోఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. దాంతోనే అన్నిరకాల దంత సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక రెండవ విషయం… మన ఇంట్లో రోజువారీ శుభ్రత……
Foods for Healthy Tooth పండ్లు, కూరగాయలు క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు; పాలు, నట్స్, గుడ్లు, మాంసం.. లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలు పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాదు.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఎక్కువ మొత్తంలో నీరు నీరు కూడా దంతాల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించి నోటిలో లాలాజలం స్థాయుల్ని పెంచుతుంది. లాలాజలంలో 95 శాతం నీరు, ఎక్కువ శాతం ప్రొటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి దంతాల్లో ఏవైనా సమస్యలుంటే తొలగించి దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది. నిమ్మజాతి పండ్లు …
ప్రతి జీవికి ఆహారం కావాలి. ఆ ఆహారం కోసమే అనేకరకాల పవృత్తులతో వివిధ – వృత్తులు. వ్యాసంగాలు చేస్తుంటాం. ప్రతి 3 లేక 4 గంటలకు ఏదైనా ఆహారం తీసుకోకపోతే కడుపులో కలవరం బైలుదేరుటయేగాక – నీరసము, విసుగు, కోపం, తలనొప్పిలాంటి శారీరక బాహ్యలక్షణాలు కనుపిస్తుంటవి. దీనినే ఆకలి అనుకోవచ్చు. ఆకలి ప్రారంభించగానే తగిన ఆహారం తినకపోతే శరీరం మానసికంగాను, శారీరకంగాను చెయ్యవలసిన పనులపట్ల విముఖత జెందుతుంది ఆహారాన్ని నియబద్ధంగా తీసుకొనే అలవాట్లు గలవారికీ ఆకలి వెయ్యటం సహజంగా సంభవిస్తుంది. ఆ విధంగా కాక చిరుతిళ్ళు తినేవారికి, కాఫీ తేనీరులాంటి పానీయాలు అధికంగా సేవించేవారికి అమితంగా పొగత్రాగేవారికి యింకా మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆకలి అనేది కలుగదు. శరీరంలో ఆకలిని కలిగించే దాన్ని ”ఫీడింగ్ సెంటర్’ అని ఆహారం భుజించిన తర్వాత ఇకచాలు అనేభావం (తృప్తి) కలిగించే దాన్ని ”పేషైటీ సెంటర్’ అని అంటారు. ఆహారపు తృప్తికి మూలమైనది రక్తంలోని…
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమో గాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకు వాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవాలనుకునే వారి కోసమే ఈ కథనం. చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించు కుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా…
