Author: apanalysis
పెళ్ళయిన కొత్తలో రోజు సెక్స్ లో పాల్గొనే వారు 35-40 ఏళ్ళు వచ్చేసరికి అసక్తి ఉన్న కూడా వారానికి రోజుకు ఒకసారి మాత్రమే చేయగలుగుతున్నారు. దీనికి కారణం… సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఉద్ధృతంగా ఉంటాయి. సెక్స్ విషయంలో పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో (సెకండరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్ సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికి తోడు బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యల మూలంగా కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది. దీనిని చాలావరకు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా సామర్థ్య లోపాన్ని నివారించుకోవచ్చు. కానుక ఎటువంటి…
ఎక్సర్సైజ్లు చేస్తున్నవారిలో సెక్స్ బలహీనత వస్తుందన్న అపోహ కొందరిలో ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం బాగుండి సెక్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అయితే ఒక్కోసారి విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయి నొప్పుల వల్ల సెక్స్ చేయలేకపోవచ్చు. కాని, ఇది అలసట ఉన్నంత సేపు ఉండే తాత్కాలిక ప్రభావం మాత్రమే. ఎప్పుడూ జిమ్ ఎక్సర్ సైజ్లు మాత్రమే గాక ఏరోబిక్ ఎక్సర్సైజ్లు (సైక్లింగ్, వాకింగ్,జాగింగ్ వంటివి) చేయడం వల్ల ఆరోగ్యం మరింత బాగుంటుంది. సెక్స్ కు ఎక్సర్సైజ్ మరింత మేలు చేస్తుంది. కాబట్టి ఫెండ్స్ చెప్పే మాటలు విని అనవసర అపోహలు పెట్టుకోకండి. ప్రతిరోజు ఎక్సర్ సైజ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ తయారు చేసుకోండి. దీని వల్ల మీ సెక్స్ జీవితానికి ఏ విధమైన అపాయం లేదు.
తమ వయసుకు తగినట్లుగా ఎత్తు పెరగకపోవడం అన్నది చాలామందికి మనస్తాపం కలిగించే అంశమే. అది వాళ్లలో అత్మన్యూనతను పెంచుతుంది కూడా. మన జనాభాలో 3-5 శాతం మంది ఈ ఎత్తు పెరగకపోవడం అనే సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఎదిగే వయసులోని పిల్లలు, యుక్తవయస్కులను ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. నిజానికి ఎత్తు తక్కువగా ఉండటం ఒక వ్యాధి కాదు. సాధారణంగా తల్లిదండ్రులు తక్కువ ఎత్తు ఉంటే, జన్యుపరమైన కారణాలతో వాళ్ల పిల్లలూ తక్కువ ఎత్తే పెరుగుతారు. అయితే ఒక్కోసారి ఏదైనా వ్యాధి కారణంగా కూడా ఎత్తు పెరగకపోవడం జరగవచ్చు. అలాంటప్పుడు దానికి చికిత్స చేయవచ్చు. తద్వారా ఎత్తు పెరిగేలా చూడవచ్చు. ఎత్తు పెరగకపోవడానికి కారణాలు… ఎకాండ్రోప్లేసియా (జన్యుపరంగా వచ్చే సమస్యతో ఎత్తుపెరగకపోవడం) దీర్ఘకాలిక వ్యాధులు, పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు, మూత్రసంబంధ వ్యాధులు, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, యుక్తవయసులో వచ్చే కీళ్ల నొప్పులు (జువెనైల్ డయాబెటిక్ ఆర్థరైటిస్), మధుమేహం (డయా…
పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగాఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే దీనిని బై ఆట్రల్ పీసీఓడీ అంటారు. దీని బారిన పడిన చాలామంది స్ర్తీలు సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా…
బరువు తగ్గాలని మనలో చాల మందికి ఉండే కోరిక. దాని కోసం చాల కష్టపడుతూ ఉంటాం. ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఎందుకంటే బరువు తగ్గాలని డైటింగ్, ఎక్సర్ సైజ్ చేస్తున్నా తగ్గకపోవడానికి కారణం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే. బరువు తగ్గాలనుకునే వాళ్లందరూ సమాన్యంగా చేసే పని తిండి తగ్గించడం. అయితే పూర్తిగా తిండి తగ్గించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. దాని బదులు మనం ఎన్ని క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాలో అంతే మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచి పద్ధతి. బరువు తగ్గాలాను కొనేవారి కోసం కొన్ని సలహాలు, సూచనలు డైట్మనలో చాలమంది. తొందరగా బరువు తగ్గాలని క్రాష్ డైట్ ల మీద ఆధార పడతారు. ఇలాంటప్పుడు తీసుకునే డైట్ శరీర అవసరాలకు అస్సలు సరిపోక పోవచ్చు.. ఉదాహరణకు రోజు మొత్తానికి కలిపి ఏదో ఒక సూప్, పళ్లు మాత్రమే తీసుకునే డైట్ వల్ల మనకు…
భార్యాభర్తల బంధం దృఢ పడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో; లైంగిక చర్య కూడా అంతే ముఖ్యం. ఆలుమగలిద్దరూ పూర్తి ఇష్టంతో, సౌఖ్యంగా కలయికలో పాల్గొంటేనే అది సంపూర్ణం కావడంతో పాటు, ఇద్దరికీ సంతృప్తి కలుగుతుంది. కానీ, ఇటువంటి కీలక సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దంపతులిద్దరికీ లైంగిక పరంగా అసంతృప్తి కలుగుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే… చాల మంది పెళ్లి కుదిరి నప్పటి నుండే వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటారు. కానీ, ఆ కలలన్నీ నిజమయ్యే సమయం వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని భయం, సందేహాలు. అన్నీ ఒకేసారి చుట్టి ముట్టి మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అందుకే శారీరక కలయికని కొంతమంది ఎంజాయ్ చేస్తే, మరికొందరు మాత్రం భయం వల్ల, లేక ఇష్టం లేకపోవడం వల్ల, ఇలా ఏదో ఒక కారణంతో కలయికకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి, అలా దూరంగా ఉండకుండా, కలయికను…
టీవీ చూసేటప్పుడు, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు, దాదాపు అందరూ కూర్చునే ఉంటారు. కానీ ఇలా కూర్చుని ఉండడం వల్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం వుంది. కాబట్టి గంటల కొద్దీ అలానే కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందులు… ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు నడుము చుట్టు వచ్చి చేరుతుంది. ఫలితంగా స్థూలకాయం, రక్తంలో చెక్కర స్ధాయిలు ఎక్కువవడం, రక్తపోటు పెరగడం మొదలైన ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రోజులో ఎక్కువ సమయం కూర్చునే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల గుండె ఆరోగ్యం దెబ్బతినడమే కాదు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల డయాబటెస్ సమస్య ఎదురవుతుంది. అధిక సమయాన్ని కూర్చోవడానికే కేటయిస్తే మూత్రపిండాలకు సంబంధించిన రకరకాల…
పిల్లలు పుట్టక ముందు వరకూ లైంగిక జీవితాన్ని బాగానే ఆనందిస్తారు. ఒకసారి ప్రసవం అయిన తరువాత లైంగికాసక్తి తగ్గిపోయింది. దానికి తోడు ఒత్తిడిగానూ అనిపిస్తోంది. ఆ పరిస్థితిని ప్టోనేల్ డిప్రెషస్ అంటారు. గర్భం దాల్చడం, ప్రసవం కావడం, ఆ సమయంలో రకరకాల మందులు వాడడం శారీరకంగా జరిగిన మార్పులూ, ఆకృతిపరంగా వచ్చిన తేడా మళ్లీ భవిష్యత్తులో గర్భం దాల్చడం గురించి భయపడం లాంటివి కొన్నిసార్లు లైంగికాసక్తిని తగ్గిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బలవంతంతో కలయికలో పాల్గొనడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. అలగని భాగస్వామికి పూర్తిగా దూరంగా ఉండాలనీ లేదు. కలయికలో పాల్గొనకపోయినా ఇద్దరూ కలిసి ఏకాంత సమయాన్ని కల్పించుకోవచ్చు. దాంతో పాటూ మీకున్న అసౌకర్యాన్నీ, ఇబ్బందినీ మీ భాగస్వామికి వివరిస్తే, తప్పకుండా అర్థం చేసుకుంటారు. చాల తక్కువ సమయంలోనే ఈ పరిస్థితి సర్దుకుంటుంది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోతే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-fareast-language:EN-US;} ఒక్కసారి మధుమేహం వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఎంత తినాలి? వంటి విషయాలన్నో పరిగణనలోకి తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి. మధుమేహంతో బాధపడే వాళ్లు యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే డయాబెటిక్ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వాటి ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా అందాల్సి ఉంటుంది. ఒకవేళ ఉదయం ఆలస్యంగా నిద్ర లేచినా, ఖాళీ కడుపుతో అలాగే ఉండకుండా ప్రొటన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్డులోని తెల్లసొన భాగాన్ని ఉడికించి…
రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణం. రక్తహీనత రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నిస్సత్తువగా ఉండటం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి… ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచ బారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను తీసుకుంటుండాలి. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే రక్తం బాగా పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కాస్త టిఫిన్ తిన్నాక… గంటసేపటి తర్వాత…
