Author: apanalysis

నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్ (యాంటీస్పెర్మ్ యాంటీబాడీ) స్థాయులు…

Read More

అశ్లీల చిత్రాలు తరచుగా చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఇది పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గటానికి, స్తంభనలోపానికి దారితీయొచ్చు!అశ్లీల చిత్రాలను చూడటం కూడా ఒకరకంగా కొకైన్ వంటి మాదక ద్రవ్యాల వ్యసనం లాంటిదే అనుకోవచ్చు. మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మన మెదడులో ‘హాయి భావన’ కలిగించే భాగాలు ప్రేరేపితమవుతుంటాయి. అందుకే మాదక ద్రవ్యాలను మళ్లీ మళ్లీ తీసుకోవాలని మనసు తహతహలాడిపోతుంటుంది. అయితే చిక్కేటంటే.. ఒకసారి వీటికి అలవాటుపడితే క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకునే’ సామర్థ్యమూ పెరుగుతూ వస్తుండటం. మొదట్లో మాదిరిగా హాయి కలగదు. అందువల్ల తరచుగా.. మరింత ఎక్కువ మోతాదులో మాదక ద్రవ్యాలను తీసుకోవటమూ మొదలవుతుంది. అశ్లీల చిత్రాలను తరచుగా చూసేవారిలోనూ ఇలాగే జరుగుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో ప్రేరేపితమయ్యే భాగాలే ప్రేరేపితమవుతాయి. వీటిని తరచుగా చూసేవారిలో క్రమంగా వాటి ప్రభావాన్ని ‘తట్టుకోవటం’ సంభవిస్తోందని.. దీంతో శృంగార స్పందనలు,…

Read More

శృంగారమన్నది ఏమాత్రం చీకటి వ్యవహారం కాదు. ఆబగా, ఆదరాబాదరగా కానిచ్చే పని అంతకంటే కాదు. ముఖ్యంగా పెళ్లైన తర్వాత మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరముంటుంది. సెక్స్ అంటే అంగాంగ సంభోగం ఒక్కటే కాదు.. భాగస్వామని అర్థం చేసుకోవటం, ఇష్టాయిష్టాలను గౌరవించటం వంటి ఎన్నో అంశాలతో ముడిపడిన వ్యవహారమన్న విస్తృతమైన అవగాహన ఉండాలి. అప్పుడే సెక్స్ను మరింతగా ఆస్వాదించే అవకాశముంది. నిజానికి పెళ్లైన కొత్తలో దంపతులకు అంతా కొత్తగా ఉంటుంది. అంతకు ముందు పుస్తకాల్లో చదివిన విషయాలకూ, తమకు అనుభవంలో ఎదురవుతున్న పరిణామాలకూ పొంతన ఉండకపోవచ్చు. అప్పటికే నీలి చిత్రాల వంటివి చూసిన కొందరు.. తమ జీవితం అలా లేదేంటని నిరాశలోకి జారి, జావగారిపోతుంటారు. బయటికి చెప్పకోలేక లోలోపలే మథనపడుతుంటారు. అంగ ప్రవేశానికి భాగస్వామి సహాయం అవసరమన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి నూతన దంపతులకు ముందు నుంచే లైంగిక ఆరోగ్యంపై చక్కటి అవగాహన ఉండటం అవసరం. శృంగారమన్నది ఒక బాధ్యతాయుతమైన…

Read More

మన సమాజంలో ఎంతోమంది ఇప్పటికే స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం తదితరాలతో బాధపడుతున్నారు. అలాగే అంగ స్తంభన సమస్యతోనూ బాధపడుతున్నారు. కానీ చాలామంది వీటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించలేక.. ఆ అవగాహన లేక చీకట్లో ఉండిపోతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రతి పురుషుడికీ కూడా ఎంతోకొంత అంగస్తంభన లోపం ఉండే అవకాశం ఉంది. పైగా అది గుండె జబ్బు కంటే చాలా ముందే వచ్చే అవకాశమూ ఉంది. మనం మధుమేహంలో ముందున్నాం! హైబీపీలోనూ తక్కువేం లేం!! మన భారతీయుల్లో కొలెస్ట్రాలూ ఎక్కువే!!! ఫలితం… మనకు గుండెపోటు, పక్షవాతం ముప్పు చాలా ఎక్కువ. గుండె నుంచి కిడ్నీల వరకూ.. కళ్ల నుంచి కాళ్ల వరకూ రకరకాల వ్యాధులూ వెన్నాడొచ్చు. ఇదంతా మనం తరచూ వింటున్నదే. ఇది కచ్చితంగా మనకు హెచ్చరికే. అయితే మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వల్ల కేవలం గుండె జబ్బులూ.. పక్షవాతాలే కాదు… వాటికంటే ముందే… మరో పెను…

Read More

నేను నా భర్తతో కలిసినప్పుడు స్పెర్మ్ బయటికి వచ్చింది. ఇలా జరగడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయా? గర్భం ధరించాలంటే నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు, ఎన్ని రోజుల పాటు కలవాల్సి ఉంటుంది..? కలయిక సమయంలో ఇలా స్పెర్మ్ బయటికి రావడం అన్నది సర్వసాధారణం. చురుకుగా కదిలే స్పెర్మ్స్ వాటంతట అవే గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి, అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబుల్లోకి ప్రవేశిస్తాయి. సెమెన్లో ఉన్న ద్రవపదార్థం మాత్రం బయటికి వచ్చేస్తుంది. అందుకని ఇలా జరగడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అన్న భయం అవసరం లేదు. మీరు ఫెర్త్టెల్ పిరియడ్ గురించి అడిగారు. మీకు నెలసరి క్రమం తప్పకుండా 28 రోజుకోసారి గనుక వస్తున్నట్లయితే నెలసరి వచ్చిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజు విడిచి రోజు కలిసుంటే సరిపోతుంది. ఈ సమయంలో అండం విడుదలవుతుంది కాబట్టి గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Read More

హలో మేడం. నాకు పెళ్త్లె సంవత్సరం అవుతుంది. ప్రస్తుతం మేము పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. పిరియడ్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది. ఆ సమయాన్ని ఎలా కౌంట్ చేయాలి? దయచేసి తెలుపగలరు.? మీకు ఎప్పుడైతే అండం ఉత్పత్తి అవుతుందో ఆ రోజుల్లో పిల్లల కోసం ప్లాన్ చేయాలనుకుంటున్నారు. అది సరైన ఆలోచనే కానీ మీకు రుతుక్రమం ఎన్ని రోజులకోసారి వస్తుందో తెలియకుండా అండం ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం కష్టం. ఓవ్యులేషన్ అనేది ఎప్పుడైనా రాబోయే నెలసరికి 14 రోజులు ముందుగా జరుగుతుంది. అంటే 28 రోజుల రుతుచక్రం ఉండే వారికి 14వ రోజున, 35 రోజులుండే వారికి 21వ రోజున, 40 రోజులుండే వారికి 26వ రోజున అండం విడుదలవుతుంది. ఈ లెక్క కూడా కచ్చితం కాదు. ఒక నాలుగైదు రోజులు అటూ ఇటుగా జరగచ్చు. అందుకని అండం విడుదలయ్యే సమయానికి నాలుగు రోజుల ముందు నాలుగు రోజుల…

Read More

పీసీఓడీ అనేది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్. సాధారణంగా ఇది జన్యుపరంగా సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నట్టుండి బాగా బరువు పెరగడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం.. మొదలైన సందర్భాల్లో ఈ సమస్య బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని హార్మోన్స్ స్థాయిలు మారతాయి. ఇన్సులిన్ మామూలుగానే ఉత్పత్తి అవుతున్నా.. శరీరం దాన్ని వినియోగించుకోలేదు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ నిల్వలు ఎక్కువగా ఉండిపోతాయి. ఈ పరిస్థితిని హైపర్ ఇన్సులినీమియా అని అంటారు. శరీరంలో పురుష హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఎక్కువగా బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం.. మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం అండం విడుదల కాకపోవడమే. కాబట్టి ఇన్ఫెర్టిలిటీ, నెలసరి క్రమంగా రాకపోవడం, నెలసరి వచ్చినా రక్తస్రావం ఎక్కువగా అవడం.. మొదలైన సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు.. ఇలాంటి సమస్యతో బాధపడే మహిళలు గర్భం ధరించినా అబార్షన్ అయిపోతుంది.…

Read More

అధికశాతం స్త్రీలలో బహిష్టుస్రావం కనబడిన 10వ రోజునుంచి 18వ రోజులోపల అండం విడుదల అవుతుంది. ఎక్కడో చాలా కొద్దిమందిలోనే ఇలా కాకుండా బహిష్టుకి ముందూ-వెనకా ఎప్పుడైనా జరగవచ్చు. అండం విడుదల తెలుసుకోవడం కోసం ఏ స్త్రీ అయినా బహిష్టుస్రావం కనబడిన మొదటిరోజు నుంచి తిరగి బహిష్టు కనబడేవరకు ఒక పద్ధతి ప్రకారం శరీర ఉష్ణోగ్రతని రికార్డు చేయాలి. తాను నిద్రలేస్తూనే ఇంకా మంచం కూడా దిగకుండా నోట్లో థర్మామీటరు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న థర్మామీటరుని రెండు నిమిషాలు నోట్లో వుంచుకోవాలి. ఆ తరువాత థర్మామీటరులో ఎంత టెంపరేచరు వున్నదీ చూడాలి. ఇలా చూపిన టెంపరేచరుని ఒక కాగితం మీద నోట్ చేయాలి. ఏ రోజుకారోజు బహిష్టుస్రావమై, అప్పటికి ఎన్నో రోజో, ఏ తారీసాధారణంగా మొదటి కొద్దిరోజులు శరీర ఉష్ణోగ్రత 97.6 లేదా 98 డిగ్రీల ఫారన్హీట్ వుంటుంది.అండం విడుదలతో పెరిగే శరీర ఉష్ణోగ్రతఇలావుండగా నెలమధ్యలో అకస్మాత్తుగా టెంపరేచర్ 98.6 లేదా 99…

Read More

గర్భం రాకపోవడానికి స్త్రీలెంత కారణమో, పురుషులూ అంతే. పురుషునిలో వీర్య స్ఖలనం వున్నా అందులో వీర్యకణాలు వుండకపోవచ్చు. ఒకవేళ వున్నా తగినన్ని లేక పోవచ్చు. పైగా చక్కని కదలిక లేకపోవచ్చు. ఇటువంటప్పుడు స్త్రీలో అంతా చక్కగా వున్నాగర్భం రాదు. వీర్యం పలచగా ఉంటే గర్భం రాదా?వీర్యం పలచన, చిక్కనబట్టి గర్భం రావడం ఆధారపడిలేదు. సాధారణంగా పురుషుడు స్ఖలించే వీర్యం 2 నుంచి 6 ఎం.ఎల్. వుంటుంది. అలా స్ఖలించిన ప్రతీ యం.యల్. లో 60 నుంచి 120 మిలియన్ల వీర్య కణాలు వుంటాయి. ఇంతకంటే ఎక్కువ కూడా వుంటాయి. చక్కని సంతాన సాఫల్యత కలిగిన వీర్యంలో అన్ని వీర్యకణాలూ చక్కని కదలిక, చక్కని రూపాన్ని కలిగి వుంటాయి. ఎవరిలోనైనా వీర్యం కనీసం 2 యం.యల్. వుండి, ప్రతీ యం.యల్.కి 60 మిలియన్ వీర్యకణాలు వుండి, 6-8 గంటల తరువాత కూడా వాటిల్లో కనీసం 40 శాతం చక్కని కదలిక కలిగి వుంటేనూ,…

Read More

గర్భం రావడానికి పురుషుడు రెగ్యులర్గా దాంపత్యంలో పాల్గొనాలి. తరచు గనేరియా వంటి సుఖవ్యాధులకి గురి అవుతున్నా, మూత్రసంబంధిత వ్యాధులు వస్తున్నా గర్భం రాదు. వృషణాలకి దెబ్బతగలడం, ఇన్ఫెక్షన్ రావడం వాపు ఉన్నట్లయితే వీర్యకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం వుంది. దిగని వృషణాలు, కలగని సంతానంకొందరు పురుషులలో వృషణాలు బీజకోశంలో కాకుండా, పొత్తికడుపు దగ్గరవుంటాయి. మరికొందరిలో వృషణాలు చింతపిక్కలంత చిన్నవిగా వుంటాయి. ఇటువంటి వారు సెక్స్లో సమర్థవంతంగా పాల్గొనగలుగుతారు కానీ, సంతాన సాఫల్యత వుండదు. కొందరు పురుషులకి మూత్రద్వారం పురుషాంగం చివర్లో కాకుండా మొదట్లో వుంటుంది. ఇటువంటి వారికి మూత్రం, వీర్యం అక్కడ నుంచే వుంటుంది.వీరిలో అంగప్రవేశం ఇబ్బందిలేకపోయినా మూత్రద్వారం పురుషాంగం మొదట్లోనే వుండబట్టి వీర్యమంతా యోని బయటే పడిపోతుంది.సంతానం కలగనప్పుడు పురుషుని వీర్యం ఒక్కటే పరీక్షచేస్తే చాలదు. పురుషాంగం, వృషణాలు ఎలా వున్నవీ నిశితంగా పరీక్షించాలి. అలాగే వీర్యంలో వీర్యకణాలు ఎన్ని వున్నవీ, ఎలా వున్నవీ చూడాలి. మద్యం, మత్తు పదార్థం…

Read More