Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » స్తంభన లోపం గుర్తించేదెలా?
for Couples

స్తంభన లోపం గుర్తించేదెలా?

apanalysisBy apanalysisSeptember 6, 2018Updated:May 4, 2026No Comments7 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మన సమాజంలో ఎంతోమంది ఇప్పటికే స్థూలకాయం, అధిక రక్తపోటు,  మధుమేహం తదితరాలతో బాధపడుతున్నారు. అలాగే అంగ స్తంభన సమస్యతోనూ బాధపడుతున్నారు. కానీ చాలామంది వీటి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించలేక.. ఆ అవగాహన లేక చీకట్లో ఉండిపోతున్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రతి పురుషుడికీ కూడా ఎంతోకొంత అంగస్తంభన లోపం ఉండే అవకాశం ఉంది. పైగా అది గుండె జబ్బు కంటే చాలా ముందే వచ్చే అవకాశమూ ఉంది. మనం మధుమేహంలో ముందున్నాం! 

హైబీపీలోనూ తక్కువేం లేం!!  మన భారతీయుల్లో కొలెస్ట్రాలూ ఎక్కువే!!!  ఫలితం… మనకు గుండెపోటు, పక్షవాతం ముప్పు చాలా ఎక్కువ. గుండె నుంచి కిడ్నీల వరకూ.. కళ్ల నుంచి కాళ్ల వరకూ  రకరకాల వ్యాధులూ వెన్నాడొచ్చు.  ఇదంతా మనం తరచూ వింటున్నదే. ఇది కచ్చితంగా మనకు హెచ్చరికే. అయితే మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వల్ల కేవలం గుండె జబ్బులూ.. పక్షవాతాలే కాదు… వాటికంటే ముందే… మరో పెను సమస్యా తలెత్తుతోంది.   దీని గురించి ఎక్కడా పెద్దగా వినపడదు. ఎవరూ పెద్దగా ప్రస్తావించరు.  కానీ.. ఎవరికి వారే తమలో తామే మథనపడుతున్నారు. లోలోపలే నిట్టూరుస్తున్నారు. కళ్ల ముందే కలలు జావగారిపోతూ.. సత్తువ సన్నగిల్లిపోతుంటే.. కక్కలేక మింగలేక.. భాగస్వామిని వూరించలేక..  వూరడించలేక.. ఆనందాన్ని పొందలేక.. ఆవేదనను పంచుకోలేక.. చీకటిలోనే చితికిపోతున్నారు.  ఇంతటి ఆవేదనకు మూలం.. స్తంభన సన్నగిల్లిపోతుండటం! గట్టిదనం.. ఓటిపోతుండటం! మధుమేహం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు.. పురుషాంగ స్తంభననూ దెబ్బతీస్తాయని తెలియక.. ఆ అవగాహన లేక.. ఎంతోమంది మౌనంగా వ్యథ చెందుతున్నారు.
నిజానికి ఇదో పెను హెచ్చరిక. స్తంభన లోపం.. గుండె జబ్బుల వంటి వాటి కంటే ముందే మొదలవుతుంది. కాబట్టి స్తంభన అనుమానంగా ఉన్నప్పుడే సమస్యను గుర్తిస్తే.. వెంటనే జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా.. ఇతరత్రా పెను వ్యాధులనూ అడ్డుకోవచ్చు. దాంపత్య జీవితాన్నీ నిలబెట్టుకోవచ్చు. అందుకే దీని గురించి సమగ్ర వివరాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది
ఇదో హెచ్చరిక… అంగ స్తంభన లోపానికి కారణమవుతున్న చాలా అంశాలు.. ప్రమాదకరమైనవి!   మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, రక్తనాళాల వ్యాధుల వంటివన్నీ గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యలను తెచ్చిపెడతాయని తెలుసుగానీ గుండె, మెదడు వంటి వాటిని ప్రభావితం చేయటానికంటే చాలా చాలా ముందే.. అవి సున్నితమైన పురుషాంగంలోని రక్తనాళాలను, నాడులను దెబ్బతీస్తాయి. ఫలితం అంగ స్తంభన సమస్య! దీన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే గుర్తించి శ్రద్ధ తీసుకుంటే.. దాంపత్య జీవితాన్ని నిలబెట్టుకోవటమే కాదు.. గుండెపోటు, పక్షవాతం వంటి పెను సమస్యలను నివారించుకోవటం కూడా సాధ్యపడుతుందని ఇప్పుడు వైద్య ప్రపంచం స్పష్టంగా గుర్తించింది.

లోపం ఎక్కడ? .. వూబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి అంగస్తంభన లోపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి పొగ, మద్యం వంటి అలవాట్లు… శారీరక శ్రమ లేకపోవటం, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువెక్కువ తింటుండటం… వంటి జీవనశైలి సమస్యలు కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. మన భారతీయులకు జన్యుపరంగానే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. వాటికి ఈ అస్తవ్యస్తమైన జీవనశైలి, అలవాట్లు కూడా తోడయ్యే సరికి.. రకరకాల జబ్బులు చుట్టుముడుతున్నాయి. ఆ ప్రభావం అంగ స్తంభన పైనా పడుతోంది. ఫలితంగానే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇప్పుడు మధ్యవయసులోనే స్తంభన లోపాలతో తీవ్రంగా మథనపడుతున్నారు. వాస్తవానికి మధుమేహం, హైబీపీ వంటివాటికి సరైన చికిత్స తీసుకుంటుంటే దుష్ప్రభావాల బారిన పడకుండా చూసుకోవచ్చు. కానీ అంగస్తంభన లోపంతో బాధపడే వారిలో చాలామంది పరిస్థితి ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. అప్పటికే సమస్య ముదిరిపోయి ఉంటోంది. ఫలితంగా దాంపత్య జీవితమే కాదు.. సామాజికంగా కూడా ఎంతో నష్టం జరుగుతోంది.

నష్టం.. ఎలా?
మధుమేహం:మధుమేహం చాలా రకాలుగా అంగస్తంభన లోపానికి కారణమవుతుంది. మధుమేహం కారణంగా శరీరంలోని పెద్ద రక్తనాళాలే కాదు చిన్న రక్తనాళాలూ దెబ్బతింటాయి. దీన్నే ‘మైక్రోయాంజియోపతి’ అంటారు. ఫలితంగా శరీరంలోని అవయవాలకు కావలసినంత రక్త సరఫరా లభించదు. అంగస్తంభనకు మూలమైనది, అత్యంత కీలకమైనది ఈ రక్త సరఫరానే. పురుషాంగానికి రక్తసరఫరా బాగుండి, అది రక్తంతో నిండితేనే అసలు స్తంభన సాధ్యమవుతుంది. (కింద వివరంగా) అందుకే మధుమేహం కారణంగా రక్తనాళాలు దెబ్బతింటే స్తంభన సమస్య తలెత్తుతుంది. రెండోది- మధుమేహం శరీరంలోని నాడులనూ దెబ్బతీస్తుంది. ఇదీ అంగస్తంభన లోపాన్ని కలిగించే సమస్యే. వీటికి తోడు మధుమేహులలో వూబకాయం, అధిక రక్తపోటు వంటి ‘మెటబాలిక్ సిండ్రోమ్’ లక్షణాలన్నీ కలిసికట్టుగా ఉండే అవకాశం ఎక్కువ. అవీ సమస్యలను పెంచేవే.

వూబకాయం:
మధుమేహానికి స్థూలకాయం కూడా తోడైతే శరీరంలో పేరుకొనే కొవ్వు- ‘ఆరోమటేజ్’ అనే ఎంజైమును స్రవిస్తుంది.. అది రక్తప్రవాహంలో ఉన్న పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ను స్త్రీహార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్లుగా మార్చేస్తుంది. దీనర్థం పురుషుడు ఒక రకంగా స్త్రీ లక్షణాలను సంతరించుకున్నట్టే! వీటన్నింటి వల్లా మధుమేహులు, వూబకాయుల్లో అంగస్తంభన సమస్య తీవ్రమవుతుంది.
హైబీపీ, అధిక కొలెస్ట్రాల్: అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్న వారిలో రక్తనాళాలకు సాగే గుణం, ఆ సున్నితత్వం తగ్గి అవి గట్టిపడతాయి. దీంతో వాటిలో రక్తప్రసారం సజావుగా సాగదు. ఇక రక్తనాళాల గోడలకు పేరుకునే కొలెస్ట్రాల్.. రక్తనాళాల సామర్థ్యాన్ని దెబ్బతీసి, రక్త ప్రవాహానికి అవరోధంగా తయారవుతుంది. దీంతో గుండె ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. ఎంతచేసినా దీనివల్ల- గుండెకు దూరంగా ఉండే అవయవాలకు రక్త ప్రసరణ సరిపడినంతగా అందదు. పైగా గుండెకు ఎంత దూరంగా ఉంటే అంత తగ్గుతుంది. ఫలితంగా- కాళ్ల వేళ్లకు, చేతి వేళ్లకు.. ఇలా కొస అవయవాలకు రక్తప్రసారం తగ్గుతుంది. పురుషాంగం కూడా చేతి వేళ్లలాంటి, కాలి వేళ్లలాంటి ఒక కొస అవయవమే. అందుకే దానికీ రక్తప్రసారం సన్నగిల్లిపోతుంది. ఫలితం- స్తంభన సమస్య.

* అందుకే ఇవాల్టి రోజున అంగ స్తంభన లోపాన్ని.. మున్ముందు రాబోయే గుండె, రక్తనాళాల వ్యాధులకు ఒక ముందస్తు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మన దేశంలో అధిక సంఖ్యలో గుండె జబ్బు బాధితులున్నారు. దీన్ని బట్టి స్తంభన లోపం ఎంత ఎక్కువగా ఉందో మనం గ్రహించవచ్చు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎక్కువ. ఇది ఒక్క రోజులోనో అప్పటికప్పుడో పుట్టుకొచ్చేది కాదు. దీనికి చాలాకాలం ముందు నుంచే గుండె జబ్బు మొదలై ఉంటుంది. వారిలో అంగస్తంభన లోపం కూడా అంతకు ముందే ఆరంభమై ఉండొచ్చు. కాబట్టి- కనీసం దాన్ని గుర్తించి పరీక్షలు చేయించుకున్నా.. గుండె జబ్బుల ముప్పు నుంచి ముందుగానే బయటపడటానికి వీలుండేదని చెప్పుకోవచ్చు.
  స్తంభన ఎలా?
అంగం సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. దీని మధ్యలో రెండు గొట్టాల వంటి సున్నిత స్పాంజి వంటి కండర నిర్మాణాలు (కార్పోరా కావర్నోజా) ఉంటాయి. ఇవి ఎప్పుడూ సంకోచించి ఉంటాయి. శృంగార భావనలు కలిగినప్పుడు.. అంగంలోని ఈ సున్నితమైన కండరాలు విశ్రాంతిగా.. వదులుగా తయారవుతాయి. దీంతో వీటిలోకి రక్త ప్రవాహం పెరిగిపోయి అంగం స్తంభిస్తుంది.
* శృంగార భావనలను ముందుగా మెదడు ప్రేరేపిస్తుంది. అవి అక్కడి నుంచి వెన్నుపాములోని నాడుల ద్వారా అంగానికి చేరుకుంటాయి. వెంటనే అక్కడి సున్నిత కండరాలు విశ్రాంతి భావనలోకి రావటం.. రక్తం లోపలికి వచ్చి చేరిపోవటం జరుగుతుంది. ఇక ఆ రక్తం తిరిగి బయటకు వెళ్లిపోకుండా సిరలకు ఉండే కవాటాలు మూసుకుంటాయి. దీంతో రక్తం లోపలే ఉండి… స్తంభన నిలబడుతుంది. ఒకసారి శృంగార వాంఛ పూర్తయినా, స్ఖలనమైనా.. ఆ ప్రేరేపణలు తగ్గి.. ఆ కవాటాలు తెరుచుకుని.. రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. స్తంభన తగ్గి.. అంగం సాధారణ స్థితికి వస్తుంది. అందుకే అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర.

వయసుతో పాటు ..
వయసుతో పాటు టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గుతాయి. శృంగార వాంఛలు తగ్గుతాయి. రక్తనాళాల్లో వయసుతో పాటు ఎంతోకొంత మార్పులు వస్తాయి కాబట్టి స్తంభనలూ కొంత తగ్గుతాయి. మెసాచుసెట్స్ అధ్యయనంలో 40 ఏళ్లు పైబడిన పురుషుల్లో 52 శాతం మందికి ఎంతోకొంత స్తంభన తగ్గుతుందని గుర్తించారు. అయితే ఇది ‘స్తంభన లోపం’గా గుర్తించేంత స్థాయికి చేరుకుందా? లేదా? అన్నది కీలకాంశం.

చికిత్స..
మందులు: స్తంభన లోపానికి ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ‘వయగ్రా’ సమర్థంగా పనిచేస్తున్నట్టు నిరూపణ అయ్యింది. దీనితో దుష్ప్రభావాలూ చాలా తక్కువ. సరైన మోతాదులో వేసుకుంటున్న వారిలో 70-80% మందిలో మంచి ఫలితాన్నిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో తగు మోతాదులో సరైన క్రమంలో వాడుకోవటం తప్పనిసరి. వయగ్రా తాత్కాలికంగా పనిచేసే మందే గానీ శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తించాలి. సమస్యను బట్టి హార్మోన్ మాత్రల వంటివీ అవసరమవుతాయి.
* వయగ్రాతో ఫలితం లేని కొందరికి సర్జరీలూ అవసరమవుతాయి. శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలంటే ‘పీనైల్ ప్రోస్థెటిక్ ఇంప్లాంటేషన్ సర్జరీ’ ఉపయోగపడుతుంది.

స్తంభన లోపం గుర్తించేదెలా?
శృంగారంపై ఆసక్తి తగ్గటం (లిబిడో లాస్) అనేది వేరే సమస్య. అలాగే శీఘ్రంగా స్ఖలనమైపోవటమన్నదీ వేరే సమస్య. స్తంభన సమస్య వీటికి భిన్నమైనది. పురుషుడు తాను కోరుకున్నప్పడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. ఒకప్పుడు అంగస్తంభన లోపానికి మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారుగానీ ఎక్కువభాగం వీరిలో శారీరక సమస్యలే కారణమవుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. కాబట్టి అసలు స్తంభన లోపం ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పని తీరు ఎలా ఉందో పరీక్షిస్తారు.
** స్తంభన సామర్ధ్యానికి రిజిస్కాన్, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పీనైల్ డాప్లర్ ఎవాల్యుయేషన్ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
** రక్తపరీక్షలో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు.

ఇదీ ముఖ్యమే
** స్తంభన సమస్యలతో బాధితులు వచ్చినప్పుడు వైద్యులు పీనైల్ డాప్లర్ పరీక్షలో రక్తనాళాలు పూడుకున్నాయని గుర్తిస్తే.. అధిక రక్తపోటు ఉందా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? అన్నది చూస్తారు. గుండె జబ్బు కూడా ఉందా? అన్నది తెలుసుకునేందుకు కార్డియాలజిస్ట్ వంటి ప్రత్యేక నిపుణుల వద్దకు పంపిస్తారు.
** స్తంభన లోపంతో వచ్చే దాదాపు అందరిలోనూ మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉంటాయి. అంగానికి రక్తసరఫరా కొద్దిగా తగ్గిన వారిలో అంగం స్తంభిస్తుంది కానీ ఎక్కువసేపు గట్టిగా ఉండలేదు. ఇలాంటి వాళ్లు ఎలాగోలా భాగస్వామితో నెట్టుకొస్తుంటారు. మన దేశంలో స్త్రీలు శృంగారంలో తృప్తి పొందలేకపోయినా దాన్ని మనసులోనే దాచుకోవటంలో, సహకరించటంలో ముందుంటారు. అయితే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. ఆధునిక మహిళలు సెక్స్ విషయాల్లోనూ అవగాహన కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఎంతోమంది భార్యలే భర్తలను వైద్యుల వద్దకు తెస్తున్నారు కూడా.


** గుండెలోని రక్తనాళాలు 80% మూసుకుపోయినా.. చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తుంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు. అవి చాలా సున్నితమైనవి, కొంత వరకూ ఫర్వాలేదుగానీ అది ఇంకా ముదిరితే దాన్ని చక్కదిద్దటం కష్టం. అందుకే ఒకసారి స్తంభన లోపం వచ్చిన తర్వాత… హైబీపీ, మధుమేహం వంటివాటిని అదుపులో ఉంచుకుంటున్నప్పటికీ స్తంభన లోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పటం కష్టం. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి వాటి ద్వారా చాలా కొద్దిమేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి.
** యువకుల్లో ఏర్పడే స్తంభన లోపాన్ని తొలిదశలోనే గుర్తించి, జీవనశైలి మార్పులతో జాగ్రత్త పడితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.
శృంగారం, సంభోగం విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మన దేశంలో పురుషులు దాన్ని అంగీకరించటానికి ముందుకు రావటం లేదు. దాన్ని స్త్రీల మీదికి నెట్టటానికే ప్రయత్నిస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల వారిలో సమస్యలను ముందే పట్టించుకునే అవకాశం లేకుండా పోతోందని మర్చిపోకూడదు.
** పొగ, మద్యం మానెయ్యటం.. శారీరక శ్రమ చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటివల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరగవుతుంది. గుండె రక్తనాళాల పనితీరూ బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఉపయోగపడతాయి.
** జీవనశైలి మార్పులతో భాగస్వామితో సంబంధాలు కూడా మెరగవుతాయి. కేవలం సంభోగం విషయంలోనే కాదు సాన్నిహిత్యం పెరగటానికీ తోడ్పడతాయి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

ఇతరులతో చెప్పుకోలేని స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.