Author: apanalysis
మానసిక ఒత్తిడి వల్ల కలిగే శారీరకంగానూ సమస్యలు ఎదురవుతాయని గుర్తించినప్పుడు చేయాల్సిందల్లా దాన్ని అధిగమించడం, నియంత్రిం చడం. దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయని తేలింది కూడా. ఉదాహ రణకు మొదటిసారి గుండెపోటుకు గురైనవారు, ఒత్తిడిని సమర్థంగా నియంత్రించుకోగలిగితే 74 శాతం మందిలో రెండో స్ట్రోక్ రాకుండా నివారిం చుకోగలగడం సాధ్యమేనని తేలింది. పైగా ఇలా ఒత్తిడి నియంత్రణ కారణంగా వ్యాధి నిరోధకశక్తి కూడా పెరిగి అది కూడా జబ్బులను దూరం చేస్తుందని నిరూపితమైంది. ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలివి… ఒత్తిడికి కారణాన్ని గుర్తించి, దాని నుంచి దూరంగా ఉండాలి. దాంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకోడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలివి… ? చాలా లోతుగా గాలి పీల్చడం వంటి బ్రీతింగ్ వ్యాయా మాలు చేయడం ? ఏదైనా అంశం తీవ్రంగా బాధపెడుతుండటం లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి గురిచేస్తుంటే మరింకేదైనా వ్యాపకంలో పడుతూ దాన్ని మరచిపోయి, ఒత్తిడి నుంచి విముక్తం కావడం. ఒత్తిడికి…
ఒత్తిడి అనేది కేవలం మనల్ని ఇబ్బంది పెట్టే ఆ సమయంలోని మానసిక స్థితి మాత్రమే కాదు. దానివల్ల కొన్ని శారీరకమైన మార్పులూ వస్తాయి. ఫలితంగా శరీరం దెబ్బతింటుంది. అది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం. ఒత్తిడి కారణంగా వచ్చే పది పాపులర్ సమస్యలు : 1. గుండెజబ్బులు: పైన పేర్కొన్నట్లుగా ఒత్తిడికి గురయ్యేవారిలో దీర్ఘ కాలిక గుండెజబ్బులు ఎక్కువగా ఉండటం చాలా సాధారణమైన విషయం. ఒక్కోసారి ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. 2. ఆస్తమా: ఒత్తిడి ఆస్తమాను ప్రేరేపిస్తుందని ఇప్పటికే వైజ్ఞానిక శాస్తపరంగా రుజువైంది. అంతేకాదు… తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లలకూ హాని చేస్తుందని తేలింది. ఒకవేళ తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారే అయితే వారి పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలాఎక్కువని అధ్యయనాల్లో తేలింది. అంటే… తమ ఒత్తిడి వల్ల వారు తమనే కాకుండా తమ సంతతిని, ముందు తరాలవారినీ బాధిస్తున్నారన్నమాట. గర్భవ తిగా ఉన్నవారిలో కొందరిని ఎంపిక చేసుకుని…
‘ఒత్తిడి అలా కొనసాగుతూ … అది ఎలాంటి హానీ చేయకపోతే దాన్ని ఎంతకాలమైనా భరించ గలం’ అనుకునే వాళ్లూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఒత్తిడి అన్నది కేవలం ఆ సమయానికే పరిమితం కాదు. ఒత్తిడి అప్పటికి తొలగినా… దాని భవిష్యత్ పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉండే ఒత్తిడి అలా అలా వేర్వేరు వ్యాధులకు దారితీస్తుంది. అదీ నిజమైన సమస్య. అందుకే ఏరోజుకు కలిగే ఒత్తిడిని ఆ రోజుకు అలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. అదలా దీర్ఘకాలం పాటు కొనసాగుతూ పోతూ ఉంటే, దాని వల్ల వచ్చే వేర్వేరు వ్యాధులు… అందు వల్లదాన్ని నివారించుకోవాల్సిన ఆవశ్యకత గురించిన అవగాహన కోసం… ఈ కథనం. వ్యాధి నిరోధక శక్తిపై ఒత్తిడి ప్రభావం… మనకు ఏదైనా గాయం అయినప్పుడు అక్కడ వాపు రావడం, ఎరబ్రారడం (ఇన్ఫ్లమేషన్) వంటి పరిణామాలు జరుగుతాయి. ఇది బాధాకరంగానే ఉన్నా, కాస్త వ్యవధి తర్వాత…
మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. ‘మనకు ఇలాంటి సమస్యలు రావులే’ అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం, అంగచూషణం వంటివి కూడా సుఖవ్యాధులు…
వైరస్ల కారణంగా వచ్చే ఈ వ్యాధులను అదుపులో పెట్టేందుకైతే మందులున్నాయి గానీ.. వీటిని శరీరం నుంచి పూర్తిగా నిర్మూలించి, సంపూర్ణంగా నయం చేయటం కష్టం. హెర్పిస్ ఇది హెర్పిస్ సింప్లెక్స్ టైప్-2 అనే వైరస్ మూలంగా వస్తుంది. దీని బారినపడ్డ వారితో సెక్స్‌లో పాల్గొంటే.. 2-7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ముందుగా పురుషాంగం మీద, స్త్రీ జననావయాల మీద నీటి పొక్కుల్లాంటివి వస్తాయి. తర్వాత ఇవి చితికి పుండ్లు పడతాయి. చికిత్స తీసుకుంటే అప్పటికి తగ్గినప్పటికీ.. ఒంట్లో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడల్లా ఈ పొక్కులు మళ్లీ మళ్లీ వస్తుండటం గమనార్హం. హెర్పిస్కు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వైరస్ శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తుంది. దీంతో మెదడు పొరల వాపు, నడుము వద్ద నాడులు దెబ్బతినటం, పురుషుల్లో నంపుసకత్వం కూడా రావొచ్చు. గర్భిణులకైతే అబార్షన్ ముప్పూ పెరుగుతుంది. ఇది తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించి రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుంది. జననాంగాలపై పులిపిర్లు…
‘సుఖవ్యాధులు’ వీటి గురించి బయటకు చెప్పుకోలేక.. ఆ బాధ అనుభవించలేక ఎంతోమంది నిత్యం నరకం చూస్తున్నారు. ఇవి లైంగికంగా సంక్రమించే సమస్యలు కాబట్టి వీటి గురించి వైద్యులను సంప్రదించేందుకు కూడా వెనకాడుతుంటారు. దీంతో ఇవి ముదిరిపోయి.. భాగస్వాములకు కూడా అంటుకుని.. అంతిమంగా సంసారం దుర్భరంగా తయారవుతుంది. అందుకే సుఖవ్యాధుల విషయంలో దాపరికాలు మంచివి అవి. ఒకప్పుడు సిఫిలిస్, గనోరియా వంటి బ్యాక్టీరియా కారణంగా సంక్రమించే సుఖవ్యాధులు మానవాళిని భయంకరంగా కబళించాయి. అయితే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కనిబెట్టిన తర్వాత ఇక సుఖవ్యాధులను జయించటం చాలా తేలిక అనుకున్నారు అంతా. అది కొంత నిజం కూడా. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు వైరస్ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. వీటిని నిర్మూలించటం మహా కష్టం. నియంత్రించటమూ తేలిక కాదు. మరోవైపు ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలికగా లొంగిన సుఖవ్యాధులు కూడా ఇప్పుడు వాటికి ఏమాత్రం లొంగకుండా.. మొండిగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా…
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్ హార్మోన్ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు. అందులో కొన్ని విషయాలు మీ కోసం.. గర్భంలో ఉండగానే ఎనిమిదో వారం నుంచే మగశిశువు మెదడుపై టెస్టోస్టీరాన్ ప్రభావం పడుతోంది. దీంతోనే అబద్ధాలు ఆడటం, సాహసం చేయటం, భావోద్వేగాలను అణచుకోవటం వంటి లక్షణాలకు బీజం పడుతోంది. యుక్తవయసులో మగపిల్లలు ఇతరులను ఎక్కువగా విమర్శిస్తుంటారు. అన్నింటి పైనా త్వరగా ఆసక్తి కోల్పోతుంటారు. మెదడును టెస్టోస్టీరాన్ ఎక్కువగా ప్రభావితం చేయటం వల్ల.. అసాధారణమైన భావోద్వేగాలు మాత్రమే వారిని ఉత్తేజితం చేయగలుగుతాయి. అందుకే ఉద్వేగభరితమైన వీడియోగేమ్‌లను ఆడేందుకు మగపిల్లలు ఇష్టపడుతుంటారు. సంభోగానంతరం ఆనందాన్ని కలగజేసే ఆక్సిటోసిన్ హార్మోన్ హైపోథాలమస్‌లోకి విడుదల అవుతుంది. దీని ప్రభావంతో ఆడవాళ్లు తమ…
జుట్టు తల మీద ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులూ పాటిస్తుంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే? మనసులో తీవ్ర వేదన మొదలవుతుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా.. కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించటం చూస్తుంటాం. ఈ సమస్యను ‘హిర్సుటిజమ్’ అంటారు. సాధారణంగా స్త్రీలల్లో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం. అయితే చాలామందిలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది.…
వృద్ధుల్లో తికమక పడడం, మతి మరుపు వంటి లక్షణలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిస్ లోపమూ కారణం అవుతుండొచ్చని మీకు తెలుసా? ఎందుకంటే వయసు మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిస్ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడం, మతిమరుపు వంటి లక్షణలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణలుగానే చాలమంది పొరపడుతుంటారు. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటనికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిస్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, మూత్రం ఆపుకోలేకపోవం, రక్తపోటు తక్కువ కావడం, కుంగుబాటు(డిప్రెషన్), మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలత్తుతాయి. ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమిన్ల మాదిరిగానే బీ12…
ఈ మధ్య మీకు కారణం తెలియకుండానే తలనొప్పి వేధిస్తోందా? దీనికేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ విధి నిర్వహణలో భాగంగా తలెత్తిన ఒత్తిడి. దీన్ని పట్టించుకోకపోతే డిప్రెషన్‌లోకీ దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత పరిశ్రమల అనుబంధ సంస్థ- అసోచామ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక సర్వేలో.. మనదేశంలో పలురంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, బడలిక అధికంగా ఉంటున్నట్లు గుర్తించారు. భారతీయ ఉద్యోగివర్గంలో ఇంటికీ, ఆఫీసు పనికీ మధ్య తేడా చెదిరిపోతున్నట్లు తేల్చారు. పనివేళలు ఎక్కువవ్వటం, అసాధారణ పని వేళల్లో విధులు నిర్వర్తించాల్సి రావటం వంటివన్నీ మానసిక ఒత్తిడులను అంతకంతకూ పెంచుతూ పలురకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి డిప్రెషన్‌కు కారణమవ్వటం మామూలే కానీ.. ఇది తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకూ దారి తీస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తలనొప్పులకు స్పష్టమైన కారణం కూడా తెలియటం లేదని పేర్కొంటున్నారు. తలనొప్పితోపాటు కాళ్లూ చేతుల్లో…
