Author: apanalysis
అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం పండ్లు, కాయగూరలు,గింజలు, పప్పులు, కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి… ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మగవారు కాస్త మోటుగా వున్నా పర్వాలేదు. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి.…
కావలసిన పదార్థాలు : Sunnunddalu మినపప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు, నెయ్యి – 1 కప్పు, యాలకలపొడి – 1/2 టీ స్పూన్ తయారు చేసే విధానం : మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొని నెయ్యి వేడిచేసి పంచదారపొడి, మినప్పిండీ, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. Ingredients: Urad dal – 2 cups, sugar powder – 2 cups Ghee – 1 cup, cardamom powder – 1/2 tea spoon Preparation : Fry urad dal and make the urad floor. take a pan and and fry ghee, add sugar powder, cardamom powder and urad floor.and make small size balls.
కావలసినవి : బొంబాయి రవ్వ – 2 కప్పులు, పంచదార – 2 కప్పులు, పచ్చికొబ్బరి – అర కప్పు, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పు – తగినన్ని, కిస్మిస్ – తగినన్ని, ఏలకులపొడి – అర టీ స్పూను, నీళ్ళు – 2 టీ స్పూన్లు. Ravva Laddu తయారి : రవ్వని వేయించి పక్కనుంచుకోవాలి. నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, ఏలకులపొడి పాకంలో కలుపుకుంటే తియ్యతియ్యటి రవ్వలడ్డు రెడీ.
Ravva Purnalu కావలసిన పదార్థాలు :బొంబాయి రవ్వ – 2 కప్పులు, యాలకలపొండి – 1 టీస్పూన్, కార్న్‌ఫ్లోర్ – 1/4 కప్పులు, పంచదార – 2 1/2 కప్పులు, నెయ్యి – 1/2 కప్పు, మైదాపిండి – 1 1/2 కప్పు, బియ్యంపిండి – 1/4 కప్పుతయారు చేసే విధానం : బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార యాలకలపొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి.
కావలసిన పదార్థాలుబియ్యం – 1కప్పు, బెల్లం – 2 కప్పులు, జీడిపప్పు – 10-12, పెసరపప్పు – 1/2 కప్పు, నెయ్యి – 1/4 కప్పు, కిస్మిస్ – 20-25తయారు చేసే విధానం : బియ్యం, పెసరపప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. బెల్లంలో ఒక కప్పు నీళ్ళుపోసి ముదురు పాకం వచ్చిన తరువాత బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని కలిపి 3,4 నిమిషాలు ఉడికించండి. దీనికి వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ మరియు, యాలకలపొడి జల్లి కలిపి వడ్డించండి.
కావలసినవి : undrallu బియ్యంపిండి : 1 కప్పు, నీళ్ళు : 1 కప్పు, నెయ్యి : 2 గరిటెలు వంట సోడా : చిటికెడు, ఉప్పు : చిటికెడు, ఉండ్రాళ్ళలో నింపడానికి పచ్చి కొబ్బరి కోరు : 1 కప్పు, కొబ్బరి పొడి : 1/2 కప్పు, వేయించిన గసాలు : 1 గరిటెడు, యాలకుల పొడి: 1/2 చెంచాతయారుచేసే విధానం :కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్‌లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండకట్టే మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి. ఉప్పు, నెయ్యి వేసి మరి గిన తరువాత బియ్యం పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. తక్కువ మంటపైన పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి…
మాట్లాడటం… అంటే నోటి నుండి శబ్దం రావడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. మాట్లాడాలంటే స్వరపేటిక, పెదవులు, దవడలు, నాలుకఅన్నీ కలిసి పనిచేయాలి. కొందరు నత్తిగా మాట్లాడటానికి కారణం వారి స్వరపేటికలో వుండే లోపమే. నత్తిని వైద్యపరిభాషలో ‘డిస్ఫిమియా’ అంటారు. పదంలోని మొదటి అక్షరాన్ని రెండు, మూడు లేక అంత కంటే ఎక్కువసార్లు పలకటాన్ని ‘నత్తి’ అంటారు. నత్తిలో రెండురకాలు వున్నాయి. మొదటి అక్షరం రెండు మూడుసార్లు ఉచ్చరిం చడం ఒకరకం. అంటే మొదటి అక్షరం పలికేటప్పుడు ధ్వని గొంతులో అడ్డుకుంటుంది. రెండోరకంలో నాలుక, గొంతు, ముఖంలోని కండరాలు బిగుసుకుని, నోట్లోనుంచి మాట బయటకు రావడానికి ఇబ్బందిపడు తుంది. స్వరపేటిక గోడల పక్కన ‘స్వరపేటికా కోష్టం’ రెండు వైపులా వుండే ‘స్వర రజ్జువులు’సాగడంలో లోపం ఏర్పడితే నత్తి వచ్చే అవకాశాలు వుంటాయి. సాధారణంగా నత్తి నాలుగైదు ఏళ్ల వయసు లోపే వస్తుంది. స్ర్తీలలో కంటే పురుషులలో నత్తి వచ్చే అవకాశాలు ఎక్కువ.
చిట్టి ముత్యాల లడ్డు :కావలసిన పదార్థాలు : శనగపిండి – 2 కప్పులు, యాలకలపొడి – 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార – 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు,రిఫైండ్ నూనె – వేయించటానికి తగినంతతయారు చేసే విధానం : శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లతపాకం తయారుచేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి. Ingredients : Chick flour (Bengal gram flour) – 2 cups , cardamom powder – 1 tea spoon , Lemon Yellow color -…
మోదక్ లడ్డుకావలసినవి : గోధుమపిండి – అరకప్పు, బొంబాయిరవ్వ-1 కప్పు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, నీళ్ళు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు – గుప్పెడు, కిస్మిస్ – గుప్పెడు, ఏలకులపొడి – అర టీ స్పూనుతయారి : పంచదారలో నీళ్ళు కలిపి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గోధుమపిండి, బొంబాయిరవ్వలో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యివేడిచేసి బూందీ ప్లేట్లో గోధుమపిండి మిశ్రమాన్ని పోసి బూందీ చేసుకోవాలి. నెయ్యివడకట్టి బూందీని పాకంలో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యిలో వేయించి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. ఏలకులపొడి కలిపి కావలసిన సైజుల్లో లడ్డు కట్టుకోవాలి.
కావలసిన పదార్థాలు పాలు – 4 కప్పులు, పంచదార – 1 కప్పు, జీడిపప్పు – 10-12, బియ్యపిండి – 1/2 కప్పు, కొబ్బరితురుము – 1/2 కప్పు, కిస్మిస్ – 20-25తయారు చేసే విధానం : బియ్యపిండిని బాండిలో సన్నని సెగపై వేయించుకోవాలి. చల్లారిన తరువాత కొద్దిగా నీళ్ళు కలిపి ముద్దలా కలుపుకొండి ఈ మిశ్రమాన్ని సన్నని జంతికల చట్రంలో ఇడ్లీ ప్లేట్లపై సేమియా చుట్టి ఆవిరిపై 10 నిమి షాలు ఉంచండి. కాగుతున్న పాలలో ఆవిరిలో ఉడికించిన సేమియాలను కలపండి పాలు చిక్కపడ్డ తరువాత పంచదార కొబ్బరి తురుము, యాలకలపొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి.
