మోదక్ లడ్డు
కావలసినవి : గోధుమపిండి – అరకప్పు, బొంబాయిరవ్వ-1 కప్పు, పంచదార – 1 కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్లు, నీళ్ళు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు – గుప్పెడు, కిస్మిస్ – గుప్పెడు, ఏలకులపొడి – అర టీ స్పూను
తయారి :
పంచదారలో నీళ్ళు కలిపి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గోధుమపిండి, బొంబాయిరవ్వలో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యివేడిచేసి బూందీ ప్లేట్లో గోధుమపిండి మిశ్రమాన్ని పోసి బూందీ చేసుకోవాలి. నెయ్యివడకట్టి బూందీని పాకంలో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యిలో వేయించి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. ఏలకులపొడి కలిపి కావలసిన సైజుల్లో లడ్డు కట్టుకోవాలి.

