Author: apanalysis
గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్‌లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది. వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టు కుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం…
“జుట్టు తెల్లబడి, చర్మం ముడుతలు పడడమే వయసు మీద పడిందనడానికి గుర్తనుకుంటే పొరపాటు. అసలు మొత్తం శరీరానికి ఒకటే వయసు ఉంటుందనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు. శరీరంలోని చాలా భాగాలు మీ వయసు కంటే ముందుగానే ముసలివి అవుతాయి” అంటున్నారు క్లినీషియన్ (clinician) డాక్టర్ యాంజిలా ఎపిస్టిన్. ఆమె లెక్క ప్రకారం మనని ప్రతిక్షణం నడిపించే మెదడు 20 యేళ్ల నుంచే ముసలిదవడం ప్రారంభమవుతుందట. మరి మిగతా భాగాల సంగతో అంటున్నారా. ఆ వివరాలు చెప్పే కథనమే ఇది. గుండె : గుండె వృద్ధాప్యం నలభై యేళ్ల నుంచి మొదలవుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ శరీరంలోకి రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేదు. కారణం రక్తనాళాల్లో సాగేగుణం తగ్గిపోవడమే. ధమనులు గట్టిపడతాయి లేదా కొవ్వు రక్త నాళాల్లో అడ్డుపడుతుంది. శాచ్యురేటెడ్ ఫ్యాట్ పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కరొనరి ఆర్టరీల్లో కొవ్వు డిపాజిట్లు ఏర్పడతాయి. దాంతో గుండెకు రక్త…
ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంపై చింతిస్తూనే ఉంటారు. పనిలో ఒత్తిడీ, ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో పోటీ, చదువుల్లో ముందంజ, పెరిగిపోయే ఖర్చులూ, మిగిలిపోయే అప్పులూ.. ఇలా ప్రతి మనిషికీ ఏదో ఒక సమస్య పెనుభూతమై వేధిస్తూ, చింతకు కారణమవుతూనే ఉంటుంది. కొద్ది మోతాదుల్లో ఉండే చింత మామూలే, అది సహజం కూడా. కానీ.. రోజంతా అదేపనిగా చింతాక్రాంతులై ఉంటే మాత్రం సాధారణం కాదు. ఇలాంటి సమస్యను వైద్యులు.. ‘జనరలైజ్డ్ యాంగ్త్జెటీ డిజార్డర్-జీఏడీ’గా అభివర్ణిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలకూ ఆందోళన చెందుతూ, ఆ ఆలోచనల్ని నియంత్రించుకోలేక క్షోభ పడుతుంటారు. ఆందోళనకు దారితీసే ఈ ఆలోచనలు.. శారీరకంగా బడలికనూ, మానసికంగా ఆలోచనారహిత స్థితిలోకి నెడతాయి. వీటన్నింటి కారణంగా వీరిలో మానసిక వ్యాకులత ఎక్కువవుతుంది. మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మీ జ్ఞాపకశక్తి ఏమాత్రం తగ్గకుండా ఉండాలంటే.. చింతలన్నీమాని, సాధ్యమైనంత వరకూ సంతోషంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.…
ఆఫీసులో ఉద్యోగి ఎలా ఉండాలి? ఉద్యోగి మరింత బాగా పని చేసేందుకు ఆఫీసు ఎలా ఉండాలి? ఈ కోణంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నో అధ్యయనాలు సాగాయి. సంతోషంగా ఉండే ఉద్యోగి, ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పని చేసే చోట కొన్ని చిన్నచిన్న మార్పులు చేపట్టటం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఉదాహరణకు తరచూ ఈ మెయిల్స్ చూడటాన్ని తగ్గించటం ద్వారా ఒత్తిడి తగ్గుతుందనీ, పనిచేసే చోట మొక్కల్ని పెంచుకోవటం ద్వారా గొంతు నొప్పి వంటి సమస్యల్ని నివారించుకోవచ్చని పేర్కొన్నారు. కిటికీ దగ్గర కూర్చునే అవకాశం ఉంటే.. ఒత్తిడి మరింతగా తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. పని ప్రదేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవటానికి కొన్ని చిట్కాలివి. కార్యాలయంలో లోపలి భాగంలో మంచి రంగులు, సరిపడినంతగా వెలుతురు ఉండటం వల్ల మూడ్ బాగుండటమే కాకుండా తలనొప్పి వంటి సమస్యలూ తగ్గుతాయని పేర్కొన్నారు. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. తెలుపు, నీలం ఆకుపచ్చ రంగులు వేసిన…
పోటీ ప్రపంచంలో బలంగా నిలబడటానికి తీవ్ర పనిభారాన్ని మోయక తప్పని పరిస్థితి. కానీ.. ఇది తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావటంతో ఆఫీసు నుంచి బయటపడినా.. ఆఫీసు ఒత్తిడి ఇంటికీ చేరుతోంది. ఈ పరిణామాలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. ‘మనుషులు యంత్రాల్లా అదే పనిగా పని చేయలేరనీ, ఏదో ఒకచోట పూర్తిస్థాయిలో డస్సిపోతారని’ మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగానికి సెలవు పెట్టటానికి 60 శాతం వరకూ ఒత్తిడి సంబంధ సమస్యలే కారణమవుతున్నట్లు అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. ఒత్తిడి తీవ్రత పెరుగుతున్న కొద్దీ వ్యక్తిలో పని చేసే మానసిక సామర్థ్యం క్షీణించటమే కాకుండా, శారీరకంగా ఆరోగ్యమూ దెబ్బ తింటుందంటున్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు.. నివాస ప్రాంతం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటే మంచిది. ఇరుగు పొరుగు వారు సైతం అనుకూలంగా ఉండే వారుంటే మంచిది. విపరీతమైన ఒత్తిడి పెంచటంలో డబ్బుల పాత్ర కూడా అధికమే. వాటి…
రాత్రివేళ ఉద్యోగం చేసే వారిలో ఆరోగ్యం దెబ్బతింటుందా? అవుననే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ కాలంపాటు రాత్రివేళల్లో విధులు నిర్వహించిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటున్నట్లు తాజా అధ్యయనంతో తేల్చారు. రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే పగటి వేళల్లో విధులు నిర్వర్తించే వారితో పోలిస్తే, రాత్రి డ్యూటీలు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 48 శాతం దాకా ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. శరీరంలో మెలటోనిన్ హార్మోన్‌పై ప్రభావం చూపటం వల్లే రాత్రి డ్యూటీలు క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సహజ సిద్ధమైన వెలుతురులో కాకుండా కృత్రిమ వెలుతురు కింద, లైట్ల కాంతిలో పని చేసేటప్పుడు మెదడు మెలటోనిన్ విడుదలను ఆపేస్తుంది. పలురకాల విధులు నిర్వర్తించే మెలటోనిన్ హార్మోన్ మన శరీరంలో జీవ గడియారం పనిచేసేలా చేస్తూ, పగటివేళ మెలకువగా ఉండేలా, రాత్రివేళ నిద్రపోయేలా నిర్దేశిస్తుంటుంది.…
మనిషిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి చక్కని ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యానికి సమతులాహారం, రోజువారీ వ్యాయామ ప్రక్రియలు ఎంతో దోహదపడుతాయనడంలో సందేహం లేదు. ఆత్మ విశ్వాసంతో జీవించగలిగిననాడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. తద్వారా జీవితాన్ని సాఫీగా, ఆనందంగా గడుపవచ్చు. జీవితంలో నిర్దేశించుకునే లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు. వ్యాయామాన్ని తొలిసారిగా ప్రారంభించేవారు కూడా తమ శరీరంలో కలిగే మార్పులను తేలిక గానే గుర్తించవచ్చు. వీరు ఇతరులను అనుకరించకూడదు. ముఖ్యంగా మోడల్స్, సినీ తారలు మొదలైన వారితో పోల్చుకుంటూ, వారు చేసే వ్యాయామ ప్రక్రియలను నిర్వహించకూడదు. సమాజంలో కొందరు సన్నగానూ, మరికొందరు లావుగానూ, ఇంకొందరు ఎంతో బలిష్టంగానూ కనిపిస్తారు. అది లోక సహజం. వారి వారి శరీరాకృతులనూ, ఆరోగ్యాన్ని చూసి మన మలా లేమని కలత చెందాల్సిన పని లేదు. వారికంటే మనం అన్నిటిలో తక్కువగా ఉన్నామనే భావనతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఫిట్నెస్ సెంటర్లు శారీరకంగా తగిన అర్హత కల్పించడానికి…
పొద్దున్నే లేచి, హడావుడిగా రెడీ అయిపోయి, వాహనాన్ని బయటకు తీసి, తిన్నగా పార్క్కో, జిమ్కో వెళ్ళిపోయి…. వన్ టూ త్రీ… అంటూ వ్యాయామం మొదలు పెట్టేయడం చాలా మందికి అలవాటు. లెక్కప్రకారం 3-4 కిలోమీటర్ల వాకింగో, 30 నిమిషాల సేపు వెయిట్స్తో వర్కవుట్సో చేసేసి చెమటలు కూడా ఆరకుండానే సర్రున ఇంటికి తిరిగి వచ్చేస్తారు. హడావుడిగా తమ రోజువారీ పనుల్లో పడిపోతారు. కాని ‘వ్యాయమం చేయడం ఎంత అవసరమో, పద్ధతిగా చేయడం అంతే అవసరం’ ఫిట్నెస్ రొటీన్లో వర్కవుట్‌కి ముందు వార్మప్ చివరన కూల్డవున్ చేయడం సక్రమమైన పద్ధతిలో భాగం. రోజూ వ్యాయామం చేసేప్పుడు అందులో వార్మప్, కూల్డవున్ ఎక్సర్సైజ్లు కూడా తప్పకుండా చేర్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వార్మప్ కోసం వేడెక్కించాలి వంచాలంటే. ఇనుమును మాత్రమే కాదు దేహాన్ని కూడా. వేడెక్కితేనే ఒళ్లు వంగుతుంది. ఒళ్లు వంచితేనే వ్యాయామం పండుతుంది. పండిన ఫలం అందాలంటే… అందుకోవాలంటే దేహానికి తీరిక చిక్కాలి. వ్యాయామానికి ముందూ వెనుకా చూడాలి. చేసే ముందు వార్మప్, ముగించాక కూల్డవునూ చేయాలి… వార్మప్ కోసం ఆటలకైనా, వ్యాయామాలకైనా ప్రారంభానికి ముందు వార్మప్ తప్ప నిసరి. చేయబోయే పూర్తిస్థాయి వర్కవుట్కు సిద్ధం చేసే ప్రయత్నమది.వ్యాయామానంతరం కూల్డవున్ అత్యవసరం. వ్యాయామం పూర్తయ్యాక చేసే ఈ కూల్డవున్ ప్రక్రియ వల్ల రక్తసరఫరాతో పాటు అన్నీ తిరిగి సాధారణ స్థాయికి చేరతాయి. వార్మప్ ఎందుకంటే.. ఏదైనా శారీరక శ్రమకు గురయ్యే పని చేసేప్పుడు దానికి తగ్గట్టుగా మనసు, శరీరం సిద్ధం కావాలి.…
చర్మం కింద ఉన్న ఫాలికిల్ అనే చిన్న చిన్న పాకెట్ల నుంచి జుట్టు తయారవుతుంది. ఒక్కో ఫాలికిల్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు వెంట్రుక పెరుగుతుంది. ఆ తరువాత రాలిపోయి ఆ స్ధానంలో కొత్త వెంట్రుక మోలుస్తుంది. ఈ ఫాలికిల్ అనేది మగవాళ్లలో ఉత్పతి అయ్యే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ పై అధారపడి ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల వల్ల ఆ ప్రభావం పైన చెప్పిన ఫాలికిల్ మీద పడుతుంది. దానివల్ల ఫాలికిల్స్ ముడుచుకుపోతాయి. దాంతో కొత్తగా వచ్చే ప్రతీ వెంట్రుకా అంతకు ముందు వచ్చిన దానికంటే చిన్నదిగా వస్తుంది. దీనివల్ల వెంట్రుక చర్మాన్ని దాటుకుని బయటికి రాలేదు.
మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్ స్వీటనర్స్) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు. ఆస్పర్టేమ్, శాక్రీన్ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపు కొంటే పెద్దగా నష్టం ఉండదు గానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.
