Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » ‘జెట్లీ’ రివ్యూ: సత్య – రితేష్ సినిమా ఎలా ఉందంటే?
రివ్యూ

‘జెట్లీ’ రివ్యూ: సత్య – రితేష్ సినిమా ఎలా ఉందంటే?

apanalysisBy apanalysisMay 1, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ విజయాలు సాధించడంలో కమెడియన్ సత్యది కీలక పాత్ర. ఆ సినిమాల దర్శకుడు రితేష్ రాణాతో సత్య చేసిన తాజా సినిమా ‘జెట్లీ’. ఇందులో ఆయన హీరో. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర చేశారు. రియా సింఘా హీరోయిన్. మే 1న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ‘మత్తు వదలరా’ తరహాలో నవ్వించారా? ఈ సినిమా ఎలా ఉంది? అంటే…

 

కథ : ప్రజాపతి (అజయ్) బ్యాంక్ బోర్డ్ తిప్పేసి విదేశాలకు పారిపోతాడు. ఇదే సమయంలో తనపై ఒక హత్యాయత్నం జరుగుతుంది. ఏజెంట్ రియా సింఘా, ప్రజాపతిని పట్టుకుని స్వింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకొస్తుంది. ఈ ఫ్లైట్ జర్నీలో ప్రజాపతిని చంపాలని ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మరో గ్యాంగ్ తనని తప్పించాలని చూస్తుంది. ఇదే ఫ్లైట్‌లో వేదవ్యాస్ (సత్య) జర్నీ చేస్తుంటాడు. తనకు ఒక వింత సమస్య.. త‌ను స‌డ‌న్ గా గతాన్ని మర్చిపోతాడు. అసలు అతడు ఎవరు? తనకు గతం గుర్తుకు వచ్చిందా? ప్రజాపతి మిషన్‌లో తన భాగస్వామ్యం ఏమిటి? ఈ జర్నీలో ఎలాంటి వింతలు, విశేషాలు జరిగాయనేది మిగతా కథ.

‘నేల విడిచి సాము చేయకూడదు’ అనేది పెద్దల మాట. కాకపోతే రితేష్ రాణా ఈ మాటకు తనదైన భాష్యం చెబుతూ వాస్తవానికి దూరంగా, సాధ్యం కాని పనులతో కామెడీ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. మత్తు వదలరా సిరీస్ సినిమాల్లో కథ ఎంతోకొంత నేల మీదే ఉంటాయి. తను చేసిన ‘హ్యాపీ బర్త్‌డే’ మాత్రం ఓవర్ ది బోర్డ్. ఆ సినిమాకి నెగటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని మళ్లీ ఓవర్ ది బోర్డ్ స్టైల్‌లో ‘జెట్లీ’ని తీర్చిదిద్దాడు. ఈ ప్రయత్నం కూడా ‘హ్యాపీ బర్త్‌డే’లానే కొన్ని నవ్వులకే పరిమితం అయింది.

ప్రజాపతి బ్యాంక్ స్కామ్‌తో కథ మొదలవుతుంది. అపరిచితుడిగా ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకునే సత్య పాత్ర పరిచయంలోనే కొన్ని నవ్వులు పంచుతుంది. వెన్నెల కిషోర్ పద వినోదం, డాక్టర్‌గా సత్య చేసే వైద్యం.. ఇవన్నీ కాసేపు కాలక్షేపాన్ని ఇస్తాయి. అయితే ఆ నవ్వులను కొనసాగించే సన్నివేశాలు ఇందులో కరువయ్యాయి. మిషన్ ఇంపాజిబుల్ స్టైల్‌లో సత్యతో ఓ కామెడీ స్టంట్ చేయించి ఇంటర్వెల్ కార్డ్ వేయడం కూడా అంతగా ఆకట్టుకోదు.

ఫస్ట్ హాఫ్ ఏదోలా నెట్టుకొచ్చిన ‘జెట్లీ’కి సెకండ్ హాఫ్ భారంగా మారుతుంది. సత్య కూడా ఒక దశలో క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాడు. పాత్రల మధ్య సెటైర్లు నడుస్తుంటాయి కానీ అవి ప్రేక్షకుడిని నవ్వించేలా ఉండవు. అక్కడక్కడ కొన్ని మీమ్ ఐటమ్స్ తప్ప అసలు నవ్వులు కనిపించవు. ప్రజాపతి మిషన్ గందరగోళంగా ఉంటుంది.

న్యూ ఏజ్ పేరుతో స్క్రీన్‌ప్లేను అయోమయం చేశారు. అన్నీ లేయర్లు ఈ కథకు అవసరం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. అంతమంది కామెడీయన్లు ఉన్నప్పుడు సుబ్బరంగా నవ్వించే సిట్యువేషన్స్ రాసుకుని ఉంటే బెటర్‌గా ఉండేది. ప్రజాపతి మిషన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేశారు. ఆ ట్రాక్ ఆడియన్స్‌కి ఏ మాత్రం పట్టదు.

సత్య కొన్ని చోట్ల నవ్వించాడు. బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే సన్నివేశాల్లో తగిన బలం లేకపోవడంతో ఒక దశ తర్వాత తను కూడా క్లూలెస్‌గా కనిపించాడు. ఏజెంట్ పాత్రకు రియా సింఘా సరిపోయింది. వెన్నెల కిషోర్ సినిమా సుడోకు కొన్ని చోట్ల నవ్వించింది. అజయ్ విలనిజం ఎప్పటిలానే ఉంది కానీ ఈసారి రైటింగ్‌లో బలం కనిపించలేదు. కబీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, గుండు సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి—ఇలా చాలా మంది పేరున్న నటులు కనిపించారు కానీ చెప్పుకోదగ్గ పాత్రలు కావు.

కాలభైరవకు పాటలు చేసే అవకాశం రాలేదు. కాకపోతే చివర్లో ఓ పేరడీ స్టయిల్ పాట ఉంది. అది రితేష్ రాణా మార్క్ సెటైర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగానే ఉంది. ఫ్లైట్‌లో జరిగిన సినిమా ఇది. ఫ్లైట్ సెట్స్ వేశారు కానీ ఫిల్మ్ మేకింగ్ ఆ ఫీల్‌ను క్యారీ చేయలేదు. ఫ్లైట్ జర్నీ ఫీలింగ్ సరిగ్గా కుదరలేదు. నిడివి 2 గంటలు 10 నిమిషాలే అయినప్పటికీ మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కామెడీని ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది.

రితేష్ రాసుకున్న కొన్ని డైలాగులు నవ్విస్తే, కొన్ని డైలాగులు మాత్రం మరీ సిల్లీగా అనిపించాయి. తన హ్యూమర్, సెటైర్ అంతగా కుదరలేదు. నవ్వులు, థ్రిల్ కోసం ప్రయాణం మొదలుపెట్టిన ‘జెట్లీ’ గమ్యస్థానానికి చేరలేకపోయింది.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

03 మే 1913 : భారతీయ సినిమా చరిత్రలో మొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల: భారతీయ సినిమా రంగంలో మీకు తెలియని తొలి ఘట్టాలు

May 2, 2026

57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవ సంచాలకునిగా శ్రీ అశుతోష్ గోవారికర్ నియామకం

May 1, 2026
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.