Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » గుండెపోటును మొదటే గుర్తించండి…
ఆరోగ్యం

గుండెపోటును మొదటే గుర్తించండి…

apanalysisBy apanalysisAugust 1, 2014Updated:May 4, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
సాధారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే గానీ, మనం గుండెపోటు వచ్చినట్లు గుర్తించం. నిజానికి గుండెపోటు ఒక నిమిషంలో ముగిసిపోయే సంఘటన కాదు. అది స్వల్పంగా మొదలై ఒక్కోసారి కొన్ని గంటలపాటు కొనసాగుతుంది. గుండె పోటుకు ప్రధాన కారణం జీవన విధానంలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడమే కారణమంటున్నారు వైద్యులు. యుక్తవయస్కుల్లో హార్ట్ఎటాక్ రావడానికి స్మోకింగ్ ముఖ్యకారణం. హైపర్ టెన్షన్ , డయాబెటిస్ వల్ల కూడా హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
గుండెకు వెళ్లే రక్తప్రసారంలో ఆటంకం తలెత్తినప్పటి నుంచే గుండెపోటు మొదలైనట్లు గుర్తించాలి. ఈ స్థితిలో క్రమంగా ఆయాసం మొదలవుతుంది. చెమటలు పడతాయి. రక్తపోటు పడిపోతుంది. చివరగా స్పృహ కోల్పోతారు. శ్వాస ఆడక మెలికలు తిరిగిపోయే దాకా చూడకుండా ముందే ప్రధమ చికిత్సకు సిద్ధం చేస్తే ప్రాణాపాయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు.
అందుకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాల గురించి అవగాహన చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఆ లక్షణాలను తీసుకోవలసిన జాగ్రత్తలు…
గంట క్రితమే నాతో మాట్లాడి వెళ్లాడు. ఈ కాసేపట్లోనే ఇంత ఘోరం జరిగిపోయిందేమిటి ? అంటూ తెలిసిన వాళ్లంతా అంటుంటారు. నిజానికి గంట క్రితం అతడు పైకి బాగానే కనిపించి ఉండవచ్చు. కానీ, లోలోపల కచ్చితంగా అతనికేదో అసౌకర్యం ఉండే ఉంటుంది. కాకపోతే, దాని గురించి అతడు ఎవరికీ చెప్పి ఉండకపోవచ్చు అంతే…! అదేదో అతి సాధారణ లక్షణంగానే చాలా మంది భావిస్తారు. ఆ కాస్త నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలికొంటుంది. ఈ నిర్లక్ష్యంలో చాలా వరకు గుండెపోటు లక్షణాల గురించిన అవగాహన లేనితనమే మూలంగా ఉంటుంది.
ఛాతీ నొప్పి, ఛాతీ మంటలన్నీ గుండెపోటుకు సంబంధించినవే కాకపోవచ్చు. అంత మాత్రాన ఒకసారైనా ఇసిజి పరీక్ష చేయించకుండా ఉండిపోవడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. గుండెపోటు చాలా వరకు ఇతర వ్యాధుల్లో ఉండే కొన్ని సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. అయితే ఛాతీనొప్పి పెరగడానికీ, తగ్గడానికీ కారణమయ్యే చర్యల ఆధారంగా కూడా అది గుండెపోటు అవునో కాదో ముందే తెలుసుకోవచ్చు. పరిస్థితి విషమించకుండా అతన్ని కాపాడుకోవచ్చు.
లక్షణాలు
గుండెపోటుకు కొద్దిరోజుల ముందే చాలా మందిలో ఛాతీనొప్పి, శ్వాస ఆడకపోవడం, కాళ్లవాపు, గుండెదడ, కళ్లుతిరిగి పడిపోవడం, త్వరగా అలసిపోవడం, పట్టేసినట్టు గుండె బరువుగా ఉండడం, ఏదో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అరుదుగా కొందరికి తలనొప్పి, దగ్గుతో పాటు ఒక్కోసారి నోటి నుంచి రక్తం కూడా రావచ్చు. కాకపోతే ఈ లక్షణాలు గుండెపోటులోనే కాకుండా మరికొన్ని ఇతర సమస్యల్లో కూడా కనిపిస్తాయి. 
ఛాతీ నొప్పినే ఉదాహరణగా తీసుకుంటే ఛాతీ ఎముకలు, ఛాతీ కండరాలు, శ్వాసకోశాలు, చర్మసమస్యల వల్ల కూడా ఛాతీ నొప్పి రావచ్చు. అందుకే ఛాతీ నొప్పులన్నీ గుండెనొప్పులేనని నిర్థారించలేం. అయితే ఈ సాధారణ లక్షణాలకు కొన్ని ఇతర లక్షణాలు కూడా తోడైనప్పుడు గుండెనొప్పిని గుర్తించడం సులువవుతుంది.
ఛాతీ నొప్పితో పాటు చాలా అసౌకర్యంగా ఉండడాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి ఇది చాలా తీవ్రంగా పరిగణించవలసిన పరిస్థితి. గుండెపోటు తొలిదశలో చాలా మందికి ఛాతీలో మంట రావచ్చు. అలాగే తేన్పులు, వాంతులు కూడా రావచ్చు. ఈ స్థితిని చాలా మంది ఆసిడిటి అని పొరబడుతుంటారు. అందుకే అసలు సమస్యను గుర్తించడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. ఈ ఆలస్యంలో ఒక్కోసారి పరిస్థితి చేయిదాటిపోవచ్చు కూడా.
మరికొన్ని…
  • గుండె బరువుగా ఉంటూ చెమటలు,ఛాతీ మంట, అసౌకర్యం
  • నడవడం లేదా ఏదైనా చేస్తున్నాప్పుడు ఛాతీ నొప్పి అధికమవడం, ఆగిపోగానే నొప్పి తీవ్రత తగ్గడం. లేదా నొప్పి మొత్తంగానే తగ్గడం
  • ఛాతీలో మొదలైన నొప్పి, రెండు చేతులకూ, దవడలకూ లేదా వెన్ను భాగానికి పాకడం
  • ఏదైనా బరువు మోస్తూ కొంత దూరం నడవగానే నొప్పి మొదలై, బరువు దించగానే నొప్పి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే గుండె నొప్పిగా అనుమానించవచ్చు.
  • ఒకవేళ పనిచేస్తున్నప్పుడు ఒక మోస్తరుగా ఉంటూ పని మానగానే నొప్పి అధికమైతే అది గుండె నొప్పి కాదని గ్రహించాలి. ఇలా ఏం చేస్తే నొప్పి పెరుగుతోంది. ఏం చేస్తే నొప్పి తగ్గుతోంది అనే అంశాల ఆధారంగా కూడా అది గుండెనొప్పి అవునో కాదో నిర్ధారించడం వీలవుతుంది.

ఆలస్యం ప్రాణాంతకం
ఛాతీ నొప్పి ఉండే వ్యవధిని బట్టి కూడా గుండెనొప్పికీ గుండెపోటుకూ ఉన్న తేడాను అంచనా వేయవచ్చు. సాధారణంగా ఛాతీ నొప్పి మొదలైన మూడు నిముషాల్లోనే దానికదే తగ్గిపోతే అది గుండె నొప్పి అనీ, 10 నిముషాలకు మించి ఉంటే దాన్ని గుండెపోటుగానూ గ్రహించాలి. ఒకసారి గుండెపోటు అన్న అనుమానం కలిగితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.
20 ఏళ్ల లోపు వారిలో ఛాతీ నొప్పి వస్తే, చాలా వరకు అది గుండెనొప్పి కాకపోవచ్చు అదే 60 ఏళ్లకు అటుఇటుగా ఉన్న వారికి ఛాతీ నొప్పి వస్తే అది గుండె నొప్పి అయ్యే అవకాశమే ఎక్కువ.
ప్రమాద సూచికలు
వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు అధిక కొలెస్టాల్, పొగతాగడం వంటివి గుండె జబ్బులకు గురిచేసే అవకాశం ఎక్కువ. అలాగే వారసత్వంగా గుండె జబ్బులు ఉండడం, అంతకు ముందే గుండె జబ్బుకు లోనయి ఉండడం, గుండెపోటు రావడానికి ఎక్కువ అవకాశమిస్తాయి. ఇలాంటి వారికి ఛాతీనొప్పి వస్తే తక్షణమే ఆసుపత్రికి చేర్చాలి. అంతకు ముందే గుండె జబ్బులకు లోనైన వారు డిస్పిరిన్, సార్బిట్రేట్ మాత్రలను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

వయసు పెరగడంతో వచ్చే మార్పులు

November 4, 2014

మానసిక ఒత్తిడిని అధిగమించండి ఇలా…

October 28, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.