వాతావరణం మారగానే
ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో
జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో
తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే
పనికొచ్చే కొన్ని సూచనలు…

- సిల్కు, షిఫాన్ దుస్తులు
వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి. - పాదాలు
ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే
సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త
గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది. - రాత్రి నిద్రపోయే
ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి. - తల తడిస్తే
వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా రాలుతుంది. - కొబ్బరినూనెని
వెచ్చబెట్టి జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిపడటమే
కాదు, జలుబు చేయదు.
నూనెతో మర్దనా చేసాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు కూడా పోతుంది. - వేడినీళ్లలో
నాలుగు యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు గాని, యూకలిప్టస్ ఆకులు
గాని వేసి స్నానం చేస్తే ఈ కాలంలో తరచూ ఇబ్బందిపెట్టే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు
తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది. - నువ్వుల నూనె
రాసుకుని వారానికి ఒకసారి స్నానం చేయటం చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. - తులసాకురసం, తేనె కలుపుకుని
వర్షాకాలంలో అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అస్తమానూ జలుబు, జ్వరాలు రాకుండా
ఉంటాయి. - వర్షాకాలంలో
జలుబు చేస్తే పంచదారని నిప్పులమీద వేసి వచ్చే పొగని పీల్చండి. జలుబు నుంచి వెంటనే
ఉపశమనం దొరుకుతుంది.