Author: apanalysis
కావలసినవి : బియ్యప్పిండి -50 గ్రా., కారం – టీ స్పూను, చాట్‌మసాలా – అర టీ స్పూను, సేవ్ – పావు కప్పు, క్యారట్ తురుము – 3 టీ స్పూన్లు, ఉల్లితరుగు – అర కప్పు, పెరుగు – అర కప్పు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు –తగినంత తయారి : ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి. కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి. అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి. ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్ మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.
కావలసినవి : కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు – రెండు కప్పులు (బాగా చిలకాలి), శనగపిండి – 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము – టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూను, కొత్తిమీర తరుగు – రెండు టీ స్పూన్లు, పసుపు – అర టీ స్పూను, పకోడీల కోసం: శనగపిండి -పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూను, కొత్తిమీర – చిన్న కట్ట, తినే సోడా – చిటికెడు, పసుపు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి – 1 (కట్ చేయాలి), జీలకర్ర – అర టీ స్పూను, ఆవాలు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు తయారి : ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర,…
కావలసినవి : బీన్‌కర్డ్ – కప్పు (సూపర్ మార్కెట్లోదొరుకుతుంది), టొమాటో తరుగు – పావుకప్పు, లవంగం – 1, వెల్లుల్లి రెబ్బలు: 6, కార్న్‌ఫ్లోర్ – అర టేబుల్ స్పూను, పచ్చిబఠాణీ – పావు కప్పు (ఉడికించాలి), నూనె – 3 టేబుల్ స్పూన్లు తయారి: బీన్ కర్డ్ని అర అంగుళంముక్కలుగా కట్ చేయాలి. టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి. బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి. బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి. బఠాణీలతో గార్నిష్ చేయాలి.
కావలసినవి : గోధుమలు – ఒకటిన్నర కప్పులు, మినప్పప్పు – ముప్పావు కప్పు, బఠాణీ – పావు కప్పు, క్యారట్ తురుము – పావు కప్పు, బీన్స్ తరుగు – పావు కప్పు, పెరుగు – అర కప్పు, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, ఆవాలు – టీ స్పూను, మినప్పప్పు (బద్దలు) – 2 టీ స్పూన్లు, శనగపప్పు – 2 టీ స్పూన్లు, అల్లం – చిన్న ముక్క, పచ్చిమిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – తగినంత తయారి: గోధుమలను నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. మిన ప్పప్పును నీటిలో అర గంట నానబెట్టాలి. గోధుమలను మరీ మెత్తగా కాకుండా రవ్వలా మిక్సీ పట్టాలి. మినప్పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో మిక్సీ పట్టిన మినప్పిండి, గోధుమరవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి ఆరు…
కావలసినవి : పెరుగు – అరలీటరు, అల్లం తురుము – పావు టీ స్పూను, పచ్చిమిర్చితరుగు – టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ – పావుకప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తి మీర- కొద్దిగా, క్రీమ్ – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారి : మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి. పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి. గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి. వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్ లను పైన వేసి సర్వ్ చేయాలి.
కావలసినవి : మామిడికాయ ముక్కలు – కిలో; నువ్వులు – పావు కిలో, ఉప్పు – పావు కిలో; నువ్వుల పొడి – అర కిలో; అల్లం వెల్లుల్లి ముద్ద – పావు కిలో; ఆవ పొడి – 50 గ్రా., పసుపు – టీ స్పూను; జీలకర్ర పొడి – 25 గ్రా., మెంతి పొడి – టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు, జీలకర్ర – ఒకటిన్నర టీస్పూన్లు తయారీ : మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి. వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయూలి. నూనె చల్లారి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి…
కావలసినవి : మామిడికాయ ముక్కలు – కిలో; ఉప్పు – పావు కిలో, పసుపు – టేబుల్, స్పూను; కారం – 125 గ్రా., ఎండుకొబ్బరి పొడి – పావు కిలో; ఆవ పొడి – 50 గ్రా., జీలకర్ర పొడి – 25 గ్రా.; మెంతి పొడి – టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – పావు కిలో నువ్వుల నూనె – పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; ఇంగువ – టీ స్పూను, జీలకర్ర , మెంతులు – టీ స్పూను తయారీ : మామిడికాయ ముక్కలను తగినంత పరిమాణంలో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి, ఎండుకొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు…
కావలసినవి : మామిడికాయ గుజ్జు – కేజీ, ఉప్పు – పావు కేజీ, పసుపు – టేబుల్ స్పూను, కారం – 125 గ్రా, అల్లం వెల్లుల్లి ముద్ద – పావు కేజీ, నువ్వుల నూనె – పావు కేజీ, జీలకర్ర పొడి – 2 టేబుల్ స్పూన్లు, మెంతి పొడి – టేబుల్ స్పూను, ఇంగువ – టీ స్పూను, ఆవాలు, జీలకర్ర, మెంతులు – ఒకటిన్నర టీ స్పూన్లు. తయారీ : బాగా కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి తగినంత నీళ్లు జతచేసి కుకర్‌లో ఉడికించాలి. చల్లారిన తర్వాత పై చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జుంతా తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వులనూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి…
కావలసినవి : మామిడి తురుము – 3 కప్పులు (తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది); పంచదార – కప్పు; ఏలకుల పొడి – టీ స్పూను; జీడిపప్పు – 10, బాదంపప్పు – 10; నెయ్యి – టీ స్పూను; కిస్మిస్ – 20. తయారీ : జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి. దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. దీన్ని జామ్లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు.
పిల్లలు ఈ మధ్య ఆధునికత, స్టైల్, సరదాకోసం అవసరం లేని ఆహారానికి అలవాటు పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికిరాని ఆహారాన్నే ఇంగ్లిషులో ‘జంక్ ఫుడ్’ అనీ వ్యవహరిస్తున్నారు. పిజ్జా, బర్గర్, పేస్ట్రీ, ఐస్‌క్రీం, కట్లెట్, పానీపూరీ, టోస్ట్, మళ్లీమళ్లీ నూనెల్లో వేయించిన బజ్జీలు, ప్యాకెట్లలో నెలల తరబడి నిల్వవుంచే చిప్స్, కోక్‌లు, ఎక్కువ తీపి, ఉప్పు ఉన్న పదార్థాలు ఇవన్నీ పనికిరాని ఆహారం కిందనే లెక్క. అలాగే డబ్బాలలో, ప్యాకెట్లలో ఏళ్ల తరబడి నిల్వవుంచే తినుబండారాలు, డ్రింక్స్‌లో కృత్రిమ చక్కెరలు, ఉప్పు, నిల్వవుండటానికి వాడే ప్రిజర్వేటివ్‌లు, హానికరమైన కృత్రిమరంగులు, ఫ్లేవర్స్, స్వీట్కార్న్స్, మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ ఎదిగే పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తాయి. చౌకబారు ఐస్‌క్రీములు, ఐస్ప్రూట్స్, నల్లగా వేగిన పదార్థాలు, దుమ్ముధూళి నిండినవి, ఈగలు, దోమలు ముసురుతుండే రోడ్డు పక్కఆహారాలు కూడా పిల్లల సున్నితమైన ఆరోగ్యానికి హాని చేస్తాయి.
