Author: apanalysis
గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదని నమ్మేవాళ్లూ చాలామంది ఉన్నారు. కానీ ఇది పూర్తి నిజం కాదు. గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండదు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్ ఉంటుందిగానీ అదొక్కటే కాదు, అందులో విటమిన్-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి వాళ్లు పచ్చసొన తీసేసి ఒక్క తెల్లదాన్ని తినొచ్చు. ఏ సమస్యా లేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు, రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది.
మన ఆరోగ్యానికి ‘ఉప్పు పెద్ద ముప్పు’ అని భావిస్తూ ఉప్పును పూర్తిగా మానెయ్యటం అవసరమన్న భావన తరచుగా వినపడుతుంటుందిగానీ అది పూర్తిగా మంచిది కాదు. ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటూగా 4 గ్రాముల ఉప్పు తీసుకోవటం మంచిది. చాలామంది మన శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, మన ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంక అదనంగా ఉప్పు వేయటం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారుగానీ నిజానికి ఆహారం కాకుండానే 4 గ్రాములు (యాడెడ్ సాల్ట్) తీసుకోవాలన్నది శాస్త్రరంగం చేస్తున్న సిఫార్సు. కొన్ని రకాల జీవక్రియల్లో సోడియం క్లోరైడ్ (ఉప్పు) చాలా అవసరం. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత (బ్యాలెన్స్) సజావుగా ఉండటానికి, మనం ‘డీహైడ్రేషన్’ లోకి వెళ్లకుండా ఇది చాలా కీలకం. దీనర్థం ఉప్పు ఎక్కువెక్కువగా వాడమని కాదు. ఉదాహరణకు హైబీపీ ఉన్నవాళ్లు,…
మనం నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ, రోజుకు 4-5 లీటర్త్లెనా తాగితే ఒంట్లో మలినాలు కొట్టుకుపోతాయనీ చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సమస్యలు తెచ్చిపెట్టే నమ్మకం! నీరనేది కేవలం మనం తాగే నీళ్ల రూపంలోనే కాదు.. పండ్లు, కూరగాయలు, అన్నం, చారు, మజ్జిగ.. ఇలా అన్నింటిలోనూ ఉంటుంది. చాలామంది దీన్ని గుర్తించరు. ఇలాంటి పదార్థాల ద్వారా కాకుండా మనం రోజు మొత్తమ్మీద 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగితే చాలు! అంతకంటే ఎక్కువ తాగితే శరీరంలోని స్రావాలన్నీ పల్చబడిపోయి వాటి పనిసామర్థ్యం బాగా తగ్గిపోతుంది. చాలామంది నిద్ర లేస్తూనే 2 లీటర్ల నీటిని తాగేసెయ్యాలని చెబుతుంటారుగానీ ఇలా ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వెనకబడుతుంది. మనం తినే ఆహారానికి తగ్గట్టుగా ఎంజైముల వంటివి శరతాయి. కానీ మనం ఒక్కసారే నీళ్లు ఎక్కువగా తాగేస్తే అవన్నీ పల్చబడి, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఆహారం తినేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా…
అస్సలు నూనె లేకుండా వండుకోవటం (జీరో ఆయిల్ కుకుంగ్) గుండెకు మంచిదని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. అస్సలు నూనె అనేది లేకుండా ఉడకబెట్టేసుకు తినమని చెప్పటం సరికాదు. నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి-క్యాలరీలు కూడా మన శరీరానికి అవసరం. మనం తినే ఆహారంలో, ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీల్లో కనీసం 20% నూనెల నుంచి రావటం ఎంతైనా అవసరం. నూనెల నుంచి మన శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్) కొన్ని లభిస్తాయి. మన శరీరంలో కొన్ని జీవక్రియలు సజావుగా జరగాలంటే కొవ్వు తప్పనిసరి. అలాగే ఎ, బి, ఇ, కె విటమిన్లు కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతాయి, కొవ్వు ఉంటేనే ఇవి మన ఒంటికి పడతాయి. కాబట్టి ఇవన్నీ సజావుగా జరగాలంటే మన ఆహారంలో నూనె, కొవ్వు తప్పనిసరిగా ఉండాలి. నూనె అస్సలు లేకుండా వంటలు చేస్తుంటే- రకరకాల చర్మ…
పంచదార ఎక్కువ తింటే ‘షుగర్’ వస్తుందన్నది చాలామంది నమ్మే విషయం. కానీ ఇది వాస్తవం కాదు. షుగర్.. మధుమేహం అన్నది కేవలం పంచదార, తీపి పదార్థాలు ఎక్కువగా తినటం వల్లనే రాదు. మనం ఏం తీసుకున్నా శరీరంలో అది ముందు షుగర్ కింద మారి, వినియోగానికి వీలైన శక్తిగా (క్యాలరీల్లా) సిద్ధంగా ఉంటుంది. కానీ మనం ఎటువంటి శారీరక శ్రమా చెయ్యకుండా దాన్ని ఖర్చు పెట్టకపోతే, అది తనకు తానుగా కొవ్వుగా మారిపోయి శరీరంలో పేరుకుని, నిల్వ ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, అది తెచ్చే దుష్ప్రభావాలు మొదలవుతాయి. అంతేగానీ పంచదార తింటే మధుమేహం వస్తుందని భావించటం సరికాదు. మధుమేహానికి మన జీవనశైలి, ఒత్తిళ్లు, జన్యువుల వంటివి ముఖ్యమైన కారణాలుగానీ పంచదార కాదు. అయితే ఒకసారి మధుమేహం వస్తే మాత్రం పంచదార, తీపి, స్వీట్ల విషయంలో పథ్యం తప్పదు. తీపి, కొవ్వు తక్కువగా తీసుకోవాలి.
చాలా మంది స్త్రీలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. దీనిని బహిష్టు నొప్పి(డిస్మనోరియా) అంటారు. డిస్మనోరియా అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం యుక్త వయసులో ఉన్న స్త్రీలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ప్రతీ చిన్న విషయానికి ఎక్కువ ఆందోళన చెందడం వల్ల గర్భాశయంలోని హార్మోన్స్ సరియైన క్రమంలో పనిచేయక గర్భాశయ సమస్యలు మొదలవుతున్నాయని అంటున్నారు వైద్యులు. గర్భాశయానికి సంబంధించిన సమస్యలు, అందులో నెలసరి సమస్యలు స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంటాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తుంది. బహిష్టు నొప్పి వల్ల స్కూల్కు, కాలేజ్కు వెళ్లలేకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయాల్సి రావడం, చికాకు, ఏ పనీ సరిగ్గా చేసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా మంది స్త్రీలు బహిష్టు నొప్పిని భరించాల్సిందేనా అని అడుగుతూ ఉంటారు. ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే బహిష్టు నొప్పి నివారణకు ఔషధాలు వేసుకుంటున్నా ఫలితం ఉండటం లేదని మరికొందరు స్త్రీలు…
ఆరోగ్యంగా ఉండాలంటే.. కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలని అనుకుంటాం. మరి కొలెస్ట్రాల్ సంగతి! అదీ కొవ్వూ.. ఒకటేనా.. రెండూ హాని చేసేవేనా.. మీకూ ఇలాంటి సందేహాలు ఉన్నాయా.. రండి వాటిని నివృత్తి చేసుకుందాం. సాధారణంగా కొవ్వు పదార్థాలు అనగానే అవి శరీరానికి హానిచేస్తాయనే భ్రమలో ఉంటాం. దాంతో వాటి వినియోగాన్ని తగ్గిస్తాం. లేదంటే పూర్తిగా మానేస్తాం. కానీ శరీరానికి అందే ఇతర పోషకాల్లానే కొవ్వు కూడా మేలుచేసే పదార్థమే. అది మోతాదు మించినప్పుడే సమస్య మొదలవుతుంది. కొలెస్ట్రాల్ కూడా అంతే. ఇందులోనూ మేలు, కీడు చేసే రకాలుంటాయి. కొవ్వు వల్ల ఎప్పుడు హాని జరుగుతుందో తెలియాలంటే… అవి ఏయే పదార్థాల నుంచి అందుతాయి.. ఎలా ఉపయోగపడతాయి అన్నది తెలుసుకోవాలి. రెండు రకాల్లో.. మన శరీరం కొన్నిరకాల కొవ్వుల్ని తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం నుంచి తీసుకోవాలి. ఇందులో రెండు రకాలుంటాయి. ఒకటి కనిపించేది, మరొకటి కనిపించనిది. కనిపించే కొవ్వు అంటే.. మనం వాడే…
నెలసరిలో భరించలేని నొప్పి కొందరికి. నెల మధ్యలో రక్తస్రావం కనిపిస్తుంటుంది మరికొందరికి. బాధించే ఈ సమస్యలు ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్కి సంకేతం కావచ్చు. అసలు ఈ సమస్యలేంటీ… వాటికి ఎటువంటి చికిత్సలున్నాయో… తెలుసుకుందాం.. కొన్ని సమస్యలకు ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఉండదు. ఎండోమెట్రియోసిస్ కూడా అలాంటిదే. గర్భాశయంలో ఉండాల్సిన ఎండోమెట్రియం పొర కొన్నిసార్లు అక్కడ కాకుండా మరో చోట ఏర్పడుతుంది. ముఖ్యంగా కటివలయ భాగం, పొత్తికడుపూ, మరికొన్నిసార్లు ఇతర శరీర భాగాల్లోనూ ఏర్పడుతుంది. ఆ పరిస్థితినే ఎండోమెట్రియోసిస్ అంటారు. బయట పెరగడమే కారణం.. సాధారణంగా ఎండోమెట్రియల్ కణాలు ఈస్ట్రోజెన్ హార్మోనుకి స్పందించి, రెట్టింపవుతాయి. అలా పెరిగిన కణాలు పొరలుగా నెలసరి సమయంలో బయటకు వచ్చేస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు గర్భాశయం బయట, అండాశయాలూ, ఫెల్లోపియన్ ట్యూబుల్లో కూడా పెరుగుతాయి. దాంతో నెలసరి సమయంలో బయటకు రావాల్సిన ఆ పొర అక్కడే ఉండిపోతుంది. అదే ఎండోమెట్రియోసిస్ సమస్య. ఈ పొరలు జిగురుగా ఉండటం…
చాలామంది మహిళలు నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. దీన్ని భరించలేక నొప్పి తగ్గించే మందులు వేసుకుంటూ ఉంటారు. కొందరికి నొప్పితో పాటు వికారం, వాంతి, విరేచనాలు, నిద్ర సమస్యలు కూడా తోడవుతాయి. ఇలాంటి వారికి ఒకేసారి పెద్దమొత్తంలో విటమిన్ డి ఇవ్వటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతున్నట్టు ఇటలీ పరిశోధకులు గుర్తించారు. దీంతో నొప్పి నివారణ మందుల వాడకాన్ని తగ్గించొచ్చని భావిస్తున్నారు. రెండు నెలల పాటు చేసిన తమ అధ్యయనంలో విటమిన్ డి ఇచ్చినవారికి గణనీయంగా నొప్పి తగ్గినట్టు తేలిందని మెసినా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణులు అంటున్నారు. హార్మోన్ల వంటి ప్రోస్టాగ్లాండిన్స్ పదార్థాలు అధికంగా విడుదల కావటం వల్ల నెలసరి సమయంలో నొప్పికి దారితీస్తుంది. విటమిన్ డి వీటి ఉత్పత్తిని తగ్గిస్తుంది కాబట్టి పరిశోధకులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నెలసరి రావటానికి ఐదు రోజుల ముందు కొందరికి పెద్దమొత్తంలో విటమిన్ డి ఇవ్వగా.. మరికొందరికి…
దంతాలు ఆరోగ్యంగా ఉంటే, సాధారణ ఆరోగ్యం బాగుంటుంది. అనేక కారణాల వలన దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై దంత క్షయం సంభవిస్తుంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై నప్పుడల్లా ఆ భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి దంతాలలో కాని, అవి ఉన్న భాగంలోని దవడ ఎముకలలో కాని ఉండవచ్చు. నొప్పి విడవకుండా ఉండవచ్చు. లేదా పొడుస్తున్నట్లు కాని, దేని తోనో కొడుతున్నట్లు కాని అనిపించవచ్చు. ఈ విధమైన దంత శూల కలగడానికి వివిధ కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది దంతక్షయం. దంత మూలాలలో ఇన్ఫెక్షన్లు కలగడం వలన దంతక్షయం ఏర్పడి నొప్పి కలుగవచ్చు. దంతాలపైన ఉండే ఎనామిల్ నాశనమై, దంతాలలోని సున్నిత భాగం పైకి వచ్చి మనం తీసుకునే ఆహారం, చల్లటి నీరు మొదలైన వాటి తాకిడి కారణంగా నొప్పి కలుగవచ్చు. అలాగే ఏవేని ప్రమాదాల కారణంగా దంతాలు విరగడం కూడా దంతశూలకు కారణం కావచ్చు. ప్రథమ చికిత్స దంత క్షయానికి గురవుతున్న…
