Author: apanalysis
దీనిలో తొంబై అయిదుశాతం నీళ్ల ఉంటయి. దాంతో డీహైడ్రేషస్ సమస్య రాదు. అదే సమయంలో శరీరంలో పేరుకొన్న వ్యర్థాలు కూడా పోతాయి. అయితే సాధ్యమైనంతవరకూ చెక్కు తీసి కాకుండా అలేగే తినడం మంచింది. ఎందుకంటే.. కీరదోస చెక్కులో సి విటమిస్ ఉంటుంది. దాన్ని అలేగే తీసుకోవడం వల్ల ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సి విటమిస్ పదిశాతం వరకూ అందుతుంది. నీటిశాతం ఎక్కువగా ఉండం, కెలరీలు తక్కువగా ఉండం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కీరదోసలో పీచు పదార్ధం కూడా ఎక్కువ. మలబద్ధకంతో బధపడేవారు రోజూ కీరదోసను తీసుకోవడం వల్ల ఆ సమస్య చాల సులువుగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగవుతుంది. కీరదోస శరీరంలోని కొలస్ట్రాల్ స్దాయిని తగ్గిస్తుంది. కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, పీచుశాతం ఎక్కువ. ఇవి అధికరక్తపోలును అదుపులో ఉంచుతాయి. ఒకవేళ తక్కువగా ఉన్నా. బ్యాలెన్స్ చేస్తాయి.…
బరువు తగ్గాలంటే… కొవ్వు పదార్థాలతో పాటు పిండి పదార్థాలనూ మానేయాలని అనుకుంటరు చాలమంది. అయితే వాటిలో కొన్ని రకాలనూ తినడం వల్ల చాల ప్రయోజనలు ఉంటాయి. వాటిలో కొన్ని…కొన్ని పండ్లలో పిండి పదార్థాలున్నా అవి ఎంతో మేలు చేస్తాయి. అలంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. వీటిలో జీవక్రియల వేగాన్ని పెంచే పెక్టిస్ శాతం ఎక్కువగా ఉంటుది. శరీరానికి మేలుచేసే పిండిపదార్థాలతో పాటూ విటమిన్లూ, ఖనిజాల్లంటి పోషకాలూ అందుతాయి.సన్నబడాలంటే దుంపలు మానేయడం కొంతవరకూ మంచిదే కానీ.. చిలగడదుంపలు మాత్రం కాదు. వీటిల్లో పీచు శాతం మాత్రమే కాదు క్యాన్సర్ కణలతో పోరాడే యాంట ఆక్సిడెంట్లూ ఎక్కువగా ఉంటయి. వాటిల్లో ఇతర విటమిన్లతో పాటూ బీటెకరొటిస్ శాతం కూడా ఎక్కువ. పైగా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. శరీరం చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తీ లభిస్తుంది.ఆరోగ్యానికి మేలు చేసే పిండిపదార్థాల్లో ఓట్స్ (అటుకులు) కూడా ఒకటి. ఇవి కొలస్ట్రాల్ స్థాయిని…
బరువు తగ్గాలంటే… కొవ్వు పదార్థాలతో పాటు పిండి పదార్థాలనూ మానేయాలని అనుకుంటారు చాలమంది. అయితే వాటిలో కొన్ని రకాలనూ తినడం వల్ల చాల ప్రయోజనలు ఉంటాయి. వాటిలో కొన్ని… కొన్ని పండ్లలో పిండి పదార్థాలున్నా అవి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. వీటిలో జీవక్రియల వేగాన్ని పెంచే పెక్టిస్ శాతం ఎక్కువగా ఉంటుది. శరీరానికి మేలుచేసే పిండిపదార్థాలతో పాటూ విటమిన్లూ, ఖనిజాల్లంటి పోషకాలూ అందుతాయి. సన్నబడాలంటే దుంపలు మానేయడం కొంతవరకూ మంచిదే కానీ.. చిలగడదుంపలు మాత్రం కాదు. వీటిల్లో పీచు శాతం మాత్రమే కాదు క్యాన్సర్ కణలతో పోరాడే యాంట ఆక్సిడెంట్లూ ఎక్కువగా ఉంటయి. వాటిల్లో ఇతర విటమిన్లతో పాటూ బీటెకరొటిస్ శాతం కూడా ఎక్కువ. పైగా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. శరీరం చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తీ లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పిండిపదార్థాల్లో ఓట్స్ కూడా ఒకటి. ఇవి…
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు అయితే రంగుల ప్రాతిపదికన మనం తినే పదార్థాలన్నింటినీ విడదీసి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే… ఈ విధంగా ఉంటాయి. ఆకుపచ్చటి పళ్లు/కూరగాయల్లో… అవొకాడో, గ్రీన్ ఆపిల్, గ్రీన్ గ్రేప్స్, కివీ ఫ్రూట్ వంటి పండ్లు; బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ, ఆకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే బెండ, దోస, బీన్స్‌తో చాలా ఉపయోగాలున్నాయి. ఇలా ఆకు పచ్చగా ఉండే తినదగ్గ పండ్లు, కూరల్లో ప్రధానంగా క్లోరోఫిల్, పీచు, ట్యూటిన్, జియాగ్జాంథిన్, రెస్వరట్రాల్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఎలాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే తినే పదార్థాల విషయంలో అవి కంటిచూపు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయుని గుర్తుంచుకోవాలి. రెటీనా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆకుపచ్చటి పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు క్యాన్సర్‌ను బలంగా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. తెల్లరంగు…
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు అయితే రంగుల ప్రాతిపదికన మనం తినే పదార్థాలన్నింటినీ విడదీసి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే… ఈ విధంగా ఉంటాయి. ఆకుపచ్చటి పళ్లు/కూరగాయల్లో… అవొకాడో, గ్రీన్ ఆపిల్, గ్రీన్ గ్రేప్స్, కివీ ఫ్రూట్ వంటి పండ్లు; బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ, ఆకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే బెండ, దోస, బీన్స్‌తో చాలా ఉపయోగాలున్నాయి. ఇలా ఆకు పచ్చగా ఉండే తినదగ్గ పండ్లు, కూరల్లో ప్రధానంగా క్లోరోఫిల్, పీచు, ట్యూటిన్, జియాగ్జాంథిన్, రెస్వరట్రాల్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఎలాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే తినే పదార్థాల విషయంలో అవి కంటిచూపు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయుని గుర్తుంచుకోవాలి. రెటీనా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆకుపచ్చటి పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు క్యాన్సర్‌ను బలంగా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి.…
ఈ ఆసనాలతో సూర్యుడిని ఆరాధిస్తారు. ఇందులో రకర కాల భంగిమలలో ఆసనాలు వేస్తారు. దీనితో శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఇందులో ఆసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం అన్నీ ఇమిడి ఉంటాయి. సూర్యనమస్కారాలు ఖాళీకడుపుతో మాత్రమేవేయాలి. ఒకవేళ ఏదైనా తినేసి ఉంటే, తిన్న రెండుగంటల తర్వాత మాత్రమే వేయాలి. సర్వసాధారణంగా ఈ ఆసనాలు ఉదయమే అల్పాహారం కూడా తీసుకో కుండా వేస్తారు. పన్నెండు ఆసనాలు కలిస్తే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఈ పన్నెండు ఆసనాలను సుమారు పది సార్లు వేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమకు తగట్టుగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఉంటుంది. పన్నెండు భంగిమలకు పన్నెండు మంత్రాలు ఉంటాయి. ఓం మిత్రాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. ఓం రవయే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. ఓం సూర్యాయ నమః అంటూ హస్తపాదాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. ఓం భానవే…
యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే ఒక రకమైన అనుభవం. లక్షణాలు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం ఆకలి లేకపోవడం పెద్ద శబ్దంతో తేంపులు రావడం కారణాలు కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం. అధిక టీ/కాఫీ సేవనం సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం ఒత్తిడి, అలసట మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం నివారణా చర్యలు వేళకు ఆహారం తీసుకోవడం. నీరు ఎక్కువగా త్రాగడం వ్యాయామం చెయ్యడం వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడండి.
కావలసినవి : సగ్గుబియ్యం – అర కేజీ; టొమాటోలు – 200 గ్రా; నీళ్లు – 6 కప్పులు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావు గంటసేపు ఉడికించాలి చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్‌తో తీసుకుని వడియా లుగా పెట్టాలి కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
కావలసినవి : పచ్చి మిర్చి – కేజీ (బజ్జీమిర్చి వాడాలి) పుల్ల పెరుగు – 2 లీటర్లు ఉప్పు – తగినంత పసుపు – కొద్దిగా ఇంగువ – టీ స్పూను తయారీ పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి పెరుగును కూడా ఎండబెట్టాలి సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి వీటిని వేయించు కుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.
కావలసినవి : ఉసిరికాయలు – 10; బియ్యం – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; నువ్వులపొడి – 2 టీ స్పూన్లు; జీడిపప్పు – 10; పచ్చిమిర్చి – 4; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర కట్ట – చిన్నది; శనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను తయారి : ముందుగా అన్నం వండుకుని పెద్ద పాత్రలో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి ఉంచి, కొద్దిసేపయ్యాక దంచాలి. (ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే తురుముకోవచ్చు). పాన్‌లో నూనె వేసి కాగాక పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన…
