Author: apanalysis

సాధారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటే గానీ, మనం గుండెపోటు వచ్చినట్లు గుర్తించం. నిజానికి గుండెపోటు ఒక నిమిషంలో ముగిసిపోయే సంఘటన కాదు. అది స్వల్పంగా మొదలై ఒక్కోసారి కొన్ని గంటలపాటు కొనసాగుతుంది. గుండె పోటుకు ప్రధాన కారణం జీవన విధానంలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడమే కారణమంటున్నారు వైద్యులు. యుక్తవయస్కుల్లో హార్ట్ఎటాక్ రావడానికి స్మోకింగ్ ముఖ్యకారణం. హైపర్ టెన్షన్ , డయాబెటిస్ వల్ల కూడా హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండెకు వెళ్లే రక్తప్రసారంలో ఆటంకం తలెత్తినప్పటి నుంచే గుండెపోటు మొదలైనట్లు గుర్తించాలి. ఈ స్థితిలో క్రమంగా ఆయాసం మొదలవుతుంది. చెమటలు పడతాయి. రక్తపోటు పడిపోతుంది. చివరగా స్పృహ కోల్పోతారు. శ్వాస ఆడక మెలికలు తిరిగిపోయే దాకా చూడకుండా ముందే ప్రధమ చికిత్సకు సిద్ధం చేస్తే ప్రాణాపాయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. అందుకు గుండెపోటుకు సంబంధించిన లక్షణాల గురించి అవగాహన చాలా ముఖ్యం అంటున్నారు…

Read More

పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోకుండా పనిచేయడం కష్టం. అయితే నిరంతరం ఎంత బిజీగా ఉన్నా.. మానసిక ఒత్తిళ్లను అధిగమించకపోతే.. ప్రశాంతత కరువవుతుంది. తద్వారా ఎన్నో జబ్బుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి చక్కటి వ్యాయామం, నిద్ర మాత్రమే కాదు. ప్రత్యేకించి ఆహారం విషయంలోనూ జాగ్రత్త పడాలి. తాజాపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు శరీరంలోని చక్కెరస్థాయిలను తగ్గిపోనీయవు. ఒకవేళ తగ్గిపోతే మానసిక ఒత్తిళ్లు అధికమై, శారీరక ఉద్వేగాలు పెరుగుతాయి. శరీరంలోని విషతుల్యాలను శుభ్రం చేస్తుంది కెరోటిన్. ఇది బొప్పాయిలో దొరుకుతుంది. వారంలో కనీసం రెండుమూడు సార్లు అయినా బొప్పాయిని తినడం శ్రేయస్కరం. చక్కటి నిద్రకు, మెదడు చురుకుదనానికి లాక్టోజ్ అవసరం. ఇది పాలలో అధికం. రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఒత్తిళ్లకు దూరం కావొచ్చు. తద్వార నరాల బలహీనత రాదు. చిలగడదుంపల్లో అత్యధిక పీచుతో పాటు కార్బొహైడ్రేట్లు లభిస్తాయి. మానసిక ఒత్తిళ్లను తగ్గించే గుణం దీని సొంతం. జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది అరటిపండు. ఇందులోని…

Read More

భయం ముదిరితే ఫోబియా అవుతుంది. ఫోబియా అంటే…అతిగా భయపడటం. ప్రపంచంలో ప్రతి మనిషికీ భయం అనే లక్షణం ఉంటుంది. భయమే పెద్ద బాధంటే, అతిగా భయపడటం అనేది పెద్ద బాధే. అయితే ఫోబియాకు చికిత్స ఉంది. సంపూర్ణంగా నయమైపోయే వ్యాధుల్లో ఫోబియా కూడా ఒకటి కావడం విశేషం. ఫోబియాకు సమానార్థం భయమే అనుకోవాలి. కాకపోతే ప్రత్యేకమైన భయం అని అర్థం. ఏదో ఒక విషయం గురించి అతిగా భయపడటాన్నే ఫోబియా అంటారు. మానసిక సమస్యల్లో తరుచుగా కనపడే సమస్య ఇది. ఫోబియాతో బాధపడే వారి జీవితం అపుపడప్పుడూ విచిత్రమైన ఇబ్బందుల్లో పడిపోతుంది. అయితే చికిత్సలో పూర్తిగా నయమైపోయేది కూడా ఈ ఫోబియాలే కావటం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. ఏదైనా ఒక వస్తువు లేదా ఒక సందర్భం లేదా పరిస్థితుల పట్ల అసహజమైన భయం పెరిగిపోవటమే ఫోబియా. నిజానికి ఫోబియాను అనుభవిస్తున్న వాళ్లకి కూడా ఆ సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఆ…

Read More

మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇప్పుడు అనేక మార్గాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొందరు యోగా చేస్తున్నారు. మరి కొందరు మెడిటేషన్లోకి దిగిపోతున్నారు. ఇంకొందరు ఉదయాన్నే నడక పని పెట్టుకుంటున్నారు. అయితే, ఎక్కువ మందికి పాత సినిమాల పాటలే ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం కలిగిస్తున్నట్టు ఇటీవల జరిపిన ఓ చిన్నపాటి సర్వేలో వెల్లడైంది. ఉదయమే పాత సినిమా పాటలు విని, రోజును ప్రారంభిస్తే రోజంత ఉల్లాసంగా ఉంటోందని వివిధ పార్కులు, వీధుల్లో ఉదయమే జరిపిన సర్వేలో తెలిసింది. కొందరు ఇంట్లోనే పాత పాటలు నాలుగైదు విని బయటికి వస్తుండగా, మరి కొందరు తమకు నచ్చిన పాటల్ని సెల్ ఫోన్లలోకి ఎక్కించుకుని వాటిని వింటూ రోడ్ల మీదా, పార్కుల్లోనూ ఓ గంటసేపు తిరుగుతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయ్ వంటి మహానగరాల్లో పాత సినిమా పాటలకు మళ్లీ గిరాకీ పెరిగింది. ఇదివరకు రోజూ పొద్దున్నే కొద్ది సేపు మంచి పుస్తకం చదివితే…

Read More

ఈ మధ్య సరిగా నిద్రపట్టడం లేదు. దానివల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది అంటుంటారు చాలామంది. ఇలా నిద్రపట్టకపోవడానికి కారణం మన అలవాట్లే అంటున్నారు వైద్యులు. వాటిని గుర్తించి సరిచేసు కోగలిగితే హాయిగా నిద్రపడుతుందని చెప్తూ కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే… వేళకు నిద్రకు ఉపక్రమించాలి. కొందరైతే శని, ఆదివారాలప్పుడు ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్రలేవడం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. వారాంతాల్లో కూడా సమయానికే నిద్రపోవడం నేర్చుకోవాలి. సుఖవంతమైన నిద్రకు చక్కటి పరుపులు, దిండ్లు అవసరం. వాటిలో ఏ ఒక్కటి శరీరానికి అనుకూలంగా లేకపోయినా రాత్రంతా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక వేళ నిద్రపోయినా.. పొద్దున మెల్కొన్నక ఒళ్లు నొప్పులు, కండరాల సమస్యలతో బాధపడక తప్పదు. మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే నిద్రకు ఉపక్రమించాలి. మనసులో లేనిపోని ఆలోచనలు పెట్టుకుని పడుకుంటే నిద్ర పట్టదు. బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నిస్తే తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. నిద్రలో గురకపెట్టే అలవాటుంటే దాన్నుంచి బయటపడేందుకు…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-fareast-language:EN-US;} దేశంలో శృంగార సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పురుషుల శృంగార సమస్యల్లో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్యలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. శృంగార సమస్యలు ఏర్పడటానికి ప్రధానంగా శారీరక, మానసిక కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులోనూ మానసిక కారణాలతో ఏర్పడుతున్న శృంగార సమస్యలు పెరుగుతున్నాయి. 20- 30 శాతం మందిలో శృంగార సమస్యలకు కారణాలు మానసిక కారణాలేనని అధ్యయనాల్లో వెల్లడవుతున్న విషయాలు. వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఒత్తిడి కారణంగానే కాక, ఆర్థిక సమస్యలు, భయం వల్ల కూడా శృంగార సమస్యలు ఏర్పడుతున్నాయి. పెర్ఫామెన్స్…

Read More

ఆహారం తీసుకోవడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ జీవితంలో శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలు అవసరం కాబట్టి విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం శరీరానికి అందాలంటే వీలైనంత ఎక్కువ ఆకుకూరలు పాలకూరను తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. బరువు పెరగరు. బ్రెస్ట్క్యాన్సర్ బారిన పడకూండ ఉండలంటే ఒమెగా ప్యాటీ ఆసిడ్స్, ఆంటీయాక్సిడెంట్స్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం, పోలిక్యాసిడ్స్ తప్పనిసరి. ఇవన్నీ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ గింజలను కూరల్లో కాని, ఉడికించి కాని తినాలి. మహిళలను ఎక్కువగా వేధించేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే అధిక రక్తపోటు, తలనొప్పి, మనోవికలత, డిప్రెషన్ చుట్టుముడతాయి. ఇవి దరిచేరకుండా ప్రత్యేక ఆహార పదార్థాలతోపాటు ఓట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. కాల్షియం సమస్యను తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు పాలను తాగడం శ్రేయస్కరం. విటమిన్ డి కూడా లభిస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

Read More

ఎముకలు బలంగా లేకపోతే వృద్ధాప్యంలో లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ముప్పయి ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు బలవర్దకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎముకల సామర్థ్యాన్ని పెంచుకోవాలంటున్నారు వైద్యులు. కండరాల పటుత్వానికి, నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు, హార్మోన్ల పనితీరుకు కాల్షియం అవసరం. శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్లలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల కాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, ఛీజ్, మజ్జిగ, పెరుగు, ఆల్మండ్స్, బీన్స్లు తరచూ ఆహారంలో ఉండేలా చూసుకుంటే శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది. శరీరానికి తగినంత కాల్షియం అందించడంలో విటమిన్ డి ఎంతో దోహదపడుతుంది. పొద్దున లేస్తూనే బిజీ జీవితంలో పడిపోయే నగరజీవి శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోవడం కష్టం. అందుకని విటమిన్ డి కొరత ఉంటే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల సప్లిమెంట్లు వాడవచ్చు. పొటాషియం, విటమిన్ కె కూడా ఎముకల్ని…

Read More

రోజంతా అలసటగా ఉందా? అనారోగ్య సమస్యలతో అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా? ఎక్కువ పనిచేయకపోయినా అలసట ఆవహిస్తుంటే.. ఆరోగ్యంపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో బ్లడ్ ప్రెజర్ తక్కువగా ఉన్నా.. ఎనర్జీ లేకపోయినా అలసట తప్పదు. ఇంకా రోజంతా అలసట, నీరసంగా ఉన్నట్లైతే అది గుండె సంబంధిత రోగాలకు గుర్తని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత రక్తప్రసరణ లేకపోవడంతో పాటు శరీరంలోని బ్లడ్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం ద్వారా హృద్రోగ వ్యాధులకు దారి తీస్తుంది. 8 గంటల నిద్రకు తర్వాత చురుగ్గా పనిచేయాలంటే తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారంలోనే రోజంతా పనిచేసేందుకు కావలసిన పోషకాలున్నాయి. అయితే సింపుల్గా టైమ్ లేదనో ఇతరత్రా కారణాల చేత టిఫిన్ తీసుకోకుండా పోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. దీనితో పాటు నీరు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోవడాన్ని నివారించాలి. …

Read More

నెలసరి మొదలైందంటే ఆడవారికి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా అప్పుడే రజస్వల అయిన ఆడపిల్లలకు మరీ సమస్యగా ఉంటుంది. వారి ఆరోగ్యం పాడవుతుందనే టెన్షన్ ప్రతి తల్లికీ ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంటూ అమ్మకు టెన్షన్. ఇకపై నెలనెలా రుతుస్రావం అవుతుంటుంది. అమ్మాయి రక్తం కోల్పోతూ ఉంటుంది. నెత్తురు రక్తాన్ని మళ్ళీ భర్తీ చేయలి కాబట్టి ఎప్పుడూ తినేదానికంటే ఎక్కువే తినిపించ మంటారు వాళ్ళూ వీళ్ళూ. ఆ మాట ఎంతవరకూ నిజం? మరి అమ్మాయి సరిగా తినడం లేదే? ఏం చేయాలి. ఎటూ పాలుపోని ఈ పరిస్థితి నెలకొని సతమతమవుతుంటాంరు. కొత్తగా రుతుస్రావం మొదలైన వారికి కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి కాస్తంత పరిమితి పాటిస్తే మంచిది. నెయ్యికి బదులు వెన్న వాడాలి. ఎందుకంటే వెన్న కాచి…

Read More