Author: apanalysis
సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్ లేదా మాల్స్ కువెళ్లడం వల్ల పని సులువవుతుందనే అభిప్రాయం నిజమేకావచ్చు. కావలసిన వస్తువులన్నీ శుభ్రం చేసి అందంగా ప్యాక్ చేసి ఆకర్షణీయంగా సరుకులు సర్దడం వల్ల ఎంపిక చేసుకోవడం చాలా సులువు అవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. సమయం, శుభ్రత, సుఖం… వీటికోసం ఆలోచిస్తూ మనం కొన్ని నష్టపోతున్నాం. అవేంటో తెలుసుకుందాం.అవసరాలకు తగ్గట్టుగా ఏయే సరుకులు కావాలో ముందుగా లిస్ట్ తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ప్యాకింగ్ ఆర్భాటాలు చూసి కొంటే బడ్జెట్లో కొరత ఏర్పడే ప్రమాదముంది. అంతేకాదు అసలు కొనాల్సిన వస్తువులను మరిచిపోయి ఇబ్బందిపడటం ఖాయం. ఏది కావాలి. ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలేకపోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే మొదట రాసుకున్న లిస్టు ప్రకారం తీసుకోవాలి. తరువాత మిగిలిన వాటిలో ఇంకా అవసరం అయిన వాటిని కొనుగోలు చేయాలి.రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్ ధరలను మీరు…
కొంతమందిలో కొన్ని రకాల సామాజిక కారణాలపట్ల భయాలు లేదా ఫోబియాలు ఉంటాయి. ఇటువంటి వారు కొత్తవారితో మాట్లాడాలంటే విపరీతమైన ఆందోళనకు గురవుతారు. ఈ రకమైన భయాన్ని సోషల్ ఫోబియా అని వ్యవహరిస్తారు.సోషల్ ఫోబియా రెండు రకాలుగా ఉంటుంది. అవి – సాధారణ సామాజిక ఫోబియా, ప్రత్యేక సామాజిక ఫోబియా.సాధారణ సామాజిక ఫోబియాకు గురైన వ్యక్తి పదిమందిలో ఉన్నప్పుడు అందరి దృష్టి తనపైనే ఉందని భావిస్తాడు. కొత్త వారిని పరిచయం చేస్తున్నప్పుడు అతడు తీవ్ర భయాందోళనలకు గురవుతాడు.కొత్త వ్యక్తుల ముందు తినడానికి, తాగడానికి కూడా భయపడతాడు. పదిమంది కూర్చున్న గదిలోకి ప్రవేశించడానికి కూడా జంకుతాడు. వీలైనంత వరకూ అటువంటి పరిస్థితులను తప్పించుకు తిరగడానికే ప్రయత్నిస్తాడు.పెళ్లిళ్లు, పార్టీలు మొదలైన వాటికి ఎక్కువ మంది వస్తారు కనుక వాటికి హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటాడు.ప్రత్యేక సామాజిక ఫోబియాకు గురైన వ్యక్తులు వృత్తిరీత్యా పదిమందిలో తిరగాల్సి ఉన్నా, ఏదేని ఒకబృందానికి నాయకత్వం వహించాల్సి ఉన్నా, మార్కెటింగ్, బోధనా…
వయసుపైబడే కొద్దీ జీవక్రియ మందగిస్తుంది. ఆకలి మందగిస్తుంది. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తి క్రమేపీ క్షీణించటం ప్రారంభిస్తుంది. క్రొత్త కణాల ఉత్పత్తి వేగం తగ్గి, ఉన్న కణాలు శిథిలం కావటం వేగవంతమవుతుంది. రోగనిరోధక శక్తి మందగించటంతో అప్పటివరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశపారం పర్య దీర్ఘవ్యాధులు మెల్లమెల్లగా బయటపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితులలో వృద్ధులు తమ జీవనశైలిని, ఆహార నియమాలను మార్చుకోవలసి ఉంటుంది. ఆ క్రమంలో…వయసు మీద పడటంతో దాహం వేయదు. అయినా క్రమం తప్పకుండా ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తీసుకోవాలి. ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది.త్వరగా జీర్ణమయ్యే బలవర్థకమైన ఆహారపదార్ధాలను మాత్రమే భుజించాలి.ఎముకలు దృఢంగా ఉండాలి గనుక సాధారణం కన్నా ఎక్కువగా కాల్షియం అవసరమవుతుంది. ఆ కాల్షయం శరీరానికి వంట బట్టాలంటే విటమిన్-డి అవసరం. అందువలన విటమిన్-డి, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి.వృద్ధాప్యంలో రోగనిరోధకశక్తి తగ్గకుండా తగు…
మీరు బోర్లా పడుకొని నిద్రపోతుంటరా? ముఖాన్ని దిండకేసి నొక్కుతూ పడుకునే అలవాటుందా? అయితే ముఖంపై మడతలు పడుతున్నాయేమో, చర్మం సాగిపోతోందేమో ఓసారి చూసుకోండి. ఎందుకంటే బోర్లా పడుకునేవారికి ఇలాంటి సమస్యలు పొంచి ఉంన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రోజూ ముఖాన్ని దిండుకు నొక్కుతూ పడుకుంటే దాని ఒత్తిడి, ఘర్షణ మూలంగా చర్మంపై ముడతలు పడే ప్రమాదముంది. దిండు చర్మం నుంచి నూనెలను పీల్చుకోవం వల్ల తేమా తగ్గుతుంది. ముఖం చర్మంలోని సన్నటి నారలు (కొల్లజెస్) దెబ్బతింటాయి. సింథటిక్ వస్ర్తాల మీద చర్మం రుద్దుకోవం వల్ల మెటిమలు వచ్చే అవకాశమూ ఉంది. కాబట్టి ముఖం అందంగా కనబడాలంటే వెల్లకిల పడుకోవడం మంచిది. మనం పడుకునే విధానాలు కూడా ముఖంపై మడతలు పడటనికి కారణమవుతాయి. పక్కలకు తిరిగి పడుకునే వారికి చెంపలు, గదమలపై మడతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక దిండుకు ముఖం ఆనించి బోర్లా పడుకునేవారికి నుదురుపై మడతలు ఎక్కువ. రాత్రుళ్లు వీలైనంత త్వరగా పడుకొని…
చాలా మందికి నిద్ర సమస్య వేధిస్తూ ఉంటుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఎంతకీ నిద్రపట్టదు. ఇలాంటి ముందు కొన్ని పాటి చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి గట్టెక్కవచ్చని నిపుణులు చెపుతున్నారు.మీలోనున్న ఒత్తిడి కారణంగా లేదా మనసులో అలజడి కారణంగా కూడా నిద్ర రాదు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి లేదా మంచి సాహిత్యం చదవండి లేదా ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను చదవండి. ఇలా చేస్తే మనసు కాస్త కుదుటపడి గాఢమైన నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది.రాత్రి భోజనం చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలపాటు నడవడం అలవాటు చేసుకోండి. ఆదీంతో మంచిగా నిద్ర పట్టడమే కాకుండా జీర్ణక్రియ కూడా పెరగుతుంది.మీరు పడుకునే మంచం లేదా పడక ఏదైనా కావచ్చు మీకు అనువైన రీతిలో ఉండే విధంగా తయారు చేసుకోండి. లేకుంటే నిద్రలో తేడాలొచ్చి మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుంది.నిద్రలేమితో బాధపడుతుంటే…
బరువు కోల్పోవడం అత్యంత ప్రాధమిక మార్గం కేలరీలు తగ్గించుకోవడం. ఈ విధానలు పటించడం వల్ల 5 వారలలో కనిసం 5 కేజీలు బరువు తగ్గే అవకాశం వుంది. ప్రయత్నించి చూడండి. 1. మీ కాళ్ళకు పని చేప్పండి. నడక, పరిగెత్తం వంటివి చేయడం వల్ల ప్రతిరోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది. జగింగ్, లేదా వ్యాయమం చేయడానిక సమయం లేదు అనుకునేవారు సెల్ ఫోన్ లో మాట్లాడే టప్పుడు అటు ఇటు నడవడం, వేరే వాళ్ళ మీద అధారపడకుడా ఆఫీసులో లేదా వంటగదిలో మనకు అవసరమైనవి మనమే వేళ్ళి తెచ్చుకోవడం, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కిడం వంటి చిన్న చిన్న పనులు చేసిన ప్రతి రోజు 350 కేలరీలు తగ్గే అవకాశం వుంది. 2. నట్స్ : జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనక గుళ్ళు వంటివి కోవ్వు పదార్ధలే అయిన ప్రతిరోజు తక్కువ మోతదులో అవి తీసుకోవడం వల్ల కడుపు…
ఈ క్రింద సూచించిన ప్రకారం చేస్తే జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత చదువుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి అరగంటకొకసారి అరగ్లాసు నీరు త్రాగండి. మేల్కొనేటప్పుడు వచ్చే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అది కూడా పదకొండు గంటల వరకే మంచిది. ఆ పైన మేల్కొంటే ప్రమాదమే. చదివి చదివీ అలసిపోయినప్పుడు మీకు అలసట అనిపిస్తే కాస్త అటు ఇటు పచార్లు చేస్తూ తిరగండి. నిద్ర పోగొట్టడానికి టీ, కాఫీలు, కూల్ డ్రీంక్స్ వంటివి తాగకండి. చాలామంది చదువుకునేటప్పుడు బోర్లా పడుకుని లేదా వంగి కూర్చుని చదువుతుంటారు. అలా చదివితే ప్రమాదమే. నిటారుగా కూర్చుని చదవాలి. దీంతో చదవడానికి ఏకాగ్రత కుదురుతుంది. ఒక క్యారెట్టు, గోబి ఆకులు 10 నుండి12 అంటే కనీసం 50-60 గ్రాములు, కొత్తిమిరి ఈ మూడు కోసి ప్లేట్లో ఉంచుకోండి, ఆపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మకాయ రసం కొద్దిగా కలిపిన తర్వాత ఉదయంపూట టిఫిన్‌గా…
మానసికపరమైన ఒత్తిడితో ఎవ్వరు కూడా జీవించాలని అనుకోరు. కాని ఇంట్లోని పలు సమస్యలు, కార్యాలయంలోని పనుల కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. అలాంటివారు మృదువైన శ్రావ్యమైన సంగీతం వింటే ఒత్తిడి దూరమవడామే కాకుండా మనసుతో పాటు శరీరం సైతం ఉల్లాసంగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలో సంతోషానికి సంబంధించిన సిరోటిన్ అనే రసాయనం విడుదల అవ్వడామే. రోజంతా పని వత్తిడిలో పడిపోయే వారు సంగీతం లేదా పాటలు వినడం వల్ల ప్రయోజనలు శరీరంలో ట్రాయిటోఫన్ రసాయనం కూడా ఉంటుంది. ఇది సంగీతం వినడం ద్వారా శరీరంలోని ఒత్తిడి దూరమై మంచి నిద్ర వస్తుంది. సంగీతం వినడంతో మీ శరీరంలోని కొన్ని జబ్బులు ఉదాహరణకు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీరంలో నొప్పి ఏదైనా ఉంటే సంగీతం నివారణోపాయంగా పని చేస్తుంది. ఆఫీస్ లో మీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీలో ఉన్న అలసటను తొలగించికునేందుకు ఈవెనింగ్ రాగాన్ని…
పొడి చర్మం: చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి. జిడ్డు చర్మం: చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు స్క్రబ్ తో పట్టిన మురికిని, జిడ్డుని…
ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాల సమస్య ఎక్కువై పోతుంది. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా, వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా. పలు సందర్భాల్లో నేరాలకు కూడా పలు పాడుతున్నారు. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అనే అంశాన్ని పరిశీలిస్తే… భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేక పోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పడక గదిలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ, పురుషులు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో సెక్స్‌లో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు. దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడడం మొదలవుతుంది. తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడక పోవడం, తాము చెప్పినట్టు నడుచుకోక పోవడం…
