Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » సూపర్ మార్కెట్ కు వెళుతున్నారా!
ladies

సూపర్ మార్కెట్ కు వెళుతున్నారా!

apanalysisBy apanalysisJuly 20, 2014Updated:May 4, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్ లేదా మాల్స్ కువెళ్లడం వల్ల పని సులువవుతుందనే అభిప్రాయం నిజమేకావచ్చు. కావలసిన వస్తువులన్నీ శుభ్రం చేసి అందంగా ప్యాక్ చేసి ఆకర్షణీయంగా సరుకులు సర్దడం వల్ల ఎంపిక చేసుకోవడం చాలా సులువు అవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. సమయం, శుభ్రత, సుఖం… వీటికోసం ఆలోచిస్తూ మనం కొన్ని నష్టపోతున్నాం. అవేంటో తెలుసుకుందాం.
  • అవసరాలకు తగ్గట్టుగా ఏయే సరుకులు కావాలో ముందుగా లిస్ట్  తయారు చేసుకుంటే అనవసరమైన వస్తువుల కొనుగోలు ఉండదు. ప్యాకింగ్ ఆర్భాటాలు చూసి కొంటే బడ్జెట్లో కొరత ఏర్పడే ప్రమాదముంది. అంతేకాదు అసలు కొనాల్సిన వస్తువులను మరిచిపోయి ఇబ్బందిపడటం ఖాయం. ఏది కావాలి. ఏది వద్దు అని సరిగా నిర్ణయించుకోలేకపోవడం వల్ల ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే మొదట రాసుకున్న లిస్టు ప్రకారం తీసుకోవాలి. తరువాత మిగిలిన వాటిలో ఇంకా అవసరం అయిన వాటిని కొనుగోలు చేయాలి.
  • రోజూ దినపత్రికల్లో సూచించే మార్కెట్ ధరలను మీరు వెళ్లే సూపర్ మార్కెట్ల ధరలతో పోల్చుకుంటే వ్యత్యాసం తెలిసిపోతుంది. మిగతా సూపర్ మార్కెట్ ధరలను కూడా ఒకసారి పరిశీలిస్తే తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈ మాత్రం అవగాహనతో భవిష్యత్తులో జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
  • చాలా వరకు సూపర్ మారెెట్ లలో వినియోగదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఏసి, సంగీతం మేగజైన్లు, జ్యూస్ సెంటర్, స్నాక్స్ ఇవన్నీ వినియోగదారుల దృష్టిని పక్కదోవ పట్టిస్తాయి. ఒకపక్క మ్యూజిక్ వింటూ స్నాక్స్ నములుతూ వస్తువుల ధరలను అంతగా పట్టించుకోరు. కాబట్టి ఏదైనా తీసుకుంటున్నప్పుడు దృష్టిని ఆ వస్తువు వైపే కేంద్రీకరించడం ఎంతో అవసరం. 
  • వీలైనంత వరకు పిల్లల్ని ఇంట్లో వదిలి మార్కెట్కి వెళ్లాలి. వారిని తోడు తీసుకువెళితే వాళ్ల అవసరాలే ఎక్కువగా ఉంటాయి. చాక్లెట్లు, ఐస్క్రీంలు, బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొనమని పేచీ పెడుతూనే ఉంటారు. కాబట్టి వారికి ఏం కావాలని అని అడిగి, అది తీసుకొస్తామని మాటిస్తే చాలు. 
  •  ప్రొడక్ట్ ఉన్నచోట లైటింగ్ అమరిక భారీగా ఉంటుంది. ఆ వెలుతురు కారణంగా ఒక్కోసారి ధరలు సంగతి అంతక పరిశీలిచం. కానీ దానిని అలా వదిలేయకుండా నిశితంగా పరిశీలించి చూడాలి. అర్థంకాకపోతే షాపువారిని అడిగి తెలుసుకోవాలి. షాపు దర్పం చూసి మొహమాటపడితే నష్టపోయేది మనమే. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాటిని కొనుగోలు చేయాలి.
  • కొన్ని వస్తువులపై ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఆఫర్ ఉంటుంది. ఉచితం అనగానే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. ఆ వస్తువు అప్పటికి అవసరం ఉందా, లేదా అని ఆలోచించాలి. పైగా వాటిపైన డేట్స్ కూడా సరిగ్గా చూసి తీసుకోవాలి.
  • ఇంకొద్ది సమయంలో క్యాష్ కౌంటర్కి వెళ్తాం అనుకున్నప్పుడు ఒకసారి బాస్కెట్లో ఉన్న సామగ్రిని చెక్ చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వస్తువులన్నిటిని ఒకసారి పరిశీలించి చూడాలి. వాటిలో కొన్ని అవసరం లేదు అనుకుంటే కౌంటర్లో అయినా నిరభ్యంతరంగా పక్కన పెట్టేయాలి.
  • కొన్ని వస్తువులు ధర తక్కువగా ఉన్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది. వీటికారణంగా చివరకు బిల్ ఎక్కువయ్యే అవకాశం ఉంది.
  •  మీరు తీసుకున్న వస్తువులకు మాన్యువల్ బిల్ ఉండదు. ప్రతీదీ స్కాన్ చేసి బిల్ చేసే విధానం ఇప్పుడు అంతటా అమలులో ఉంది. కాబట్టి స్కానర్ ఇచ్చిన బిల్ కరెక్ట్గా ఉందో లేదో తిరిగి చెక్ చేయాలి. కొన్ని వస్తువులను షాప్ వారే స్వయంగా ప్యాక్ చేసి అమ్ముతుంటారు. వాటిపై ధరలకు బయటి వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాటిని పరిశీలించాల్సి ఉంటుంది.
  • వస్త్రాల విషయంలో కొన్ని సంస్థల పేరు యధాతథంగా ఉండే పేర్లతోనే విడుదల చేస్తాయి. ఒక అక్షరం అటో ఇటో మార్పు ఉంటుంది. తీసుకునేటప్పుడు ఇది ఎక్కువగా గమనించలేం.
  • కాబట్టి బ్రాండెడ్ వస్త్రాలను ఎంపిక చేసేప్పుడు వాటి లోగోలను ఒకసారి చెక్ చేయాలి. కొన్ని వస్త్రాలపై ఇచ్చిన ఆఫర్స్కు సంబంధించి బిల్ దగ్గర కూడా అవి వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 

ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ బడ్జెట్లోపలే మీ బిల్లు ఉంటుంది

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

మీ శ్రీవారిని కోపాన్ని తగ్గించండిలా….

July 29, 2014

సోషల్ ఫోబియా

July 20, 2014

నిద్రలేమి సమస్యా… ఇలా చేసి చూడండి

July 20, 2014

అందమైన గోళ్లకోసం…

July 18, 2014

మానసిక ఆందోళనతో వచ్చే తలనొప్పి

July 17, 2014

రోజు టీ తాగుతున్నారా…

July 17, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.