Author: apanalysis

వ్యాయామం ఉదయం వేళలోనే చేయాలని చెబుతుంటారు. దీనికి ఏదైనా కారణం ఉందా? దయచేసి వివరించండి. పూర్వకాలం నుంచి చాలా పనులు ప్రాతఃకాలంలోనే మొదలు పెట్టి ఎండ ముదిరే వేళకు కాస్త విరామం ఇచ్చి, చల్లబడే వేళకు మళ్లీ మొదలుపెట్టేవారు. పొలం పనులు, తోట పనులు, చేపలు పట్టడం వంటివాటిని సూర్యోదయం కాకముందు నుంచే మొదలుపెట్టేవారు. అలాగే వ్యాయామాన్ని కూడా సూర్యోదయం కాకముందే చేయడం అన్నది మొదటి నుంచీ ఉన్న అభ్యాసమే. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి… ఆ సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి త్వరగా అలసిపోవడం, త్వరగా చెమటపట్టడం వంటివి ఉండవు. ఇక రోజు గడుస్తున్న కొద్దీ అలసట పెరుగుతుంది. ఉదయం వేళలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. న్యూరోట్రాన్స్మిటర్ల, హార్మోన్ల, ఎంజైమ్ ల పనితీరు ఉదయం వేళల్లో బాగుంటుంది. మూఢనమ్మకం వెనక శాస్ర్తీయత ఇదే… రాత్రుళ్లు దెయ్యాలు సంచరిస్తుంటాయానే…

Read More

మా బాబు వయసు ఎనిమిదేళ్లు. తరచూ తలనొప్పితో బాధపడుతున్నాడు. ఇంతకుముందు అరుదుగా వచ్చేది. కాని ఇటీవల చాలా తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ కు చూపిస్తే కొన్ని పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కొంతకాలం బాగానే ఉంటోంది. మళ్లీ మళ్లీ తలనొప్పి వస్తోంది. మా బాబు విషయంలో తగిన సలహా ఇవ్వండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబు దీర్ఘకాలిక తలనొప్పి (క్రానిక్ హెడేక్)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఇలా వచ్చే తలనొప్పులకు అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మైగ్రేన్. ఇది పెద్దల్లో ఎంత సాధారణమో పిల్లల్లో అంతగా సాధారణం కానప్పటికీ అరుదేమీ కాదు. మైగ్రేన్ తో పాటు టెన్షన్ హెడేక్, మెదడు లోపలి సమస్యలు, సైనస్, జ్వరాలు రావడం, పళ్లకు సంబంధించిన సమస్యలు, కంటి లోపాలు, మానసికమైన సమస్యల వల్ల కూడా దీర్ఘకాలిక (క్రానిక్) తలనొప్పులు రావచ్చు. మీరు చేయించిన ప్రాథమిక పరీక్షల్లో రిపోర్టులు నార్మన్ గా…

Read More

డయాబెటిస్ అన్ని అవయవాలను ప్రభావితం చేసినట్లే… పళ్లనూ చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు గుండె, రక్తపోటు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే… పళ్ల విషయంలోనూ అంతే శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధకశక్తి తక్కువ . దాంతో నోటిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పైగా చిగుళ్ల వ్యాధిలో నొప్పి తెలియదు. దీనికి తోడు డయాబెటిస్ ఉందంటే చిగుళ్ల వ్యాధులు వచ్చేందుకు అన్ని రకాల అవకాశాలుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు నోరు, దంతాల విషయంలో ఎలాంటి జాగ్ర త్తలు పాటించాలన్న అవగాహన కోసం ఈ కథనం. డయాబెటిస్ ఉన్నవారు డెంటిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు తమకు డయాబెటిస్ ఉందన్న సంగతి తప్పనిసరిగా చెప్పాలి. డయాబెటిస్ కు వాడుతున్న మందులు, వ్యాధి నియంత్రణలో ఉన్నదా అన్న విషయం డెంటిస్ట్కు వివరించాలి. డయాబెటిస్ మందులతో పాటు వారు వాడే ఇతర మందులు అంటే రక్తాన్ని పలుచబార్చే మందుల వంటి వాటి వివరాలతో పాటు రోగి తాలూకు…

Read More

నా వయసు 55 సంవత్సరాలు. బీపీ, షుగర్ ఉన్నాయి. పళ్లు బాగా అరిగిపోయాయి. ఈ మధ్యనే కొన్ని పళ్లు పీకించాను. మిగిలిన పళ్లతో అంత బాగా నమిలి తినలేకపోతున్నాను. డాక్టర్ను కలిస్తే అన్ని పళ్లూ పీకేసి, కొత్తవి కడదాం అన్నారు. భయమేసి మళ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లలేదు. నేను అన్ని పళ్లూ పీకించాలంటారా? సలహా ఇవ్వండి. ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంతో పాటు నోటిలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. పళ్లను… నమలడానికి దశాబ్దాల తరబడి వాడుతుంటాం. కాబట్టి అరిగిపోవడం సాధారణమే. కొంతమందికి ఎక్కువగా, మరికొంత మందికి తక్కువగా అరుగుతుంటాయి. ఇక బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక సమస్యలు తోడైనప్పుడు నోటి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావమే ఉంటుంది. నోట్లో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు కూడా సరిగా పనిచేయక సహజసిద్ధమైన దంత పరిరక్షక వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్లకు సంబంధించిన జబ్బులు వంటివన్నీ పళ్లు…

Read More

కిడ్నీ (మూత్రి పండాలు) ల్లో రాళ్లు ఏర్పడినట్లు అప్పుడప్పుడు వింటుంటాం. కిడ్నీల్లోనే గాక కాలేయంలో, పిత్తాశయంలో కూడా రాళ్లు ఏర్పడవచ్చు. ఇవి మనం ఆహారంలో పొరపాటున తీసుకునే రాళ్లు కావు, శరీరంలో కొన్నిరకాల ఆసిడ్స్ (ఆమ్లాలు), ఇతర పదార్థాల వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్న గుండు సూది తల నుండి కోడిగుడ్డు సైజు వరకు రకరకాల సైజుల్లో వుంటాయి. వైద్యపరిభాషలో ఈ రాళ్లను కాలిక్యులై అంటారు. ఈ రాళ్లు మూత్ర వాహికలో ఇన్ఫెక్షన్లు వున్నప్పుడు, మూత్రం నిల్వ వుండి పోయినప్పుడు, తగినంత నీరు తాగకపోవడం, ఆసిడ్ కలుగజేసే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఏర్పడతాయి. మూత్రంలో ఆమ్లగుణాలు ఎక్కువగా వుంటే సోడియం యూరేట్, యూరిక్ ఆసిడ్, ఫాస్పేటులు గల రాళ్లు ఏర్పడతాయి. మూత్రంలో క్షారగుణం వుంటే కాల్షియం ఫాస్పేటు, అమోనియం యూరేట్, మెగ్నీషియం, ఫాస్పేటులతో కూడిన రాళ్లు ఏర్పడతాయి. రాళ్లు ఏర్పడినపుడు తీవ్రంగా కడుపునొప్పి వస్తుంటుంది. వివిధ రసాయనాలతో…

Read More

నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. నల్లగా ఉంటాను, అందవికారంగా మాత్రం కాదు. నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నువ్వు బావుండవని నా ముఖం మీదే చెప్పింది. చనిపోవాలన్నంత బాధ కలిగింది. నల్లగా ఉండేవాళ్లు ప్రేమకు అనర్హులా? వారికి ప్రేమించే హక్కులేదా? అన్నింటిలోనూ మంచి నిర్ణయం తీసుకునే అమ్మాయిలు రంగుచూసి మా పట్ల ఎందుకిలా ప్రవర్తిస్తారు. మాకూ మనసుంటుందని, ప్రేమ మనసుకు సంబంధించిన విషయమని ఎందుకు అర్థం చేసుకోరు? దయచేసి నా బాధను అర్థం చేసుకుని సరైన సమాధానం ఇచ్చి మమ్మల్ని ప్రేమించేలా కొంతమందినైనా మారుస్తారని ఆశిస్తున్నాను.నీ బాధను నేను అర్థం చేసు కోగలను. అయితే ఒక్క అమ్మాయి మిమ్మల్ని కాదన్నంత మాత్రాన ఇక ప్రపంచంలో అమ్మాయి లందరూ నల్లగా ఉండేవారిని ప్రేమించరనే సందేహా ల నుంచి బయటకు రండి. సాధారణంగా మనకు ఎదురైన అనుభవాలను మనం మూడు రకాలుగా ఫిల్టర్ చేస్తాం. అవి డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. ఇప్పటివరకు మీతో…

Read More

హలో సర్. రెండేళ్లుగా ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతను ఇంటర్మీ డియెట్ చేసి జాబ్ చేస్తున్నాడు. నాకు నా లైఫ్ గురించి చాలా కలలున్నాయి. తనకి కూడా చాలా గోల్స్ ఉన్నాయి. కాని మా ఇంట్లో వాళ్లు ఒప్పు కోరు. నా తల్లిదండ్రులను మోసం చేసి అతనితో వెళ్లలేను. అతను ఈమధ్య నా మొబైల్కి ఏమైనా కొత్త నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయా అని రోజూ అడుగుతున్నాడు. నా మెయిల్ రోజూ చెక్ చేస్తాడు. మా బంధువుల్లో ఒకతను నన్ను ఇష్టపడుతున్నాడు. ఈ విషయం అతనికి ముందే చెప్పాను. ఈ మధ్య నేను మాటి మాటికి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నానని అసలు ఫోన్ చెయ్యద్దన్నాడు. రెండు రోజులు కాల్ చేయలేదు. ‘మీ బంధువుల అతన్నే పెళ్లి చేసుకో. వాడే నీ కోరికలు తీరుస్తాడు. వాడు వచ్చాడని నన్ను వదిలేస్తున్నావ్’ అని నాకు చాలా బ్యాడ్గా మెసేజ్ ఇచ్చాడు. తనతో మాట్లాడ కుండా…

Read More

నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. ఆమెది విశాఖపట్నం, బీఎస్సీ చదువుతోంది. నేను కర్నూలులో ఎంకాం చేస్తున్నాను. ఒక రాంగ్ నంబర్ ద్వారా మాకు పరి చయమైంది. ఆ పరిచయం స్నేహమై, చివరకు ప్రేమగా మారింది. మా ప్రేమ చాలా గొప్పది. మేమిద్దరం ఇప్పటివరకూ ఒకరినొకరం చూసుకోలేదు. కాని ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం.ఆమె నాకు దక్కదేమోనని రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఆ విషయం తెలిసి తనూ ఆత్మహత్యాయత్నం చేసింది. వచ్చేనెలలో ఆమెను చూడటానికి వైజాగ్ వెళ్తున్నాను. కాని నా స్నేహితులు మా ప్రేమ నిజం కాదంటున్నారు. ఒకరి నొకరు చూసుకోకుండా లవ్ ఏమిటంటున్నారు. ఆమె టైమ్పాస్ కోసం కాల్ చేస్తోందని చెప్తున్నారు. తనకు నామీద నిజంగానే ప్రేమ ఉందా? ఇటువంటి ప్రేమలు నిజమవుతాయా? మా ప్రేమ ఫలిస్తుందా?కమ్యునికేషన్స్ పెరిగిన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఫ్రెండ్స్ గా మారడాన్ని అర్థం చేసుకోగలను. ఒకరినొకరు చూసుకోకపోయినా…

Read More

ఇటీవలి కాలంలో 20 నుంచి 40 సంవత్సరాలలోపు వయస్సున్న మహిళల్లో 5 నుంచి 10 శాతం మందిని ఈ వ్యాధి బాధిస్తుంటుంది. మహిళల్లో నెలసరిలో అపక్రమం, అకార ణంగా బరువు పెరగడం, మొటిమలు, అవాం ఛిత రోమాలు, మధుమేహం వంటివి కలిసిక ట్టుగా కనిపిస్తుంటే ముందుగా ఈ వ్యాధి గురించి ఆలోచించాలి. సంతాన రాహిత్యానికి ఈ వ్యాధి ఒక ముఖ్యమైన కారణం. మహిళల్లో తరచుగా కనిపిస్తున్న వ్యాధి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (పిసిఒడి). అనేక రకాలైన వ్యాధి లక్షణాలను కలిగి ఉండటం వలన దీనిని సిండ్రోమ్ అని వ్యవహరిస్తున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యత వలన వస్తుంది. అండాల విడుదల మీద ప్రభావాన్ని చూపుతుంది. దీని పర్యవసానంగా ఇతర శారీరక వ్యవస్థల మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ వ్యాధితో బాధపడే మహిళల్లో చాలా మందికి ఇలాంటి వ్యాధి తమకున్నదనే సంగతి తెలియదు. తాము తమ ప్రమేయం లేకుండా బరువెందుకు పెరుగుతున్నారో,…

Read More

నా బాయ్ ఫ్రెండ్ ఇప్పటి వరకు కండోమ్ వాడే వాడు. అయితే అది వాడటం విసుగ్గా ఉందని, ఆనందించ లేకపోతు న్నానని అంటున్నాడు. అది వాడడం మానేస్తే గర్భమే కాదు… సుఖ వ్యాధుల్లాంటి ఇతరత్రా సమస్యలూ వస్తాయని నా భయం. ఆ మధ్య స్త్రీల కండోమ్ గురించి చదివాను. వాటి గురించి తెలియజేస్తారా ? ఫిమేల్ కండోమ్ ఎప్పటి నుంచే తయారు చేస్తున్నారు. పురుషులు వాడే కండోమ్ తో పాటు డయాఫ్రమ్ ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయి. 17 సెం.మీ. పోడుగున్న పాలీయురేథీన్ బ్యాగులా ఉండే ఈ కండోమ్ కు రెండు చివర్లా రెండు రింగ్స్ లాంటివి ఉంటాయి. ఒకటి లోపలికి చొప్పించడాని వీలుగా ఉంటే రెండోది పైన ఉండి కండోమ్ మొత్తం జారిపోకుండా ఉండేటట్లు చూస్తుంది. సిలికాన్ లూబ్రికెంట్తో పూత ఉంటుంది. పురుషుల కండోమ్ లాగే ఈ ఫిమేల్ కండోమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఇవి కాకుండా ఇతరత్రా గర్బనిరోధక…

Read More